ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తనకు కోటిన్నర విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తన దగ్గర రివాల్వర్, రైఫిల్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ ఉన్నట్టు వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1,54,94,054 ఆస్తులను ప్రకటించారు. ఇందులో చేతిలో నగదు, ఆరు బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్, సేవింగ్స్ ఉన్నాయి. తన వద్ద రూ. 12,000 విలువైన సామ్‌సంగ్ మొబైల్ ఫోన్, రూ. 1,00,000 విలువైన రివాల్వర్, రూ. 80,000 విలువైన రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. తన పేరు మీద వ్యవసాయ, వ్యవసాయేతర భూములు లేవన్నారు. అలాగే సొంత వాహనం కూడా లేదని వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ వద్ద రూ.49,000 విలువైన 20 గ్రాముల బంగారు చెవి రింగు, రూ.20,000 విలువైన 10 గ్రాముల బంగారు గొలుసు, రుద్రాక్ష హారం ఉన్నాయి. తనపై…
Author: Editor's Desk, Tattva News
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏటా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అద్భుతంగా తీర్చిదిద్దిన శకటాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను కూడా ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో ఉత్తమ రాష్ట్ర శకటంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అవార్డు గెలుచుకుంది. పాపులర్ చాయిస్ కేటగిరీలో మహారాష్ట్ర శకటం టాప్‌లో నిలిచింది. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు 12 రాష్ట్రాల శకటాలకు మాత్రమే అర్హత లభించింది. ‘‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, కాశీ విశ్వనాథ్ ధామ్” థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న యూపీ శకటాన్ని స్టేట్ కేటగిరీలో ఉత్తమ శకటంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హస్త కళల థీమ్‌తో శకటం రూపొందించిన కర్ణాటక రెండో స్థానంలో నిలవగా, ‘‘రాష్ట్ర స్వర్ణోత్సవాలు, మహిళా సహకార సంఘాలు, స్వయం సహాయక గ్రూప్‌ల’’ థీమ్‌తో శకటం రూపొందించిన మేఘాలయకు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఐదు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన మూడో దేశం భారత్. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌లో మరణాలు ఐదు లక్షలు దాటాయి. గత ఏడాది జులై 1కి మనదేశంలో మరణాలు నాలుగు లక్షలకు చేరాయి. 217 రోజుల్లో మరో లక్ష మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం గురువారం నాటికి దేశంలో మరణాలు 5,00,055కి చేరాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,42,859 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా కేరళ (56,701), కర్ణాటక (39,197), తమిళనాడు (37,666), ఢిల్లీ (25,932), ఉత్తర ప్రదేశ్ (23,277)లు ఉన్నాయి. భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,27,952 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1059 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 2,30,814 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648కి తగ్గింది.…
ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు కలకలం రేపడంతో వెంటనే కేంద్ర హోంశాఖ స్పందిస్తూ ఆయనకు సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఒవైసీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. జెడ్-కేటగిరీ భద్రత తనకు అక్కర్లేదని తిరస్కరించారు. ‘‘ఎవరు వారిని మొబిలైజ్ చేస్తున్నారు అనేది నా ప్రశ్న. దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పరిస్థితిని సమీక్షించడానికి నేను దీనిని ప్రభుత్వానికి వదిలివేస్తున్నాను’’ అని ఒవైసీ లోక్ సభలో చెప్పారు. ఇటీవల హరిద్వార్, రాయ్‌పూర్, ప్రయాగ్‌రాజ్‌లలో నిర్వహించిన ధర్మ సంసద్‌లలో తనకు వ్యతిరేకంగా చేసిన ‘ప్రేరేపిత ప్రసంగాలను’ పరిశీలించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. “నాకు జెడ్ కేటగిరీ భద్రత వద్దు. నేను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నా, ఊపిరాడకుండా ఉండాలని నేను…
గల్వాన్ లోయలో రెండేండ్ల కిందట భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా వైపు 42 మంది సైనికులు చనిపోయారని ‘ద క్లాక్సన్’ అనే ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. తమ వైపు నలుగురే చనిపోయారని చైనా చేసిన ప్రకటన అబద్ధమని తేల్చిచెప్పింది. సోషల్ మీడియా దర్యాప్తు ఆధారంగా ఆ పత్రిక ‘గల్వాన్ డీకోడెడ్’ పేరిట కథనాన్ని వెలువరించింది. కొందరు వీబో యూజర్లు పెట్టిన పోస్టులను, వీడియోలను ఇందులో ప్రస్తావించింది. ‘‘గల్వాన్ లోయలో 2015, జూన్ 6న చైనా, ఇండియా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మాట్లాడేందుకు భారత సైన్యం నుండి నుంచి కర్నల్ సంతోష్ బాబు బృందం గల్వాన్ లోయకు చేరుకుంది. చైనా ఆర్మీ కర్నల్ ఖీ ఫబావో మాత్రం 150 మంది సైనికులతో వచ్చారు. చర్చలకు బదులుగా దాడికి ఆదేశించారు. దీంతో రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఆ తర్వాత ఖంగారుతో భయపడి చైనా సైనికులు వెనక్కి పారిపోయారు. ఈ…
కేంద్ర బడ్జెట్ 2022-23 “అభివృద్ధి ఆధారితమైనది” అయితే ఉపాధికి దారితీయదని స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్‌జేఎం) స్పష్టం చేసింది మూలధన వ్యయంలో 35 శాతం “క్వాంటమ్ జంప్” రూ. 7.5 లక్షల కోట్లకు చేరుకోవడం వల్ల దేశంలో భవిష్యత్తు వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంది.”కేంద్ర బడ్జెట్ 2022-23 అనేది డిజిటల్ మౌలిక సదుపాయాలు, విద్య సంబంధిత మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, పేదలకు గృహాలతో సహా వివిధ రకాలైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తగినంత ప్రోత్సాహంతో కూడిన వృద్ధి ఆధారిత బడ్జెట్ అని స్వదేశీ జాగరణ్ మంచ్ విశ్వసిస్తోంది” అని ఒక ప్రకటనలో ఎస్‌జేఎం తెలిపింది. ప్రకటన. అయితే, దేశంలో చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం, ఉపాధి కల్పన కోసం “చాలా పరిమిత ప్రయత్నాలు” తీసుకున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. స్వదేశీ జాగరణ్ మంచ్ దేశంలో చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి, ఉపాధి కల్పనకు చాలా పరిమిత ప్రయత్నాల పట్ల తన ఆందోళనలను వ్యక్తం చేసింది. .దేశంలో స్వయం ఉపాధిని…
దేశంలోనే ప్రతిభావంతులైన, అత్యాధునిక సాంకేతిక పద్దతులను ఉపయోగించడంలో నిపుణులైన పోలీసులలో ఒకరిగా పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన కట్టడి చర్యలు తీసుకొంటున్నట్లు చెబుతున్నప్పటికీ అనూహ్యంగా అన్ని నిర్బంధాలను దాటికొని భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు గురువారం విజయవాడకు చేరుకొని, ప్రభుత్వంకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించడం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలను పోలీస్ వర్గాలు గాలికి వదిలేసి, ఉద్యోగుల `చలో విజయవాడ’ కార్యక్రమంకు సహకారం అందించినట్లు వెల్లడి అవుతున్నది. అంటే ఒక విధంగా రాష్ట్ర పోలీసులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై `తిరుగుబాటు’ ధోరణిని బహిరంగంగా ప్రకటించినట్లు స్పష్టం అవుతున్నది. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలు అన్ని పోలీసులకు కూడా వర్తించేవే కావడంతో వారికి సంఘీభావం వ్యక్తం చేశారా? లేదా అడ్డదిడ్డంగా తమ రాజకీయ ప్రయోజనాలకోసం పోలీసులను వాడుకొంటూ, అనేక సందర్భాలలో తమను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్న ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రవేశాలను వ్యక్తం చేశారా?…
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గనేందుకు 90 దేశాల నుంచి సుమారు 2,900మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. అత్యధిక అథ్లెట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వింటర్ ఒలింపిక్స్‌గా బీజింగ్ చరిత్రలో నిలిచిపోనుంది.కాగా, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు ఉత్సవాలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణం పిఎల్‌ఏ గల్వాన్ కమాండర్‌ను వింటర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్ నిర్ణయించడమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌తో గాల్వాన్ వ్యాలీ ఘర్షణల్లో గాయపడిన చైఆన ఆర్మీ అధికారిని చైనా బుధవారం టార్చ్ బేరర్‌గా నిర్ణయించి ఆయనను ఘనంగా సత్కరించినట్లు చైనా మీడియా తెలిపింది. గాల్వాన్‌లో ఘర్షణ వాతావరణం కారణంగా భారత సైనికులు 20మంది చనిపోయారని, చైనా నలుగురు సైనికులను మాత్రమే కోల్పోయిందని మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. మరోవంక, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనకు నిరసనగా అమెరికా, బ్రిటన్, జపాన్,…
కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం రూ.10,080 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,032 కోట్లు (గత ఏడాది కంటే 21 శాతం అధికం), తెలంగాణ రాష్ట్రానికి రూ.3,048 కోట్లు (గత ఏడాది కంటే 26ు అధికం) కేటాయించినట్లు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుద్దీకరణ, ట్రాఫిక్ పనుల కోసం బడ్జెట్‌లో రూ.9,125 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ఏడాది రూ.7,049 కోట్లు కేటాయించగా ఈసారి దాదాపు 30 శాతం అదనంగా కేటాయించడం విశేషమని పేర్కొన్నారు. ఆంధ్రకు కేటాయించిన మొత్తంలో నడికుడి-శ్రీకాళహస్తి(309 కి.మీ) కొత్త రైల్వే ప్రాజెక్టు పనుల కోసం రూ.1,501 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్ కొత్త లైనుకు రూ.358 కోట్లు, కడప-బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, విజయవాడ-గూడూరు 3వ లైను ప్రాజెక్టు కోసం…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇప్పటికే హనీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన తర్వాత గురువారం అర్దరాత్రి అతన్ని అరెస్టు చేసింది. 2018 అక్రమ ఇసుక మైనింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. పంజాబ్‌లో అక్రమ ఇసుక మైనింగ్ కార్యకలాపాలపై మనీలాండరింగ్ నిరోధక విచారణలో జనవరి 19న నిర్వహించిన దాడుల్లో ఈడీ రూ. 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భూపీందర్ సింగ్‌కు సంబంధించిన స్థలాల నుంచి రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో అక్రమ ఇసుక మైనింగ్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, వ్యక్తులపై పోలీసు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చర్యలు ప్రారంభించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. కాగా పంజాబ్ ఎన్నికలకు ముందు ఈ కేసులో…