Author: Editor's Desk, Tattva News

లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్‌స్ట్రీట్‌లో జరిగిన మూడు మద్యం పార్టీలు ఆయన నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తూ, రాజినామా చేయాలనే వత్తిడులు ఎదురవుతూ ఉండడంతో ఆయన వారసుడు ఎవరని అక్కడి మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన వ్యక్తి మొదటిసారిగా బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  జాన్సన్ పదవీచ్యుడైతే ఆయన స్థానంలో నూతన ప్రధానిగా ఎవరన్నదానిపై   బ్రిటన్ మీడియాలో ఊహాగానాలు, విశ్లేషణలు వస్తున్నాయి. కాబోయే ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్(41) పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి అల్లుడు. రిషి బ్రిటన్ ఆర్థికమంత్రిగా 2020 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈ మూడు మద్యం పార్టీలను ఆ దేశ మీడియా పార్టీగేట్ కుంభకోణంగా అభివర్ణిస్తూ కథనాలను వెల్లడిస్తున్నాయి. అందులో రెండు ఫేర్‌వెల్ పార్టీలు గతేడాది ఏప్రిల్ 17న జరిగాయని డైలీటెలీగ్రాఫ్ వెల్లడించింది.…

Read More

గత ఏడాది ఉద్భవించిన కరోనా డెల్టావేరియంట్‌ భారత్‌లో భారీగా ప్రాణాలను బలిగొందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్‌ నుండి జూన్‌ మధ్య కాలంలో 2,40,000 మంది ప్రాణాలను బలిగొందని తెలిపింది.  పైగా, ఆర్థిక పునరుద్ధరణకు అంతరాయం కలిగించిందని పేర్కొన్నది. సమీప భవిష్యత్ లో సహితం భారత్ లో ఈ విధంగా భారీ మరణాలు  జరగవచ్చని హెచ్చరించింది. ‘ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఎకనామిక్‌ సిట్యుయేషన్‌ అండ్‌ ప్రాస్పెక్టర్‌ 2022’ పేరుతో గల ఈ నివేదిక ఒమిక్రాన్‌ సహితం అత్యంత తీవ్రంగా వ్యాపిస్తోందని, ప్రపంచ వ్యాప్త టీకా కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టనంత వరకూ… మహమ్మారి సవాళ్లు విసురుతూనే ఉంటుందని పేర్కొంది.  దీంతో ప్రపంచం ఆర్థికంగా కోలుకోవడానికి ఇబ్బందులు తప్పవని, దక్షిణాసియా ప్రాంతంలో టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతోందని తెలిపింది. ఫలితంగా అక్కడ కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని పేర్కొంది.  బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లలో డిసెంబరు నాటికి కేవలం 26 శాతం మంది జనాభా పూర్తి స్థాయిలో…

Read More

చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్‌రావత్, ఆయన భార్యసహా 14మంది దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఎటువంటి కుట్రలేదని త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలను భారత వైమానిక దళం(ఐఎఎఫ్) ప్రకటించింది.  ప్రమాదం వెనుక కుట్రకోణంగానీ, సాంకేతికలోపంగానీ లేవని నివేదిక పేర్కొన్నది.  వాతావరణంలో అనుకోకుండా చోటు చేసుకున్న మార్పుల వల్ల పైలట్ అయోమయానికి గురి కావడంవల్లే ప్రమాదం జరిగిందని తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మాన్వేంద్రసింగ్ నేతృత్వంలో త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ జరిగిన విషయం తెలిసిందే. కమిటీ తమ ప్రాథమిక నివేదికను ఈ నెల మొదటివారంలో రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సమర్పించింది. లోయలోని వాతావరణంలో ఏర్పడ్డ అనూహ్య మార్పుల వల్ల సిడిఎస్ బిపిన్‌రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ17వి 5 హెలికాప్టర్ మేఘాలలో చిక్కుకోవడంతో హెలికాప్టర్‌పై పైలట్ నియంత్రణ కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారని ఐఎఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదానికి ఎలాంటి సాంకేతిక, యాంత్రిక…

Read More

ప్రయాణికుల భద్రత కోసం కేంద్ర ఎనిమిది మంది వరకు ప్రయాణించగలిగే అన్ని వాహనాల్లోనూ 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.  ఎనిమిది మంది వరకు ప్రయాణించగలిగే మోటారు వాహనాల్లో తప్పనిసరిగా కనీసం ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలని నిర్దేశించే ముసాయిదా నోటిఫికేషన్‌ను తాను ఆమోదించానని గడ్కరీ తెలిపారు. మోటారు వాహనాల్లో ప్రయాణించేవారికి భద్రతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  డ్రైవర్ భద్రత కోసం ఎయిర్ బ్యాగ్‌ను 2019 జూలై 1 నుంచి తప్పనిసరి చేశామని, ముందు సీట్లో కూర్చునే ప్రయాణికుడి భద్రత కోసం ఎయిర్‌ బ్యాగును అమర్చడాన్ని 2022 జనవరి 1 నుంచి తప్పనిసరి చేశామని తెలిపారు.  ఎం1 వెహికిల్ కేటగిరీలోని ప్రతి వాహనానికి అదనంగా 4 ఎయిర్ బ్యాగులను అమర్చాలని తెలిపే నిబంధనను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.  వాహనంలో…

Read More

దేశ రాజధాని ఓవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలకు, మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సిద్ధపడుతున్న వేళ బాంబు కలకలం సృష్టించింది. తూర్పు ఢిల్లీలో రద్దీగా ఉండే ఘాజీపూర్ పూల మార్కెట్లో ఏకంగా 3 కేజీల బరువున్న హై-ఇంటెన్సిటీ బాంబును పోలీసులు గుర్తించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) బృందాలు బాంబును నిర్జన ప్రదేశంలో పేల్చి నిర్వీర్యం చేశాయి. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల కుట్రేనని ఢిల్లీ పోలీసు యంత్రాంగం అనుమానిస్తోంది. గణతంత్ర దినోత్సవాల సమయంలో భారీగా ప్రాణనష్టం కల్గించే విద్రోహ చర్యలకు పాల్పడి, అలజడి సృష్టించాలన్నది ఉగ్రవాదుల పన్నాగమని, అందులో భాగంగానే రద్దీగా ఉండే ఈ పూల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. పంజాబ్‌లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై చర్చ జరుగుతున్న సమయంలో దేశ రాజధానిలోనే భారీ తీవ్రత కల్గిన బాంబు గుర్తించడం కలకలానికి కారణమైంది. . ఘాజీపూర్ మార్కెట్లో ఓ పూలవ్యాపారి అప్రమత్తత పెద్ద ముప్పును తప్పించింది. తన పూల దుకాణం…

Read More

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ను కులం పేరుతో పాటు, అసభ్యపదజాలంలో దుషించాడని గొంది రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. చింతలపూడి ఏపీ సునీల్‌ కుమార్‌ సొంతగ్రామం. రాజు ఫిర్యాదుతో రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చింతలపూడి పోలీసులు తెలిపారు. తనపై జార్ఖండ్ వ్యక్తులతో హత్యాయత్నం చేస్తున్నారని, అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ వ్రాస్తున్నానని ఆయన ప్రకటించిన రోజుననే ఈ కేసు నమోదు కావడం గమనార్హం. రెండు రోజుల క్రితం, హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి రఘురామకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో రఘురామ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారన్న విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా రఘురామను అరెస్టు చేయొద్దని గతంలో…

Read More

బంగ్లా యుద్ధం – 29 యుద్ధం జరిగిన 50 సంవత్సరాల తరువాత, 1971 బంగ్లాదేశ్, భారతదేశం,   పాకిస్తాన్‌లలో ప్రజల స్థాయిలో, ప్రభుత్వాల స్థాయిలో  వారి జీవితాలు, విధానాలపై విశేష ప్రభావం చూపుతూ వస్తున్నది. వారి విధానాల రూపకల్పనలో చెరగని ముద్ర వేస్తున్నది.  1971 గురించి  బంగ్లాదేశ్‌లో విముక్తి, భారతదేశంలో విజయం, పాకిస్తాన్‌లో ఓటమిని వెల్లడి చేసే విభిన్న కథనాలను అవకాశం లభించింది.   1971పాకిస్తాన్  విభజన దేశ విభజన అనంతరం మూడు దేశాలలోని నూతన తరాలకు  శాశ్వత వారసత్వాన్ని మిగిల్చింది. బంగ్లాదేశ్‌లో, అణచివేత పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా బెంగాలీ ప్రజల పోరాటంగా ఈ యుద్ధం గుర్తుకు వస్తుంది. భారతదేశం, పాకిస్తాన్లకైతే తమ మధ్య జరిగిన మూడవ ఇండో-పాకిస్తాన్ యుద్ధంగా గుర్తుకు వస్తుంది. అయితే ఈ కధనం పట్ల  చాలా మంది బంగ్లాదేశీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాము భావించే  విముక్తి యుద్ధంలో తమ పాత్రను చెరిపివేసినట్లు భావిస్తున్నారు.యుద్ధ సమయంలో ముఖ్యమైన పాత్ర పోషించిన షేక్ ముజిబుర్ రెహమాన్   స్వాతంత్య్రం  తర్వాత అధికారం చేపట్టాడు.…

Read More

రైతాంగం ప్రయోజనాలకు కేంద్రం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ లేఖ వ్రాయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఆ లేఖలో కేసీఆర్ చెప్పినవన్నీ  పచ్చిఅబద్ధాలని ఎండగట్టారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డారు.  జీవో 317ను సవరించాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ మహోద్యమానికి శ్రీకారం చుడుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధానికి లేఖ పేరిట కొత్త డ్రామాకు తెరదీశారని సంజయ్ ఆరోపించారు. అందుకు సమాధానంగా ఆయన కేసీఆర్ కు మరో బహిరంగ లేఖ వ్రాసారు.  ‘మీ విధానాలు, నిర్ణయాలతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది’ అంటూ ఆ లేఖలో కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ చేసిన…

Read More

సర్బానంద సోనోవాల్, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి మకర సంక్రాంతి.. సూర్యుడు కొద్దిగా ఉత్తరాన ఉదయించే రోజు. ఎన్నో మార్పులకు సంకేతం సంక్రాంతి. ఈ పండుగ దేశ ప్రజలకు అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యవసాయ సందేశాలను అందిస్తుంది. ఈ అనంత విశ్వంలో అంతర్గత, బాహ్య మార్పులు, రాశి చక్ర గమనం సంక్రాంతితో ప్రారంభమవుతాయి. విశ్వం ప్రాధాన్యతను గుర్తు చేసే సంక్రాంతి.. మానవ శరీరం, మనస్సు బాహ్య ప్రపంచంతో చేయి కలిపి ముందుకు సాగాలని మనకు గుర్తు చేస్తుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ‘సూర్య నమస్కారాల’ ద్వారా ప్రతి ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. యోగాసనాలు వేసి సూర్య భగవానుడికి అంజలి ఘటించాలన్నది ఈ కార్యక్రమం  ముఖ్య ఉద్దేశం.  మానవాళికి అనేక సంవత్సరాల నుంచి భారతీయ యోగా అందుబాటులో ఉంది. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో యోగాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు…

Read More

కరోనా కట్టడికి రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. టెస్టింగ్ తో పాటు ట్రేసింగ్ పై దృష్టి పెట్టాలని చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కోరారు. లోకల్ కంటైన్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెబుతూ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. దేశంలో 10 రోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిని వైద్య నిపుణులు నిరంతరం సమీక్షిస్తున్నారన్న ప్రధాని మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం వ్యూహాలు రూపొందించే ముందు సామాన్యుల జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని సూచించారు. ఆర్థిక…

Read More