ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపంపై దర్యాప్తునకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధాని పర్యటనలో భద్రతా ఉల్లంఘనకు గల కారణాలు, దానికి బాధ్యులైన వ్యక్తులు, వివిపిల భద్రతా ఉల్లంఘనలను నిరోధించడానికి భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలపై విచారిస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) ఇందు మల్హోత్రా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సభ్యులుగా ఉంటారు. జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లో పర్యటించిన సందర్భంగారోడ్డు మార్గంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ర్యాలీకి వెళ్తుండగా, దారిలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రధానమంత్రి కాన్వాయ్ రోడ్డు మీద ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన తిరిగి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే ఈ ఘటనపై…
Author: Editor's Desk, Tattva News
దేశ రాజధానిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా విజృంభించింది. ఆఫీసులో 50 మందికి మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా బారిన పడిన వారిలో సెక్యురిటీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల కోసం మంగళవారం బీజేపీ కార్యాలయంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా, యుపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యకుడు జెపి నడ్డా, సీనియర్ మంత్రులు రాజ్ నాఁథ్ సింగ్, నితిన్ గడ్కరీలు సహా పలువురు కేంద్ర మంత్రులు, నాయకులకు కరోనా సోకింది. తాజాగా ఇప్పుడు పార్టీ ఆఫీసులో కరోనా కేసులు రావడంతో బీజేపీ నేతలంతా అప్రమత్తం అవుతున్నారు. క్వారంటైన్ లో ఉండి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి 12 వ తేదీ లోపు దాదాపుగా 1700 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. మరోవైపు ఢిల్లీలో ప్రైవేటు కార్యాలయాలన్నింటిని బంద్…
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు సిద్ధార్థ్ ఎట్టకేలకు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. ఒక బహిరంగ లేఖలో, తన అసలు వ్యాఖ్యతో జోక్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే అది ‘ల్యాండ్ కాలేదు’ అని చెప్పాడు. షట్లర్ సిద్ధార్థ్ క్షమాపణపై స్పందిస్తూ విషయం ‘మహిళలకు సంబంధించినది’ అని అంటూ వ్యాఖ్య చేసిన తర్వాత నటుడు తన వైఖరిని ఎందుకు మార్చుకున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేసింది “అతను మాత్రమే చెప్పాడు, అతను ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నాడు. ఆ రోజు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అతనితో మాట్లాడలేదు. కానీ అతను క్షమాపణలు చెప్పినందుకు నేను సంతోషంగా ఉన్నాను”అని ఆమె ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. “చూడండి, ఇది మహిళల గురించి. అతను అలాంటి స్త్రీని లక్ష్యంగా చేసుకోకూడదు, కానీ ఫర్వాలేదు, నేను దాని గురించి బాధపడటం లేదు. …
కొత్త సీజన్‌లో అమెరికాకు భారతీయ మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ (యూఎస్డీఏ) ఆమోదాన్ని కేంద్రం పొందడంతో అమెరికాలోని వినియోగదారులకు ఇప్పుడు రెండేళ్ల తర్వాత భారతదేశం నుండి అద్భుతమైన నాణ్యమైన మామిడి పండ్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన పరిమితుల కారణంగా రేడియేషన్ సదుపాయాన్ని తనిఖీ చేయడానికి యూఎస్డీఏ ఇన్‌స్పెక్టర్‌లు భారతదేశాన్ని సందర్శించలేక పోవడంతో భారతీయ మామిడి పండ్ల ఎగుమతిని అమెరికా 2020 నుండి పరిమితం చేసింది. ఇటీవల, నవంబర్ 23, 2021న జరిగిన 12వ భారతదేశం – అమెరికా వాణిజ్య విధానం ఫోరమ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై అనుగుణంగా, భారత వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ, యూఎస్డీఏ అమలు కోసం ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశం అమెరికాకు మామిడి, దానిమ్మ ఎగుమతులు చేయగా; అమెరికా నుండి భారత్ చెర్రీస్, అల్ఫాల్ఫా ఎండుగడ్డి దిగుమతికి రేడియేషన్‌పై ఉమ్మడి ప్రోటోకాల్‌ను అనుసరిస్తాయని వాణిజ్య, …
బంగ్లా యుద్ధం – 27ఒక దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భావం హింసాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కల్లోలానికి మూలాలు 1947 నాటి భారత్ విభజనలోనే ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలకులు ఉపఖండాన్ని విడిచిపెట్టి వెళ్లే సమయంలో జరిగిన మతపరమైన హింసలో సుమారు 2 లక్షల మంది మృతి చెందారు. మరో కోటి మంది నుండి 1.5 కోట్ల మందివరకు నిరాశ్రయులయ్యారు. కొత్తగా ఏర్పడిన స్వతంత్ర పాకిస్థాన్‌లో వెయ్యి మైళ్లకు పైగా భారత భూభాగంతో వేరు చేస్తున్న రెండు వేర్వేరు భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. రెండు ప్రాంతాలు గణనీయమైన ముస్లిం జనాభాను కలిగి ఉండగా, పశ్చిమ పాకిస్తాన్ ఎక్కువగా పంజాబీ, పష్టున్లు, సింధీలు, బలూచ్, ఇతర చిన్న జాతులతో నిండి ఉంది. అందుకు విరుద్ధంగా, ఆధునిక బంగ్లాదేశ్‌గా మారిన తూర్పు పాకిస్తాన్ జనాభా ప్రధానంగా జాతిపరంగా బెంగాలీగా ఉంది, ఎందుకంటే ఈ భూభాగం గతంలో బెంగాల్‌లోని భారత ప్రాంతంలో భాగంగా ఉంది.ఈ రెండు ప్రాంతాల మధ్య…
డా. టి ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ, సామజిక శాస్త్రవేత్త పంతొమ్మిదవ శతాబ్దంలో విశేషంగా ప్రభావం చూపిన భారతీయ హిందూ సన్యాసి, ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా స్వామి వివేకానందను పరిగణిస్తున్నారు. భారతదేశం గురించి తెలుసుకోవడానికి వివేకానంద రచనలను అధ్యయనం చేయాలని రవీంద్రనాథ్ ఠాగూర్ సూచించారు. భారత స్వాతంత్య్ర వీరుడు సుభాష్ చంద్రబోస్ వివేకానందను తన ఆధ్యాత్మిక గురువుగా భావించారు. మహాత్మాగాంధీ వివేకానంద రచనలు చదివిన తర్వాత జాతి పట్ల తనకున్న ప్రేమ వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబర్ 2010లో భారతదేశంలో చేసిన ప్రసంగంలో వివేకానంద మాటలను ఉటంకించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, వివేకానంద తనను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించారని తెలిపారు. వివేకానంద జన్మదినమైన జనవరి 12న భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. అయినా, ఆధునిక భారతదేశ నిర్మాణంలో స్వామి వివేకానంద ప్రభావం గురించి భారతీయ చరిత్రకారులు సరిగ్గా అంచనా వేయలేదని చెప్పవచ్చు. ఆయన కేవలం కాషాయ వస్త్రాలు ధరించి,…
భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం రేటుతో వృద్ధి చెందే అవకాశం ఉందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ విర్మానీ చెప్పారు. ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు పెరిగినట్లు తెలిపారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేటు వినియోగ రంగం ఇంకా కోలుకోలేదని తెలిపారు. భారత దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు ప్రస్తుతం సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల వృద్ధి రేటు వెనుకంజలో ఉందని చెప్పారు. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)లు సమ్మిళిత వృద్ధికి చాలా ముఖ్యమని చెప్పారు. ఆధునిక ఎంఎస్ఎంఈలు కార్పొరేట్ రంగంతో పోటీ పడటానికి సంపూర్ణ అవకాశాలు ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అధికంగా ఉంటుందని, సుమారు 9.5 శాతం వరకు ఉండవచ్చునని చెప్పారు. ఈ దశాబ్దం (1921-1930) సగటు వృద్ధి సుమారు 7.5 శాతం (+/- 0.5 శాతం) ఉండవచ్చునని అంచనా…
తాలిబన్ల పాలన ప్రారంభమైన తర్వాత ఆఫ్ఘానిస్తాన్ జర్నలిస్టులకు నరకప్రాయంగా మారింది. స్వతంత్రంగా వార్తలు వ్రాసే స్వేచ్ఛ లేదు. మహిళలు వృత్తిని చేపట్టేందుకు వీలు లేదు. ఇటువంటి పలు వత్తిడుల కారణంగా, హింసాయుత దాడుల పర్యవసానంగా గత నాలుగు నెలల కాలంలో 80 శాతం మంది తమ వృత్తిని వదిలివేశారు. జర్నలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంచనా ప్రకారం తాలిబన్‌ల పాలనలో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో సుమారు 79 శాతం మంది జర్నలిజాన్ని వదులుకున్నారని, తమ జీవనోపాధి కోసం ఇతర వృత్తుల్లోకి మళ్లారని స్థానిక పత్రిక ఖామా ఒక నివేదికలో పేర్కొంది. దేశంలో 75 శాతం మీడియా సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో మూసివేతకు గురయిన్నట్లు తెలిపింది. ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి తూర్పు ప్రావిన్స్‌లైన నంగర్‌హర్, లఫ్‌మాన్, నూరిస్తాన్‌లలోని ఆరు రేడియో స్టేషన్‌లు మూతపడ్డాయని తెలిపింది. వాటిలో ఐదు ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా మూతపడగా, మరో స్టేషన్ ఉద్యోగులు లేకపోవడం వల్ల మూతపడిందని…
భారతదేశపు నైటింగేల్ ఆఫ్ ఇండియా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు. 92 ఏళ్ల గాయనికి కరోనా పాజిటివ్ నిర్దారైన తర్వాత ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఐసియులో చేరారు. ఈ వార్తలను లతా మంగేష్కర్ మేనకోడలు రచన ధృవీకరించారు. లతా మంగేష్కర్‌లో తేలికపాటి లక్షణాలు ఉన్నాయని రచన ఓ వార్తా సంస్థకు తెలిపింది. “ఆమె బాగానే ఉంది; ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త కారణాల కోసం మాత్రమే ICUలో ఉంచబడింది. దయచేసి మా గోప్యతను గౌరవించండి. మరియు మీ ప్రార్థనలలో దీదీని ఉంచండి” అని రచన చెప్పారు. ప్రస్తుతం, ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చికిత్స పొందుతోంది, ఇక్కడ డాక్టర్ ప్రతిత్ సంధాని, అతని బృందం బాధ్యత వహిస్తున్నారు. ఆమె న్యుమోనియాతో బాధపడుతోంది. అంతకుముందు లతా మంగేష్కర్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ 2019లో ఆసుపత్రిలో చేరారు. గత సంవత్సరం, మంగేష్కర్‌కి 92…
దేశంలో మూడో అతిపెద్ద ఫోన్ అపరేటర్‌గా ఉన్న వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో వొడాఫోన్- ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. గత కొద్దికాలంగా.. వొడాఫోన్, ఐడియా కస్టమర్లను భారీగా కోల్పోవడం, లాభదాయక పరిస్థితులు కనిపించకపోవడంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే స్టాక్ ఎక్స్సేంజ్‌లోని వాటాలను కంపెనీ వివరించింది. లండన్‌కు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28.5 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్ 17.8 శాతం వాటాలను కలిగి ఉందని పేర్కొంది. వ్యవస్థాపకులతో పాటు కంపెనీ ప్రస్తుత షేర్ హోల్డర్లందరిపై ఇది ప్రభావం చూపనుంది. తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయంతో.. భారత ప్రభుత్వం 36 శాతం వాటానాను కలిగి ఉండడంతో కీలక పాత్ర పోషించే…