Author: Editor's Desk, Tattva News

రోడ్లపై ఇటీవల ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ) కనిపిస్తున్నాయి. నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, పెట్రోలుతో పనిలేకుండా ఎంచక్కా ఇంట్లోనే చార్జింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉండడం, ఎంత దూరమైనా చవగ్గా ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో అందరూ వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా ఈవీలపై అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో ప్రముఖ వాహన తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటే కాన్పూరు ఐఐటీ మాత్రం విస్తుపోయే విషయాలను వెల్లడిస్తూ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. సంప్రదాయ, హైబ్రిడ్‌ కార్లతో పోలిస్తే ఈవీలు ఎంతమాత్రమూ ఎకో ఫ్రెండ్లీ కాదని అధ్యయనం తేల్చి చెప్పింది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్‌ కార్లతో పోల్చి చూసినప్పుడు 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూరుకు చెందిన ఇంజిన్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌…

Read More

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ వ్యాపారులతో భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్, టెలికమ్యూనికేషన్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాలలో భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు. మూడు రోజుల పర్యటన భాగంగా చివరి రోజున సిడ్నీలో అగ్రశ్రేణి ఆస్ట్రేలియా కంపెనీల సీఈఓలతో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ.వ్యాపారం చేయడం, ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం భారత ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు రూపొందించినట్లు గుర్తు చేశారు. ఈ రౌండ్ టేబుల సమావేశంలో స్టీల్, బ్యాంకింగ్, ఇంధనం, మైనింగ్ ఐటీ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు కూడా రౌండ్ టేబుల్‌ సమావేశంలో భాగస్వాములయ్యారు. రియో టింటో, నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్, వైసెటెక్, ఆస్ట్రేలియన్ ఇండస్ట్రీ బ్యాంక్ సీఈఓలు రౌండ్ టేబుల్‌లో పాల్గొన్నారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఫిన్‌టెక్, టెలికమ్యూనికేషన్స్, సెమీకండక్టర్స్, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్‌తో సహా పునరుత్పాదక ఇంధనం,…

Read More

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రమాదం తగ్గినప్పటికీ.. రాబోయే కాలంలో మరో మహమ్మారి ప్రమాదం పొంచి ఉందని, రాబోయే కాలంలో తదుపరి మహమ్మారిని ప్రపంచ దేశాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ హెచ్చరించింది. మే 21 నుండి 30వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో డబ్ల్యుహెచ్‌ఓ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో డబ్ల్యుహెచ్‌ఓ హెడ్ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ మాట్లాడుతూ కోవిడ్‌ -19 మహమ్మారి ముగింపుతో ప్రపంచ ముప్పు ముగిసిపోలేదని, కోవిడ్‌లాంటిదే మరో వేరియంట్‌ రూపాంతరం చెందే అవకాశముందని స్పష్టం చేశారు. ఈ కొత్త వేరియంట్‌ వల్ కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయని, అత్యధిక మరణాలు కూడా సంభవించే అవకాశముందని అంటూ మరో వ్యాధికారక ముప్పు మిగిలే ఉందని తెలిపారు. కోవిడ్‌ – 19 మహమ్మారికంటే ‘ప్రాణాంతకమైన’ మరో మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా తదుపరి…

Read More

ఈనెల 31 నుంచి అరవై రోజుల పాటు “పొగాకు విముక్తి యువత ” ప్రచారాన్ని చేపట్టడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. యువత పొగాకును వినియోగించే అలవాటు ప్రారంభించకుండా నివారించడానికి, ఆ అలవాటు ఉన్నవారిని మాన్పించడానికి తగిన చర్యలు తీసుకోవడం పైనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టి కేంద్రీకరించింది. పొగాకు వినియోగం తగ్గుతున్నప్పటికీ, అదింకా ఆమోదం కాని ఎక్కువ స్థాయిలో యువత, పెద్దల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం కౌమార దశలో ఉన్న (1315 ఏళ్ల ) వారిలో పొగాకు వినియోగం 2019లో 8.5 శాతం వరకు ఉండగా, అంతకు ముందు 2010లో ఈ వినియోగం 14.6 శాతం వరకు ఉందని గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (జివైటిఎస్ ) వెల్లడించింది. 42 శాతం వరకు తగ్గుదల కనిపించింది. మే 31న పంచ పొగాకు వ్యతిరేక దినం పాటిస్తున్న సందర్భంగా పొగాకు విముక్తి విద్యావ్యవస్థ వంటి కార్యక్రమాలు ఈ ప్రచారోద్యమంలో చేపడుతున్నారు.…

Read More

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్రిటీష్ నుంచి భారతీయులకు అధికార మార్పిడికి చిహ్నంగా వచ్చిన స్వాతంత్ర్యానికి సంబంధించిన ‘ముఖ్యమైన చారిత్రక’ చిహ్నం ‘రాజదండం’ని తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. “ఈ రాజదండంకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని గురించి ప్రధాని మోదీకి తెలియగానే, దాని గురించి మరింత సమాచారాన్ని పొందాలని కోరారు. ఆగస్టు 14, 1945న 10:45గంటలకు నెహ్రూ తమిళనాడు నుంచి వచ్చిన ఈ `రాజదండం’ను స్వీకరించారు. ఇది అధికార మార్పిడికి ప్రతీక”అని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ముందు తమిళనాడు నుంచి ప్రధాని మోదీ రాజదండంను స్వీకరిస్తారని, ఆయన దానిని కొత్త పార్లమెంట్ భవన్‌లో ఉంచుతారని షా తెలిపారు. ఇది ఒక పునాది కార్యక్రమం కానుందని, భారతదేశంలో అమృత్ కాల్‌ని గుర్తు…

Read More

తిరుమలలో పటిష్ట భద్రత కోసం అన్ని దళాలనూ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీ్‌షకుమార్‌ గుప్తా సూచించాడారు. తిరుమలలో ఇటీవల వరుసగా భద్రతా వైఫల్యాలు వెలుగు చూసిన నేపథ్యంలో భద్రతను పటిష్ఠం చేసే అంశంపై మంగళవారం తిరుమలలో ఉన్నతస్థాయి సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో ఉండే తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం కత్తిమీదసాము వంటిదని చెప్పారు. పోలీసు, టీటీడీ విజిలెన్స్‌ విభాగాలు సమన్వయంతో విధులను నిర్వహిస్తూ తిరుమల పేరుప్రఖ్యాతులను కాపాడాలని సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా అధికారులకు, సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్యంలో భద్రతాపరమైన అంశాలపై కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీలు పదిరోజుల్లో తిరుమలలో విస్తృతంగా పర్యటించి నివేదికను అందజేస్తాయని చెబుతూ ఆ మేరకు తిరుమలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత చర్యలు…

Read More

క్రికెట్, రుచికరమైన వంటల అనుబంధం, దీనికి మించిన విశిష్టమైన పరస్పర నమ్మకం , ఆదరణీయ భావం భారత్ ఆస్ట్రేలియాల బంధానికి పెట్టని కోట అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు దేశాల పర్యటనల్లో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చిన ప్రధాని మంగళవారం సిడ్నీ శివార్లలో జరిగిన సభలో మాట్లాడారు. లిటిల్ ఇండియాగా నామకరణం చేసిన ఈ వేదిక నుంచి ఆయన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనెస్‌తో కలిసి పాల్గొన్నారు. భారతీయ సంతతివారిని ఉద్ధేశించి ఆయన ఈ భారీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక్కడ వెలిసిన ఈ లిటిల్ ఇండియా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తోందని చెప్పారు. ఇరుదేశాలకు క్రికెట్ అంటే ప్రాణప్రదం, ఇరుదేశాలకు చెందిన క్రికెటర్లు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని తెలిపిన ప్రధాని ఈ సందర్భంగా గవాస్కర్, గ్రేగ్ ఛాపెల్ పేర్లను ప్రస్తావించినప్పుడు భారతీయ సంతతివారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంబంధాలు స్థిరమైనవే కాకుండా క్రమేపీ స్థిరంగా పురోగమిస్తూ…

Read More

కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించిన ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చాలా `రఫ్ అండ్ టాప్’ నేతగా పేరొందారు. రాజకీయ ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు ఎంతవరకైనా వెడతాడని ప్రతీతి. అయితే ముఖ్యమంత్రి పదవికోసం తీవ్రంగా ప్రయత్నించి, ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. సాధారణంగా కర్ణాటకలో ద్వేషరాజకీయాలు తక్కువ. రాజకీయంగా ఎంతటి తీవ్ర విబేధాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా సామరస్య సంబంధాలను నెరుపుతూ ఉంటారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి హోదాలో ద్వేషరాజకీయాలకు స్వస్తి పలికి, అందరితో కలిసి మెలిసి పనిచేయాలని నిర్ణయించిన్నటు కనిపిస్తున్నది. సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలలో బిజెపి, జేడీఎస్ సభ్యులను ఆప్యాయంగా పలకరించడం, వారితో కలిసిపోవడం అందరిని ఆకట్టుకొంటోంది. తన మీద కనకపుర నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ బిజెపి మంత్రి ఆర్. అశోక్ ను నవ్వుతూ పలకరించి కాంగ్రెస్ వారందరికీ షాక్ ఇచ్చారు.…

Read More

కేరళలోని దేవాలయాల ప్రాంగణాలలో ఆర్‌ఎస్‌ఎస్ కవాతులు, ఇతరత్రా కార్యకలాపాలను తిరువనంతపురం దేవస్థానం బోర్డ్(టిడిబి) నిషేధిస్తూ సర్కులర్ జారీ చేసింది. దక్షిణాదిన తిరువనంతపురం దేవస్థానం బోర్డు దాదాపు 1200 దేవాలయాలను మేనేజ్ చేస్తోంది. టిడిబి జారీ చేసిన సర్కులర్‌లో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు తిరువనంతపురం దేవస్థానం బోర్డు నియంత్రణలో ఉంటాయే తప్ప, ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో కాదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి కార్యకలాపాలను గుళ్ల ప్రాంగణాలలో నిర్వహించరాదని స్పష్టం చేసింది. తిరువనంతపురం దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. అనంతగోపన్ మీడియాతో మాట్లాడుతూ ‘గుళ్లలో వేడుకలు జరుగుతున్నందున మేము ఎలాంటి పరిశోధనలు చేయలేదు. కేవలం ఆర్‌ఎస్‌ఎస్ అనే కాదు, ఇతరులు కూడా జోక్యం చేసుకుంటున్నారు. దానిని మేము వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 2021 మార్చిలో కూడా ఇలాంటి సర్కులర్‌నే హెచ్చరిస్తూ విడుదలచేశారు. 2016లో అయితే దేవస్థానం బోర్డు ఆర్‌ఎస్‌ఎస్ తాలూకు అన్ని ఆయుధాల శిక్షణను నిషేధిస్తూ సర్కులర్ జారీ చేసింది. ఇక తాజాగా జారీ…

Read More

యూపీఎస్సీ సివిల్స్ 2022 తుది ఫలితాలు మంగళవారం విడుదల చేయగా వాటిల్లో  తెలుగు తేజాలు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా 933 మంది ఎంపిక అయ్యారు. ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించ‌గా, తెలంగాణ‌కు చెందిన నూకల ఉమా హార‌తి మూడో ర్యాంక్ సాధించారు. ఉమా హార‌తి నారాయ‌ణపేట ఎస్పీ వెంక‌టేశ్వర్లు కుమార్తె. ఆమె స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌న‌గ‌ర్. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గుంటూరుప‌ల్లికి చెందిన శాఖ‌మూరి శ్రీసాయి హ‌ర్షిత్ సివిల్స్ మెయిన్స్ లో 40వ ర్యాంకు సాధించారు. జ‌గిత్యాల జిల్లా ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంక్ సాధించారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బీవీఎస్ ప‌వ‌న్ ద‌త్తా 22వ ర్యాంకు, హెచ్ఎస్ భావ‌న‌ 55వ ర్యాంకు, సాయి ప్రణ‌వ్‌ 60వ ర్యాంకు, నిధి పాయ్ 110వ ర్యాంకు, అంకుర్ కుమార్ 257వ ర్యాంకు, చ‌ల్లా క‌ళ్యాణి 285వ ర్యాంకు, వై…

Read More