Author: Editor's Desk, Tattva News

బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలున్న చోట కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్లతో ఘర్షణాత్మక ధోరణులు తరచూ వెలువడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా కేరళలో సహితం రాజ్‌భవన్‌కు, పినారయ విజయన్ ప్రభుత్వంల మధ్య ఏదో ఒక అంశంపై రాజకీయ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా రెండు వివాద అంశాలపై ఇరువురు అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదాలు తెలపడం రాజకీయ వర్గాలలో విస్మయంకు గురిచేస్తున్నది. ఇదంతా క్విడ్ ప్రోకో అంటూ ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నది. తాజాగా, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు అదనపు వ్యక్తిగత సహాయకుడిగా ప్రముఖ జర్నలిస్ట్, బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు హరి ఎస్ కర్త నియామకం తాజా వివాదంపై కేంద్రంగా నిలిచింది. అయితే ఈ నియామకానికి, పినరయి విజయన్ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూనే ఆ విధంగా గవర్నర్ నియమించుకోవడం నిబంధనలకు విరుద్ధం అంటూ స్పష్టం చేసింది. కేరళ చరిత్రలోనే రాజ్‌భవన్‌కు మొదటిసారిగా ఓ రాజకీయ నియామకం జరపడాన్ని సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం…

Read More

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే బుల్డోజర్‌లతో తొక్కిస్తామంటూ బిజెపి గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం వరకు వెళ్లడంతో కమీషన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది.   ఈ విషయమై  రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలని కోరింది. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్.. యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాచరు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు.  మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ.. యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్‌లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు. అయితే,  ఎన్నికల  కమిషన్ నోటీసు…

Read More

మొత్తం దేశ ప్రజల ఆసక్తితో గమనిస్తున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, సమాజవాద్ పార్టీలు అధికారం కోసం తీవ్రంగా పోటీ పడుతుండగా, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పోటీచేస్తున్న ఈటా జిల్లాలోని ‘కాస్గంజ్’ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వంటి పెద్ద పార్టీలు మొదలుకొని ఆర్ఎల్డీ వంటి చిన్నా చితకా పార్టీల వరకు.. అన్ని పార్టీలు ఇప్పుడు కాస్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పైనే దృష్టి సారించాయి. ఎట్లాగైనా అక్కడ గెలవాలనే పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ‘కాస్గంజ్ ఒడిసిపట్టు.. యూపీ అధికారం చేపట్టు’అన్న రీతిలో పార్టీలు కాస్గంజ్ పై ఫోకస్ పెట్టాయి. అందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే ‘కాస్గంజ్ లో గెలిచిన పార్టీయే… రాష్ట్ర అధికార పీఠాన్ని కూడా చేపడుతుంద’నే నమ్మకం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన మొత్తం 17 ఎన్నికల్లో 12 సార్లు కాస్‌గంజ్ లో గెలిచిన పార్టీలే రాష్ట్రంలో అధికార పీఠాన్ని చేపట్టాయి. 1952లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎన్నికల ర్యాలీలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీలకుచెందిన “భయ్యా”లను రాష్ట్రంలోకి రానివ్వవద్దని పేర్కొంటూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పంజాబ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న బిజెపి, ఆప్ నేతలను ఉద్దేశించి ప్రజలను కోరడం ద్వారా వివాదాస్పదమైంది. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను ఉద్దేశించి “భయ్యాలు” అనే పదాన్ని ఉపయోగించడం సాధారణంగా అభ్యంతరకరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో, మంగళవారం రూప్‌నగర్‌లో రోడ్‌షోలో చన్నీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పక్కన చప్పట్లు కొడుతూ కనిపించారు. కాగా, చన్నీ వాఖ్యలపై  బీజేపీ తీవ్రంగా స్పందించింది. యూపీ, బీహార్ ప్రజలను సీఎం అవమానించారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు.  కాగా,  పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను పబ్లిక్ గూండాలని అన్నారని, అఖిలేశ్ యాదవ్ ఆమెకు పెద్ద…

Read More

గత వారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు 19 శాతం వరకు తగ్గాయని , మరణాల రేటు నిలకడగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారం ప్రపంచం మొత్తం మీద కరోనా కొత్త కేసులు కేవలం 16 మిలియన్ వరకే నమోదయ్యాయని, 75,000 మరణాలు సంభవించాయని వివరించింది. పశ్చిమ పసిఫిక్ రీజియన్‌లో మాత్రం 19 శాతం వరకు కొత్త కేసులు పెరిగాయని, ఆగ్నేయాసియాలో 37 శాతం వరకు భారీగా కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. పశ్చిమపసిఫిక్ రీజియన్‌లో మూడోవంతు మరణాలు పెరగగా, మధ్యప్రాచ్యంలో 38 శాతం వరకు పెరిగాయని డబ్లుహెచ్‌వొ తన నివేదికలో తెలియజేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతుండడంతో రష్యాలో అత్యధికంగా కొత్త కేసులు పెరగడం కనిపిస్తోందని, తూర్పు ఐరోపాలో కూడా ఇటీవల రెట్టింపు సంఖ్యలో కేసులు పెరగడమైందని పేర్కొంది. ఆల్ఫా, బీటా, డెల్టా తదితర కరోనా వేరియంట్ల వ్యాప్తి తగ్గుముఖం పట్టడా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి…

Read More

హెల్మెట్‌ మనకు రక్షణ కవచం. అందుకే హెల్మెట్ ప్రాధాన్యతను ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. హెల్మెట్ ధరించకపోతే చలాన్లు, జరిమానాలు విధిస్తున్నారు. చాలామంది హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా మనం చూశాం. అందుకే ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడటంలో హెల్మెట్ తప్పనిసరి. ప్రమాదాల్లో గాయాల నుంచి మనల్ని కాపాడుకునేందుకు హెల్మెట్ ఉపకరిస్తుంది. అయితే ఇప్పటి వరకు బైక్ పై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే రూల్ ఉండేది. కానీ.. నేడు కేంద్రం కొత్తగా మరిన్ని కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇకపై నాలుగేళ్ల లోపు పిల్లలను బైక్‌పై తీసుకెళ్తే వారికి కూడా హెల్మెట్‌ తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాల నుండి ద్విచక్ర వాహనదారులకు భద్రత కల్పించే వీలుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు రూపొందించింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం…

Read More

యుద్ధ మేఘాలు ఆవహించిన ఉక్రెయిన్ సరిహద్దుల్ల నుండి రష్యా సేనలు కొంతమేరకు వెనుతిరగడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకొంటున్న సమయంలో ఈ దేశంపై సైబర్ దాడి జరగడం ఆందోళన కలిగిస్తున్నది.  ఉక్రెయిన్‌ ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్‌లపై, ప్రధాన బ్యాంకులపై మంగళవారం సౖౖెబర్‌ దాడి జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. డిప్యూటీ మంత్రి విక్టర్‌ జోరా కూడా ఈ దాడిని ధృవీకరించారు.  డిడిఓఎస్‌ దాడుల కారణంగా కనీసం 10 ప్రభుత్వ వెబ్‌సైట్‌లు పనిచేయడం లేదు. వీటిలో రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక శాఖల వెబ్‌సైట్‌లతో పాటు రెండు అతిపెద్ద బ్యాంక్‌ల వెబ్‌సైట్‌లు కూడా వున్నాయి.  ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులైన ప్రివత్‌బ్యాంక్‌, స్బెర్‌బ్యాంక్‌ల్లో వినియోగదారులు ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో, బ్యాంక్‌ యాప్‌ల్లో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.  అయితే, డిపాజిటర్ల నిధులకు ఎలాంటి ముప్పు లేదని ఉక్రెయిన్‌ సమాచార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడి వెనుక రష్యా వుందేమోనన్న అనుమానాలను మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. అయితే అంతకుమించి…

Read More

హువావే భార‌త్ కార్యాల‌యాల్లో ఐటీ అధికారులు త‌నిఖీలు చేశారు. హువావే ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీ సంస్థ. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులోని కార్యాలయాల్లో సోదాలు చేపట్టినట్టు సమాచారం. ఆదాయపన్ను ఎగవేతను గుర్తించేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారి వెల్ల‌డించారు.  ఇదేమాదిరి సోదాలు చైనాకు చెందిన జెడ్ టీఈ భారత కార్యాలయాల్లో కొన్ని నెలల క్రితం జరగడం గమనార్హం. సోదాల సందర్భంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.  చైనాకు చెందిన ఒప్పో, షావోమీ కంపెనీల్లోనూ ఐటీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. విక్రయాలకు సంబంధించి విలువను తక్కువ చేసి చూపించారంటూ, ఎగవేసిన పన్నును చెల్లించాలంటూ షావోమీకి నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఐటీ సోదాలపై హువావే స్పందించింది. భారత్ లో తమ కార్యకలాపాలు స్థానిక చట్టాలకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. ఇలా ఉండగా,  పన్నుఎగవేత విషయంలో…

Read More

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్ల ముందు ధర్నాలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద రేవంత్‌రెడ్డి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు.  జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి రేవంత్‌ ను గృహనిర్బంధం చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు యత్నించిన కాంగ్రెస్‌ నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.  హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ, తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. 2016లో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని రాహుల్‌గాంధీ ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ పుట్టకపై తామేమైనా రుజువులు అడిగామా? అని  శర్మ ప్రశ్నించడం వివాదాస్పదమైంది.  కాంగ్రెస్‌ అగ్రనేత…

Read More

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్‌లో కేంద్రమంత్రి, బీజేపీ నేత సత్యపాల్ సింగ్ బఘేల్ కాన్వాయ్‌పై దాడి చేసి రాళ్లతో దాడి చేశారు. కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి సత్యపాల్ సింగ్ బఘేల్ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. సత్యపాల్ పై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  దాడి అనంతరం బీజేపీ నాయకుడు క్షేమంగా బయటపడ్డారు. అయితే, బఘెల్ కాన్వాయ్‌లోని ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి. బాఘెల్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన వెనుక సమాజ్‌వాదీ పార్టీ గూండాల హస్తం ఉందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేపీ మౌర్య ఆరోపించారు. ‘‘అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్, బీజేపీ నేతలపై పెంపుడు గూండాల ద్వారా దాడి చేశారు. నిన్న బీజేపీ ఎంపీ గీతా శాక్యాపై కూడా…

Read More