బంగ్లా యుద్ధం – 5 స్వాతంత్య్రానంతర కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలలో భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం, 1971లో పాకిస్తాన్‌పై భారతదేశం నిర్ణయాత్మక విజయం సాధించి, బంగ్లాదేశ్ అనే ఒక స్వతంత్ర దేశాన్ని సృష్టించడం. 93,000 మంది పాకిస్తాన్ సేనలను యుద్ధ ఖైదీలుగా తీసుకోవడం. భారత దేశ రక్షణ దృష్ట్యా, దక్షిణాసియాలో భౌగోలిక పరిస్థితుల దృష్ట్యా ఈ యుద్ధం ఒక కీలక మైలురాయి అని చెప్పవచ్చు. ఎవ్వరు ఊహించని విధంగా, కేవలం 13 రోజులలో పాక్ సేనలు లొంగిపోయే విధంగా చేయడంలో సామ్ బహదూర్ అని విస్తృతంగా పిలువబడే మన సేనాధిపతి ఫీల్డ్ మార్షల్ సామ్ హోర్ముస్జీ ఫ్రామ్‌జీ జంషెడ్జీ మానెక్ షా కీలక పాత్ర వహించారు. ఆయన ప్రదర్శించిన ముందుచూపు, వ్యూహాత్మక ఎత్తుగడలు కీలక భూమిక వహించాయని చెప్పవచ్చు. వాస్తవానికి ఆరు నెలల ముందుగానే, ఏప్రిల్ లోనే యుద్ధం ప్రారంభించాలని నాటి ప్రధాని ఇందిరా గాంధీ అభిలషించారు. ఆ విధంగా చేస్తే భారత్ కు…
Author: Editor's Desk, Tattva News
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విజేతగా మోస్ట్ ఎంటర్‌టైనర్ సన్నీ అవతరించాడు. తనే విన్నర్ అని ప్రకటించగానే సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు రన్నరప్‌గా యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్ నిలిచాడు. 19 మంది పోటీదారులతో మొదలైన ఈ షో సుమారు 105 రోజుల పాటు సాగింది. చివరకు పోటీదారులుగా సిరి, షణ్ముఖ్, మానస్, విజె సన్నీ, శ్రీరామ చంద్ర మిగిలారు. అలియాభట్, రణబీర్ కపూర్, రాజమౌళి, దేవి శ్రీ ప్రసాద్, రష్మిక, నాగ చైతన్య, నాని, సాయి పల్లవి, కృతిక శెట్టి, ఫరియా అబ్దుల్లా వంటి ప్రముఖులు వచ్చి అలరించారు. హౌస్ నుండి వెళ్లిన పోటీదారులు తమదైన శైలిలో ఎంటర్‌టైన్ చేశారు. చివరి రోజు సిరి, మానస్, శ్రీరామ్ చంద్రలను వచ్చిన అతిధులతో ఎలిమినేట్ చేయించి, హౌస్ నుండి బయటకు రప్పించగా, నాగార్జున చివరకు పోటీలో మిగిలిన సన్నీ, షణ్ముఖ్ లను వేదిక మీదకు తీసుకువచ్చారు. చివరకు సన్నీని విజేతగా…
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హింస, ఘర్షణలు చెలరేగేలా రెచ్చగొట్టడం సీఎం కేసీఆర్‌కు తగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ‘బీజేపీ నేతలను ఉరికించండి.. కేంద్రంపై యుద్ధం చేస్తాం.. ఢిల్లీలో అగ్గిపెడతాం..’ అంటూ వ్యాఖ్యానించడం హింసను ప్రేరేపించడమేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ శవయాత్రలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలంటూ ఒక ముఖ్యమంత్రి చెప్పడం తాను ఎక్కడా చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ మాటల్లో ఆ ‘మంట’ కనిపిస్తోందని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. ఉద్యమంలో కూడా ఎన్నడూ బయటకు రాని కేసీఆర్, ధర్నాచౌక్‌లో ధర్నాకు రావడం, బీజేపీపై పరుష పదజాలంతో విరుచుకుపడటం.. హుజూరాబాద్ తీర్పు ప్రభావమే అని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై అబద్ధపు ప్రచారం చేస్తూ, రైతులను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులనే ఉరికించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఈ సీజన్‌లో ఉప్పుడు బియ్యాన్ని కొంటున్నాం. వంద శాతం కొంటాం. రబీ…
ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటకంను విస్తరించేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విజయవాడ నుంచి కాశ్మీర్‌కు పర్యాటక ప్యాకేజీ కింద ప్రత్యేకంగా డొమెస్టిక్ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు సాధ్యాసాధ్యాలను ఐఆర్‌సిటిసి పరిశీలిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా కాశ్మీర్ టూరిజాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్, విశాఖ నుంచే ఈ తరహా ప్యాకేజిలు నడుస్తున్నాయి, వీటితో పాటు ఉత్తర భారతదేశ దర్శనీయ యాత్ర, గోవా, హంపి ప్రత్యేక ప్యాకేజి కింద ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పిబ్రవరి 12న గోవా, హంపి యాత్రా రైలు బయలుదేరి 18న తిరిగి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రూట్‌మ్యాప్ ఖరారు చేశారు. అనకాపల్లి, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ రైలులో ప్రయాణీకులు ఎక్కవచ్చు దీనికి స్లీపర్ క్లాస్ రూ.6,620, ఎసి 3టైర్‌లో…
మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరింత కాలం బతికి ఉంటే గోవాకు ఇంకాస్త ముందుగానే విముక్తి కలిగేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. డిసెంబర్ 19న ‘గోవా విమోచన దినం’ సందర్భంగా గోవా రాజధాని పనాజీలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటూ స్వాతంత్య్రం కోసం గోవా ప్రజలతో పాటు, దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు సుదీర్ఘకాలం పోరాడారని గుర్తు చేశారు. ‘‘సర్దాద్ వల్లభాయ్ పటేల్ మరికొన్ని రోజులు బతికి ఉంటే గోవాకు విముక్తి ఇంకా ముందుగానే లభించేది. మహారాష్ట్రలోని మరఠ్వాడాతో పాటు నిజాం పాలనను తప్పించిన పలేట్.. గోవాకు కూడా విముక్తి కల్పించేవారు. ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారు గోవా విముక్తి కోసం కూడా పోరాడేవారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఎంతో కాలానికి కానీ గోవాకు విముక్తి లభించలేదు’’ అని మోదీ విచారం వ్యక్తం చేశారు. మోదీ తన రోమ్ పర్యటనను గుర్తు చేసుకుంటూ ‘‘కొద్ది రోజుల కిందట…
చరిత్ర పుస్తకాల్లో పాఠ్యాంశాలకు మార్పులు చేర్పులు చేయాలని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక సూచించింది. ప్రస్తుతమున్న పాఠ్యాంశాల్లో పలువురు చారిత్రక వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధులను దోషులుగా చిత్రీకరించారనీ, వాటిస్థానంలో రాజవంశాల ఘనకీర్తిని, 1947 తర్వాత చరిత్ర, ప్రపంచ చరిత్ర అంశాలు చేర్చాలని కమిటీ సూచించింది. బిజెపి ఎంపి వినయ్ పి సహస్రబుద్ధే నేతృత్వంలోని ఈ కమిటీ పాఠ్యాంశాలతో పాటు పలు ప్రతిపాదనలను సూచించింది. పుస్తకాల సంఖ్యను, పాఠ్యాంశాలను తగ్గించి పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగు బరువు తగ్గించాలని పేర్కొన్నది. పాఠ్యపుస్తకాలను నాణ్యమైన ప్రమాణాలలో అభివృద్ధి చేయాలని కమిటీ సూచించింది. పాఠ్యాంశాల రూపకల్పనలో బహుళ విభాగాలకు చెందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని, విద్యార్థుల స్వీయ అధ్యయనానికి వీలుగా పుస్తకాలతో పాటు చిత్రాలు, గ్రాఫిక్స్, ఆడియో-విజువల్ సామాగ్రిని ఉపయోగించాలని కమిటీ తెలిపింది. పాఠ్యాంశాలలో వివిధ వృత్తులలో మహిళలకు సంబంధించిన విషయాలను, స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర గురించిన వివరాలు సముచితంగా పొందుపర్చాలని పేర్కొంది. డ్రగ్స్, ఇంటర్నెట్ వ్యసనాలతో పాటు సమాజానికి…
పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలోకి శనివారం ఓ ఆగంతకుడు చొరబడి, సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగుతున్నది. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు అతడిపై దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడికి గల కారణాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. అయితే ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జీందర్ సింగ్ ప్రకటించారు. అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ (శాంతి భద్రతలు) ఈ సిట్‌కు సారథ్యం వహిస్తారు. రెండు రోజుల్లోగా సిట్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సిట్ ఆమూలాగ్రం దర్యాప్తు చేస్తుందని చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ప్రార్థనల సమయంలో ఆలయం లోపలికి ఓ వ్యక్తి వెళ్లాడు. బంగారు గ్రిల్స్ దాటి, ఖడ్గాన్ని పట్టుకుని, పూజారి గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తున్న ప్రాంతానికి చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన శిరోమణి గురుద్వార…
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఢిల్లీ నుండి 150 మందికి పైగా సీనియర్ బిజెపి నాయకులు పార్టీ విజయం కోసం రెండు రాష్ట్రాలలో పర్యటించారు.పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 44 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం, బూత్ నిర్వహణ సమన్వయం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి 100 మందికి పైగా సీనియర్ నాయకులు, కార్యకర్తలను జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేయడానికి నియమించిన్నట్లు బిజెపి వర్గాలు తెలిపారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న బిజెపి నాయకుల బృందాన్ని ఢిల్లీ బిజెపి మాజీ అధ్యక్షుడు విజయేందర్ గుప్తా, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి దినేష్ ప్రతాప్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. “పార్టీ ఎన్నికలలో పోరాడుతున్న చోట సహాయం చేయడానికి వివిధ రాష్ట్రాల నుండి నాయకులను పంపడానికి ఇది సాధారణ కసరత్తు. ఢిల్లీ ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు సమీపంలో ఉండటం వల్ల అక్కడ పనిచేసే మా నాయకులు క్షేత్రస్థాయిలో కొంత ప్రభావం చూపుతారు” అని ఢిల్లీ బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఢిల్లీ నేతల బృందం…
ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆదివారం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ ప్రాంతంలోని అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు భద్రతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇవి కట్యూషా రాకెట్లు. మొదట వచ్చిన రాకెట్‌ను సి-రామ్ డిఫెన్స్ బ్యాటరీలు ఆకాశంలో ఉండగానే కూల్చేశాయి. ఇది అమెరికన్ ఎంబసీకి సమీపంలో పడింది. రెండోది ఓ స్క్వేర్‌లో పడటంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా, మూడో రాకెట్ గ్రీన్ జోన్ వెలుపల ఒక కుటుంబంపై పడడంతో నలుగురు గాయాలకు గురయ్యారు. ఇరాక్ భద్రతా దళాలు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, బాగ్దాద్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆదివారం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. గ్రీన్ జోన్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ రాకెట్లను ఎవరు ప్రయోగించారో ఇంకా తెలియలేదు. దీనికి తమదే బాధ్యత అని ఇప్పటి…
కేరళలో కేవలం 12 గంటల వ్యవధిలో బిజెపి, ఎస్‌డీపీఐ నేతల హత్యలు హత్యలకు గురవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలప్పుజలో ఈ రోజు ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఆదివారం ఉదయం ఆయన ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల ఎదుటనే ఎనిమిది మంది వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పరారయ్యారు. దీంతో హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. అలప్పుజ జిల్లాలోనే నిన్న (శనివారం) రాత్రి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ (38)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అలప్పుజ నుంచి మన్నచేరిలో ఉన్న తన ఇంటికి స్కూటీపై వెళ్తుండగా కొంత మంది కారులో వచ్చి ఢీకొట్టారు. ఆ తర్వాత కింద పడిన షాన్‌పై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న…