Author: Editor's Desk, Tattva News

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన దౌత్యపర పాస్ పోర్టుల ద్వారా యూఏఈ నుంచి కేరళకు భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు అయిన స్వప్న సురేశ్‌కు తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు కొచ్చి కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆమె వ్యక్తిగతంగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా హాజరు కావాలని పేర్కొన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దాదాపు 15 నెలలుగా జైలులో ఉన్న స్వప్న సురేశ్‌‌కు ఇటీవల కేరళ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ యూఏపీఏ కింద కేసు నమోదు చేసింది. కేరళకు చెందిన స్వప్న తండ్రి అబుదాబిలో స్థిరపడ్డారు. దీంతో అక్కడే జన్మించిన స్వప్న చిన్నప్పటి నుంచి విషయ పరిజ్ఞానం పెంచుకోవడంలో చురుకుగా ఉండేవారు. అబుదాబిలోనే చదువుకున్న స్వప్న.. అక్కడే విమానాశ్రయంలో ఉద్యోగం…

Read More

అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తున్న టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ మధ్య ప్రత్యక్ష రాజకీయ పోరాటం ప్రారంభమైన్నట్లు కనిపిస్తున్నది. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మీడియా సమావేశంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకొంటున్నది.  ఒక వంక రాజ్యాంగం మార్చివేయాలని కేసీఆర్ కోరడంతో రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ ను అవమానించడంగా భావిస్తూ బీజేపీ కేసీఆర్ ను `దళిత వ్యతిరేకి’ అంటూ ప్రచారాన్ని తీవ్రతరం చేస్తుంటే, మరోవంక శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండడం ద్వారా గతంలో చెప్పినట్లు బిఎజిపితో `తాడో – పేడో’ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు కేసీఆర్ సంకేతం ఇస్తున్నారు.  ప్రధాని పర్యటనకు కేసీఆర్ గైరాజరు కావడం పట్ల రాష్ట్ర బిజెపి నాయకులు తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంను మార్చాలనడంతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పట్ల దూషణపూరితంగా మాట్లాడటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ `రాజద్రోహం’ కేసు నమోదు చేయాలనీ కోరుతూ హైకోర్టు ను…

Read More

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన సొంత పార్టీ వారిపైనే పోరాడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత పుష్కర్‌ సింగ్‌ ధామి ఎద్దేవా చేశారు. కొండ ప్రాంతాలైన రాష్ట్రంలోని 70 మంది సభ్యుల అసెంబ్లీలో 60కి పైగా సీట్లతో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ తమకు పోటీయేకాదంటూ కొట్టిపారవేసారు. ఫిబ్రవరి 14న జరగనున్న ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి ధామి అతుల్ బర్తరియాతో ఎన్నికలకు సంబంధించిన అనేక విషయాలపై `అవుట్ లుక్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు: అసెంబ్లీ ఎన్నికలకు మీ పార్టీ ఎలాంటి సన్నాహాలు చేస్తోంది? ఎన్నికలకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బూత్ స్థాయి వరకు కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాఖండ్ ప్రయోజనాల కోసం బిజెపి మాత్రమే పని చేయగలదని మా పార్టీ, మా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో ఏయే అంశాలపై బీజేపీ ప్రజల మద్దతు కోరుతోంది?…

Read More

చెప్పుకోదగిన ప్రాబల్యం లేకపోయినా ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ నేత అసదుద్దీన్ ఒవైసి సుమారు 100 స్థానాలలో అభ్యర్థులను పోటీకి దింపుతూ ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకతతో ఈ సారి అధికారంలోకి రాగలమని ధీమాగా ఉన్న సమాజావాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు చుక్కలు చూపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది బీహార్ ఎన్నికలలో సహితం పెద్ద ఎత్తున ఒవైసి అభ్యర్థులను నిలబెట్టి, ఐదు స్థానాలను గెల్చుకోవడం తెలిసిందే. ఒవైసి ఎన్నికల రంగంలో ఉండడంతో అక్కడ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా ఆర్ జె డి అధినేత తేజస్వి యాదవ్ కు అధికారం దూరమైనది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో కూడా అదే జరిగే అవకాశమున్నదని ఎస్పీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అంతకు ముందెన్నడూ లేకపోవడంతో ఒవైసి చతికలబడినా, యుపిలో 2017లో కూడా పొటీ, చేయడం, అప్పటి నుండి రాష్ట్రంలో తరచూ పర్యటనలు జరుపుతూ వస్తుండడం గమనార్హం. ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి పరోక్షంగా…

Read More

కాంగ్రెస్ ను ఏ రాష్ట్రం కూడా స్వీకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుందని, కానీ అక్కడి ప్రజలు ఆ పార్టీ ఓటు వేయలేదని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మరో వందేళ్ల వరకూ అధికారంలోకి రావొద్దని కోరుకుంటున్నట్లుగా ఉందంటూ చురకలేశారు. రెండేళ్లుగా భారత్ కోవిడ్‌పై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు గర్వం, అహంకారం తగ్గలేదన్నారు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ హస్తం పార్టీ నేతలు ఇంకా 2014లో ఉన్నారని.. వారు ఏంటనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారని అంటూ కాంగ్రెస్ విధానాల్లో సమస్య ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనే విధానం అవలంబిస్తుందని, ఆ పార్టీ టుక్డే టుక్డే గ్యాంగ్‌కు నాయకత్వంగా ఎదిగిందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఆయన ఓ…

Read More

ఉత్తరప్రదేశ్ ప్రజలను “అవమానించిన” తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు మద్దతు ఎందుకు కోరుతున్నారని బిజెపి నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అఖిలేష్ యాదవ్‌పై మండిపడ్డారు. గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని జేవార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ, బెనర్జీ మద్దతు కోరుకోవడం ద్వారా అఖిలేష్ “తన స్వంత బలంతో ప్రజల మద్దతు పొందడం లేదని” గ్రహించినట్లు సూచిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి, ఆహారపు అలవాట్లను అవమానించినప్పటికీ యాదవ్ బెనర్జీ నుండి మద్దతు కోరుతున్నారని ఇరానీ విస్మయం వ్యక్తం చేశారు. “నేను అఖిలేష్ జీని అడగాలనుకుంటున్నాను, ఈ రాష్ట్రపు అద్భుతమైన గతాన్ని మరచిపోయి, రాష్ట్ర వాసులను బహిరంగంగా అవమానించిన వారి మద్దతు కావాలనికోరుతున్న మీకు ఎప్పుడేమయింది? ఎటువంటి వత్తిడి ఎదుర్కొంటున్నారు?” అంటూ ఆమె నిలదీశారు. అయితే అఖిలేష్ జీ మాత్రం తన సొంత బలంతో తనకు ప్రజల మద్దతు లభించడం…

Read More

ప్రతిష్టాకరమైన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) తొలి మహిళా వైస్ చాన్సలర్‌గా తెలుగు మహిళా డా. శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియమితులయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శాంతిశ్రీని జెఎన్‌యు వైస్‌చాన్సలర్‌గా నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 59 సంవత్సరాల శాంతిశ్రీ పండిట్ జెఎన్‌యులో ఎంఫిల్‌తోపాటు అంతర్జాతీయ సంబంధాలలో పిహెచ్‌డి చేశారు. జెఎన్‌యు విసిగా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియామకాన్ని జెఎన్‌యు విజిటర్ అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించినట్లు విద్యా శాఖ ప్రకటించింది. శాంతి శ్రీ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1988లో గోవా విశ్వవిద్యాలయంలో తన అధ్యాపక జీవితాన్ని ప్రారంభించిన పండిట్ 1993లో పుణె విశ్వవిద్యాలయంలో చేరారు. యుజిసి సభ్యురాలిగా, ఇండియన్ కౌనిసల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్(ఐసిఎస్‌ఎస్‌ఆర్) సభ్యురాలిగా, కేంద్ర విశ్వవిద్యాలయాల విజిటర్స్ నామినీగా ఆమె ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా ఉన్న ఎం.…

Read More

కరోనా మహమ్మారికి గురయిన ప్రజలు వైద్యంకోసం భారీగా ఖర్చు పెట్టవలసి రావడంతో అనేక కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక ఇక్కట్లలో చిక్కుకు పోగా, ప్రభుత్వం చేపట్టిన కరోనా కట్టడి చర్యల ను అరికట్టేందుకు చర్యల కారణంగా పెద్దసంఖ్యలో ఉపాధి కోల్పోవడంతో మరి అనేక ఆర్ధిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికి మించి, కేవలం కరోనా న్రిధారణ టెస్ట్ ల కోసమే ప్రజలు భారీగా ఖర్చు పెట్టవలసి వస్తున్నదని ఒక అధ్యయనం వెల్లడిస్తున్నది. కరోనా లక్షణం ఏ ఒక్కటి కనిపించినా ప్రజలు తీవ్ర ఆందోళనతో కరోనా పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు. వాటిపై చెప్పుకోదగిన నియంత్రణ లేకపోవడంతో ప్రజల ఆందోళనలను ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇలా గడచిన రెండేళ్లలో కరోనా టెస్టుల కోసమే దేశవ్యాప్తంగా ప్రజలు రూ.74 వేల కోట్లు ఖర్చు చేసినట్లు గ్రాహక్‌ భారతి అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. వీటిల్లో దాదాపు 74 కోట్ల టెస్టులను ఎటువంటి అనుమతి లేని ప్రైవేటు…

Read More

అమెరికా -కెనడా సరిహద్దులు దాటుతున్న సమయంలో కరోనా టీకాలు తప్పనిసరి చేసిన నిబంధనలతో పాటు జస్టిస్‌ ట్రూడో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ట్రక్కర్లు చేపడుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయని, అవి నియంత్రణలో లేవని ఒట్టావా మేయర్‌ తెలిపారు. దీంతో అక్కడ అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా గత నెల 29న రాజధానికి చేరుకున్న నిరసనకారులు, నగర వీధుల్లో వారి భారీ వాహనాలను నిలిపివేసి, గుడారాలు, తాత్కాలిక గుడిసెలు వేశారు. ఈ చర్య అధికారులను దిగ్భ్రాంతికి గురి చేయగా, అక్కడ నివాసితులు కూడా ఈ నిరసనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల వల్ల నివాసితుల భద్రతతో పాటు వారి రక్షణకు తీవ్ర ప్రమాదం జరిగే అవకాశాలున్న నేపథ్యంలో అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు మేయర్‌ జేమ్‌ వాట్సన్‌ తెలిపారు. అంతేకాకుండా దీని వల్ల ఇతర అధికార పరిధి, ప్రభుత్వాల మద్దతు అవసరం కూడగట్టుకోవాల్సిన…

Read More

కర్ణాటకలోని విద్యా సంస్థలు, ఎక్కువగా కళాశాలలకు ముస్లిం బాలికలు హిజాబ్ తో హాజరు కావడంపై ఆంక్షలు విధించడంతో దుమారం రేగుతున్నది.  విశ్వవిద్యాలయాలు, తమ ప్రాంగణంలో కొత్త డ్రెస్ కోడ్ నియమాన్ని అమలు చేశాయి, ఇది రాష్ట్రంలో భారీ రాజకీయ రగడకు దారితీస్తుంది.  గత కొన్ని వారాలుగా, యూనిఫాం కోడ్‌ను ఉల్లంఘించినందున, హిజాబ్ ధరించిన చాలా మంది విద్యార్థులను  తమ దుస్తుల కోసం వారి కళాశాలల గేట్ల వద్ద ఆపివేస్తున్నారు. కర్ణాటకలోని ఉడిపి, చిక్కమగళూరు జిల్లాల నుంచి ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.  హిజాబ్ ధరించిన విద్యార్థులకు వ్యతిరేకంగా అనేక మంది కళాశాలల హిందూ బాల, బాలికలు కాషాయ కండువాలు ధరించి, “జై శ్రీ రామ్” నినాదాలు చేస్తూ తరగతి గదుల లోపల నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఇది జరిగింది.  కర్ణాటక కళాశాలలు,   విశ్వవిద్యాలయాలలో అమలు చేస్తున్న  యూనిఫాం డ్రెస్ కోడ్ క్రమశిక్షణను అమలు చేస్తుందా లేదా ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధం…

Read More