Author: Editor's Desk, Tattva News

అన్ని రంగాల్లో భారత్‌ పురోగతి సాధిస్తున్నదని, సృజనాత్మక రంగంలో పెట్టుబడులతో అద్భుత ఫలితాలు సాధించామనడానికి భారత్‌ నిదర్శనం అని మైక్రోసాఫ్ట్‌ కో-ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌ కొనియాడారు. భారత్‌ పర్యటనలో ఉన్న బిల్‌ గేట్స్‌  శనివారం ప్రధాని మోడితోభేటీ అయ్యారు. ఆరోగ్య రంగం, పర్యావరణ మార్పులు వంటి కీలక అంశాలపై ఇరువురూ చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీ వివరాల గురించి గేట్స్‌ తన అధికారిక బ్లాగ్‌లో రాశారు. భారత్‌ అన్ని రంగాల్లో రాణిస్తోందని పేర్కొన్నారు. భారత్‌ ఎంతో సమర్థమైన, భద్రమైన, అందుబాటు ధరల్లో ఉండే అనేక వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసిందన్నారు. భారత్‌ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ పలు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటే, భారత్‌ వంటి సృజనాత్మక, శక్తిమంతమైన దేశాన్ని సందర్శించడం స్ఫూర్తి కలిగిస్తున్నదని తన బ్లాగ్‌ ‘గేట్స్‌ నోట్స్‌’లో బిల్‌ గేట్స్‌ రాసుకున్నారు. కరోనా వేళ లక్షల మంది ప్రాణాలను…

Read More

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. శనివారం ఢిల్లీలోని రోజ్‌ అవెన్యూ కోర్టులో ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ పాహ్వా ఇందుకు సంబంధించిన పత్రాలు సమర్పించారు. సంజీవని క్రెడిట్‌ సొసైటీ కుంభకోణంలో తనకు సంబంధం ఉందంటూ గహ్లోత్‌ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఇందుకు ఆయనను ప్రాసిక్యూట్‌ చేయడంతోపాటు తనకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ కుంభకోణంపై రాజస్థాన్‌ ప్రభుత్వం దర్యాప్తు చేయించిందని, తన పేరును ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. ఫిబ్రవరి 28న గహ్లోత్‌ ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రికి సంబంధం ఉందని ఆరోపణలు చేశారు. దీనిపై గహ్లోత్‌ జైపూర్‌లో మాట్లాడుతూ తనపై దావా వేయడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దీంతో నైనా ఈ కుంభకోణం దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు. ఈ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన డిపాజిట్‌దార్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. లక్ష…

Read More

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా రిమాండ్‌ను కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌పై విచారణను వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 10న విచారణ జరుపనున్నది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో గత ఆదివారం సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం విధితమే. ఆ తర్వాత ఆయనను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా ఐదు రోజులు సీబీఐ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. శనివారంతో సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. మరో మూడు రోజుల సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. విచారణకు సిసోడియా సహకరించడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మనీష్‌ సిసోడియా తరఫు న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌ వాదనలు వినిపిస్తూ సీబీఐ వాదనలను ఖండించారు. దర్యాప్తులో సీబీఐ అసమర్థత కారణంగా రిమాండ్‌ను పొడిగించాలని కోరడం సరికాదని పేర్కొన్నారు. నిర్దోషిగా నిరూపించుకోవాలని…

Read More

ఉపాధ్యాయ విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం డిగ్రీతో పాటే బీఈడీ చదువుకునేలా సరికొత్త ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్న నాలుగేళ్ల కోర్సును బీఏ – బీఈడీ, బీఎస్సీ-బీఈడీ, బీకాం-బీఈడీ రూపంలో అందుబాటులోకి రానుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద తొలిదశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని యూనివర్సిటీలు, ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో అమల్లోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర విద్యా శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కోర్సు ద్వారా నాలుగు దశల్లో ఉపాధ్యాయ శిక్షణ అందించనున్నారు. ఫౌండేషనల్‌, ప్రిపరేటరీ, మిడిల్‌ దశలతో పాటు- సెకండరీలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నూతన విద్యావిధానం ప్రకారం (5 ప్లస్‌ 3 ప్లస్‌ 3 ప్లస్‌ 4) బోధనా విధానాలపై కోర్సు ఉంటుంది. సాధారణంగా డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు చేపట్టాలంటే మరో రెండేళ్ల పాటు- బీఈడీ చదవాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ఐదేళ్లలో…

Read More

దేశాభివృద్ధి ప్రక్రియలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కలిసి నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మాట్లాడుతూ ఈ ఏడాది బడ్జెట్‌ మౌలిక సదుపాయాల రంగానికి కొత్త వృద్ధి శక్తినిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధి ప్రక్రియలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎల్లప్పుడూ మూలస్తంభంగా వుంటుందని పేర్కొంటూ  నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ కింద రాబోయే కాలంలో రూ. 110 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని చెప్పారు. ప్రతి వాటాదారునికి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు, సాహసోపేతమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు.కాగా, ఈ వెబినార్‌లో ప్రధాని మోడీ ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. ‘మునుపటి ప్రభుత్వాలు దేశంలోని మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అదే ఈ ప్రభుత్వం పేదరికం, ఆధిపత్యం ఆలోచనను తొలగించేందుకు మౌలిక సదుపాయాలపై దృష్టి…

Read More

దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడంలో విశాఖపట్నంలో రెండురోజులపాటు జరిపిన గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సదస్సు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 రెండోరోజు సదస్సులో ముగింపు ఉపన్యాసంలో రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధిచెందేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నామ‌ని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు తమ ప్రభుత్వం నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుంద‌ని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం మరిన్ని అవకాశాలు అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలతో మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించామ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుంద‌ని తెలిపారు. అంతేకాదు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం…

Read More

కరోనా మహమ్మారి వైరస్‌ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఇది మొదట చైనాలోనే పుట్టిందనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. కానీ, చైనాలో సహజంగానే ఈ మహమ్మారి ఉద్భవించిందా? లేక అమెరికా చెబుతున్నట్టు అది చైనాలోని వుహాన్ ల్యాబ్ లో తయారు చేసిన వైరస్సా? అనే విషయమై నిర్ధారణ లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పుట్టుక మూలం గురించి ప్రపంచ దేశాలు తమకు తెలిసిన సమాచారాన్ని తనతో పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘కరోనా మహమ్మారి మూలం గురించి సమాచారం ఉంటే దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, శాస్త్రవేత్తలతో పంచుకోవడం ఎంతో అవసరం. ఇది ఎవరో ఒకరిని నిందించేందుకు కాదు. మహమ్మారి ఎలా మొదలైందో తెలుసుకుని, అవగాహన పెంచుకోవడం కోసం. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, నివారించేందుకు వీలుంటుంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్…

Read More

బెలారస్‌ మానవహక్కుల ఉద్యమకారుడు, 2022 నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీతల్లో ఒకరైన అలెస్‌ బియాలియాట్‌ స్కీకి బెలారస్‌లోని ఓ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన స్థాపించిన వియస్నా మానవ హక్కుల కేంద్రం బెలారస్‌లో పౌర హక్కుల కోసం పోరాడుతోంది. బియాలియాట్‌ స్కీతోపాటు వియస్నా కేంద్రానికి చెందిన మరో ముగ్గురికి కూడా జైలు శిక్షలు పడ్డాయి. వీరు పౌర భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనీ, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనీ ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. 2020లో దేశాధ్యక్షుడిగా అలెగ్జాండర్‌ లుకషెంకో ఎన్నికైనప్పుడు దేశమంతటా పెద్దఎత్తున నిరసనలు రేగాయి. ఆ అల్లర్లలో 35,000 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పట్లో అరెస్టయిన 60 ఏళ్ల బియాలియాట్‌ స్కీ, ఆయన సహచరులు గత 21 నెలలుగా జైలులోనే ఉన్నారు. వారందరినీ కోర్టు ముందు హాజరుపరిచారు. బెలారస్ ప్రభుత్వ ఏజెన్సీబెల్టా న్యాయస్థానం సుదీర్ఘ జైలు శిక్ష విధించడాన్ని ధ్రువీకరించింది. కాగా బిలియాట్సి…

Read More

సంపదపై దురాశే అవినీతిని ప్రోత్సహిస్తూ క్యాన్సర్‌గా వృద్ధి చెందడానికి దోహదపడిందని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏమాత్రం సహించకూడదని, దేశ ప్రజల తరపున బాధ్యతగా ఉంటూ ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అమన్‌సింగ్‌, ఆయన భార్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ రవీంద్రభట్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది.  ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. ఈ సందర్భంగా కొన్ని కుంభకోణాలను ప్రస్తావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వాటిపై దర్యాప్తు జరుగుతున్న తీరు బాధ కలిగిస్తోందని అభిప్రాయపడింది. రాజ్యాంగ పీఠిక హామీ ఇచ్చినట్లుగా ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడంలో అవినీతి అనేది తీవ్ర అవరోధంగా మారుతోందని సుప్రీం కోర్టు…

Read More

ఇండో-పసిఫిక్‌లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని, మధ్యధరా సముద్రంలో ఇటలీ కీలక వాటాదారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌లో జరిగే సంఘటనలు యూరప్‌పై ప్రత్యక్ష పరిణామాలను కలిగిస్తాయని ఆమె స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన బహుపాక్షిక సమావేశాలు ‘రైసినా డైలాగ్‌’ లో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొంటూ జి20లో భారత్‌ నాయకత్వం, రైసినా చర్చలు కలిసి ప్రపంచానికి సహకారం, శాంతి సందేశాన్ని పంపగలవని చెప్పారు. వాతావరణ మార్పులపై ప్రపంచ సమన్వయం జీరో-సమ్‌ గేమ్‌ కాకూడదని, ఈ విషయంలో భారత్‌ నేతృత్వంలోని ఇండో-పసిఫిక్‌ దేశాలు బలమైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు. ఇటలీ, భారత్‌లు గతం కన్నా మెరుగైన సంబంధాలను కలిగి ఉన్నాయని మెలోనీ చెబుతూ ఇరు దేశాల భౌగోళిక స్వరూపాలు ఒకేవిధంగా ఉన్నాయని తెలిపారు. తూర్పు మధ్యధరా, ఆఫ్రికా, యూరప్‌లను కలిపే వారధిగా ఇటలీ వ్యవహరిస్తోందని ఆమె పెక్రోన్నారు. ఉత్పత్తి దేశాలు తమ వనరుల ద్వారా పూర్తి ప్రయోజనం…

Read More