Author: Editor's Desk, Tattva News

ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదిపొంచింది. జేడీఎస్ తో పాటు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ హయాంలో సిద్దరామయ్య ప్రభుత్వమే అసలు ఈ బిల్లును రూపొందించిందా? బెళగావిలో గురువారం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మతమార్పిడి నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి మాట్లాడుతూ, 2016లో సిద్ధరామయ్య నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మతమార్పిడి నిరోధక బిల్లు ముసాయిదాను ప్రారంభించిందని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు మరికొన్ని అంశాలను మాత్రమే జోడించిందని స్పష్టం చేశారు.2016లో కర్నాటక లా కమిషన్ బిల్లును సిద్ధం చేసి స్క్రూటినిజింగ్ కమిటీ ముందుకు ఈ బిల్లు వచ్చిందని, దానిని కేబినెట్‌కు పంపిందని మధుస్వామి తెలిపారు. “సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటక మత స్వేచ్ఛ బిల్లును ప్రారంభించింది. బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం ఉన్నందున మేము కొన్ని నిబంధనలను…

Read More

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సూత్రధారి వైసిపి నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహిత అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అని సిబిఐ స్పష్టం చేసింది. ఇటీవలనే అతనిని అరెస్ట్ చేసిన సిబిఐ  తాజాగా కోర్టుకు సమర్పించిన వివరాలలో వివేకా హత్య సమయంలో ఘటనా స్థలంలో ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారని నిర్ధారించింది. వివేకా రక్తపు మడుగులో పడి ఉన్నా గుండెపోటుతో మరణించారంటూ ప్రచారం తొలుత ప్రారంభించింది శివశంకర్ రెడ్డిగా సీబీఐ స్పష్టం చేసింది.ఎక్కడా ఆధారాలు లేకుండా వివేకా బెడ్ రూం, వాష్ రూంలో రక్తపు మరకలను తుడిపించేశారని సీబీఐ కోర్టుకు నివేదించింది. హత్య సమయంలో వివేకా శరీరంపై  ఉన్న గాయాలకు గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో ఆయనే బ్యాండేజీ వేయించారని వివరించింది.  సీబీఐ అరెస్ట్ చేసిన శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. దీనికి సంబం ధించి నవాదనల సమయంలో శివ శంకర్ రెడ్డి పాత్ర పైన సీబీఐ పలు అంశాలను కోర్టు…

Read More

కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశంలో కరోనా పరిస్థితులపై ఆయన ఉన్నతాధికార సమీక్ష గతరాత్రి జరిపారు. పర్యవేక్షణ అనంతరం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన సహాయం అందించాలని కేంద్ర అధికారులను మోదీ ఆదేశించారు. కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాల ని, జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలని ప్రధాని చెప్పారు. రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్‌ సరఫరా యంత్రాంగం ఉండేలా, అవన్నీ సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. టెలిమెడిసిన్, టెలి కన్సల్టేషన్‌ వంటి ఐటీ సాంకేతికతలను ఉపయోగించుకోవాలని, కేసుల సత్వర గుర్తింపుతో పాటు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు ఆటంకం…

Read More

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారులు దాడులు చేసి పలు థియేటర్లను మూసివేయడం, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు టికెట్లను విక్రయించాలని ఆదేశించడంతో పలు థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మైనర్‌, మేజర్‌ పంచాయతీల్లోని 60 సినిమా థియేటర్లను మూసివేశారు.  ప్రభుత్వం నిర్ధేశించిన రేట్లకే టికెట్ల అమ్మకాలు కొనసాగించాలని చెప్పడం, ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించడమే కారణమని థియేటర్‌ యజమానులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 140 సినిమా థియేటర్లు ఉన్నాయి.  ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెంబర్‌ 35 ప్రకారం పంచాయతీల్లో నాన్‌ ఎసి థియేటర్లలో తరగతుల వారీగా రూ.5, రూ.10, రూ.15, చొప్పున ఎసి థియేటర్లలో తరగతుల వారీగా రూ.10, రూ.15, రూ.20 చొప్పున టికెట్లను విక్రయించాల్సి ఉంది.  ప్రభుత్వం నిర్ధేశించిన ఈ ధరలను అమలు చేస్తే కరెంట్‌ బిల్లులు సైతం రావని థియేటర్‌ యజమానూలు వాపోతున్నారు.  చిత్తూరు జిల్లాలో మొత్తం 37 సినిమా థియేటర్ల…

Read More

పంజాబ్‌లోని లుధియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడు సంఘటన వెనుక ఐఎస్ఐ, ఖలిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటనలో  ఒకరు చనిపోగా,  ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దానితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే కేంద్రం  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను రంగంలోకి దింపింది.  గురువారం మధ్యాహ్నం 12.22 గంటలకు కోర్టు రెండో అంతస్థులోని ఓ బాత్‌రూంలో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి బాత్‌రూం గోడలు కూలిపోయాయి. సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. భవనంలో కొంతభాగం దెబ్బతింది. పేలుడు జరిగిన సమయంలో జనంతో కోర్టు నిండిపోయింది. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని లుధియానా పోలీసు చీఫ్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ భుల్లార్‌ తెలిపారు. ‘‘ఆ వ్యక్తి పేలుడు పదార్థాలను వెంట పెట్టుకుని ఉండవచ్చు. లేదా ఫిదాయి (సూసైడ్‌ బాంబర్‌) అయి ఉండవచ్చు. ఇప్పుడే అన్ని…

Read More

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలైనా.. జొమాటో తదితర ఆన్‌లైన్‌ డెలివరీ కంపెనీలైనా.. జనవరి 1 నుంచి తమ వేదికలపై కస్టమర్ల కార్డు సమాచారాన్ని సేవ్‌ చేసుకోలేవు. నూతన సంవత్సరం మొదలు ఆన్‌లైన్‌ కార్డు లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతేడాది మార్చిలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్‌ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్డు టోకనైజేషన్‌ సర్వీసులపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. వినియోగదారుల సమ్మతితోనే కార్డు డాటా టోకనైజేషన్‌ విజయవంతం కాగలదని అందులో పేర్కొన్నది. యూనిక్‌ ఆల్గరిథమ్‌ జెనరేటెడ్‌ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్‌ చేసేందుకు టోకనైజేషన్‌ సహకరిస్తుంది. ఈ మార్గదర్శకాలన్నీ వచ్చే ఏడాది నుంచి వర్తించనున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్‌ కార్డు లావాదేవీలపై కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. వీటి ప్రకారం: జనవరి 1 నుంచి ఏ ఈ-కామర్స్‌…

Read More

విజయ నగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై జరిగిన ఘర్షణలకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసిపి ప్రభుత్వం మొదటి నుంచి మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ ,రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆయనను అర్ధాంతరంగా ఆ పదవుల నుండి తొలగించి, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో గత్యంతరం లేక తిరిగి నియమించింది. వీటికిగల విలువైన ఆస్తులను కాజేయడం కోసమే ఆయనను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం మండలంలోని రామతీర్థం బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా శిలాఫలకం బోర్డు ఏర్పాటును ఆయన అడ్డుకున్నారు. సరైన ప్రొటోకాల్‌ అనుసరించలేదని అధికారులతో వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో అశోక్‌పై రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆలయ ధర్మకర్త అశోక్‌పై…

Read More

బంగ్లా యుద్ధం – 8 బాంగ్లాదేశ్ పోరాట యోధులు స్వతంత్ర దేశంగా తమను ప్రకటించుకోవడం, భారత దేశం సైనిక జోక్యంతో బాంగ్లాదేశ్ విముక్తికి వేగంగా అడుగులు వేయడానికి ప్రధానంగా ప్రేరేపించింది `ఆపరేషన్ సెర్చ్‌లైట్’ పేరుతో పాకిస్తాన్ సైనికులు సాగించిన దారుణమైన అణచివేత, ఊచకోత అని చెప్పవచ్చు. ఆపరేలైషన్ సెర్చ్‌ట్ అనేది మార్చి 1971లో నాటి తూర్పు పాకిస్తాన్‌లో నానాటికి తీవ్రతరం అవుతున్న బెంగాలీ జాతీయవాద ఉద్యమాన్ని అణచి వేయడానికి పాకిస్తాన్ సైన్యం చేపట్టిన ప్రణాళికాబద్ధమైన సైనిక చర్యకు సంకేతనామం. పశ్చిమ పాకిస్తాన్‌లోని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం, మార్చి 26న తూర్పు పాకిస్తాన్‌లోని అన్ని ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తీసుకుని, ఆ తర్వాత నెలలోపు రాజకీయంగా లేదా సైనికంగా అన్ని బెంగాలీ వ్యతిరేకతలను నిర్మూలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే బెంగాలీలు ప్రతిఘటన తీవ్రతను, భారత దేశం సైనిక జోక్యం చేసుకొనే అవకాశాన్ని ఆ సమయంలో పాకిస్థానీ సైనికులు ఊహించలేదు.  మే 1971 మధ్యకాలంలో బెంగాలీ ఆధీనంలో ఉన్న చివరి…

Read More

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని బిజెపి ఎంపి, రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ ధన్వే స్పష్టం చేశారు. అంతేకాదు విదేశీ చొరబాటుదారులు హిందువుల మనోభావాలను గాయపరిచి అసలు పేర్లను మార్చిన ఇలాంటి కొన్ని స్థలాల పేర్లను మార్చాలని కూడా ఆయన సూచించారు. నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన అనంతరం పార్టీ నాయకుడి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దన్వే ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను కూడా కలిశారు. సంఘ్ సామాజిక సేవలతో స్ఫూర్తి పొందిన వివిధ సంస్థల సమన్వయ సమావేశాన్ని తెలంగాణలోని ‘భాగ్యనగర్’లో జనవరి 57 తేదీల మధ్య నిర్వహించడం గురించి ఈ మధ్య ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ ఒక ట్వీట్ చేశారు. బిజెపి, దాని సైద్ధాంతిక మార్గదర్శి అయిన ఆర్‌ఎస్‌ఎస్‌లు హైదరాబాద్ పేరును తిరిగి భాగ్యనగర్‌గా మార్చాలని…

Read More

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ భార్య గురుశ‌ర‌ణ్ కౌర్ భ‌ద్ర‌త‌ను కేంద్రం మ‌రింత క‌ట్టుదిట్టం చేయ‌నుంది. ఈ క్ర‌మంలో సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్‌కు సంబంధించిన మ‌హిళా సెక్యూరిటీని వారికి నియ‌మించినున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. హోమ్ మంత్రి అమిత్ షా కుటుంభం సభ్యులకు కూడా మహిళా సెక్యూరిటీని నియమిస్తారు. మొట్ట మొదటి సారిగా సీఆర్పీఎఫ్ మహిళా కమాండర్ లను విఐపి భద్రత కోసం వినియోగిస్తున్నారు. తమ మహిళా కమాండర్ల మొదటి బ్యాచ్ లో 35 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని, జనవరి 15 నాటికి విధులలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. వీరి సంఖ్య తక్కువగా ఉండడంతో మొదటగా వీరిని సిఐపీల నివాసాల వద్ద ఏర్పాటు చేస్తారని తెలుస్తున్నది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి `మహిళల సాధికారికత’ నివ్వడంతో ప్రియాంక గాంధీ వెడుతున్న దృష్ట్యా ఆమె భద్రత పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నారు. గతంలో…

Read More