Author: Editor's Desk, Tattva News

నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు మాత్రం రాష్ట్రానివని, ఏపీలో ఇదో విచిత్రమైన పరిస్థితి ఉందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన విజయవాడ మొఘల్రాజపురం సిద్ధార్ధ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ గ్రౌండ్‌లో మంగళవారం ”ప్రజాగ్రహసభ” లో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ రూ. 1.60 లక్షలను పీఎంఏవై కింద ఇస్తే జగనన్న కాలనీలంటున్నారని విమర్శించారు. అవి జగనన్న కాలనీలు కాదు.. మోదీ కాలనీలని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షాభియాన్ ద్వారా యూనిఫాములను కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుక అనే స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు. వైద్యారోగ్య నిధులను కూడా కేంద్రమే ఇస్తున్నా.. జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాను ప్రస్తావిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ పై పుష్ప సినిమాలో చూపించారని ఏపీలో…

Read More

`కాషాయ ఉగ్రవాదం’ అంటూ కీలక ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఇతర హిందుత్వ నాయకులను ఇరికించాలని యుపిఎ ప్రభుత్వం జరిపిన కుట్రలో భాగంగా 2008 మాలేగాం పేలుడు కేసులో పలువురిని నిందితులుగా రాజకీయ దురుద్దేశ్యంలోనే చేర్చారని ఇప్పుడు స్పష్టమైనది. నలుగురు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ పేర్లను చెప్పమని ముంబై ఏటీఎస్‌ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌) తనను బెదిరించిందని 2008 మాలేగాం పేలుడు కేసులో సాక్షి మంగళవారం కోర్టుకు చెప్పారు. నాడు ఆ కేసును ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న పరమ్‌బీర్‌ సింగ్‌ పర్యవేక్షించారు. నాడు సదరు సాక్షి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. అయితే హఠాత్తుగా తనను బెదిరించి పేర్లు చెప్పించారని సాక్షి కోర్టుకు చెప్పడం కలకలం రేపింది. కేసుపై ఎన్‌ఐఏ కోర్టు విచారణ జరుపుతోంది. పరమ్‌బీర్‌ సహా మరో అధికారి యోగి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల పేర్లను చెప్పమని బెదిరించారని తాజా విచారణలో సాక్షి కోర్టుకు విన్నవించారు. తనను ఏటీఎస్‌ చిత్రహింసలకు గురిచేసిందని చెప్పడంతో సాక్షి ఏటీఎస్‌ ముందు…

Read More

ఉత్తర ప్రదేశ్ అంతటా ‘అవినీతి సుగంధం’ వెదజల్లారు అంటూ రాష్ట్రంలో 2017లో బిజెపి అధికారం చేపట్టడానికి ముందు సమాజ్‌వాదీపార్టీ(ఎస్‌పి)ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మంగళవారం కాన్పూర్‌లో 9 కిలోమీటర్ల మెట్రోలైన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఇటీవల జిఎస్‌టి నిఘా బృందాలు సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌జైన్‌కు చెందిన కాన్పూర్,కనౌజ్‌ల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.257 కోట్ల నగదు (ఇందులో రూ.194.45 కోట్లు అక్రమ నగదు), 25కిలోల బంగారం,250 కిలోల వెండి, రూ.6 కోట్ల విలువైన గంధంచెక్కల నూనెను జప్తు చేసినట్టు జిఎస్‌టి అధికారులు తెలిపారు. పీయూష్‌జైన్‌కు ఎస్‌పితో సంబంధాలున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇప్పుడు వారి నోళ్లకు తాళాలు పడ్డాయంటూ ఎస్‌పి నేతలనుద్దేశించి ప్రధాని ధ్వజమెత్తారు. అక్రమ నగదును తమ ఖాతాలో వేసుకునేందుకు ముందుకు రాలేకపోతున్నారంటూ విమర్శించారు. తమ (బిజెపి) ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హయాంలో జరిగిన అభివృద్ధి…

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న హింసను, దాడులను నియంత్రించేందుకు దిశ యాప్ ద్వారా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మహిళలపై హింస గణనీయంగా పెరిగింది. పోస్కో వంటి కఠిన చట్టాలున్నా బాలికలపై లైంగిక హింస ఏమాత్రం తగ్గలేదు. 2021వ సంవత్సరానికి రాష్ట్ర పోలీస్‌శాఖ రూపొందించిన క్రైమ్‌ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో మహిళలపై హింస 21 శాతం పెరిగింది. 2020లో రాష్ట్ర వ్యాప్తంగా 14,603 కేసులు నమోదైతే 2021లో 17,736 నమోదయ్యాయి. 2019లో 15,665, 2018లో 14,338, 2017లో 14,813 కేసులు నమోదయ్యాయి. ప్రతి ఏడాది మహిళలపై హింస పెరుగుతుండటం గమనార్హం. ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌శాఖ నిర్వహించే స్పందన కార్యక్రమానికి మొత్తం 1,63,033 అర్జీలు వస్తే అందులో 52 శాతం తమపై జరుగుతున్న హింసను అరికట్టాలంటూ మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఉంటున్నాయి. ఇక మహిళలకు రక్షణ కోసం ప్రభుత్వం రూపొందిన…

Read More

బంగ్లా యుద్ధం – 13 డిసెంబర్ 3, 1971న, పాకిస్తాన్ వైమానిక దళం (పిఎఎఫ్) పశ్చిమ సెక్టార్‌లోని భారత వైమానిక దళం (ఐఎఎఫ్) వైమానిక స్థావరాలు,  రాడార్ స్టేషన్‌లపై, ప్రధానంగా పంజాబ్, జమ్మూ, కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్‌లలో వరుస వైమానిక దాడులను ప్రారంభించడంతో భారత్ – పాకిస్థాన్ ల 13 రోజుల యుద్ధం ప్రారంభమైనది.  మొదటి వరుస వామాణిక దాడులను `ఆపరేషన్ చెంగిజ్ ఖాన్’ అనే కోడ్ తో పిఎఎఫ్ దాడులను పఠాన్‌కోట్, అమృత్‌సర్ భారత్  వైమానిక స్థావరాలు లక్ష్యంగా ప్రారంభించింది. ఈ దాడిలో పఠాన్‌కోట్, అమృత్‌సర్ ఎయిర్ బేస్‌ల రన్‌వేలు దెబ్బతిన్నాయి, అలాగే అమృత్‌సర్‌లోని రాడార్ స్టేషన్ కూడా దెబ్బతింది.  వెంటనే వాటిని  ఐఎఫ్ మరమ్మతులు చేసి, పనిచేసేటట్లు చేయడంతో పాటు  పశ్చిమ పాకిస్తాన్‌లోని పిఎఎఫ్  స్థావరాలపై ఎదురుదాడికి వాటినే ఉపయోగించింది.  రెండవ వరుస దాడులలో, జమ్మూ, కాశ్మీర్ లోని శ్రీనగర్, అవంతిపూర్‌ వైమానిక స్థావరాలపై పిఎఎఫ్ దాడి చేసింది, అయితే ఇవి చెప్పుకోదగిన నష్టం…

Read More

గృహ వినియోగదారులపై యూనిట్ కు 50 పైసల చొప్పున, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు యూనిట్ కు రూపాయి చొప్పున విద్యుత్ చార్జీలు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దపడుతున్నది. ఇప్పటికే ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ చార్జీల పెంపు భారం సుమారు 1.64 కోట్ల వినియోగదారులపై వేయనున్నది. ఆ మేరకు డిస్కోమ్ లు విద్యుత్ నియంత్రణ కమీషన్ (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమ్పరించాయి.  ఈ ప్రతిపాదనలప్రకారం కోటీ 10 లక్షల మంది గృహ వినియోగదారులపై ప్రతి యూనిట్‌‌‌‌కు 50 పైసల చొప్పున చార్జీలు పెరుగనున్నాయి. 44 లక్షల మంది వాణిజ్య, పారిశ్రామిక  ఇండస్ట్రియల్‌‌‌‌ వినియోగదారులపై యూనిట్‌‌‌‌కు రూ. 1 చొప్పున చార్జీలు పెరుగనున్నాయి.  ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ పబ్లిక్‌‌‌‌ హియరింగ్‌‌‌‌ నిర్వహించి అనుమతి ఇవ్వడమే మిగిలి ఉంది. వచ్చే ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమలులోకి వస్తుంది. చివరిసారిగా 2018-–19లో  చార్జీలను పెంచారు.  ఈ లోటులో అంతర్గత సర్దుబాట్లు, ప్రభుత్వ…

Read More

దేశంలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్నా, రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా ఐదు రాష్ట్ర అసెంబ్లీలకు ఫిబ్రవరిలో జరుగవలసిన ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే జరపడం పట్ల ఎన్నికల కమీషన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో పర్యటించిన ఎన్నికల కమీషన్ సభ్యులు మంగళవారం నుండి మూడు రోజులపాటు ఉత్తర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తయిన తర్వాతనే ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  కరోనా మహమ్మారి దృష్ట్యా ఎన్నికలను రెండు, మూడు నెలలపాటు వాయిదా వేయమని అలాహాబాద్ హైకోర్టు సహితం ఎన్నికల కమీషన్ కు సూచించడం తెలిసిందే. అయితే సోమవారం  కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించింది. ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కవరేజీ, ఓమిక్రాన్ కేసుల వివరాలను ఎన్నిక‌ల సంఘం కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియపై ఒమిక్రాన్ ప్ర‌భావం ఉంటుంద‌న్న వాద‌న‌ల‌పై కఠినమైన కొవిడ్ ప్రోటోకాల్ ఆవశ్యకతపై కూడా ఎన్నికల సంఘం చర్చించినట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఉత్తరాఖండ్, గోవాల్లో అర్హులైన…

Read More

మరి కొద్దీ రోజులలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అధికారమలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లోఅతిపెద్ద పార్టీగా నిలిచి రికార్డు సృష్టించింది. గత ఎన్నికలలో అఖండ విజయం సాధించిన బిజెపిని ఓడించి, కాంగ్రెస్, బిజెపి లకు పోటీగా ఓట్లు పొందింది.  మొత్తం 35 సీట్లలో 14 సీట్లు గెల్చుకొని, పూర్తి మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలబడింది. గత ఎన్నికలలో 25 సీట్లు ఉండగా 20 సీట్లు గెల్చుకున్న బిజెపి 12 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్ ఒక సీటుకు పరిమితమైంది.  కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడం గమనార్హం. ఈ ఫలితాలు వస్తున్న సమయంలోనే పంజాబ్ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేయాలని బిజెపి, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ నేతృత్వంలోని లోక్ పంజాబ్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా…

Read More

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిపిసిసి) అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పోలీసు సిబ్బందిపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ఖండించిన తరువాత, చండీగఢ్ డిఎస్పీ దిల్షేర్ సింగ్ చందేల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడికు పరువు నష్టం నోటీసు పంపారు. నోటీసు ద్వారా, చందేల్ పోలీసుల గౌరవానికి భంగం కలిగించి, మనోవేదన కలిగించినందుకు సిద్దూ వ్రాతపూర్వకంగా, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలుచెప్పాలని డిఎస్పీ డిమాండ్ చేశారు. నోటీసులో, “పంజాబ్ దళం ప్రతిష్ట, ఖ్యాతిని, వారు నిర్వహిస్తున్న కఠినమైన విధులు, అత్యున్నత త్యాగాలను దృష్టిలో ఉంచుకుని నగదు రూపంలో వాటిని కొలవరాదనే ఎటువంటి నగదు పరిహారం కోరలేదని స్పష్టం చేశారు. డిసెంబరు 18న కపుర్తలా జిల్లా పరిధిలోని సుల్తాన్‌పూర్ లోధిలో జరిగిన రాజకీయ ర్యాలీలో సిద్ధూ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమా చాలా బలవంతుడని, “పోలీసు అధికారిని ప్యాంటు తడిపేలా చేయగలడు” అని ప్రగల్భాలు…

Read More

నీతి ఆయోగ్ ప్రారంభించిన నాల్గవ ఆరోగ్య సూచిక ప్రకారం, పెద్ద రాష్ట్రాలలో మొత్తం ఆరోగ్య సేవల పరంగా కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా నాలుగు ఏళ్లలో కూడా కేరళ మొదటి స్థానాల్లో ఉండటం గమనార్హం.  దేశంలో జనాభా రీత్యా పెద్దరాష్ట్రమైన  ఉత్తరప్రదేశ్ చివరలో ఉంది. 2019-20 సంవత్సరానికి రూపొందించిన హెల్త్ ఇండెక్స్ నాల్గవ రౌండ్ లో తమిళనాడు, తెలంగాణ వరుసగా రెండు, మూడవ స్థానాలలో ఉన్నాయి. బీహార్, మధ్యప్రదేశ్ చివరి నుండి వరుసగా, రెండవ, మూడవ స్థానాలలో ఉన్నాయి. అయితే అంతకు ముందు ఏడాది (2018-19)తో పోల్చితే 2019-20లో ఉత్తర ప్రదేశ్ పనితీరు అద్భుతంగా ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.  చిన్న రాష్ట్రాలలో, మిజోరాం మొత్తం పనితీరులో అత్యుత్తమంగా ఉండగా,  కేంద్ర పాలిత రాష్ట్రాలలో ఢిల్లీ,  జమ్మూ  కాశ్మీర్ మొత్తం పనితీరులో అట్టడుగున ఉన్నాయి. అయితే పెరుగుతున్న పనితీరు పరంగా అగ్రగామిగా నిలిచాయి. మొత్తం పారామితుల పరంగా వరుసగా నాల్గవ రౌండ్‌లో కేరళ…

Read More