Author: Editor's Desk, Tattva News

ఉక్రెయిన్‌ విషయంలో  యుద్ధ మేఘాలు ఆవరించడం,  రష్యా ఆ దేశాన్ని ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తున్నదనే  కధనాలు వెలువడుతున్న దృష్ట్యా అటువంటి పరిస్థితి ఏర్పడితే రష్యాపై  ఆంక్షలు  విధించేందుకు అమెరికా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడైనది. ఆంక్షలు విధించాల్సి వస్తే ఆ ఆంక్షలను చాలా రహస్యంగా వుంచుతామని అమెరికన్‌ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు.  వాటిని ముందుగానే రష్యా తెలుసుకునే అవకాశం లేదని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా నూలాండ్‌ తెలిపారు.  రష్యాపై విధించాల్సిన ఆంక్షలపై అమెరికా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఆ ఆంక్షలు ఏ రీతిలో వుండబోతున్నాయో రష్యా ముందుగానే తెలుసుకునే వీలు కూడా లేదని పేర్కొన్నారు.  ”ఈ ఆంక్షల ప్యాకేజీకి సంబంధించి…మేమేం చేయబోతున్నామనే విషయంలో కొంతమేరకు వ్యూహాత్మక సందిగ్థత నెలకొన్నపుడు ముందుగా మాట్లాడకుండా వుండడం మంచింది.” అని తెలిపారు.   ”అవి, ఆర్థికపరమైన చర్యలా, ఎగుమతుల నియంత్రణలా, రష్యా ప్రముఖులపై కొత్త ఆంక్షలా ఏవైనా కావచ్చు, వీటిని ఇప్పుడే వెల్లడించినట్లైతే…

Read More

సంపన్నులపై ప్రభుత్వం మరింతగా పన్ను విధించాలని భారతీయులలో అత్యధికులు కోరుతున్నారు. `అసమానతలపై పోరాట కూటమి భారత్’ (ఎఫ్ఐఎ ఇండియా) ఈ విషయమై జరిపిన దేశ వ్యాప్త సర్వేలో  పాల్గొన్న 80 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు, మహమ్మారి సమయంలో రికార్డు లాభాలను ఆర్జించిన ధనికులు,  కార్పొరేషన్లపై పన్నుకు మద్దతు ఇస్తున్నారని వెల్లడించింది.  ప్రభుత్వం నుండి సామాన్య ప్రజల అంచనాలపై 2022-23 కేంద్ర బడ్జెట్‌కు ముందు 24 రాష్ట్రాల నుండి 3,231 మంది భారతీయుల ఇన్‌పుట్‌లను సర్వే తీసుకుంది. సార్వత్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు మరియు లింగ ఆధారిత హింసను నిరోధించడానికి బడ్జెట్‌ను విస్తరించడం వంటి అసమానతలను ఎదుర్కోవడానికి బడ్జెట్ చర్యలను 90 శాతానికి పైగా పాల్గొనేవారు డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో భారతీయ బిలియనీర్ల సంపద రెండింతలకు పైగా పెరిగిందని ఈ కూటమి చేసిన ప్రపంచ అధ్యయనంలో తేలింది, అయితే 2020లో 46 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో పడిపోయారని అంచనా వేశారు. …

Read More

కరోనా పోరులో భారత్ పోరు స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కొనియాడారు.  పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్బంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ కరోనా సమయంలో  ప్రజలు ఆకలితో ఉండకుండా చూశామన్నారు. కరోనా సమయంలో  అందరూ ఒక టీంగా పనిచేశారని ప్రశంసించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.  ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశ సురక్షిత భవిష్యత్‌ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం ముఖ్యమని చెబుతూ వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తోందని కోవింద్ తెలిపారు.  జల్ జీవన్ మిషన్ తో రూ.6కోట్ల గ్రామాలకు నీళ్లందించామని చెబుతూ వ్యాక్సినేషన్ లో భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు.  దేశంలో ఏడాదిలో 150 కోట్ల డోసులకు పైగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిందని చెబుతూ ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.  కిసాన్…

Read More

భోపాల్ పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.‘‘ ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా నాకు కరోనా పాజిటివ్ అని వచ్చింది…నేను వైద్యుల సంరక్షణలో ఉన్నాను. గత రెండు రోజులుగా నన్ను కలిసిన వారందరూ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్‌ ట్వీట్ చేశారు. ఆవు మూత్రం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను తగ్గించి, కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని గత సంవత్సరం ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్ చెప్పారు. ‘‘దేశీ ఆవు  గో మూత్రం మనల్ని ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను చాలా ఆరోగ్య సమస్యల్లో ఉన్నాను, కానీ నేను ప్రతిరోజూ గో మూత్రం తాగుతాను.గో మూత్రం తాగితే కరోనావైరస్ నివారణ కోసం మరే ఇతర ఔషధం తీసుకోనవసరం లేదు. నేను కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడలేదు.’’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్…

Read More

గత ఏడాది విశేషమైన ప్రజా మద్దతుతో,  ఎన్నో మార్పులు తీసుకు రాగలననే విశ్వాసంతో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్ సంవత్సరకాలంలోనే ప్రజాకర్షణను కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న అనేక జటిల సవాళ్ళను ఎదుర్కోవడంలో ఆయనకు గల సమర్ధతపై ప్రజలలో విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.  ముఖ్యంగా మొత్తం ప్రపంచాన్ని కకావికలం కావించిన కరోనా మహమ్మారి సమయంలో ప్రజారోగ్యం విషయంలో ఆయన పాలనా సమర్ధత పట్ల ఆ దేశ ప్రజానీకం అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభమైనది. దానితో తన పదవీకాలం రెండో యేడాదిని సన్నగిల్లుతున్న ప్రజా మద్దతుతో ప్రారంభించినట్లయింది. పలు జటిలమైన అంశాలపై ఆయన ధోరణి స్పష్టంగా లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.  తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న డోనాల్డ్ ట్రంప్ స్థానంలో వచ్చిన బైడెన్  విదేశాంగ విధానం నుండి పలు కీలక అంశాలలో ఆయనకన్నా భిన్నమైన విధానాలను ముందుకు తీసుకు రాలేకపోతున్నారు.  ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా జరిపిన ప్రజాభిప్రాయంలో 41 శాతం మంది అమెరికా వయోజనులు బైడెన్  పనితీరును ఆమోదించారు. అయితే…

Read More

పిఆర్‌సి సాధనకు, చీకటి జిఒలను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో విజయవాడను విజయవంతం చేయాలని పిఆర్‌సి సాధన సమితి పిలుపునిచ్చింది. సాధన సమితి చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌ దార్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుత పిఆర్‌సి జీవోలను రద్దు చేయాలి, మెరుగైన పిఆర్‌సి ఇవ్వాలని, అశుతోష్‌ మిశ్రా పే రివిజన్‌ కమిటీ రిపోర్ట్‌ ఇవ్వాలని, పెన్షనర్ల సౌకర్యాలను కాపాడాలి, సిపిఎస్‌ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హెచ్‌ఆర్‌ఎ శ్లాబులు పాత పద్ధతిలో కొనసాగించాలని, సచివాలయం ఉద్యోగులను ప్రొహిబిషన్‌ పూర్తి చేసి రెగ్యులరైజ్‌ చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర పిఆర్‌సి సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు 4వ (ఆదివారం) కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న రిలే నిరాహార…

Read More

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మోదీ ఫోబియాతో బాధపడుతున్నారని గోవాలో ఆదివారం ఒకరోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధ్వజమెత్తారు.పొండాలో జరిగిన సభను ఉద్దేశించి బిజెపి నాయకుడు మాట్లాడుతూ, గాంధీ కుటుంబానికి గోవా కేవలం వెకేషన్ స్పాట్ అని ఎద్దేవా చేశారు. అయితే బిజెపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని ఆయన గుర్తు చేశారు. “మేము రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 432 కోట్ల (2013-14) నుండి రూ. 2,567 కోట్లకు (2021లో) పెంచాము. మాజీ దిగంబర్ కామత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏమీ చేయలేదు. మేము వాగ్దానం చేసాము” అని తెలిపారు. కాంగ్రెస్‌ని వీడి ఇటీవల బీజేపీలో చేరిన పార్టీ అభ్యర్థి, గోవా మాజీ సీఎం రవి నాయక్‌ తరఫున షా ప్రచారం చేస్తూ బీజేపీ ‘గోల్డెన్‌ గోవా’, కాంగ్రెస్‌ ‘గాంధీ పరివార్‌ కా గోవా’ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధి…

Read More

మెక్సికోతో సరిహద్దును కాపాడలేనివారు, ఉక్రెయిన్‌ సరిహద్దును కాపాడతారా అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బైడెన్‌ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. టెక్సాస్‌లోని కోన్రీలో శనివారం ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడుతూ, ఇతరదేశాలపై దండయాత్ర గురించి మాట్లాడే ముందు అమెరికా సరిహద్దులకు భద్రత గురించి పట్టించుకోండి అంటూ హితవు చెప్పారు. మెక్సికోతో తన సొంత సరిహద్దును కాపాడుకోవడం గురించి పట్టించుకోకుండా ఉక్రెయిన్‌ బోర్డర్‌ను కాపాడడం గురించి బైడెన్‌ ప్రభుత్వం ఎందుకింత హైరానా పడుతుందని ట్రంప్‌ ప్రశ్నించారు. శ్వేత సౌధంలో ఎవరిని కదిపినా ఉక్రెయిన్‌ సరిహద్దును రక్షించడమెలా అన్నదాని గురించే మాట్లాడుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. “ప్రపంచంలో అంతకంటే ముఖ్యమైన సరిహద్దు ఇప్పుడు మనకి ఉక్రెయిన్‌బోర్డర్‌ కాదు, అమెరికా సరిహద్దు” అని ట్రంప్‌ పేర్కొన్నారు. రికార్డు సంఖ్యలో వలసదారులు అమెరికా-మెక్సికో సరిహద్దుకు చేరుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీరు ఇలా దండెత్తి రావడం అమెరికా భద్రతకే ముప్పుగా పరిణమిస్తుందని ట్రంప్…

Read More

పెగాసస్ స్పైవేర్ వ్యవహారం దేశంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంకు ముందు కేంద్రానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పెగాసస్ ఒప్పందంతో సంబంధమున్నవారిపై చర్యలకు ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. ఈ ఒప్పందంకు సంబంధించి న్యూయార్స్ టైమ్స్ ప్రచురించిన కథనం ఆధారంగా న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017లో భారత్ – ఇజ్రాయెల్ మధ్య జరిగిన పెగాసస్ ఒప్పందంపై విచారణ జరపాలని ఆయన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ డీల్తో సంబంధమున్న వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. పార్లమెంటు ఆమోదం లేకుండా జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసి ఆ డబ్బు రికవర్ చేసేలా చూడాలని అభ్యర్థించారు. “ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ సైబర్ వెపన్” పేరుతో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. 2017లో భారత్ – ఇజ్రాయెల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో పెగాసస్ కూడా భాగమేనని బాంబు పేల్చింది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ…

Read More

ఉత్తరకొరియా మధ్యంతర శ్రేణి క్షిపణిని ఆదివారం పరీక్షించడంపై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.  భూమి నుంచి 2,000 కిలోమీటర్ల ఎత్తుకు దూసుకెళ్లిన ఈ క్షిపణి అనంతరం జపాన్‌ సముద్రంలో కూలిపోయింది. ఆదివారం ఉదయం 7.52 సమయంలో ఈ క్షిపణిని ప్రయోగించింది.  బాలిస్టిక్స్‌, న్యూక్లియర్స్‌ ఆయుధాల పరీక్షలపై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించినప్పటికీ ఉత్తర కొరియా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. కాగా, జనవరిలో ఇది ఏడవ ప్రయోగం కావడం గమనార్హం. ఈ పరీక్షను జపాన్‌, దక్షిణ కొరియా, అమెరికా ఖండించాయి.  దీర్షకాలంగా నిలిచిపోయిన అణుచర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. తమ దేశ రక్షణను బలోపేతం చేస్తానని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. చైనా వింటర్‌ ఒలింపిక్స్‌, మార్చిలో దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల ముందు ఈ పరీక్షలు జరగడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.  2 వేల కిలోమీటర్లు…

Read More