Author: Editor's Desk, Tattva News

మనదేశంలో కరోనా సంక్షోభ సమయంలోనూ కోటీశ్వరులు, అత్యంత ధనికులు మరింత సంపద పోగేసుకొని..బిలియనీర్లుగా మారారు. 100 మంది అత్యంత ధనికుల వద్ద రూ.57.3లక్షల కోట్ల సంపద ఉందని ‘ఆక్స్‌ఫాం ఇండియా’ తాజా నివేదిక తెలిపింది. ‘ఇనీక్వాలిటీ కిల్స్‌’ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న 2021లో కొత్తగా 40మంది శతకోటీశ్వరుల హోదాను అందుకున్నారు. వీరి సంఖ్య దేశంలో 102 నుంచి 142కు పెరిగింది. శతకోటీశ్వరుల సంపద రూ.30లక్షల కోట్లు పెరిగింది. రూ.23.14 లక్షల కోట్ల నుంచి రూ.53.16లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే కోవిడ్‌ సంక్షోభ సమయంలో 4.6కోట్లమంది తీవ్రమైన పేదరికంలోకి కూరుకుపోయారు. దేశ జనాభాలో అట్టడుగున ఉన్న 50 శాతం మందికి జాతీయ సంపదలో దక్కిన వాటా కేవలం 6 శాతం మాత్రమే ఉంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, ఆదాయాలు పడిపోయి పేదరికంలోకి వెళ్లిపోయిన జనాల్లో సగం భారత్‌ నుంచే ఉన్నారు. అత్యంత ధనికులు, శతకోటీశ్వరులపై సంపద…

Read More

గాల్విన్ లోయలో ఘర్షణ అనంతరం చైనా దిగుమతులపై ఆంక్షలు పెట్టడంతో పాటు, స్వదేశంలో ఉత్పత్తి పెంపొందించడం కోసం, అమెరికాతో ఏర్పడిన వివాదం కారణంగా చైనా నుండి తరలుతున్న పరిశ్రమలను ఆకట్టుకోవడం కోసం భారత్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాణిజ్యంలో చైనాపై ఆధార పడటం మాత్రం తప్పడం లేదు.  ఆత్మనిర్భర్ భారత్, భారత్ లో తయారీ వంటి విశేష ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలు సహితం చైనాపై ఆధారపడటంను తగ్గియింపలేక పోతున్నాయి. కొందరి రిటైల్ వర్తకులు స్వచ్ఛందంగా పండుగల సమయంలో చైనా దిగుమతులను కట్టడి చేసే ప్రయత్నం చేసినా, మొత్తం మీద ప్రభావం కనబడటం లేదు.  గత రెండేళ్లలో చైనా నుండి దిగుమతులు 30 శాతం మేర పెరగడం విస్మయం కలిగిస్తుంది.  అదే సమయంలో భారత్ నుండి  చైనాకు ఎగుమతు లు సహితం గణనీయంగా పెరగడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నది. రెండేళ్లలో 56 శాతం మేరకు పెరిగాయి  గతేడాది చైనాతో భారత వాణిజ్యం 125 బిలియన్‌ డాలర్లను (రూ.9.29…

Read More

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం తొలిసారిగా అంబులెన్స్ సిబ్బందికి కేంద్ర ఎన్నికల కమీషన్ కల్పించింది. అదే విధంగా గుర్తింపు పొందిన జర్నలిస్టులు కూడా పోస్టుల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని తెలిపింది. అత్యవసర సర్వీసు విభాగాలకు సంబంధించి జాబితాను కమీషన్ విడుదల చేసింది. ఫుడ్ సివిల్ సప్లై అండ్ కన్జూమర్ అఫైర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా రేడియో, దూర్ దర్శన్, పోస్ట్ అండ్ టెలిగ్రామ్, రైల్వే, బీఎస్ఎన్ఎల్, విద్యుత్, హెల్త్, ఫైర్ సర్వీస్, సివిల్ ఏవియేషన్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఇంతకుముందు ఎన్నికల కమిషన్ మీడియా వ్యక్తులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వైకల్యం ఉన్నవారు (40 శాతం కంటే ఎక్కువ), కరోనా రోగులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించి ఓటు వేయడానికి ఈసీ అనుమతించింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నిర్ణయించిన తేదీ కంటే ముందు అన్ని…

Read More

ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల సమయంలో బిజెపి నుండి ముగ్గురు మంత్రులతో పాటు  పది మంది వరకు శాసనసభ్యులు  వరకు రాజీనామాలు చేసి ప్రతిపక్షం సమాజవాద్ పార్టీలో చేరడంతో  రాజకీయాలు వేడెక్కుతున్నాయి.   వెనుకబడిన వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే తమ ఈ రాజీనామాలకు కారణమని వారు పేర్కొంటున్నారు. కాగా పార్టీ నుండి జరుగుతున్న ఫిరాయింపుల పట్ల బిజెపి మౌనం పాటిస్తోంది. గత ఎన్నికలలో వెనుకబడిన వర్గాలు లేదా యాదవేతర ఒబిసిల నేతలను ఆకట్టుకోవడం ద్వారా బిజెపి అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు అఖిలేష్  యాదవ్ సహితం అటువంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే బిజెపి విడుదల చేసిన తొలి జాబితా చూసిన వారికి జరిగిన నష్టాలను భర్తీ చేసుకొనేందుకు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు అర్ధం అవుతుంది.  బిజెపి ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో 44 మంది ఓబీసీలకు అవకాశం ఇచ్చారు. అలాగే 43 మంది అగ్రవర్ణాల వారికి, 19 మంది ఎస్సీలకు సీట్లు కేటాయించారు. ఈ జాబితాలో 63…

Read More

బంగ్లా యుద్ధం – 32భారత్ కు తిరుగులేని విజయాన్ని యుద్ధభూమిలో అందించే ప్రక్రియలో కొందరు వీర సైనికులు యుద్ధ భూమి నుండి `తప్పిపోయారు’. వారి కుటుంబాలు వారు ఎప్పటికైనా తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూస్తూ చరమాంకంలోకి వెళ్లాయి.  యుద్ధంలో ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత కూడా పాకిస్థాన్ భారత్ కు యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన తమ దేశంపై చెందిన 93,000 మందిని సగౌరవంగా వెనుకకు తీసుకు వెళ్లగలిగింది. కానీ ఆ విషయంలో మనం చెప్పుకోదగిన విజయం సాధించ లేకపోయాను.  మన సైనిక స్థావరాలపై ఉగ్రవాదుల దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి, ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి, పట్టుబడిన అభినందన్ ను మనం రెండు రోజులలోనే తిరిగి తీసుకు రాగలిగాము. కానీ 1971 యుద్ధంకు చెందిన పలువురి సమాచారం సేకరింపలేక పోయాము.  ‘ఇండియన్‌ ప్రిజనర్స్‌ ఆఫ్‌ వార్‌ ఇన్‌ పాకిస్థాన్‌’ అనే పుస్తకాన్ని రచించిన కల్నల్‌ (రిటైర్డ్) ఆర్ కె  పట్టు, 1971కి చెందిన 54 మంది…

Read More

దేశ ఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామీణ, వ్యవసాయ రంగాలే. 1991 తర్వాత చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ఇండియాను ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మలిచినా, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుండటంతో దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగు పడటం లేదు. ఆర్థిక అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి. ఐదు దశాబ్దాలుగా దేశంలో వింటూ వస్తున్న రైతుల ఆత్మహత్యలు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభ ఫలితమే. వీటిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు రుణ మాఫీ, కనీస మద్దతు ధర, కిసాన్ కార్డు వంటి చర్యలు చేబడుతున్నా సమస్య మూలానికి వెళ్లలేక పోతున్నాయి. పెరుగుతున్న రుణ భారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. అయితే 2013 నుంచి 2019 వరకు రైతుల ఆదాయం 30 శాతం పెరిగినా, వారి రుణభారం 58 శాతం పెరిగిన్నట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రైతులకు ఇస్తున్న సబ్సిడీల్లో అత్యధికంగా విత్తనాలు, ఎరువుల ఉత్పత్తిదారులకు,…

Read More

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ 2022 టోర్నీలో భారత యువ కిశోరం లక్ష్యసేన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లో కీన్‌ యూకు షాక్‌ ఇచ్చాడు. దేశ రాజధాని ఢిల్లిలోని కేడీ జాదవ్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో వరల్డ్‌ ఛాంపియన్‌ కీన్‌పై గెలిచి విజేతగా నిలిచాడు. మూడో సీడ్‌ లక్ష్యసేన్‌ ఫైనల్లో లో కీన్‌ యూపై 24-22, 21-17తేడాతో వరుస సెట్లలో గెలిచి ఛాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌కు చెందిన లో కీన్‌పై సేన్‌ 54నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం పైచేయి సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. ఒక దశలో తొలిగేమ్‌ను గెలచుకునేక్రమంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతూ 22-22తో సమంగా ఉండగా అనూహ్యంగా పుంజుకున్న సేన్‌ రెండు వరుస పాయిట్లు గెలుచుకుని 24-22తో తొలిగేమ్‌ గెలచుకుని లో కీన్‌ను దెబ్బతీశాడు. కాగా గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో శ్రీకాంత్‌పై గెలిచిన లో కీన్‌ ప్రపంచ విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో లక్ష్యసేన్‌ కాంస్య పతక…

Read More

భారత్ తో సహా సరిహద్దు ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బీజింగ్ ప్రవర్తన అస్థిరతను కలిగిస్తుందని వాషింగ్టన్ విశ్వసిస్తున్నందున, భారతదేశంతో సహా దాని పొరుగు దేశాలను “భయపెట్టడానికి” చైనా చేసిన ప్రయత్నంపై అమెరికా ఆందోళన చెందుతోంది. అయినా, అమెరికా తన భాగస్వాములతో పాటు కొనసాగుతుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది . తూర్పు లడఖ్‌లో 20 నెలలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్, చైనాల మధ్య 14వ రౌండ్ సైనిక స్థాయి చర్చలు జరగటానికి ముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ నుండి ఈ వాఖ్యలు రావడం గమనార్హం. భారత్‌తో సరిహద్దులో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని, చైనాతో చర్చల సందర్భంగా గాని లేదా నేరుగా గాని వాషింగ్టన్‌ ఈ అంశంపై  బీజింగ్‌కు ఏదైనా సందేశం పంపుతుందా అని గత వారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందిస్తూ భారత్ – చైనా సరిహద్దు వెంబటి పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  సరిహద్దు సమయాలను చర్చలు, శాంతియుత…

Read More

చంటి బిడ్డలకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి. ఆకలితో ఏడుస్తున్న పిల్లలను సముదాయించడాని కూడా తల్లులు వారికి పాలిస్తుంటారు.  ఇంట్లో అయితే వారికి అలవాటు పడ్డ వాతావరణంలో బిడ్డలకు స్వేచ్చగా పాలిచ్చే తల్లులు, బహిరంగంగా కొన్ని సందర్భాల్లో పసిబిడ్డలకు పాలు ఇవ్వాల్సి వస్తోంది.  ఆ సమయంలో కొంత మంది కామాంధులు ఆ ఫోటోలు తీసి మహిళల్ని వేధిస్తున్నారు. ఇటువంటి వేధింపులను అడ్డుకట్ట వేసేలా ఇంగ్లాండ్‌, వేల్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చనుబాలు పడుతున్న తల్లుల ఫోటోలు/వీడియోలు వారి అనుమతి లేకుండా తీస్తే రెండేళ్ల జైలు శిక్ష పడేలా తమ న్యాయ చట్టాల్లో సవరణ చేశాయి. ఇక జులియా కూడా ఇటువంటి ఓ సందర్భాన్ని ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇది నేరం కాదని కేసు నమోదు చేయలేదు. ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తేవాలనుకున్న వీరు మరికొందరితో కలిసి ‘స్టాప్‌ ది బ్రెస్‌ పెస్ట్స్‌’ పేరుతో తల్లులపై వేధింపులకు వ్యతిరేకంగా డిజిటల్‌ ఉద్యమాన్ని…

Read More

కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ జైమే సావేడ్ర  స్పష్టం చేశారు. కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివరి నిర్ణయంకావాలని హితవు చెప్పారు. పాఠశాలలను పునఃప్రారంభించడం వల్ల కరోనా వైరస్ కేసులు పెరిగాయని, పాఠశాలలు సురక్షిత ప్రదేశాలు కాదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు.  జైమే సావేడ్ర బృందం విద్యా రంగంపై కరోనా  ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావేడ్ర మాట్లాడుతూ, బాలలకు టీకాలు ఇచ్చే వరకు వేచి చూడాలనడంలో అర్థం లేదని చెప్పారు. ఈ దృక్పథానికి సైన్స్‌పరమైన ఆధారమేదీ లేదని పేర్కొన్నారు. పాఠశాలలను తెరవడం, కరోనా వైరస్ వ్యాపించడం మధ్య సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ మహమ్మారి పేరుతో  పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదని చెప్పారు. కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివర తీసుకోవలసిన నిర్ణయం కావాలని పేర్కొన్నారు. బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌ను తెరచి ఉంచి, పాఠశాలలను మూసివేయడంలో అర్థం లేదని అంటూ ఇది సరైనది కాదని స్పష్టం చేశారు.  2020లో మన సముద్ర యానం అయోమయంగా, అగమ్యగోచరంగా ఉండేదన్నాని,  కరోనా  మహమ్మారితో ఎలా పోరాడాలో, ఏది మంచి విధానమో అప్పట్లో తెలియదని గుర్తు చేశారు.…

Read More