కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ ‘ రేప్ ఎంజాయ్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్‌నుద్దేశించి ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) చైర్‌పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. మహిళా ద్వేషి, మహిళల పట్ల విద్వేషపూరిత మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం విచారకరమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ ఈ వ్యాఖ్యలు చాలా అసహ్యపూరితమైనవి. అసెంబ్లీలో కూర్చుని ఇలా మాట్లాడితే… నిజ జీవితంలో మహిళల పట్ల వీరు ఎలా ప్రవర్తిస్తారు?’ అంటూ నిలదీస్తూ ఆమె ట్వీట్ చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్రంలో ఇటీవల వరదలకు, వర్షాలకు పంట, ప్రాణ నష్టం కల్గిన రైతుల గురించి చర్చించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. దీనిపై స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే అనుమతించకపోవడంతో.. మాజీ స్పీకర్ రమేశ్ స్పందించారు. ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు.. దాన్ని ఎంజాయ్ చేయాల్సిందే అని సామెత ఉంది.…
Author: Editor's Desk, Tattva News
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మెల్లగా పావులు కదుపుతున్నాయి. తాజాగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతాపార్టీకి మధ్య పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి గజేంద్రసింగ్ షెకావత్ అధికారికంగా ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసే విషయమై అమరీందర్‌సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి, తమకు మధ్య ఏడు దఫాలుగా చర్చలు జరిగాయని తెలిపారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు పంజాబ్ బీజేపీ ఇన్‌ఛార్జి గజేంద్ర సింగ్ షెఖావత్, కెప్టెన్ సింగ్ ధ్రువీకరించారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఈ విషయంలో కూడా…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 101కి చేరిందని వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించగా మొత్తంగా 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 20 కేసులు బయటపడినట్లు తెలిపింది. రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్‌లో 5, కేరళలో 5 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అనవసర ప్రయాణాలను ఆపేయాలని, సామూహిక సమావేశాలను రద్దు చేసుకోవాలని, పండుగలను తక్కువ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవాలని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బల్‌రామ్ భార్గవ తెలిపారు. ఐరోపాలో భారీ స్థాయిలో ఈ కేసులు పెరుగుతున్నాయని, అక్కడ మహమ్మారి కొత్త దశ నడుస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ప్రతి…
కరోనా మహమ్మారి సంక్షోభంతో పలు కంపెనీలు తాత్కాలిక ఏర్పాటుగా ప్రారంభించిన వర్క్‌ఫ్రం హోం సదుపాయం ఇప్పుడు శాశ్వతంగా కొనసాగే అవకాశహాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు కేంద్రంలో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కరోనా కొత్త వేరియంట్‌లు విరుచుకుపడుతుండటంతో ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఈ సదుపాయాన్ని కొనసాగిస్తున్నాయి. త్వరలోనే ‘పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం’కు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ కొత్త నియమ నిబంధనలను తీసుకు రావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధానంతో ఉద్యోగుల వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు పన్ను భారం కూడా కొంతమేర పెరగవచ్చని భావిస్తున్నారు. శాశ్వతంగా పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం కోరుకునే వారికి వేతనాలను సవరించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గవచ్చు. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం కింద రీ ఎంబర్స్‌మెంట్ పెరగవచ్చు కూడా. ఇంటినుంచే పని చేస్తుండటంతో.. విద్యుత్తు, వైఫై, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్…
అమెజాన్‌కు రూ.202 కోట్లు జరిమానా విధించడంతో పాటు ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్‌సిపిఎల్) మధ్య కుదిరిన ఒప్పందాన్ని కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందాన్ని సీసీఐ 2019లో ఆమోదించింది. ఎఫ్‌సిపిఎల్ తో జరిగిన రూ.1400 కోట్ల ఒప్పందానికి అమెజాన్ ఆమోదం కోరుతూ కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లు ఆరోపిస్తూ సీసీఐ అమెజాన్ కు 60 రోజుల నోటీసు జారీ చేసింది. అప్పటి వరకు ఈ డీల్ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. ఎఫ్‌సిపిఎల్ అనేది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) ప్రమోటర్ ఎంటిటీ. 2019లో అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని వెల్లడించడంలో విఫలం చెందడం అనేది కాంపిటీషన్ చట్టంలో రెగ్యులేషన్ 5 సెక్షన్ 6, సబ్ సెక్షన్ (2) & కాంబినేషన్ రెగ్యులేషన్స్ సబ్ రెగ్యులేషన్స్(4), (5) ఉల్లంఘనలకు సమానమని సీసీఐ తన ఉత్తర్వుల్లో సూచించింది. అమెజాన్ ప్రతినిధి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ.. “మేము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన…
ప్రతిష్టాత్మకమైన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 31 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఎటాకింగ్ గేమ్‌తో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. పెనాల్టీ కార్నర్ నిపుణుడు హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా, ఆకాశ్‌దీప్ సింగ్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో తనవంతు పాత్ర పోషించాడు. ఇక విజయంతో భారత్ నాకౌట్ ఆశలు మరింత మెరుగయ్యాయి. ప్రథమార్ధం ఆరంభంలోనే హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఇక తొలి హాఫ్‌లో భారత్ 10 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా భారత్ జోరును ప్రదర్శించింది. 41వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్‌ను సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను షాక్‌కు గురిచేస్తూ ఆకాశ్‌దీప్ ఈ గోల్ నమోదు చేశాడు. అయితే కొద్ది సేపటికే పాకిస్థాన్ తొలి…
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్ పెల్ గి ఖొర్లో అవార్డును ప్రకటించారు. భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడానికి సంతోషిస్తున్నట్లు భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ అవార్డు ప్రకటనపై ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చేసింది. భూటాన్ పౌర పురస్కారాన్ని అందుకోవడానికి మోదీజీ అర్హుడని ఆ దేశ పీఎంవో తెలిపింది. భూటాన్ ప్రజలు కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ‘‘కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మోడీజీ అందించిన సహాయం, షరతులు లేని స్నేహం మరవలేనిది, భూటాన్ దేశ అత్యున్నత అవార్డుకు మోదీజీ అర్హులు, భూటాన్ ప్రజల నుంచి మోదీకి అభినందనలు. మోదీజీ గొప్ప మహనీయుడు, ఆధ్యాత్మిక మానవుడు. మోదీని వ్యక్తిగతంగా కలిసి వేడుక జరుపుకోవడానికి ఎదురు…
పెగాసస్ స్నూపింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ దర్యాప్తును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. స్వతంత్ర కమిటీ చేత దర్యాప్తునకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఓ దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (ఎన్‌జీవో) గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌ను ఉపయోగించి అనేక మంది ప్రముఖులపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు అక్టోబరులో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వ్యక్తులపై విచక్షణారహితంగా నిఘా పెట్టడం ఆమోదించదగినది కాదని తెలిపింది. అయితే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ లోకూర్ నేతృత్వంలో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై…
* బంగ్లా యుద్ధం – 2 1971 ప్రారంభంలో జరిగిన ఎన్నికలలో తూర్పు పాకిస్తాన్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీని సాధించిన తరువాత, ముజిబ్-ఉర్-రెహ్మాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ ఆఫ్ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్‌కు ఎక్కువ స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేసింది. అయితే ఆ డిమాండ్ కు పాకిస్తాన్ సైనిక పాలన పూర్తి స్థాయి సైనిక అణిచివేతతో ప్రతిస్పందించింది. మేజర్ జనరల్ టిక్కా ఖాన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో లక్షలాది మంది పౌరులను చంపి, వేలాది మంది పేద మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. పర్యవసానంగా, సుమారు కోటి మంది బెంగాలీలు భారతదేశానికి శరణార్థులుగా వలస రావడంతో, భారత ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోంది.శ్రీమతి ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అమాయక పౌరులపై దౌర్జన్యాలను ఆపాలని, శరణార్థులు తిరిగి వచ్చే పరిస్థితిని కల్పించాలని పాకిస్తాన్‌కు సూచించింది. అయితే అమెరికా, చైనా. ఇతర ముస్లిం దేశాలు పాకిస్తాన్ సైన్యం…
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో అధికారం బీజేపీదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మెజారిటీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, టీఆర్‌ఎస్ భవిష్యత్తు లేదని నేతలే చెప్తున్నారని తెలిపారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో పాల్గొంటూ టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంగా మారిందని, దులోని అంశాలేవి ఆచరణకు నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఎవరూ సంతోషంగా లేరని, ఆ పార్టీలో తమకు భవిష్యత్ లేదని చాలా మంది భావిస్తున్నారని చెప్పారు. ” మంత్రిగా నేను ప్రగతిభవన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు లేకుండానే విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా…