కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి వివాహం అత్యంత సాదాసీదాగా బెంగళూరులోని తమ నివాసంలోనే జరిపారు. ఈ వివాహానికి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవర్నీ ఆహ్వానించలేదని తెలుస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేస్తున్న, గుజరాత్‌కు చెందిన వరుడు ప్రతీక్‌తో వాంగ్మయి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయంలో జరిపింంచారు. ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పీఠాధిపతులు ఈ వివాహ క్రతువు నిర్వహించారు. వరుడు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి అత్యంత నమ్మకస్తుడైన అధికారిగా పేరుంది. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేవారు. 2014 నుండి ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు. చాలా లోప్రొఫైల్ లో ఉండే ఆయన ఇతర ఉన్నతాధికారులు, ప్రధాని కార్యక్రమాల తీరు గురించి ఎప్పుడు ఓ కన్నేసి ఉంటారని పేరుంది. ఎక్కడ ఏమి జరుగుతుందో ప్రధానికి కీలక సమాచారం అందిస్తుంటారని చెబుతుంటారు. ఇక,…
Author: Editor's Desk, Tattva News
మృగశిర కార్తె సందర్భంగా బత్తెన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి కరోనా కారణంగా మూడేళ్ళ విరామం తర్వాత తిరిగి శుక్ర, శనివారాలలో చేస్తున్నారు. ఉబ్బసం సమస్యను తగ్గించే చేప మందును ఇవాళ, రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. శనివారం ఉదయం 8 వరకు చేప మందు పంపిణీ కొనసాగనుంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు బత్తిన గౌడ్ వంశస్థుల ఇంట్లో చేప ప్రసాదం ఇవ్వనున్నారు. రెండు లక్షల వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు నగరంతో పాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది ఎగ్జిబిషన్ మైదానానికి తరలివచ్చారు. చేపప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఉదయమే బారులు తీరారు. శుక్రవారం ఉదయం…
తైవాన్ చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) గురువారం పెద్ద ఎత్తున విన్యాసాలు ప్రారంభించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రెండు రోజుల పాటు చైనా-రష్యా చేపట్టిన సంయుక్త వైమానిక వ్యూహాత్మక గస్తీ ముగిసిన వెంటనే ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తైవాన్ జలసంథి ప్రాంతంలో అమెరికా కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతును నేపథ్యంలో చైనా ఇటీవల గస్తీ చర్యలు, సైనిక విన్యాసాలు చేపట్టింది. గురువారం ఉదయం తైవాన్ దీవికి వాయవ్యంగా గల జలాల్లో పిఎల్‌ఎకి చెందిన 37 విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీటిలో జో11, జో16 యుద్ధ విమానాలు వునాయి. హెచ్ బాంబర్లు, వైయుా20 ట్యాంకర్ విమానాలు వునాుయి. వీటిల్లో కొనిు దీవికి తూర్పు వైపున గల బషి చానల్ ద్వారా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోకి ప్రవేశించాయని చైనా రక్షణ అధారిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. తైవాన్ దీవి చుట్టూ ప్రతి రోజూ సాగించే గస్తీలు, విన్యాసాలకు అదనంగా ఇవి చోటు…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకు సహనిందితుడిగా పేర్కొంటూ వస్తున్న సిబిఐ తాజాగా నిందితుడే అని స్పష్టం చేసింది. అంతేకాదు `ఏ 8′ నిందితుడిగా కూడా పేర్కొన్నది. పైగా, తెలంగాణ హైకోర్టు నుండి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన మూడు రోజులకే, ఈ నెల 3న విచారణకు హాజరైనప్పుడు అరెస్ట్ చేసి, వెంటనే సొంత పూచికత్తుపై విడుదల చేసింది. ప్రస్తుతం అరెస్ట్ అయి జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5వ తేదీన దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చడంతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని, దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీబీఐ…
దీర్ఘకాల కరోనా బాధితుల్లో వైరస్ తీవ్ర ప్రభావంతో వారి ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని లండన్ యూనివర్శిటీకి చెందిన యూసిఎఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీ అండ్ హెల్త్ విభాగం లోని వైద్యుల బృందం అధ్యయనం వెల్లడించింది. అధ్యయనం వివరాలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (ఎన్‌ఐహెచ్‌ఆర్) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ఈ అధ్యయనంలో దీర్ఘకాలం కరోనాతో బాధపడిన 3750 మంది రోగులపై పరిశోధనలు చేయగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్థాయిలో ఉన్న బాధితుడి అనారోగ్యం కంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తోందని తేలింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత రోగుల ఆరోగ్యంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయన్న దానిపై ఈ వైద్య బృందం పరిశోధించింది. దీనికోసం ఓ డిజిటల్ యాప్‌ను రూపొందించారు. తమకు కావలసిన సమాధానాలు రాబట్టుకోడానికి తగిన ప్రశ్నలను తయారు చేసి అందులో పొందుపరిచారు. అలసట నిరాశ,…
నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్‌లోకి ప్రవేశించాయి. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని తెలిపింది. జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా వర్షపాతానికి ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొంది. అలాగని దేశంలోని మిగతా ప్రాంతాలకు రుతు పవనాలు ఇంతే ఆలస్యం కాకుండా కాస్త ముందుగానే చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకకు సంకేతంగా కేరళలో వేర్వేరు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. వారం రోజుల్లో ఇవి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేస్తుంటాయి. అయితే వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో అలప్పుజా, ఎర్నాకుళం…
తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనని, తనకు ఎటువంటి పదవులూ లేవంటూ అభివృద్ధి విషయంలో తాను పార్టీలు చూడబోనని, అందరినీ కలుపుకుని ప్రజల కోసం పనిచేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. తద్వారా టిడిపితో బంధం తెంచుకునేందుకు సిద్దమనే సంకేతం ఇచ్చారు. తనకు ప్రజలే ముఖ్యం అని, ప్రజలు కోరుకుంటే పార్టీ సీటు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా గెలుస్తానని చెప్పిన ఆయన వైసిపిలో చేరమని తనకు ఆహ్వానాలు అందుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు పెట్టి.. ఎంపీగా తనకు ఆహ్వానం లేదని వాపోయారు. తమ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లారని.. పార్టీ కార్యాలయం పెట్టిన వ్యక్తి.. పొలిట్ బ్యూరో సభ్యుడైన నేత తనను పిలవలేదని అంటూ మండిపడ్డారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పేరుతో హడావుడి చేసే వాళ్లు గొట్టంగాళ్ల అంటూ వారి ఉనికిని గుర్తించాను అన్నట్లు తేల్చి చెప్పారు. ‘‘టీడీపీ మాహానాడుకు నాకు ఆహ్వానం లేదు. నేను ఒక…
ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్‌డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్‌ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటాయని వెల్లడించారు. గత ఏప్రిల్‌లో జరిగిన తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కూడా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు మాత్రం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే కారణంతో 2022 మే నుంచి వరుసగా ఆరుసార్లు రెపో రేటును పెంచేసింది. ఆరు విడతల్లో 250 బేసిస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై భారం పెంచింది. కానీ ఈసారి…
తెగల మధ్య ఘర్షణలతో కొన్నాళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌లో హృదయవిదారకమైన ఘటన జరిగింది. కొందరు దుండగులు ఓ ఎనిమిదేళ్ల బాలుడు, అతడి తల్లి, వారి బంధువు నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఇప్పటికే 98 మంది మృతిచెందగా తాజాగా మరో ముగ్గురు మరణించారు. పశ్చిమ ఇంపాల్‌లోని ఇరోసింబా ప్రాంతంలోని ఓ శరణార్థుల శిబిరం సమీపంలో మెయితీ–కుకీ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ బులెట్ వచ్చి బాలుడు తాన్సింగ్ (8) మెదడులోకి దూసుకెళ్లింది. హుటాహుటిన సిబ్బంది.. ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లోకి ఎక్కించారు. తోడుగా బాలుడి తల్లి మీనా, లైడియా అనే వారి బంధువూ వాహనంలోకి ఎక్కారు. అంబులెన్స్ ఆస్పత్రికి వెళుతుండగా ఓ దుండగుల మూక అడ్డుకొని ఆ వాహనానికి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ పూర్తిగా దహనమైంది. డ్రైవర్ తప్పించుకోగా.. వాహనంలో బాలుడు, అతడి తల్లి, వారి బంధువు సజీవదహనమయ్యారు. నెలరోజులకుపైగా అట్టుడుకుతున్న మణిపూర్ నిరసనల…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కోర్టులో బుధవారం గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరీ జీవాను కాల్చివేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి లాయర్ దుస్తులలో వచ్చినట్లు తెలిసింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ రాష్ట్ర పోలీసుల కస్టడీలో ఉన్న దశలో కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు ఈ కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకుంటే రూ 50వేల పారితోషికం ఉంటుందని ఇటీవలే ప్రకటించగా షహ్రాన్‌పూర్‌లో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు పోలీసుల రక్షణ వలయంలో ఉన్నప్పుడే మృతి చెందిన సంజీవ్ హతుడైన, పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అన్సారీకి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు. లాయర్ వేషంలో వచ్చిన దుండగుడు తన రివాల్వర్ తీసి కాల్పులు జరిపినట్లు, ఈ ఘటనలో సంజీవ్ నెత్తురోడుతూ కింద పడిపోయి, చనిపోయినట్లు , అక్కడే ఉన్న ఓ యువతి గాయపడినట్లు తర్వాత పోలీసులు తెలిపారు. బిజెపి ఎమ్మెల్యే బ్రహ్మదత్త ద్వివేది హత్యకేసులో సంజీవ్ సహ నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులోనే ముక్తార్ నిందితుడుగా…