కేసీఆర్ హామీలు పక్కన పెట్టి సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ కాలం నెట్టుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి ఎంపీ డి అరవింద్ ధ్వజమెత్తారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో బిజెపి ప్రదర్శించిన దూకుడు చూసి కేసీఆర్ లో వణుకు వచ్చిన్నట్లున్నదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో తప్పు లేదని, వాడిన పదంలో కూడా తప్పు ఏం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ ఇస్తే టి.ఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నారని అరవింద్ గుర్తు చేశారు. రాజకీయ కారణాలతో 1200 వందల మంది యువకులు మృతి చెందారని చెబుతూ డిసెంబర్ 2009 తెలంగాణ ప్రకటన చేసి మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. వెనకబడిన 9 జిల్లాలకు ప్రతి ఏడాది రూ 450 కోట్లు వచ్చాయి. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ 2,420 కోట్లను కేంద్రం కేటాయించింది. అయినా కేసీఆర్ తెలంగాణను బిచ్చగాళ్ల పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.…
Author: Editor's Desk, Tattva News
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరు తెచ్చుకున్న ఎవరెస్టు పర్వత శిఖరంపై ఉన్న 2000 ఏళ్ల నాటి హిమనదం ఈ శతాబ్దం మధ్యకల్లా అంతర్ధానం కానుందని, ఎందుకంటే ఎవరెస్టు పర్వతంపై మంచుగడ్డ శరవేగంగా కరిగిపోతుండడమే దీనికి కారణమని నేపాల్ శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. 1990 దశకం చివరినుంచి ఎవరెస్టు పర్వతంపై మంచు గణనీయంగా తగ్గిపోతోందని ఇటీవల విడుదలయిన తాజా పరిశోధన నివేదికను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ (ఐసిఐఎంఒడి)పేర్కొంది. ‘ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్’ అనే పర్వతారోహక బృందం హిమనదాలు, పర్వతాలకు సంబంధించిన వాతావరణాలపై విస్తృతమైన పరిశోధన నిర్వహించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఎవరెస్ట్‌పై మంచు ప్రమాదకరమైన స్థాయిలో కరిగిపోతోందని ‘నేచర్ పోర్ట్‌ఫోలియో’ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన పరిశోధనా వ్యాసం పేర్కొంది. వివిధ రంగాలకు చెందిన వారితో కూడిన ఈ బృందంలో ఎనిమిది దేశాలకు చెందిన శాస్త్రజులున్నారు. వీరిలో నేపాల్‌కు చెందిన వారు 17 మంది ఉన్నారు. ఈ…
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) వైస్-ఛాన్సలర్ (విసి)గా నియమితులైన శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ తన పేరుపై ధృవీకరించని ట్విట్టర్ హ్యాండిల్ (@SantishreeD) నుండి ట్వీట్‌లపై వివాదం జరిగిన ఒక రోజు తర్వాత, తనకు ట్విట్టర్ ఖాతా “ఎప్పుడూ లేదు” అని స్పష్టం చేశారు. కేవలం దక్షిణ భారత్ నుండి ఒక అట్టడుగు వర్గానికి చెందిన మహిళా విసి కావడంతో వామపక్ష భావజాలంకు చెందిన వారు అసహనంతో ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. జామియా మిలియా ఇస్లామియా, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని “కమ్యూనల్ క్యాంపస్‌లు” అని పిలిచే ట్వీట్‌లను కలిగి ఉన్న హ్యాండిల్, భారతీయ క్రైస్తవులను దూషిస్తూ, పౌర హక్కుల కార్యకర్తలను “మానసిక-జబ్బుల జిహాదీలు” అని అభివర్ణిస్తూ చేసిన ట్వీట్లను సోమవారం కలకలం తర్వాత తొలగించారు. ఈ సందర్భంగా ఆమె ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, పండిట్ ఇలా అన్నారు: “నాకు ట్విట్టర్ ఖాతా లేదు… అది హ్యాక్ చేయబడిందని, జెఎన్‌యు నుండి అంతర్గతంగా…
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించిన 2022-23 బడ్జెట్ లో రాష్ట్రాల ఆర్ధిక వనరులను బలోపేతం చేసేందుకు దోహదపడే విధంగా పలు అంశాలు ఉన్నాయి. దానితో రాష్ట్రాలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా కేంద్రం నుండి ఆర్ధిక వనరులు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాల్లో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు మరింత డబ్బు సమకూరుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్రా) అధ్యయనం వెల్లడించింది. ‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయ పథకం’ కింద వీటికి రూ.లక్ష కోట్ల కేపెక్స్ను ఇస్తారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, కొత్త ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రాలకు జీఎస్డీపీలో 4 శాతం ఆర్థిక లోటును అనుమతించారు. ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువే! రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన ఆస్తులను పెంచుకోవడం దేశాభివృద్ధికి కీలకం’ అని పేర్కొన్నారు. మరోవంక, మూలధన వ్యయాన్ని పెంచడంతోపాటు పన్నుల వాటాలను ఎక్కువ ఇవ్వడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి…
తెలంగాణ బిజెపి నాయకులు కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పట్ల హుందాగానే వ్యవహరిస్తున్నది. కేసీఆర్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర మంత్రులు సహితం కలవడం, రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సానుభూతితో స్పందించడం చేస్తున్నారు. వాస్తవానికి వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాల క్రింద వస్తున్న నిధులతోనే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఆర్ధికంగా నిలదొక్కుకో గలుగుతున్నది. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రవిష్కరణకు వచ్చే ముందు మీడియా సమావేశంలో కేవలం కేంద్ర బడ్జెట్ పైననే కాకుండా, ప్రధాని, ఆర్దిక మంత్రులపై వ్యక్తిగత దాడులకు దిగడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవంక, ప్రధానికి కనీసం స్వాగతం పలుకక పోవడమే కాకుండా, ఆయన కార్యక్రమాలలో ఎక్కడా కేసీఆర్ పాల్గొనక పోవడంతో ప్రతికూల సంకేతాలు పంపించినట్లు అయింది. దానితో రాబోయే రోజులలో కేసీఆర్ వ్యవహారశైలి పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించే అవకాశాలున్నట్లు…
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఓట్ల విభజనపై ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అయితే ఈ ప్రాంత ప్రజలు గతంలో మాదిరిగానే మరోసారి వారిని ఓడిస్తారని భరోసా వ్యక్తం చేశారు. యుపి అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి తన మేనిఫెస్టోను విడుదల చేసిన రోజున, పార్టీ తన మ్యానిఫెస్టోలలోని వాగ్దానాలను నెరవేర్చడంలో పార్టీ పేరుగాంచిందని ప్రధాని చెప్పారు. రాంపూర్, బదౌన్, సంభాల్ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల వర్చువల్ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. అన్ని ర్యాలీలు, మేనిఫెస్టోలు విడుదల కావడంతో, ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ పోలింగ్‌కు ఎన్నికల ప్రచారం ముగిసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2017కి ముందు కైరానా నుండి హిందువులు “వెళ్లిపోయారని” ఆరోపించడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మథురలో ఆయన ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రూ 5వేల కోట్లు వెచ్చించి చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, రైతులు పండించిన వరి, గోధుమలకు…
కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో హిజాబ్ వివాదం పెరిగి పెద్ద నిరసనలు వెల్లువెత్తడంతో విద్యార్థులు, ప్రజలు శాంతి, ప్రశాంతతను కాపాడాలని కర్ణాటక హైకోర్టు విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉంచాలని ప్రజలను కోరిన జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షితో, కొంతమంది దుర్మార్గులు మాత్రమే సమస్యను రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు, నినాదాలు, విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడం మంచిది కాదని జస్టిస్ దీక్షిత్ సూచించారు. తీరప్రాంత పట్టణమైన ఉడిపిలోని బాలికల ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన తర్వాత, కోర్టు ఈ విషయాన్ని బుధవారానికి వాయిదా వేసింది. . “ఈ కోర్టు విద్యార్థులు, ప్రజలను శాంతి, ప్రశాంతతను కాపాడాలని అభ్యర్థిస్తోంది. ఈ కోర్టు ప్రజల వివేకం, వివక్షత లపై పూర్తి విశ్వాసం కలిగి ఉంది. అదే ఆచరణలో పెట్టగలరని ఆశిస్తున్నాము” అని జస్టిస్ దీక్షిత్ సింగిల్ బెంచ్ పేర్కొంది. . కాలేజీ ప్రాంగణంలో ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం…
కశ్మీర్ వేర్పాటువాదానికి సంఘీభావం తెలిపేలా పాకిస్థాన్ హ్యుందయ్ చేసిన ట్వీట్ పట్ల భారత్ లో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కంపెనీతో పాటు మరో మూడు కార్పొరేట్ కంపెనీల వ్యవహారం పట్ల కూడా భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ పోలీసులు ఒక న్యాయవాది ఫిర్యాదుపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌కి చెందిన పాకిస్తాన్ ఆఫ్‌షూట్ కాశ్మీర్‌లోని ప్రజల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసిన కొద్ది రోజుల తర్వాత, ఈ ప్రజలు “స్వాతంత్య్రం కోసం పోరాటం” కొనసాగిస్తున్నందున మద్దతుగా నిలబడాలని ప్రజలను కోరింది, దీనిపై భారత విదేశాంగశాఖ దక్షిణ కొరియా రాయబారిని పిలిపించి తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. వెంటనే, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు-యోంగ్ భారత విదేశాంగ మంత్రి మంత్రి ఎస్ జైశంకర్ కు ఫోన్ ద్వారా, తర్వాత సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజలకు, భారత ప్రభుత్వానికి జరిగిన “అపరాధానికి చింతిస్తున్నాను” అని తెలిపారు. పాకిస్థాన్…
కాంగ్రెస్ పార్టీని “అర్బన్ నక్సల్స్” ట్రాప్ చేశారని, వారి “ఆలోచన ప్రక్రియ”ను పట్టణ నక్సల్స్ ప్రభావితం చేస్తున్నారని, వారి ఆలోచనా విధానాన్ని “విధ్వంసకరం”గా మార్చారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రమైన ఆరోపణ చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం, అవినీతి, కుటుంబ ప్రయోజనాలను అందరిపై ఉంచడం, ఇతరుల వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవించడం లేదని ఆరోపిస్తూ ప్రధాని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాజ్యసభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ “కాంగ్రెస్‌కు ఉన్న కష్టం ఏమిటంటే, ఓ కుటుంభంకు మించి వారు ఇంకేమీ ఆలోచించలేదు. భారతదేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు కుటుంభం పార్టీలని మనం అంగీకరించాలి. ఏ పార్టీలోనైనా కుటుంబమే అత్యున్నతమైనప్పుడు, మొదటి ప్రమాదం ప్రతిభకే” అని మోదీ హెచ్చరించారు. దేశంలోనే అత్యంత పురాతన రాజకీయ పార్టీగా అన్ని పార్టీలలో కూడా ప్రజాస్వామ్య ప్రమాణాలను నెలకొల్పే బాధ్యతను కాంగ్రెస్ వహించాలని ఆయన కోరారు. దేశ సమాఖ్య నిర్మాణాన్ని…
స్నేహితుల హోటల్ ప్రమోషన్ కోసం తలకు `గణపతి బొప్పా మోరియా’ అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి, మధ్యం సేవించినట్లు ఓ వీడియోలో నటించిన బిగ్ బాస్ ద్వారా పేరొందిన సరయతో పాటు, ఆమె బృందంలోని వారిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఆ విధంగా నటించడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బకొట్టారని,, మత విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యవహరించారని విశ్వహిందూ పరిషత్ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగింది. ఆమె 7ఆర్ట్స్ పేరుతో వీడియోలు తీస్తున్నారు. ఆమె స్నేహితులు గత ఏడాది సిరిసిల్లలో సెవెన్ ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆ హోటల్ ప్రమోషన్‌లో భాగంగా సరయూ ఒక లఘు చిత్రాన్ని విడుదల చేయడంతో .రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషద్ అధ్యక్షుడు అశోక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరయుతో పాటు ఆమె వీడియో టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను కూడా అరెస్ట్ చేశారు.యూట్యూబ్‌లో ఆ వీడియో వైరల్…