మిత్రపక్షం బిజెపి తనతో సహకరించక పోవడం వల్లననే తాను టిడిపి వైపు వెళ్ళవలసి వస్తున్నట్లు అన్నట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల మచిలీపట్టణం బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్త్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్యెల్సీ పివిఎన్ మాధవ్ కొట్టిపారేసారు. పైగా, తమతో పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదని మాధవ్ ఆరోపణలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్న కూడా.. లేనట్టుగానే ఉందని అంటూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించాలని కోరినా పవన్ స్పందించలేదు. పైగా కమ్యూనిస్టులు తమకు సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దాన్ని ఖండించాలని కోరినా పవన్ కళ్యాణ్ ఖండించలేదు” అంటూ పేర్కొన్నారు. గతంలోనూ తమ పార్టీ ఓటమి చెందినా పుంజుకున్న ఘటనలు ఉన్నాయని చెబుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు.…
Author: Editor's Desk, Tattva News
భారత్‌కు రానున్న 20 సంవత్సరాల్లో 31000 మంది విమాన పైలట్స్ అవసరం అవుతారని అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ అంచనా వేసింది. వీరితోపాటు 26 వేల మంది మెకానికులు అవసరం అవుతురాని తెలిపింది. భారత్‌కు చెందిన వివిధ విమానయాన సంస్థలు భారీగా కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బోయింగ్ ఈ అంచనా వేసింది. వచ్చే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఇండియన్ ఏవియేషన్ రంగం వృద్ధి చెందుతుందని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తా ముంబైలో సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. దేశంలో విమానయాన రంగం వృద్ధికి ఎయిర్‌పోర్టుల అభివృద్ధితో పాటు, విమానాల నిర్వహణకు అవసరమైన నిపుణులైన సిబ్బంది కూడా కావాలని ఆయన చెప్పారు. ఇటీవలే ఎయిర్ ఇండియా 470 కొత్త విమానాలకు బోయింగ్, ఎయిర్‌బస్స్‌లకు ఆర్డర్ ఇచ్చింది. ఇండిగోతో పాటు మరికొన్ని సంస్థలు కూడా భారీగా కొత్త విమానాలను…
మరో భారతీయ సంతతికి చెందిన మహిళకు అమెరికా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్‌ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒబామా హయాంలోనూ బిస్వాల్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆమె దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఆమె 30 ఏళ్లకు పైగా అనుభవం గడించారు. ప్రస్తుతం బిస్వాల్ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ వ్యూహం మరియు ప్రపంచ చొరవ కార్యక్రమానికి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సమయంలో సెంట్రల్ ఆసియాతో సి51 సదస్సు, అమెరికా బంగ్లాదేవ్ భాగస్వామ్య సదస్సుకు బాధ్యత వహించారు. అలాగే బిస్వాల్ యుఎస్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్…
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సిట్ పేర్కొంది. మార్చి 24వ తేదీన సిట్ ఎదుట హాజరవ్వాలని బండి సంజయ్ కు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల క్రమంలో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఒకే మండలానికి చెందిన 100 మంది అభ్యర్థులు మంచి మార్కులు తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఏవైనా ఉంటే, సమర్పించాలని సిట్ అధికారులు కోరారు. ‘పేపర్ లీకేజీ కుట్ర వెనుక నా పాత్ర ఉందని కేసీఆర్ కుమారుడు…
లోక్‌సభలో స్పీకర్ ఓమ్ బిర్లా ప్రతిష్ఠంభనను ముంగించేసేందుకు పిలిచిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. పార్టీలు తమ వ్యతిరేకతను వదులుకోడానికి ఇష్టపడలేదు. అభిజ్ఞ వర్గాల ప్రకారం అధికార పక్షం బిజెపి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ వైఖరిని వదులుకోడానికి ఒప్పుకోలేదు. కాగా లోక్‌సభ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. సభా కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని అన్ని పార్టీలకు స్పీకర్ బిర్లా విజ్ఞప్తి చేశారు. అయితే బిజెపి కానీ, కాంగ్రెస్ కానీ తమ వైఖరిని సడలించడానికి ససేమీరా అన్నాయి. ఎంపీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి లోక్‌సభ కార్యకలాపాలను కొనసాగనివ్వడంలేదు. మరోవంక, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడంలేదు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ…
హిదూత్వంపై అభ్యంతరకర ట్వీట్ చేసిన కన్నడ నటుడు చేతన్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. హిందుత్వపై ఆయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో చేతన్‌ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అసత్యాలపై హిందుత్వ నిర్మాణమైంది అంటూ చేతన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ‘అసత్యాలపై హిందుత్వ నిర్మాణమైంది. రావణుడిని ఓడించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతే భారత జాతి అనేది మొదలైందని సావర్కర్ చెప్పారనేది ఒక అసత్యం. బాబ్రీ మసీదే రాముడి జన్మస్థలం అని పేర్కొనడం ఒక అసత్యం’ అంటూ రాసుకొచ్చాడు. దీంతోపాటుగా హిందుత్వను కేవలం నిజం మాత్రమే ఓడించగలదని, ఆ నిజం సమానత్వం అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. చేతన్ ట్వీట్‌పై హిందుత్వ అనుకూల సంస్థ అతనికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన శేషాద్రిపురం పోలీసులు నటుడిని అదుపులోకి…
బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను సోమవారం సుమారు 10 గంటల పాటు ఈడీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారించింది. తిరిగి మంగళవారం కూడా ఆమెను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరకావలసిందిగా నోటీస్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో రెండో సారి ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 9.14 నిమిషాలకు బయటకు వచ్చారు. అక్కడ నుంచి నేరుగా ఆమె కెసిఆర్ నివాసానికి బయలుదేరి వెళ్లారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు కూడా తీసుకున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది. ఉదయం కవిత, అరుణ్ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా…
దేశంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. స్కిల్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచేసిందని జగన్ అరోపించారు. ఇది రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అని అన్నారు. ఇలాంటి గొప్ప స్కామ్ నడిపిన వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై ఆధారాలు చూపిస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ ముఠాగా ఏర్పడి ఓ పద్దతి ప్రకారం రూ.371 కోట్లు దోచేశారని జగన్ ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులను మళ్లించి స్కామ్ కు పాల్పడ్డారని జగన్ చెప్పారు. స్కిల్లింగ్ పేరుతో డబ్బులు దోచుకోవడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య అంటూ ఏ విధంగా ఓ వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ అడుగులు ఎలా పడ్డాయో ప్రజలకు తెలియాలని స్పష్టం చేశారు. వందరూపాయలు పనిచేస్తానని చెప్పి పది…
ఈ నెల 30న శ్రీరామ నవమి పండుగ నేపధ్యంలో రెండో అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వేలాదిగా భక్తజన సందోహనం నడుమ వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో స్వామివారి కళ్యాణం, పట్టాభిషేక ఉత్సవాల కోసం భక్తులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లా కలెక్టర్ అనుదీప్ సారధ్యంలో సమీక్ష నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు. ఇప్పటి వరకు 200 క్వింటాల తలంబ్రాలు, ప్రతి ఒక్కరూ కళ్యాణం తిలకించేందుకు 6 భారీ ఎల్‌సీడీలు, తెప్పోత్సవం వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 200 మంది స్విమ్మర్లు, 135 వివిధ రకాల బోట్స్, ఎక్కడికక్కడ తగు సిబ్బంది, సిబ్బంది వారి విధులకు అనుగుణంగా జాకెట్స్, 75 శాతం వసతి సౌకర్యాలు, పబ్లిక్…
చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి) కేంద్ర కమిటీ, స్టేట్ కౌన్సిల్ పార్టీ, ప్రభుత్వ సంస్థలను మరింత పటిష్టపరచే దిశగా ఓ ప్రణాళికను రూపొందించింది. ఇందుకు సంబంధించిన సర్కులర్‌ను సిపిసి ఇటీవల జారీ చేసింది. 18వ సిపిసి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మొదలుకుని, పార్టీ, ప్రభుత్వ సంస్థలనన్నిటిని మరింత పటిష్టపరిచే యత్నాలు జరుగుతున్నాయి. చైనా సంపూర్ణ పరివర్తనకు పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులు నిర్వర్తించాల్సిన విధులను నిర్దిష్టంగా ప్రణాళిక పేర్కొంది. నూతన కర్తవ్యాలు సాఫీగా అమలు జరిగేలా చూసేందుకు సంస్థాగత నిర్మాణం, పార్టీ , ప్రభుత్వ సంస్థల విధుల్లో సంస్కరణలు, సర్దుబాట్లు అవసరమని సిపిసి పేర్కొంది.కీలకమైన రంగాలలో సంస్థాగత సంస్కరణలను మరింత లోతుగా చేయడానికి, సోషలిస్ట్ ఆధునీకరణపై పార్టీ నాయకత్వం మరింతగా కేంద్రీకరించి పనిచేసేందుకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని పేర్కొంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం సెంట్రల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆ ప్రణాళిక సూచించింది. సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయాలని కూడా…