Author: Editor's Desk, Tattva News

* కాకినాడ లోక్‌స‌భ స్థానం నుంచి బరిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఢిల్లీ వేదికగా బీజేపీ, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. గత రెండు రోజులుగా బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంలో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి.  ఇప్పటి వరకూ బీజేపీ 10 ఎంపీ సీట్లు కోసం పట్టుపట్టగా, ఇప్పటికే జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు బీజేపీకి 6 స్ధానాలు ఇచ్చేందుకు తలూపారు. బీజేపీ మాత్రం 10ఎంపీ సీట్ల కోసం ఒత్తిడి చేసింది. ఈ సమయంలో బిజెపికి ఆరు అసెంబ్లీ, ఆరు లోక్ స‌భ సీట్లు ఇచ్చేందుకు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే స‌మయంలో జ‌న‌సేన‌కు ఒక ఎంపి సీటుకు క‌త్తెర ప‌డింది. ముందు మూడు లోక్ స‌భ సీట్లు కేటాయించిన టిడిపి తాజాగా రెండు సీట్లు…

Read More

ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్‌న‌గ‌ర్ బ‌స్టాండ్ వ‌ద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నాయ‌కుడు ష‌బ్బీర్ అలీతో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం జేబీఎస్ – ఎంజీబీఎస్‌ వరకు ఉన్న మెట్రో లైనును ఫలక్‌నుమా వరకు ఇంకో 5.5 కిలోమీటర్లు పొడిగించనున్నారు. ఈ రైలు మార్గంలో 5 మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాతబస్తీ ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. పాతబస్తీకి వీలైనంత త్వరగా మెట్రోను తీసుకురావడానికి కృషి చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. వ‌రుస‌గా అభివృద్ధి ప‌నుల‌తో ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు. ఎన్నిక‌లు వ‌చ్చిన స‌మ‌యంలోనే రాజ‌కీయాలు, మిగ‌తా స‌మ‌యాల్లో అభివృద్ధి ప‌నుల‌కే ప్రాధాన్యం ఇస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. దారుల్‌షిఫా నుంచి ఆలియాబాద్‌ మీదుగా సాగే ఈ మార్గంలో…

Read More

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయ‌బోతున్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భ‌గేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. బెంగ‌ళూరు రూర‌ల్ నుంచి డీకే సురేశ్, త్రిశూర్ నుంచి కే ముర‌ళీధ‌ర‌న్, తిరువనంత‌పురం నుంచి శ‌శిథ‌రూర్ పోటీ చేయ‌నున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వీటిలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌, జహీరాబాద్‌ – సురేశ్‌ షేట్కర్‌, చేవెళ్ల – సునీతా మహేందర్‌రెడ్డిల పేర్లను ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.  అయితే, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డి పేరును…

Read More

‘ఆమ్ ఆద్మీ పార్టీ ’ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ “నా కుటుంబంగా ఉన్న ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు నేను అన్ని ప్రయత్నాలు చేశాను. ఆప్ పాలిస్తున్న ఢిల్లీ, పంజాబ్‌లలో మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా ఉంది” అని తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి ప్రాజెక్ట్‌ను నిలిపివేస్తుందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.   ఏడుగురు ప్రతిపక్ష అభ్యర్థులను పార్లమెంటుకు పంపడం ద్వారా తనను “బలపరచాలని” ప్రజలను కోరారు. ఢిల్లీలో ఎన్నుకుని అధికారంలోకి తెచ్చినందుకే ఆ వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నారని పేర్కొన్నారు. మొహల్లా క్లినిక్‌లను బుల్‌డోజర్‌లతో కూల్చివేశారని,…

Read More

లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అకౌంట్లపై ఆదాయం పన్ను శాఖ చర్యను నిలివేయాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను స్తంభింప చేసి, బకాయిలు వసూలుకు ఐటీ శాఖ చర్యలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఐటీ శాఖ చర్యను పది రోజుల పాటు సస్పెండ్ చేయాలని, ఈలోపు తాము హైకోర్టుకు వెళ్తామని ఐటీఏటీ కాంగ్రెస్ తరఫు న్యాయవాది వివేక్ తన్ఖా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను కోరారు. ఫిబ్రవరి 22న విచారణ సందర్భంగా ఆయన తన వాదనను కోర్టు ముందుంచుతూ, పార్టీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి నిధులు అవసరమని తెలిపారు. అయితే ఈ వాదనను ఐడీ శాఖ తోసిపుచ్చింది. బకాయిల వసూలుకు తమ చర్య అవరోధం కాదని, ఆ పార్టీకి…

Read More

వేసవి ప్రారంభంలోనే బెంగళూరు నగర వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరవాసుల నీటికష్టాల్ని తీర్చడానికి వాహనాలను కడగడం, తోటపని, వినోదం కోసం వాటర్‌ ఫౌంటైన్‌ల వంటి వాటికి నీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్టు (బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఉత్తర్వుల్ని ఉల్లంఘించిన వారికి పౌర సంఘం రూ. 5,000 జరిమానా విధించింది. మళ్లీ మళ్లీ ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానాకి మరో రూ. 500 జోడించబడుతుందని పౌర సంఘం ఆదేశాల్లో తెలిపింది. దీనికోసం బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ని కూడా ప్రారంభించింది. ఈ ఉత్తర్వులను పౌరులు ఉల్లంఘిస్తే వెంటనే 1916కు కాల్‌చేయాలని కోరింది.  మాల్స్‌, సినిమా హాల్స్‌లో కూడా తాగునీరు, రోడ్లు శుభ్రం చేయడం, ఇతర క్లీనింగ్‌ పనులకు మాత్రమే నీటిని వినియోగించాలని (బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి) ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు నగరంతోపాటు పలు జిల్లాల్లో కూడా నీటికొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ…

Read More

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. నారాయణ మూర్తి భార్య గానే కాకుండా, సుధా మూర్తి రచయిత్రిగా, మోటివేషనల్ స్పీకర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ప్రఖ్యాతి గాంచారు.  రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రకటించారు. సుధామూర్తిని అభినందించిన ప్రధాని మోదీ వివిధ రంగాలకు ఆమె చేసిన కృషి ఎనలేనిదని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ మేరకు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషకరమైన విషయమన్నారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనదని ప్రశంసించారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన…

Read More

మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘‘ఇవాళ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.100 తగ్గిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని మోదీ ట్వీట్‌లో తెలిపారు. మరోవంక, ఎల్పీజీ సిలిండర్‌పై ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగిస్తున్నట్టు గురువారం కేంద్రం తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పీఎంయువై) పథకం కింద 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం నాడు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్చి 7, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.…

Read More

ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌ర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఆంక్ష‌ల నుంచి స్వేచ్ఛ దొరికింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్నో ద‌శాబ్ధాలుగా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్‌తో పాటు మిత్ర‌ప‌క్ష పార్టీలు 370 ఆర్టిక‌ల్ పేరుతో జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌ల్ని, దేశాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించాయ‌ని ఆయ‌న ఆరోపించారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో పర్యటించారు ప్రధాని మోదీ. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.వికసిత్ భారత్-వికసిత్ జమ్మూ కశ్మీర్ కార్యక్రమం కింద రూ.64వేల కోట్లతో శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియం వేదికగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎంతో ప్రేమానురాగాలు చూపించే శ్రీనగర్ ప్రజల మధ్య తాను ఉండటం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రేమను గెలిచేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామో వాటితో…

Read More

టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద తిరుమల ఒకటో పట్టణ పోలీసులు ఇచ్చిన నోటీసును సవాల్ చేశారు.  సోషల్ మీడియా వేదికగా శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీటీడీ ఐటీశాఖ జీఎం సందీప్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల ఒకటో పట్టణ పోలీసులు రమణదీక్షితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసు జారీ చేసి విచారణ నిమిత్తం హాజరుకావాలని కోరారు.  ఈ నోటీసులను సవాలు చేస్తూ రమణదీక్షితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.. పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇవ్వలేరని దీక్షితులు తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఆయన వయసు 76 ఏళ్లు అని, 65ఏళ్లు…

Read More