తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని, వచ్చెడిది బిజెపి ప్రభుత్వమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. ఖమ్మంలో “రైతు గోస- బీజేపీ భరోసా” అనే పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ త్వరలో భద్రాచలం స్వామి వారికి బీజేపీ సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఈసారి కేసీఆర్, కేటీఆర్ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తుంటే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందని అమిత్ షా విమర్శలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి కలలను సీఎం కేసీఆర్ కల్లలు చేశారని ధ్వజమెత్తారు. రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని చెబుతూ శ్రీరామనవమికి భద్రాచలంలో పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారని…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వామపక్షాలకు ఏకపక్షంగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా సీఎం కేసీఆర్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. సొంతంగా పోటీచేసి గెలుపొందే సామర్థ్యం కోల్పోయిన వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. తమను వద్దనుకున్న కేసీఆర్ ఓటమి చూస్తామంటూ ప్రకటనలు చేసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు బిఆర్ఎస్ నుండి తాము ఆశించిన నాలుగు సీట్లను తమకు కేటాయిస్తే తాము పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ తో రాయబారం సాగిస్తున్నాయి. పైగా, జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా 26 పార్టీలతో ఏర్పాటు చేసిన కూటమిలో సిపిఐ, సిపిఎం కూడా భాగస్వాములు కావడంతో తెలంగాణాలో కూడా కలిసి పోటీ చేద్దాం అంటూ ప్రతిపాదనలు చేస్తున్నాయి. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూకూడదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే బీఆర్‌ఎస్‌తో…
చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించే సత్తా భారత్‌కు ఉందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ భరోసా వ్యక్తం చేశారు. అయితే మనలో ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ అంతరిక్ష రంగం అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు అవసరమని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంకావడంతో కేరళలోని ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించారు. పౌర్ణమికావు భద్రకాళి ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించారు. అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని చెబుతూ దేశం మొత్తం అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ విజన్‌ను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాను అన్వేషకుడినన్న ఇస్రో చైర్మన్.. సైన్స్, ఆధ్యాత్మిక రెండింటినీ అన్వేషించడం తన జీవిత ప్రయాణంలో ఓ భాగమని తెలిపారు. అనేక ఆలయాలను సందర్శిస్తానని, గ్రంథాలను చదువుతానని చెప్పారు. విశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా ప్రతి గ్రహానికి ప్రయాణించగలమని స్పష్టం చేశారు. చంద్రయాన్-3 ప్రయోగంపై…
షెడ్యూల్డ్ కులాలకు 18 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై గట్టి చర్యలు, షెడ్యూల్డ్ తెగలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు కుటుంబానికి రూ. 12 లక్షలు, 18 శాతం వంటి 12 అంశాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా చదివి వినిపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో చేవెళ్లలో జరిగిన భారీ బహిరంగసభలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి, ఎస్టీ డిక్లరేషన్ ను విడుదలచేసింది. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టులలో (ఎస్సీలు), 12 శాతం (ఎస్టీలు) రిజర్వేషన్లు, ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.. ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందుతున్న ప్రైవేట్ సంస్థలు, భూమి లేనివారికి భూమి ఇస్తామని ప్రకటించారు. ఇండ్ల నిర్మాణానికి రూ. 6 లక్షలు, పూర్తి యాజమాన్య హక్కులు ఎస్సీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, ఎస్టీలకు పోడు భూములపై పూర్తి యాజమాన్య హక్కులు, అన్ని గిరిజన తండాల అభివృద్ధికి ఏడాదికి రూ.25 లక్షలు, ఒక్కొక్కటి 3…
సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1 మిషన్‌పై లాంచ్ చేసే అవకాశం ఉందని ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడించారు. అయితే, లాంచ్‌కు సంబంధించి తుది తేదీని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను నింగిలోకి పంపాక.. లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుకునేందుకు 125 రోజులు పడుతుందని సోమ్‌నాథ్ వివరించారు. చంద్రయాన్-3 నుంచి భారీ విషయాన్ని ఆశిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ అన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై విజయవంతంకావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో విస్తరించి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడమే ఇస్రో లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు భారత్ మరిన్ని గ్రహాలపై మిషన్లను ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉందని మీడియాకు తెలిపారు. అంగారకుడితో సహా శుక్రుడిపై పరిశోధనలు చేపట్టగలమని, ఇందుకు మరింత విశ్వాసం పెట్టుబడులు అవసరమన్నారు. స్పేస్ సెక్టార్‌లో విస్తరించి.. భారతదేశాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. చంద్రుడికి సంబంధించి రోవర్ పంపే మరిన్ని…
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘గగన్‌యాన్’ మిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను పంపనున్నట్లు వెల్లడించారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన జీ20 కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో జరుగుతాయని తెలిపారు. ‘‘కరోనా మహమ్మారి వల్ల గగన్‌యాన్ కార్యక్రమం ఆలస్యమైంది. తొలి ట్రయల్ మిషన్‌ను అక్టోబర్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. వ్యోమగాములను పంపించడం ఎంత ముఖ్యమో, వారిని తిరిగి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం” అని వివరించారు. రెండో మిషన్‌లో మహిళా రోబోను పంపుతామని వెల్లడించారు. ఆమె అన్ని మానవ కార్యకలాపాలను నిర్వహిస్తుందని చెప్పారు. అంతా సవ్యంగా ఉంటే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చని ఆయన తెలిపారు. భూమి పైనుంచి 400 మీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి గగన్‌యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను తీసుకెళ్లనున్నారని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 విక్రమ్…
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు వచ్చారు. విమానాశ్రయం దగ్గర అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్.. జై అనుసంధాన్’ నినదించారు. ప్రధాని విమానాశ్రయం నుంచి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్-3 ప్రయోగం తీరును ప్రధానికి సోమనాథ్ వివరించారు. అలాగే చంద్రయాన్-3 బృందంతో ఫోటోలు తీసుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళుతోందని పేర్కొంటూ అంతరిక్ష అరంగంలో భారత్ చరిత్ర సృష్టించిందని, ఎవరు సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా అలాగే ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. అట్లాగే చంద్రయాన్ 3 చంద్రుడిపై దిగిన ప్రదేశాన్ని `శివశక్తి’గా నామకరణ చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను సౌతాఫ్రికాలో ఉన్నా…
పంజాబ్ గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మాన్ మధ్య లేఖల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ బన్వారిలాల్ శుక్రవారం సీఎంకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని, క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తానంటూ హెచ్చరించారు. ఈ మేరకు మాన్‌కు పంపిన లేఖను గవర్నర్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. గతంలో రాసిన లేఖలపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై కలత చెందినట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంపై రాష్ట్రపతికి నివేదించగలనంటూ హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ప్రకారం తాను ‘తుది నిర్ణయం’ తీసుకోవడానికి ముందే చర్యలు తీసుకోవాలని మాన్‌కు సూచించారు. శిక్షణ నిమిత్తం 36 మంది పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను విదేశాలకు పంపడంతో పాటు పలు ఇతర అంశాలపై తాను గతంలో రాసిన లేఖ ద్వారా సమాచారం కోరానని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో…
సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్ భూములకు సంబంధించి సుప్రీం కోర్టు యథాతథ స్థితి (స్టేట్‌సకో) విధించింది. వాన్‌పిక్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వాన్‌పిక్ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పటికే 15 ఏళ్లు వృధాగా గడచిపోయాయని, ఇందులో దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశం ముడిపడి ఉందని వాన్‌పిక్ ప్రాజెక్ట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాన్‌పిక్ అనేది రాష్ట్ర ప్రభుత్వం – రస్ అల్ ఖైమాతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్ అని చెప్పుకొచ్చారు. విచారణలో జాప్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని వాదించారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంటే దానిపై విచారణ జరపవచ్చని.. కానీ…
భారత్ గ్రీస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గ్రీస్ ఒక రోజు పర్యటన జరిపిన ప్రధాని మోదీ శుక్రవారం ఆ దేశ ప్రధాని రియాకోస్ మిత్సోటాకిస్‌తో సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ వాణిజ్యం, పెట్టుబడులు,రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య. డిజిటల్ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలిపారు. భారత్‌గ్రీస్ సంబంధాలను వ్యూహాత్మక వ్యూహాత్మక భాగస్వామిగా ముందుకు తీసుకెళ్లడానికి ఇరువురం అంగీకరించినట్లు తెలిపారు. “ఇరు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించాం. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపైనా దృష్టిసారించాం. భారత్, గ్రీస్‌ల మధ్య నైపుణ్య వలసలను సులభతరం చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించాం” అని ప్రధాని మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని…