Author: Editor's Desk, Tattva News

భారత దేశంలోనే భారీ జనసందోహం పాల్గొనే పండుగలలో ఒకటైన తెలంగాణాలో అతిపెద్ద పండుగ మేడారం జాతరకు హాజరైన గవర్నర్ డా. తమిళశై సౌందరాజన్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించడం పట్ల కేంద్రం సీరియస్ అవుతున్నట్లు తెలుస్తున్నది. మావోయిస్టులు ప్రాబల్యం గల అటవీ ప్రాంతంలో ఆమె రోడ్ మార్గంలో వెళ్ళవలసి రావడం, ప్రభుత్వ అధికారులు ఆమెను పట్టించుకొనక పోవడం గురించి కేంద్ర నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టిన్నట్లు చెబుతున్నారు.  మేడారం జాతరలో గవర్నర్‌ తమిళిసైకి ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉన్నా, వారు గైర్హాజర్‌ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది. మేడారం ముగింపు రోజు శనివారం ఉదయం 11.15 నిమిషాలకు గవర్నర్‌ మేడారం వెళ్తారని, హెలికాప్టర్‌ సమకూర్చాలని గవర్నర్‌ కార్యాలయం కోరినా, దానిని సమకూర్చకపోవడంతో గవర్నర్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి చేరుకున్నారు.  స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాలకు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ…

Read More

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు, డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం అధికార పార్టీ వర్గాలలో కలకలం రేపుతున్నది. అతని వాంగ్మూలం ఆధారంగానే జగన్ మోహన్ రెడ్డి మరో బాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సిబిఐ తన చార్జిషీట్ లో పేర్కొనడంతో రాబోయే రోజులలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.  వైఎస్ వివేకాహత్య కేసు నిందితుల్లో ఏ4గా ఉన్న డ్రైవర్ దస్తగిరి ఇప్పుడు సీబీఐకి కీలక వ్యక్తిగా మారాడు. నవంబర్ 26న దస్తగిరి అప్రూవ‎ర్‎గా మారడానికి కడప కోర్టు అనుమతినిచ్చింనా, సహచర నిందితులు, కొందరు అధికారపార్టీ నేతలు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడం తెలిసిందే.  వివేకా హత్యకేసులో నిందితులు ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలు కడప కోర్టు తీర్పు‎ను సవాల్ చేస్తు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా కింద కోర్టు తీర్పును సమర్దిస్తూ నిందితులు వేసిన పి…

Read More

తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్‌ను మూడు ముక్కలుగా చేసినట్లయింది. ఇప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు దొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా ప్రకటించింది.  అంతటితో ఆగకుండా ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని ఆదేశించారు. అంతేకాదు ఉక్రెయిన్ ఉనికినే పుతిన్ ప్రశ్నించడం పశ్చిమ దేశాలను కలవరపెడుతోంది. పుతిన్ అధ్యక్షతన సోమవారం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు ప్రత్యేక దేశాలుగా గుర్తింపు ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు. అదే సమయంలో ఉక్రెయిన్ దళాలు అక్కడ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. 2014లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటు ప్రాంతాల స్వాతంత్య్రాన్ని రష్యా గుర్తించినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పొస్కోవ్…

Read More

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగడానికి మరో రెండేళ్లకు పైగా సమయం ఉంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో జరుగవలసి ఉంది. అయితే ఈ లోపుగానే, వచ్చే ఏడాది ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాసహం ఉన్నట్లు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీ నాయకులకు సంకేతం ఇచ్చారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, అన్నిటికీ సిద్ధంగా ఉండాలని  పిలుపిచ్చారు.  రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహిస్తూ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలో మార్గదర్శనం చేశారు. వైసీపీ దగ్గర డబ్బు, అధికారం ఉంటే.. మన పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే మనకు పెట్టని కోట అంటూ భరోసా వ్యక్తం చేశారు.  అయితే, ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలని, దూరమైన వర్గాలను దరి చేర్చుకోవాలని, దీని కోసం పార్టీ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని ఆయన  సూచించారు.…

Read More

టీఆర్ఎస్‌  అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముంబై వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను కలసి జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించిన సమాలోచనలు జరిపి రాగానే ఆ పార్టీ శ్రేణులు తెలంగాణాలో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.  ఆయన ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయబోతున్నారని, 2024 ఎన్నికలలో ఆ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు. అంతేకాదు, కేసీఆర్ ను కాబోయే ప్రధాన మంత్రిగా కూడా ఊహించుకుంటున్నారు.  ముంబై నుండి తిరిగి వచ్చాక, మరుసటి రోజు   నారాయణ ఖేడ్ లో సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తూ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి అమెరికకన్నా గొప్పగా భారత్ ను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షను స్వయంగా కేసీఆర్ వ్యక్తం చేశారు.  అయితే ఇప్పుడే దేశంలో మూడో కూటమి ఏర్పాటు సాధ్యమని గని, ప్రాంతీయ పార్టీలు అన్ని కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని వహించడం తొందరపాటు కాగలదు. రాజకీయ…

Read More

ఉక్రెయిన్ లో యుద్ధమేఘాలు క్రమ్ముకొంటుండగా, ఆ దేశంపై దాడికి రష్యా సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఒక వంక హెచ్చరికలు జారీ చేస్తుండగా, రెండు దేశాల అధ్యక్షుల సమావేశం కోసం మరోవంక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దౌత్య మార్గాల ద్వారా యుద్దాన్ని నివారించాలని ఫ్రాన్స్ వంటి దేశాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు వివిధ దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు రష్యా సమర సన్నాహాలను ఉధృతం చేస్తోంది. ఉక్రెయిన్ తాజా వివాదాన్ని గతంలో చేసుకున్న శాంతి ఒప్పందాల పరిష్కరించలేవని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన వాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రష్యాలో చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ పౌరులను కాల్చిచంపినట్లు రష్యా సైన్యం సోమవారంనాడు ప్రకటించింది. ఉక్రెయిన్‌ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌లు శిఖరాగ్ర సమావేశానికి అంగీకరించారని ఫ్రాన్స్‌ ప్రకటించింది. అయితే రష్యా ఉక్రెయిన్‌పై దాడికి చేయకూడదన్న షరతు మేరకు ఈ సమావేశం జరుగుతుందని తెలిపింది. యుద్ధాన్ని…

Read More

భారత నావికాదళం స్థిరమైన ప్రయత్నాలు చేస్తూ, విరామం అంటూ లేకుండా దేశ రక్షణలో అప్రమత్తంగా ఉంటోందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు.నావికాదళ శక్తి సామర్థ్యాలను సమీక్ష చేసిన అనంతరం ఆయన త్రివిధ దళాలనుద్దేశించి ప్రసంగిస్తూ మన నౌకాదళం స్వావలంబనలో అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ తీరం 11వ ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పిఎఫ్‌ఆర్‌)కు వేదికైంది. త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌ సోమవారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకూ దేశీయ నౌక ఐఎన్‌ఎస్‌ సుమిత్రపై ఆశీనులై 60 నౌకలు, 55 యుద్ధవిమానాల శక్తి సామర్థ్యాలను సమీక్షించారు. 75 ఏళ్ల దేశ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంలో పిఎఫ్‌ఆర్‌ వేడుక జరగడం మన నౌకాదళ శక్తిసామర్థ్యాలను దేశానికి తెలియజేసే గొప్ప ఈవెంట్‌గా నౌకాదళం భావిస్తోంది. బంగాళాఖాతంలో ఈ నౌకలు రంగురంగులతో అలంకరించబడి సముద్రంపై అత్యంత వేగంగా వరుసగా కదలడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. …

Read More

దాణా స్కామ్‌లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో  పాటు రూ 60 లక్షల  జరిమానా కూడా విధించింది. రెండు దశాబ్దాల క్రితం  బీహార్ లో సంచలనం రేపిన ఈ  దాణా కుంభకోణంలో ఇది ఇదో కేసు కావడం గమనార్హం.  మొదటి నాలుగు కేసులలో సహితం ఆయనకు ఇప్పటికే శిక్ష పడింది. నాలుగు కేసులలో కలిపి 14 ఏళ్ళు శిక్ష  పడగా, ఇప్పటికే మూడున్నరేళ్లు జైలులో ఉంది, ప్రస్తుతం అనారోగ్యంతో రాంచి ఆసుపత్రిలో ఉన్నారు. ఈ శిక్ష పడగానే దేశంలో దాణ స్కాము కాకుండా మరే స్కామూ లేదా అని ఆయన కుమారుడు, బీహార్ లో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించడం ఆసక్తి రేపుతున్నది. ఎందుకంటె ఇంతవరకు దేశంలో మరే రాజకీయ నాయకుడికి ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష పడలేదు.  మొత్తం ఒకటే కుంభకోణం అయినప్పుడు ఒకొక్క జిల్లాలో జరిగిన దానిని…

Read More

కర్ణాటక లోని శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త 23 ఏళ్ల హర్ష హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా కేంద్రం శివమొగ్గలో రవివర్మ వీధి లోని భారతి కాలనీలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షపై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు . రాష్ట్ర రాజధాని బెంగళూరుకు దాదాపు 250 కిమీ దూరంలో ఈ పట్టణం ఉంది. ఈ సంఘటనకు నిరసనగా అనేక చోట్ల భజరంగ్ దళ్ కార్యకర్తలు సోమవారం ఆందోళనలు చేపట్టారు. భజరంగ్‌దళ్ మద్దతు దారులు కొంతమంది వీధుల్లోకి వచ్చి కోపంతో రాళ్లు రువ్వి కొన్ని ఘర్షణలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు టైర్లు, వాహనాలు దగ్ధం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో అధికారులు రెండు రోజుల పాటు శివమొగ్గ పట్ణణంలో ఆంక్షలు విధిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. సోమవారం స్కూళ్లకు, కాలేజీలకు శెలవు ప్రకటించారు.…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. ఐసీయూలో చేరిన సమాయానికే ఆయన హార్ట్ బీట్ చాలా బలహీనంగా ఉండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. కాగా, ఇటీవలే ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. పోస్ట్ కొవిడ్ పరిణామాల కారణంగానే గౌతమ్ రెడ్డికి గుండె పోటు వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. వారం రోజుల పాటు దుబాయ్ లో ఐటీ పరిశ్రమల సదస్సులో పాల్గొని రెండ్రోజుల క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి వెళ్లేలోగానే పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. వరుసగా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా…

Read More