అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన వివరాలను అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకులను కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఆర్‌బిఐ నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఒపి)లో భాగంగా కొత్త పరిణామాలు ఉండవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఆర్‌బిఐ నుండి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి వుంది. అదానీ గ్రూప్ తన ఖాతాల్లో, షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ గత నెలలో ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నివేదికకు సంబంధించి అదానీ గ్రూప్, హిండెన్ బర్గ్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అదానీ – హిండెన్ బర్గ్ నివేదిక అంశం గురువారం పార్లమెంటును కుదిపేసింది. ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. అదానీ సంస్థ మోసంపై పార్లమెంట్ కమిటీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ…
Author: Editor's Desk, Tattva News
వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం నుంచి పునఃప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని శంకరం తండా గ్రామం నుండి 3 గంటలకు షర్మిల పాదయాత్ర మొదలుకానుంది. సాయంత్రం శంకరం తండా, లింగగిరి, సూరిపల్లి తండాల మీదుగా నెక్కొండ మండలం వరకు ఆమె పాదయాత్ర సాగనుంది. షర్మిల రాత్రి నెక్కొండలో బస చేయనున్నారు. చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద గతేడాది నవంబర్ 28న షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేయటంతో ఆమె పాదయాత్రను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. షర్మిల ప్రచార రథాన్ని పెద్దిరెడ్డి అనుచరులు దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు పాదయాత్రకు బ్రేక్ వేశారు. అనంతరం షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. కాగా, ఈ ఏడాది జనవరి 28 నుంచి పాదయాత్ర చేస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సాఆర్‌టీపీ పోలీసులను…
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేసవిలో తమ దేశంలో పర్యటించాలంటూ ఆహ్వానం పలికారు. భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు అమెరికాలో పర్యటించాలని భారత ప్రధానిని, బైడెన్ కోరారు. ఈ విషయంపై స్పందించిన పీఎంఓ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని త్వరలోనే అమెరికాలో పర్యటిస్తారని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ లో పర్యటించనున్నారు. జూన్, జులై లో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్లు జరగనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మోదీ పర్యటనకు అనుకూలమైన షెడ్యూల్‌ను రూపొందిస్తామని పీఎంవో పేర్కొంది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, చైనా ఆధిపత్యం, ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, దౌత్య సంబంధాలపై ఇరు దేశాల అధినేతల మధ్య…
తెలంగాణలో అధికారం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతమైన త్రిముఖ వ్యూహంను ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలు నిర్వహించనుంది. పైగా, ఉత్తర ప్రదేశ్ లో గత రెండు ఎన్నికలలో ఈ వ్యూహం అమలులో కీలక పాత్ర వహించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాలి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వ్యూహం క్షేత్రస్థాయిలో అమలుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా, ఎన్నికల ప్రకటన వారిగానే అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డలతో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా బహిరంగ సభలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 11న అమిత్ షా, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రధాని మోదీ కూడా తెలంగాణకు వస్తున్నారు. ఆదిలాబాద్,…
దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఏపీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా జగన్ ఫై విమర్శల వర్షం కురిపించారు. ఆక్సిమొరాన్ అంటే విరుద్ధమైన రెండు పదాల కలయిక. మన సీఎం సంపాదన దేశంలోనే మిగతా సీఎంల కంటే ఎక్కువ సంపాదన అని పవన్ చెప్పుకొచ్చారు. అసలు దేశంలో జగన్ క్లాస్ వేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘లాండ్ నుంచి శాండ్ వరకు.. లిక్కర్ నుంచి మైన్స్ వరకు.. అడవుల నుంచి కొండల వరకు.. పేపర్ నుంచి రెడ్ శాండిల్ వరకు.. ఏపీ నుంచి ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉంది.. ఇది నిజంగా క్లాసిక్. ప్రజల జీవితాలు, గౌరవం, కష్టపడటం వంటివి కొంతమందికి అమ్ముడుపోయాయి.’ అంటూ ధ్వజమెత్తారు. “వాట్ ఏ ఐరనీ! ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదు, ప్రజలంతా వైకాపా రాజ్యానికి బానిసలుగా అయిపోయారు. భూమి నుంచి ఇసుక వరకు, మద్యం…
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజురోజుకీ వివాదం పెరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులుతో సమావేశమై కోటం రెడ్డి అంశంపై చర్చించారు. నెల్లూరు గ్రామీణ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీపై విమర్శలు చేస్తుండగా.. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిని ముందు నుంచి అధికార వైసీపీ పార్టీ నేతలు ఖండిస్తూనే ఉన్నారు. కోటంరెడ్డి చేసిన ఆరోపణలను మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసిపి ఇంచార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు కోటంరెడ్డి ఆరోపణలు…
ఏడాది క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ స్థానంలో భారతదేశ అత్యంత సంపన్నుడిగా ఎదిగిన అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. అదానీ గ్రూపు కంపెనీలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక గౌతమ్ అదానీ రాతను మార్చివేసింది. అదానీ గ్రూపు కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో గౌతమ్ అదానీ ఆస్తుల విలువ తగ్గిపోగా మళ్లీ దేశంలోనే నంబర్‌వన్ సంపన్న హోదాను ముకేష్ అంబానీ దక్కింపకున్నారు. గత 50 రోజుల కన్నా తక్కువలోనే 50 బిలియన్ డాలర్లను నష్టపోయిన అదానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ కన్నా 400 మిలియన్ డాలర్ల పేదగా మారిపోయారు. హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడైన నాటి నుంచి అదానీ గ్రూపు కంపెనీల షేర్లు నిత్యం పతనమవుతూనే వస్తున్నాయి. రోజూ బిలియన్ల డాలర్ల సంపదను అదానీ కోల్పోతూనే ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి అదానీ కంపెనీల…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన 2023-2024 కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. చారిత్రక బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ నిర్మలా సీతారామన్ బృందాన్ని అభినందించారు. పేదలు, మధ్యతరగతి ప్రజానీకం, రైతులతో సహా సమాజంలోని అన్ని వర్గాల కలలను నెరవేర్చేందుకు బడ్జెట్ సహకరిస్తుందని తెలిపారు. అమృత్‌కాల్‌లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అని, భారత అభివృద్ధి కలలను సాకారం చేస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేస్తుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల మహిళల జీవనం కోసం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకున్నామని, మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత మెరుగుపరిచి, ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించనున్నామని మోదీ చెప్పారు. విశ్వకర్మలకు తొలిసారి శిక్షణ, సహాయక పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టామని చెప్పారు. మన తృణధాన్యాలకు ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు ఉందని, ఇప్పుడు ఈ ‘సూపర్ ఫుడ్’కు ‘శ్రీ అన్న’ అనే…
అమృత్ కాల్ లో ఇది తొలి బడ్జెట్ అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ లా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు..లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను బుధవారం ఆమె ప్రవేశపెడుతూ రైతు, పేద, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్ రూపొందించామని తెలిపారు. తొమ్మిదేండ్లలో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ ఎదిగామని పేర్కొన్నారు. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేశామని, 7శాతం వృద్ధి రేటును ఆర్థిక సర్వే అంచనా వేసిందని ఆమె చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగామని పేర్కొంటూ కరోనా సమయంలోఎవరూ ఆకలితో బాధపడలేదన్న సీతారామన్ ఉచిత ఆహారధాన్యాల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. 2047 లక్ష్యంగా పథకాలను రూపొందిస్తున్నామని తెలిపారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించామని చెప్పారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా వైద్యకళాశాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతామన్నారు. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తామని…
“ప్రభుత్వం ఊహించిన ఆర్థిక (ఫిస్కల్ గ్లైడ్) మార్గానికి అనుగుణంగా, జి డి పి లో %గా కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు క్రమంగా క్షీణించడం, గత రెండు సంవత్సరాలలో ఉత్సాహభరితమైన ఆదాయ సేకరణ ద్వారా జాగ్రత్తగా ఆర్థిక నిర్వహణకు మద్దతు ఇచ్చిన ఫలితం‘‘ అని 2022-23 ఆర్థిక సర్వే తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచ అనిశ్చితుల సమయంలో కన్జర్వేటివ్ బడ్జెట్ అంచనాలు బఫర్ ను అందించాయని సర్వే పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఆదాయాలు పుంజుకోవడంతో ఆర్థిక పనితీరు పుంజుకుంది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు స్థూల పన్ను ఆదాయం15.5 శాతం (ఇయర్ ఆన్ ఇయర్ – వై ఒ వి )వృద్ధిని నమోదు చేసిందని, రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత కేంద్రానికి నికర పన్ను ఆదాయం 7.9 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. జిఎస్ టిని ప్రవేశపెట్టడం ఆర్థిక లావాదేవీల…