కరోనా మహమ్మారి కాలం ముందుకన్నా ఇప్పుడు దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నూతన సంవత్సరం రోజున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద విడుదల చేసిన రూ 29,900 కోట్ల నిధులను 10.09 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో జమచేసి సందర్భంగా ప్రసంగిస్తూ ప్రస్తుతం మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 8 శాతానికి పైగా ఉందని చెప్పారు. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయని చెబుతూ జిఎస్‌టి రాబడిలో గత రికార్డులు బద్దలవుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు నిర్ధేశించుకున్నామని అంటూ 2021లో కేవలం యూపిఐ ద్వారానే రూ.70వేలకోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్టు తెలిపారు. ఇప్పడు 50 వేలకు పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. అందులో గత 6 నెలల్లోనే 10 వేల అంకురాలు నమోదయ్యాయని తెలిపారు. పర్యావరణ మార్పులపై ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నామని చెబుతూ 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలనేది…
Author: Editor's Desk, Tattva News
గడువు లోగా రెన్యువల్ చేయించుకోక పోవడం, కనీసం అందుకోసం దరఖాస్తు చేసుకోక పోవడం కారణంగా దేశంలో సుమారు 6,000 స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలు పొందడానికి తప్పనిరైన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద లైసెన్సులను కోల్పోయాయి. ప్రస్తుతమున్న లైసెన్సు గడువు అక్టోబర్ తోనే ముగిసినా, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ డిసెంబరు 31కు పొడిగించింది. లైసెన్సు పునరుద్ధరణ కోసం ఆయా సంస్థలు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎన్జీవోలు దీనికోసం దరఖాస్తు పెట్టుకోగా , మరికొన్ని కారణాల వల్ల వాటిని అధికారులు తిరస్కరించారు. ఇక మరికొన్ని సంస్థలు గడువు ముగిసినా లైసెన్సు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ విధంగా మొత్తం 5933 ఎన్జీవోలు శనివారం నాటికి విదేశీ విరాళాల లైసెన్సులను కోల్పోయినట్టు హోంశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో శనివారం నాటికి 22,762 ఎఫ్‌సిఆర్‌ఎ నమోదిత ఎన్జీవోలు ఉండగా, నేడు ఆ సంఖ్య16,829 కి తగ్గినట్టు పేర్కొంది. 2010 ప్రాంతంలో పి చిదంబరం…
కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ దేశంలో జీఎస్‌టీ వసూళ్లు గణనీయంగా ఉంటూ వస్తున్నాయి. వరుసగా ఆరోనెల లక్ష కోట్ల రూపాయలకు మించి వసూలయ్యాయి. గత నెల డిసెంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ ) స్థూల వసూళ్లు రూ.1.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు పుంజుకోవడంతోపాటు పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తుండటం ఇందుకు దోహదపడిందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే గత నవంబర్ వసూళ్లకన్నా కొంచెం తగ్గాయి. నవంబరులో జీఎస్‌టీ ఆదాయం రూ.1.31 లక్షల కోట్లుగా నమోదైంది. ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలకు జీఎస్‌టీ ఆదాయం రూ.1,29,780 కోట్లుగా నమోదైంది. అందులో సెంట్రల్‌జీఎస్‌టీ (సీజీఎస్‌టీ ) వాటా 22,578 కోట్లు కాగా, స్టేట్‌జీఎస్‌టీ రూ.28,658 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ ) రూ.69,155 కోట్లుగా ఉంది. పరిహార సెస్సు రూపంలో మరో…
వైసిపి ఎంపీగా ఉంటూ ఆ పార్టీ ప్రభుత్వం పైననే నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తుండటమే కాకుండా, నేరుగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులలో బెయిల్ రద్దు చేయాలని కోర్టులను ఆశ్రయిస్తున్న యంపీ కె రఘురామకృష్ణరాజుపై ఇప్పుడు సీబీఐ ఢిల్లీ కోర్ట్ లో చార్జిషీట్ దాఖలు చేసింది. కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుపై రఘురామకృష్ణరాజు తో పాటు 16 మందిపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలయింది. రఘురామకృష్ణరాజుతోపాటు ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, గుత్తేదారులు, ఛార్టెడ్ అకౌంటెంట్లతో కలిపి 16 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు సిబిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీలోని రోజ్‌అవెన్యూ కోర్టుల సముదాయంలోని సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ జడ్జి ఎదుట ఛార్జిషీటు దాఖలు చేసినట్లు పేర్కొంది. సీబీఐ కధనం ప్రకారం 2018 అక్టోబరు 3 వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ, దాని డైరెక్టర్లపైన ఢిల్లీలోని ఈవోడబ్ల్యూ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కేంద్ర…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిష్టితి కలవరం కలిగిస్తున్నది. అక్కడ ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరపడంతో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్యెల్యేలు కరోనాకు గురయ్యారని ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ తెలిపారు. దానితో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 6 తర్వాత దేశంలో మొదటిసారి కరోనా ఆక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దాటింది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ కేసుల సంఖ్య ఏకంగా 22 వేలు దాటాయి. 400కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు కూడా 1400 దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాల మేరకు… దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1431 కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 200 కేసులు పెరగడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. మరోవైపు ఇప్పటివరకు 488 మంది…
బంగ్లా యుద్ధం – 17 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో భారత సేనలు నిర్ణయాత్మక విజయం సాధించడంలో మన సేనలకు లభించిన అసమాన సారధ్యం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పాలి. వీరిలో కీలక పాత్ర వహించిన నలుగురు యోధుల గురించి తెలుసుకుందాము. సామ్ మానెక్ షా, సామ్ బహదూర్ పేర్లతో పిలువబడే, మహావీర్ చక్ర అవార్డు గ్రహీత ఫీల్డ్ మార్షల్ సామ్ హోర్ముస్జీ ఫ్రామ్‌జీ జంషెడ్జీ మానేక్షా అనితరమైన నాయకత్వం వహించారు. ఆ సమయంలో భారత సైన్యాధిపతిగా ఉన్నారు. ఏప్రిల్ 1971లో, `మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’ అని ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అడిగినప్పుడు, తన సాయుధ, పదాతిదళ విభాగాలు చాలా వరకు ఇతర చోట్ల మోహరించి ఉన్నాయని, 12 ట్యాంకులు మాత్రమే పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని సూటిగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, హిమాలయ పర్వత మార్గాలు త్వరలో తెరుచుకుంటాయని, ఈ ప్రాంతం వరదలకు గురవుతుందని ఆయన ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. భారత ప్రధానిని తనను…
శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి మందిరం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం పన్నెండు మంది యాత్రికులు మరణించారు. డజనుకు పైగా మంది గాయపడ్డారు. 13 మందికి తీవ్ర గాయాలు కాగా నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇప్పటివరకు ఎనిమిది మందిని గుర్తించారు – ధీరజ్ కుమార్ (26), శ్వేతా సింగ్ (35), వినయ్ కుమార్ (24), సోను పాండే (24), మమత (38), ధరమ్‌వీర్ సింగ్ (35), వనీత్ కుమార్ (38) , మరియు డాక్టర్ అరుణ్ ప్రతాప్ సింగ్ (30). అధికార వర్గాల కధనం ప్రకారం, భవన్ ప్రాంతంలో భారీ రద్దీని నియంత్రించడానికి పోలీసులు తేలికపాటి లాఠీచార్జిని ఆశ్రయించడంతో తొక్కిసలాట జరిగింది. 25,000 మందికి పైగా కత్రా నుండి బయలుదేరి పవిత్ర పుణ్యక్షేత్రం వైపు వెళ్లేందుకు అనుమతించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ…
ప్రజలను మాఫియా కోరల నుంచి కాపాడటానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించిన `ఉత్తర ప్రదేశ్ గమ్యం’ సదస్సులో మాట్లాడుతూ, తాను సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను చూశానని, ఆ పరిస్థితులే తనను రాజకీయాల్లో చేరేందుకు ప్రేరేపించాయని తెలిపారు. 1994లో గోరక్షక్ పీఠ్ అధిపతిగా నియమితుడైన తనను ఆ ప్రాంతంలో జరిగిన రెండు సంఘటనలు కదిలించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో యుపిలో సమాజావాది పార్టీ అధికారంలో ఉన్నదని చెబుతూ, గోరఖ్‌పూర్‌లో ఓ ప్రముఖ కుటుంబం ఉండేదని, వారికి రెండు పెద్ద భవనాలు ఉండేవని చెప్పారు. ఈ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫియాకు కేటాయించిందని, ఆందోళనకు గురైన ఆ కుటుంబం ఆ భవనాలను కూల్చేసిందని చెప్పారు. వాటిని కూల్చేసిన మర్నాడు తాను ఆ కుటుంబాన్ని కలిసి, ఏం జరిగిందని, భవనాలను ఎందుకు కూల్చేశారని అడిగానని పేర్కొన్నారు. అందుకు ఆ కుటుంబ…
ఇప్పుడు అంతర్జాతీయ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి తరచుగా కనిపించే గొప్ప శక్తి అయిన చైనా, స్వదేశంలో తీవ్ర జలసంక్షోభం ఎదుర్కొంటున్నది. సహజ వనరులు ఎల్లప్పుడూ ఆర్థిక , ప్రపంచ శక్తికి కీలకం. 19వ శతాబ్దంలో, ఒక చిన్న దేశమైన ఇంగ్లాండ్ కేవలం సమృద్ధిగా ఉన్న బొగ్గు నిల్వలు ఉండడంతో పారిశ్రామిక విప్లవంలో మిగిలిన దేశాలకంటే ముందుంది. బ్రిటన్ ను చివరికికు అమెరికా అధిగమించింది. అమెరికాకు భారీగా వ్యవసాయ యోగ్యమైన భూమి, చమురు నిల్వలు, ఇతర వనరులను దోపిడీ చేసి ప్రపంచంలో ఆర్ధిక శక్తిగా మారింది. చైనా ఎదుగుదలకు కూడా ఇదే వర్తిస్తుంది. పెట్టుబడిదారీ సంస్కరణలు, స్వాగతించే ప్రపంచ వాణిజ్య వ్యవస్థ, మంచి జనాభా గణాంకాలు అన్నీ 1970ల చివరి నుండి 2000ల ప్రారంభం వరకు బీజింగ్ ప్రపంచ-అభివృద్ధి ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయి. భూమి, నీరు, అనేక ముడి పదార్ధాలలో చైనా దాదాపుగా స్వయం సమృద్ధి సాధించిందన్నది వాస్తవం. పైగా చౌకగా అందుబాటులో కార్మికులు ఉండడంతో ఇటువంటి సహజ వనరులను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా…
రాజధాని నగరం నిర్మాణం కోసం 33,000 వేల ఎకరాలను ఉచితంగా ఇచ్చిన రైతులను రోడ్లపైకి నెట్టివేసి, రాజధానిగా కొనసాగడానికి అక్కడేమి ఉన్నదని, ఎడారి, స్మశానం అంటూ మూడు రాజధానుల పల్లవి అందుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ చట్టాన్ని `సాంకేతిక కారణాలు’ పేరుతో వెనుకకు తీసుకున్నప్పటికీ, దాని వెనుక పెద్ద ఎత్తుగడ ఉన్నట్లు వెల్లడవుతున్నది. కేవలం హైకోర్టులో ప్రతికూల తీర్పు రాకుండా ఉండడం కోసమే మూడు రాజధానుల అంశాన్ని వెనుకకు తీసుకున్నామని, తిరిగి త్వరలో పకడ్బందీగా చట్టం తీసుకు వస్తామని మంత్రులు, వైసీపీ నాయకులు చెబుతూనే ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా అమరావతిలో జరుగుతన్న నిర్మాణాలు, అభివృద్ధి పనులు అన్నింటిని నిలిపివేసి, రూపాయి కూడా ఖర్చు పెట్టని ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా అభివృద్ధి పనులు కొనసాగింపు పేరుతో నిధుల వేటకు బయలుదేరడం గమనార్హం. అమరావతి భూములను అమ్మివేసి, సొమ్ము చేసుకునేందుకే ఈ ఎత్తుగడ అంతా అని స్పష్టం అవుతున్నది. అమరావతిలో ట్రంక్ ఇన్‌ఫ్రా, ఎల్‌పీఎస్ (భూసమీకరణ రైతులకు కేటాయించిన ప్లాట్లు)…