Author: Editor's Desk, Tattva News

అనర్హత వేటుకు గురైన కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు తీర్పుపై ‘స్టే’ విధించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని, తదుపరి విచారణ 4 వారాల అనంతరం చేపడతామని వెల్లడించింది. వనమా దాఖలు చేసిన కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్త 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వర రావు, బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తన ఆస్తులు, కేసుల వివరాలను పొందుపర్చలేదని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ…

Read More

మణిపూర్‌ ఘటనపై విచారణకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ షాలినీ పన్సాల్కర్‌ జోషి, జస్టిస్‌ ఆషా మీనన్‌లతో కూడిన కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీ పునరావాసం, పరిహారంపై అధ్యయనం చేయనుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ ఆదేశించారు. జస్టిస్‌ గీతా మిట్టల్‌ జమ్ము కాశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్‌ జోషి బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి. జస్టిస్‌ మీనన్‌ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించి రిటైరయ్యారు. అలాగే సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. చట్టపాలనపై విశ్వసనీయతను పునరుద్ధరించేందుకే ఈ కమిటీని ఏర్పాటుచేస్తున్నామని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. .  విచారణ నివేదికను  ఆ అధికారి కోర్టుకు సమర్పించాలని  సూచించింది  మహారాష్ట్ర మాజీ డిజిపి,…

Read More

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి వయనాడ్ ఎంపీగా కొనసాగనున్నారు. ఎంపీగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియేట్ పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్‌ సభ్యత్వాన్ని దిగువ సభ పునరుద్ధరించింది. ఈ మేరకు లోక్‌ సభ సెక్రటేరియట్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘మోదీ ఇంటిపేరు’ కేసులో రెండేళ్ల జైలుశిక్షను రాహుల్ గాంధీ సవాలు చేయడంతో ఆగస్టు 4, 2023న సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్‌పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సెక్రటేరియేట్ సమాచారం అందించింది. కాగా.. ‘మోదీ ఇంటిపేరు కేసులో’ దోషిగా తేలిన రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు…

Read More

ప్రమాద బీమాపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బైక్ వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తికి కూడా ప్రమాద బీమా వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది. 2004లో అనంతపురం జిల్లాలో జరిగిన బైక్ యాక్సిడెంట్ కేసులో హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. బాధితులు అప్పీల్‌ చేయకపోయినప్పటికీ పరిహారం పెంచే అధికారం హైకోర్టుకు ఉందని తేల్చిచెప్పింది. నవంబర్ 2004లో అనంతపురం జిల్లాకు చెందిన శివశంకర్‌, శివకేశవులు ఒక బైక్‌పై, సాకే ముత్యాలు, దాసరి బోడప్ప మరొక ద్విచక్ర వాహనంపై అనంతపురం వెళ్తున్నారు. సాకే ముత్యాలు ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చొన్న బోడప్ప తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ప్రమాద బీమా కోసం మృతుడి కుటుంబ సభ్యులు బీమా కంపెనీకి అప్లై చేసుకున్నారు. కానీ బీమా డబ్బులు ఇచ్చేందుకు యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ నిరాకరించింది. దీంతో బాధితులు మోటారు అనంతపురం ఐదో…

Read More

భర్త లంచాలు పుచ్చుకున్న అభియోగాలతో అరెస్టు కావడంతో మరుసటి రోజు ఆయన భార్య జైపూర్ హెరిటేజ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేష్ గుర్జర్‌ను రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అర్థరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు వెలువరించింది. భూముల లీజు గురించి మేయర్ భర్త సుశీల్ గుర్జర్‌ను రాష్ట్ర ఎసిబి శనివారం అరెస్టు చేసింది. భార్య మేయర్ కావడంతో ఆమె పేరు మీద పనులు చేయిస్తానని భర్త ఈ లంచాలు తీసుకున్నట్లు తేలింది. దీనితో పరిస్థితిని సమీక్షించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆమెను మేయర్ పదవి నుంచి సస్పెండ్ చేసింది. స్థానిక కార్పొరేషన్‌లోని వార్డు నెంబరు 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా తాత్కాలికంగా తీసివేశారు.   మేయర్‌ మునేష్‌ గుర్జార్‌ భర్త సుశీల్‌.. ఓ భూమి లీజ్‌ వ్యవహారంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ నిన్న ఎసిబికి దొరికిపోయాడు.  ఆ ఇంటి నుండి ఎసిబి అధికారులు రూ.40 లక్షల…

Read More

చంద్రయాన్‌-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో ఆదివారం విడుదల చేసింది. శనివారం జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్‌ ఈ దృశ్యాలను చిత్రీకరించింది. గుంతలు గుంతలుగా ఉన్న చందమామ ఉపరితలం అందులో కనిపించింది. మరోవంక, చంద్రయాన్‌-3 ఒక్కొక్క అడుగువేస్తూ జాబిల్లి దిశగా ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే చంద్రయాన్‌-3వ్యోమనౌక చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో శాటిలైట్‌ కక్ష్య తగ్గింపుపై ఇస్రో దృష్టిసారించింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత విజయవంతంగా వ్యోమనౌక కక్ష్యను తగ్గించింది. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17 తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు. అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.మీల ఎత్తులోకి తీసుకళ్తారు. తదనంతరం ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేస్తారు. చంద్రయాన్‌-3ని చంద్రుడికి మరింత దగ్గర చేసే దిశగా ఈ నెల 9న మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 9న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల…

Read More

దక్షిణ పాకిస్థాన్‌లో ఆదివారం ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో కనీసం 30 మంది మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ సింధు ప్రాంతంలోని నవాబ్‌షా నగరానికి సమీపంలోని సహారా రైల్వే స్టేషన్ వద్ద హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇది చాలా భారీ విషాద ఘటన, ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల విచారిస్తున్నామని రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీఖ్ ప్రకటన వెలువరించారు. 45 మంది వరకూ గాయపడ్డారని, వీరిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పెద్ద ఎత్తున సహాయక బృందాలు ఈ ప్రాంతానికి తరలివెళ్లుతున్నాయి. ప్రమాదానికి కారణాలు నిర్థారణ కాలేదు. యాంత్రిక లోపం వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది. లేదా ఎవరో కావాలనే దుర్ఘటన జరిగేలా చేసి ఉంటారు. ఇది విద్రోహ చర్యగా భావించాల్సి ఉంటుందని, కారణాలు ఏమిటనేవి దర్యాప్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. హజారా ఎక్స్‌ప్రెస్ కరాచీ…

Read More

అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు రూ.24,470 కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ““అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది. దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రూ.25వేల కోట్లు కేటాయించాం. రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్ లు ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి చేసిన తర్వాత ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్ గా మారతాయి” అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమృత్‌భారత్ పథకం కింద తొలిదశలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణలో రూ. 894.09 కోట్లతో 21 స్టేషన్లు, ఏపీలో 453.50 కోట్లతో 18 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నాంపల్లి…

Read More

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ ఆమోదం తెలిపారు. దానితో ఈ విషయమై మూడు రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. ఈ బిల్లుపై ముందుగా గవర్నర్‌ పలు సందేహాలు లేవనెత్తారు. పలు విషయాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి కోరారు. ఆదివారంతో వర్షాకాల సమావేశాలు ముగియనుండడతో సభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులు రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. అధికారులు గవర్నర్ తమిళి సై సందేహాలకు వివరణ ఇచ్చారు. వీరితో సమావేశం తర్వాత ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ లోగా అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులపాటు పొడిగించారు. టీఎస్ఆర్టీసీ బిల్లు వ్యవహారంలో శనివారం ఆసక్తికర పరిణామాలు జరిగాయి. బిల్లుపై గవర్నర్ పలు విషయాలపై వివరణ కోరడంతో ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, అప్పటికీ సంతృప్తి చెందని రాజ్‌భవన్‌ శనివారం మధ్యాహ్నం…

Read More

ప్రజాగాయకుడు గద్దర్(76) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1949లో తూఫ్రాన్ లో జన్మించారు గద్దర్. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు గద్దర్. గుండెపోటుతో ఇటీవల అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుప్తరిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌ పీపుల్స్‌ వార్‌, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. గద్దర్ తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు. గద్దర్ మృతిపై అపోలో వైద్యులు ప్రకటన జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ అమీర్ పేట్ అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో కన్నుమూశారని వైద్యులు తెలిపారు. జులై 20న గుండె సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 3న ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు వైద్యులు. ఆయన గుండె…

Read More