Author: Editor's Desk, Tattva News

అల్పపీడనంగా మిథిలి తుపాన్ బలహీనపడడంతో… అంతకు ముందు భారీ వర్షాలతో అతలాకుతలమైన త్రిపుర, మిజోరంలో శనివారం ఎలాంటి వర్షాలు కురియలేదు. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం బంగ్లా తీరం దాటిన తరువాత తుపాన్ అల్పపీడనంగా బలహీనపడి, త్రిపుర రాజధాని అగర్తలాకు తూర్పుఆగ్నేయ దిశలో 50 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం ఉదయం నుంచి మిజోరం, త్రిపుర, ఈశాన్య ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉండి ఎలాంటి జల్లులు కురియలేదని, ఇంతవరకు నష్టాల గురించి ఎలాంటి సమాచారం అందలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ విభాగం అంతకు ముందు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో త్రిపుర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అంగన్వాడీ సెంటర్లకు శనివారం శెలవుదినం ప్రకటించింది. శుక్రవారం పెనుగాలులతో భారీ వర్షాలు కురియడంతో అగర్తలా లోని మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయంలో అన్ని విమానసర్వీసులకు అంతరాయం కలిగింది. కోల్‌కతా నుంచి రెండు, గువాహతి నుంచి ఒకటి విమానాలు ల్యాండ్ కాలేకపోయాయి.…

Read More

తమిళనాడు స్టాలిన్‌ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి మధ్య గత కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లుల్ని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో వుంచారు. ఈ బిల్లులపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం తమిళనాడు అసెంబ్లీ గవర్నర్‌ ఏ కారణాలు చూపకుండా పెండింగ్‌లో ఉంచిన పది బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది.తాజాగా ఆమోదం పొందిన బిల్లులో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా, మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. ఇందులో వర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్‌ అధికారాలను తొలగించేలా తీసుకొచ్చిన తీర్మానం కూడా ఉంది. వర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. వర్సిటీల వైస్‌ఛాన్సలర్‌లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా చట్టంలో సవరణలు చేస్తూ స్టాలిన్‌ ప్రభుత్వం…

Read More

వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అబద్ధపు మాటలతో సిఎం కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గద్వాల బిజెపి విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగిస్తూ  ఇచ్చిన హామీలను కెసిఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు.  తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ టైమ్ అయిపోయిందని, బిజెపి వచ్చే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, బిసిలకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అనుకున్న స్థాయిలో టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.  బిసి సిఎం కావాలంటే బిజెపికి ఓటేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను కెసిఆర్ పూర్తి చేయలేదని అమిత్ షా విమర్శించారు. నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేశారని విమర్శించారు. జోగులాంబకు మోడీ వంద కోట్లు నిధులు విడుదల చేస్తే కెసిఆర్…

Read More

ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు నేరుగా కీలక ప్రశ్న సంధించారు. తాను రాజీనామా చేయాలా? లేదా జైలు నుంచే పరిపాలన సాగించాలా? అని అడిగారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి పలువురు ఆప్ నేతలు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. సిఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు విచారణలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పుడు తన తదుపరి చర్య గురించి పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. వెంటనే సిఎం పదవిని వదులుకుని, విచారణలను ఎదుర్కోవాలా? లేక జైలు పాలుచేయబడితే అక్కడి నుంచి పాలన సాగించాలా? అనేది తేల్చుకోనున్నట్లు వెల్లడించారు. దీనికి తనకు ప్రజల నుంచి జవాబు కావాలని కోరారు. ప్రజలే అధికారం ఇచ్చారు. అధికార నిర్ణేతలు వారే అవుతారని స్పష్టం చేశారు. తనకు అధికారంపై మమకారం లేదని, తాను తొలుత పదవిలోకి వచ్చినప్పుడు కేవలం 49వ రోజునే…

Read More

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు శుక్రవారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. కడపటి వార్తలు అందే సమయానికి మధ్యప్రదేశ్‌లో 76.22 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 74 శాతం ఓటింగ్‌ నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని ఛతార్‌పూర్‌ జిల్లా రాజ్‌నగర్‌లో రెండు పార్టీల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘర్షణల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమ్‌ సింగ్‌ అనుచరుడు ఒకరు మరణించాడని జిల్లా ఎస్పీ అమిత్‌ సంఘి వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ఇతర చోట్ల కూడా ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. ఇండోర్‌ జిల్లా మహూ ఏరియాలో రెండు గ్రూపుల మధ్య వాగ్వివాదంలో ఐదుగురు గాయపడ్డారు. మోరేనా జిల్లా దిమాని నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఓటేసేందుకు వెళ్తున్న వారిని కొంత మంది అడ్డుకోవడంతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. చత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌లో భాగంగా 70 స్థానాలకు పోలింగ్…

Read More

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు జరిగింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన 3 ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలో 18 గంటల పాటు జరిగిన పోరులో లష్కరే తాయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలోనిర్వహించిన ఆపరేషన్‌లో భారీమొత్తంలో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం  కుల్గాంలోని సామ్నో ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన భద్రతా దళాలు గురువారం రాత్రి స్థానికంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది.  అదే సమయంలో ఓ ఇంటి నుంచి టెర్రరిస్ట్‌ కాల్పులు జరిపాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు ఐదుగురు ముష్కరులను పోలీసులు మట్టుబెట్టారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించింది.  ఇక, కీలక ఉగ్రవాది, లాంచ్‌ కమాండర్‌ బషీర్‌ అహ్మద్‌…

Read More

ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు 75 శాతం కోటాను కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పంజాబ్ హరియాణా హైకోర్టు కొట్టివేసింది. హరియాణ ప్రభుత్వ స్థానికుల ఉపాధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హరియాణా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ స్థానిక అభ్యర్థుల చట్టం 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులు చేశారు. ప్రైవేటు రంగంలో రూ. 30,000 కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగాల్లో 75 శాతాన్ని స్థానికులు లేదా నివాస ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి కేటాయించారు. గతంలో 15 సంవత్సరాలుగా పేర్కొన్న స్థానికత నిబంధనలను ఐదేళ్లకు తగ్గించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్నందున స్థానిక వర్గాల ఓట్లను ముఖ్యంగా జాట్ కమ్యూనిటీని ఏకీకృతం చేయడంపై దృష్టి సారించి చట్టం తీసుకొచ్చిన మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అయితే, ఈ తీర్పుపై రాష్ట్రం అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. …

Read More

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.  హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విజయశాంతి భేటీ అయ్యి రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు.  కాంగ్రెస్ లో విజయశాంతి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలోకి వెళ్లారు.  కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ సభలకు కూడా హాజరు కావడం లేదు. అప్పటి నుంచే కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే బీజేపీ, జనసేన పొత్తు కారణంగా ఆమె బీజేపీకి మొన్న బుధవారం రాజీనామా చేశారు.…

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించింది. 42 పేజీల్లో 62 అంశాలను పేర్కొంది. ఇందులో అన్ని వర్గాలకు సంబంధించి అంశాలను ప్రస్తావించింది. కీలకమైన ధరణి ప్లేస్ లో భూమాత పోర్టల్ ను తీసుకువస్తామని స్పష్టం చేసింది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటుతో పాటు నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకువస్తామని తెలిపింది. ఇక రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచితంగా ఫ్రీవైపై ఇస్తామని తెలిపింది కాంగ్రెస్. ఇక ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేసింది. 2 లక్షల ఉద్యోగాల వివరాలను పేర్కొంటూ భర్తీ చేసే తేదీలను కూడా పేర్కొంది. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డును ఇస్తామని తెలిపింది. టీఎస్పీఎస్సీ పరీక్షలకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇక రాష్ట్రంలో పూర్తిగా బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని స్పష్టం చేసింది. కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువస్తామని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రస్తావించింది.…

Read More

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఎనిమిదోసారి వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరింది. గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌లో తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించిన భారత్‌తో ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగనున్న టైటిల్‌ ఫైట్‌లో ఆసీస్‌ తలపడనుంది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు రాణించినా.. ఒత్తిడిని అధిగమించిన ఆసీస్‌ను విజయం వరించింది. టోర్నీ ఆసాంతం తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు భారీ స్కోర్లు చేస్తూ.. ప్రత్యర్థులను హడలెత్తించిన దక్షిణాఫ్రికా ఈ సారి అదే ప్రదర్శన పునరావృతం చేయలేకపోయింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ మిల్లర్‌ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆణిముత్యం లాంటి సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)…

Read More