ముగ్గురు మంత్రులతో సహా ప్రముఖ ఓబిసి ఎమ్యెల్యేలు వరుసగా పార్టీ నుండి నిష్క్రమించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్ లో పార్టీకి ఏర్పడిన లోటును భర్తీ చేయడం కోసం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చురుకైన పాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ వారాంతం నుండి, అమిత్ షా క్షేత్రస్థాయిలో ఎక్కువగా కనిపిస్తారు. తద్వారా ప్రచారం ఊపందుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తల నైతికతను ఇనుమడింప చేయడం పట్ల దృష్టి సారింపనున్నారు. కరోనా కారణంగా బహిరంగ ర్యాలీలు, యాత్రలపై నిషేధాన్ని కొనసాగింఎన్నికల కమీషన్ ఈ నెల 22న మరోసారి సమీక్ష చేయనున్నది. ఆ తర్వాత అమిత్ షా విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నాయి. పార్టీ యూపీని విభజించిన బ్రజ్, కాశీ, అవధ్, గోరఖ్‌పూర్, పశ్చిమ యూపీ, కాన్పూర్‌లోని మొత్తం ఆరు సంస్థాగత ప్రాంతాలలో ర్యాలీలు, అలాగే ప్రచారం, టికెట్ల పంపిణీని ఆయన పర్యవేక్షిస్తారు. గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా యుపి ఇన్ ఛార్జ్…
Author: Editor's Desk, Tattva News
నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తీర్పుపై దేవాస్ మల్టీమీడియా దాఖలు చేసిన అపీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గొప్ప ఉపశమనం పొందింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉండకపోతే చాలా నష్టం జరిగి ఉండేదని జాతీయ మీడియా పేర్కొంది. ఈ కంపెనీని మూసివేయాలని NCLAT ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, దేవాస్ మల్టీమీడియాకు లభించిన ఆర్బిట్రేషన్ అవార్డుకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నెదర్లాండ్స్ కోర్టులో కేసు దాఖలు చేసింది. మోసం జరిగిందనే ఆరోపణలపై దేవాస్ మల్టీమీడియాను లిక్విడేషన్ చేయాలని కోరుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగం ఆంట్రిక్స్ ఎన్సీఎల్ఎటి ఆశ్రయించే విధంగా మోదీ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుంది. ఇటువంటి చర్యలు తీసుకోకపోయి ఉంటే దేవాస్‌పై ప్రభుత్వం దాఖలు చేసిన కేసు బలహీనపడి ఉండేది. దేవాస్ కంపెనీని వైండింగ్ అప్ చేయాలని (మూసేయాలని) నేషనల్…
గణతంత్ర దినోత్సవ కవాతు కోసం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శకటాలను తిరస్కరించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగానే శకటాల ఎంపిక జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలకు లేఖలు రాశారు. తమిళనాడుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల గురించి చాటిచెప్పే విధంగా ఆ రాష్ట్రం శకటాన్ని ప్రతిపాదించగా కేంద్రం దాన్ని తిరస్కరించింది. దీంతో సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి వివరించే శకటాన్ని బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించగా దీన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. కేంద్రం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. బెంగాల్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అందులో ఆమె మండిపడ్డారు. అయితే, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సమున్నత గౌరవం…
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అంటూ మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తమకు ఆప్షన్ ప్రకారం బదిలీ చేయండని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీలకు సంబంధించిన 317 జీవో అనే పంజాలో చిక్కుకుని విలవిలాడుతున్న దుస్థితి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావడం అత్యంత హేయం అని ఆమె ధ్వజమెత్తారు. బదిలీల కోసం ఉద్యోగులు పెట్టుకున్న ఆప్షన్లు,ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో బదిలీలు చేపట్టి,ఉద్యోగుల్లో సీనియర్, జూనియర్ అనే చీలిక తేవడం దారుణమని ఆమె పేర్కొన్నారు. బదిలీల పేరుతో ఉద్యోగులను, ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏడేండ్ల పాలనలో తమ కనీస డిమాండ్లను కూడా తీర్చటం లేదనే ఆగ్రహంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని ఆమె హెచ్చరించారు. బదిలీలు…
గ్రామీణ ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమౌతుందని చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు నిపుణులైన యువత ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం స్వర్ణభారత్ ట్రస్ట్ లోని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత మెరుగైన భవిష్యత్తును అందుకోగలరన్న ఉపరాష్ట్రపతి, వారి నైపుణ్యానికి మెరుగులు దిద్దే దిశగా విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, కష్టపడి శ్రమించే తత్వం ఉన్న భారతీయ యువతకు నైపుణ్యశిక్షణను అందించడం ద్వారా, వారు మరిన్ని అవకాశాలను అవలీలగా అందిపుచ్చుకోగలరని తెలిపారు. ఇదే వేదిక నుంచి చేతన ఫౌండేషన్, రామినేని ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్లు, బాలబాలికలకు సైకిళ్ళు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఉపరాష్ట్రపతి అందజేశారు. కష్టపడే పని…
రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజన్స్ హెచ్చరికలు అందిన దృష్టా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రిపబ్లిక్ వేడుకల దృష్టా ఈ నెల 20 నుంచి దేశ రాజధాని గగనతలంపై డ్రోన్లు (యుఎవిలు), పారా గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు లాంటి సబ్ కన్వెన్షనల్ ఏరియల్ ప్లాట్‌ఫామ్‌ల ఆపరేషన్‌ను నిషేధించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంతమంది క్రిమినల్స్ లేదా సంఘ వ్యతిరేక శక్తులు లేదా ఉగ్రవాదులు సాధారణ పౌరులకు, ప్రముఖులకు, కీలక సంస్థల భద్రతకు ముప్పు కలిగించే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గణతంత్ర దినోత్సవాల దృష్టా భద్రతను పూర్తి కట్టదిట్టం చేశామని, గణతంత్ర వేడుకలు జరిగే మొత్తం ప్రాంతాన్ని ముఖాలను గుర్తు పట్టే సాఫ్ట్‌వేర్‌తో కూడిన…
వేతన సవరణపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సోమవారం రాత్రి ఇచ్చిన మూడు జీవోల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు కొత్త సదుపాయాలు కల్పించకపోగా, గత ప్రభుత్వాలు కల్పించినవాటిలోనే కోతలు పెడుతున్నరని, ఇప్పుడు ఇస్తున్న మొత్తాలనే తగ్గిస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సమావేశమై తమ భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని అంటూ సమ్మెకు సై అంటూ సంకేతం ఇచ్చారు. ఏ.పి.ఎన్.జీ.ఓ, రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ ,డీఏలకు సంబంధించిన జీఓలను తిరస్కరిస్తున్నామని కూడా వెల్లడించారు. అయితే వీరే ఈ నెల 8న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో 23 శాతం పిట్మెంట్ కు అంగీకరించి వచ్చారు. ఆ నాటి ఒప్పందం అమలుకు జీఓలు ఇలాగే ఉంటాయని తెలుసుకోలేక పోయారా? అనే అనుమానం ఈ సందర్భంగా కలుగుతుంది. ఆ మొత్తాన్ని డీ.ఏ.ల పద్దు క్రింద చెల్లించాల్సినబకాయిల మొత్తం నుండి సర్దుబాటు చేసుకుంటామని జీ.ఓ.లో పేర్కొన్నారు. అందులో వింత లేదా…
బంగ్లా యుద్ధం – 33 డిసెంబరు 1971లో పాకిస్తాన్‌ను ముక్కలు చేయడంతో పాటు, పశ్చిమ దిశలో ఆ దేశంలోకి చొచ్చుకుపోయి, వారి భూభాగాలను మన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా సైనికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా కూడా ఆధిపత్యం ప్రదర్శించ గలిగిన భారత్ ఎప్పటికన్నా ఇప్పుడు సురక్షితంగా ఉన్నదని చెప్పగలమా? ఈ ప్రశ్న రక్షణ రంగ నిపుణులతో పాటు దేశంలోని రాజకీయ, సామజిక రంగాలలో తరచూ తలెత్తుతూ ఉంటుంది. బాంగ్లాదేశ్ ఏర్పాటు తర్వాత ఒకేసారి రెండు వైపులా నుండి భారత్ పై దండెత్తడం ద్వారా మనకు పెను భద్రతా సవాళ్ళను విసిరే సామర్ధ్యాన్ని కోల్పోవడమే కాకుండా,ఇక భారత్ తో సాంప్రదాయక యుద్దానికి తలపడే సామర్ధ్యాన్ని కూడా పాకిస్థాన్ కోల్పోయింది. దానితో ఉపఖండంలో భద్రతా వ్యవస్థ భారత్ కు అనుకూలంగా మారినట్లు భావించాము. సాంప్రదాయ సంప్రదాయ యుద్ధంలో భారత్‌తో సరితూగలేమని, చైనా లేదా అమెరికా జోక్యం చేసుకొని భారత్ పై దాడి చేస్తే తమకు అండగా వస్తాయని కూడా ఆశింపలేమని…
గ్లోబల్ సప్లయ్ చైన్‌లో నమ్మకమైన భాగస్వామిగా మారడానికి భారతదేశం ఇప్పుడు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ భారతదేశం కూడా ప్రస్తుతం అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొంటున్నదని గుర్తు చేశారు. భారతీయ యువతలో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌పై అత్యుత్సాహం కనబడుతుంది కాబట్టి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనువైన సమయం అని చెప్పారు. 2014లో, భారతదేశంలో కేవలం 100 స్టార్టప్‌లు మాత్రమే ఉన్నాయి, కానీ నేడు వాటి సంఖ్య 60,000 పైగా ఉంది. భారతదేశంలోని యువత పెట్టుబడులను సులభతరం చేయడానికి, ప్రపంచ వ్యాపారాలను దేశంలో కొత్త స్థాయిలకు చేరుకునేలా చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ప్రధాన మంత్రి తెలిపారు.భారతదేశంలో చాలా వ్యాపారాలలో ప్రభుత్వ జోక్యం ఉండే కాలం ఒకప్పుడు ఉండేదని పేర్కొంటూ, ఆ సమయంలో భారతదేశం లైసెన్స్ రాజ్‌కు అపఖ్యాతి పాలైందని ప్రధాని చెప్పారు. అయితే ఇప్పుడు వ్యాపారాన్ని సులభతరం…
బీహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బిజెపి, జెడియు నేతల మధ్య సోషల్ మీడియాలో `వార్’ తీవ్రమవుతున్నది. పరస్పరం తీవ్రమైన ఆరోపణలకు దిగుతున్నారు. దానితో సహనం కోల్పోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ హద్దుల్లో ఉండాలని, లేకుంటే కూటమి మధ్య విబేధాలు తప్పవంటూ హెచ్చరించారు. 74 : 45 సీట్ల భాగస్వామ్యంతో బీహార్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో తమకన్నా ఒక సీట్ తక్కువున్నా ఎన్నికల ముందు చేసిన ప్రకటనను గౌరవించి ముఖ్యమంత్రి పదవిని నితీష్ కుమార్ కే అప్పచెప్పారు. అయితే ప్రభుత్వంలో బిజెపి ప్రాబల్యం పెరగడంతో జెడియు నేతల నుండి సహజంగానే కవ్వింపు ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని మంచి వాతావరణంలో శాంతియుతంగా నడిపించేందుకు ఇరువైపుల నుంచి సహకారం ఉండాలని గుర్తు చేసుకోవాలని సంజయ్ జైశ్వాల్ హితవు చెప్పారు. 2005కి ముందు ముఖ్యమంత్రి నివాసంలో హత్యలు, కిడ్నాప్‌లు జరిగేవని, ఇప్పుడు అలా మారడం తమకు ఇష్టం లేదని అంటూ కొంచెం కఠినంగానే మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని జెడియు నేతలు…