అండర్–19 వరల్డ్‌కప్‌లో యంగ్ ఇండియా ఖతర్నాక్ ఆటతో చెలరేగిపోయింది. లీగ్ దశలో చూపెట్టిన సూపర్ పెర్ఫామెన్స్‌ను టైటిల్ ఫైట్‌లోనూ కంటిన్యూ చేసింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్44.5 ఓవర్లలో 189 రన్స్‌కు ఆలౌటైంది. జేమ్స్ రెవ్ (116 బాల్స్‌లో 12 ఫోర్లతో 95), జేమ్స్ సేల్స్ (34 నాటౌట్) రాణించారు. తర్వాత ఇండియా 47.4 ఓవర్లలో 6 వికెట్లకు 195 రన్స్ చేసి నెగ్గింది. రాజ్‌బవాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.మోస్తరు టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇండియాకు సెకండ్ బాల్‌కే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డు మీద ఒక్క రన్ కూడా రాకుండానే ఓపెనర్ రఘువన్షి (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇక్కడి నుంచి హర్నూర్ సింగ్ (21), షేక్ రషీద్ ఆచితూచి…
Author: Editor's Desk, Tattva News
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో పలు తీవ్రమైన మార్పులు చేయాలని పునర్విభజన కమిషన్ తన ముసాయిదా నివేదికలో ప్రతిపాదించింది. దీనిపై సూచనలు ఇచ్చే నిమిత్తం ఈ నివేదికను జమ్ము కాశ్మీర్‌కే చెందిన ఐదుగురు అసోసియేట్ సభ్యులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. జమ్ము ప్రాంతం నుంచి రాజౌరి, పూంచ్‌లను కలుపుకోవడం ద్వారా అనంత్‌నాగ్ పార్లమెంటరీ సీటును విస్తృతపరచాలని ఈ నివేదికలో ప్రతిపాదించారు. కాశ్మీర్ డివిజన్‌లో భారీ మార్పులు తీసుకురావాలని కూడా పేర్కొన్నారని వారు తెలిపారు. పూర్వపు జమ్ము కాశ్మీర్‌లోని పలు అసెంబ్లీ సీట్లు అదృశ్యమయ్యాయి. వాటిలో వలస వచ్చిన కాశ్మీరీ పండిట్లకు పెట్టని కోటగా వున్న హబ్బా కదల్ సీటు కూడా వుంది. శ్రీనగర్ జిల్లా కన్యార్, సోన్వార్, హజరత్‌బల్ అసెంబ్లీ సీట్లు మినహా మిగిలిన అన్ని సీట్లను తిరిగి రూపొందించి, కొత్తగా రూపొందించిన చన్నాపొరా, శ్రీనగర్ సౌత్ వంటి కొత్త అసెంబ్లీ సీట్లతో విలీనం చేసినట్లు అధికారులు తెలిపారు. హబ్బా…
దంపతులు విడిపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ ట్రాఫిక్ సమస్యల కారణంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో గణనీయ సంఖ్యలో విడాకులు తీసుకొంటున్నారని ఒక ప్రముఖ నేత భార్య చేసిన వాఖ్య వైరల్ గా వ్యాపిస్తుంది. ముంబయిలో ట్రాఫిక్ కష్టాలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నగరంలో మూడు శాతం విడాకులకు ఇక్కడి ట్రాఫిక్ కష్టాలే కారణమని పేర్కొన్నారు. ముంబయి రోడ్లు, ట్రాఫిక్ కష్టాలపై మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ముంబయిలో మూడు శాతం విడాకులు ట్రాఫిక్ జామ్‌ల వల్లే జరుగుతున్నాయి. ఎందుకంటే వీటి కారణంగా ప్రజలు తమ కుటుంబాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారు’ అని ఆమె తెలిపారు. రోడ్ల మీద గుంతలు, ట్రాఫిక్ చిక్కులతో తాను కూడా ఇబ్బంది పడ్డానని పేర్కొన్నారు. ‘నేను దేవేంద్ర ఫడ్నవిస్ భార్యననే విషయం మర్చిపోండి. ఒక సామాన్య మహిళగా మాట్లాడుతున్నా. రోడ్లు, గుంతల దారుల్లో ట్రాఫిక్…
ఈ నెల 10న జరుగనున్న ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలలో మొత్తం 623 మంది పోటీ చేస్తున్నారు. అయితే వారిలో 15 మంది నిరక్షరాసులే . ఈ విషయాన్ని అసోషియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదికలో వెల్లడించింది. తొలి దశలో భాగంగా 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీచేస్తున్న 615 మంది అభ్యర్థుల ప్రమాణ పత్రాల్లో పేర్కొన్న విద్యార్హతలను పరిశీలించిన శనివారం ఈ నివేదికను విడుదల చేసింది. మిగిలిన 8 మందివి సాంకేతిక కారణాల వల్ల పరిశీలించలేకపోయినట్లు తెలిపింది. ఇందులో 15 మంది నిరక్షరాసులు కాగా, 38 మంది అక్ష్యరాస్యులు. 5వ తరగతి చదివిన వారు 10 మంది, ఎనిమిది పాసైన వారు 62 మంది, పది పూర్తి చేసిన వారు 65 మంది, 102 మంది 12వ తరగతి చదివిన వారు ఉన్నారు. పట్టభద్రులు 100 మంది, గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్స్ 78 మంది, పోస్టు…
వాతావరణ మార్పులకు తట్టుకునే సరికొత్త వంగడాలను సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ శాస్త్రవేత్తలకు పిలుపిచ్చారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలలో పాల్గొంటూఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ఆయన ఆవిష్కరించారు. వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యం నిర్దేశించుకోవాలని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలకు ప్రధాని సూచించారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆకాంక్షించారు. వసంతపంచమి రోజు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెబుతూ టెక్నాలజీని మార్కెట్ తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ ఎంతో కృషి చేస్తుందని ప్రధాని కొనియాడారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారని, నీరు, మట్టి మేనేజ్ మెంట్ పై అద్భుతమైన పరిశోదనలు చేశారని ప్రధాని ప్రశంసించారు. దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని చెబుతూ అక్కడ సాగు పద్దతులపై మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉందని ప్రధాని సూచించారు. దేశంలో డిజిటల్ అగ్రికల్చర్ పెంచాలనే…
డా. కె లక్ష్మణ్, జాతీయ అధ్యక్షుడు, బిజెపి ఓబిసి సెల్ గడిచిన ఏడేండ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతూ వస్తోంది. అభివృద్ధి విధానాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్ రూపొందింది. రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలను బడ్జెట్ పొందుతోంది. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత్ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల వారికీ మౌలిక వసతులు కల్పించండంపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. భారత్‌ను స్వయం సమృద్ధ, ఆధునిక దేశంగా తీర్చిదిద్దడం అత్యంత కీలకం. ఇందుకు ప్రస్తుత బడ్జెట్ దేశానికి మార్గదర్శిగా మారనుంది. పేదలు, మధ్య తరగతి వర్గాలు, యువతపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ.. అన్ని ఈ వర్గాల ప్రజలకూ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపొందించారు. గతంలో మనదేశాన్ని ఇతర దేశాలు చాలా…
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనసంఘ్ లో తొలి శాసనసభ్యుడిగా, దక్షిణాదిన బిజెపికి తొలి ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించిన చందుపట్ల జంగారెడ్డి (83) శనివారం కన్నుమూశారు. జంగన్నగా పార్టీ కార్యకర్తలకు, ప్రజానీకానికి చేరువైన ఆయన క్షేత్రస్థాయిలో మంచి పట్టు గల కొద్దిమంది బిజెపి నేతలలో ఒకరుగా పేరొందారు. తెలుగు రాష్ట్రాలలో జనసంఘ్ తొలితరం నేతలలో ఒకరైన ఆయన 1967లో ఆ పార్టీ నుండి శాసనసభకు ఎన్నికైన ముగ్గుర్లో ఒకరు కాగా, తెలంగాణలో ఏకైక అభ్యర్థి. ఆ తర్వాత 1978 వరకు బిజెపికి రాష్ట్రంలో శాసనసభ్యులు లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి హైదరాబాద్‌లో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ఆయన 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. ఆయన మూడు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకు, ఒక సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. వయస్సు మీరుతున్న…
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని పరిశీలించడానికి… అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత కమిటీని నియమించనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి కేంద్రం లేఖ రాసిందని దీనికి ఈసీ బదులిస్తూ ఎన్నికల అనంతరం కమిటీని నియమించుకోవచ్చని సూచించిందని మంత్రి స్పష్టంచేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా క్వశ్చన్ అవర్‌లో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఎంఎ్‌సపీకి చట్టబద్ధత విషయంలో కమిటీ ఇచ్చే సిఫార్సులను పరిశీలించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం సేకరణ తగ్గించడం, ఎంఎ్‌సపీ అమలుకాకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర మంత్రిని అడిగారు. దీనికి మంత్రి బదులిస్తూ.. రైతులు తాము పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోవడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ధాన్యం సేకరణను…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొంటారు. 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ఈక్వాలిటీ)ఆవిష్కరించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్టప్రాంత పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) స్వర్ణోత్సవాలకు ప్రధాని హాజరుకానున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటనకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో పంజాబ్‌లో జరిగిన సంఘటన దృష్ట్యా ప్రధాని టూర్లో ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోదీ భద్రత కోసం కేంద్ర దళాలతో పాటు దాదాపు 8 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. శనివారం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననుండటంతో భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే ముచ్చింతల్ గ్రామం పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆక్టోపస్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సైబరాబాద్…
పెగాసస్ వ్యవహారంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై హక్కుల తీర్మానాన్ని పెట్టేందుకు పలువురు ప్రతిపక్ష నేతలు సిద్ధపడుతున్న తరుణంలో అనధికారికంగా ఎలాంటి గూడచర్యానికి పాల్పడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనధికార నిఘాకు తావివ్వని రీతిలో దేశంలో కాల పరీక్షకు నిలిచిన యంత్రాంగం వుందని పేర్కొంది. భారత్‌లో ఇప్పటికే అమల్లో వున్న ప్రొటోకాల్స్‌ను పరిశీలించినట్లైతే మన చట్టాల్లో, సంస్థల్లో వున్న జాగ్రత్తలు, పకడ్బందీ ఏర్పాట్లతో ఏ రూపంలోనూ అక్రమంగా నిఘా పెట్టడమనేది సాధ్యం కాదని తెలిపింది. గత జులైలో మొదటిసారిగా ఈ విషయమై వివాదం తలెత్తినపుడు వైష్ణవ్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, లాజిక్‌తో ఈ విషయాన్ని పరిశీలించినట్లైతే ఈ సంచలనం వెనుక ఎలాంటి సరుకు లేదని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. ఇజ్రాయిలీ సంస్థ ఎన్‌ఎస్‌ఒ నుండి తీసుకున్న పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు, రాజకీయ నేతలు, హక్కుల కార్యకర్తలు అందరిపై గూఢచర్యానికి పాల్పడ్డారని వార్తా కథనాలు వెలువడిన…