గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా, అందు లో ఆరుగురిని పద్మ విభూషణ్‌కు, 9 మందిని పద్మభూషణ్‌కు, 91 మంది ని పద్మశ్రీ అవార్డుల కోసం ఎంపిక చేసింది. గత ఏడాది మే 1నుంచి సెప్టెంబర్ 15వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలనుంచి మొత్తం 12 మందికి పద్మ అవార్డులు లభించాయి.తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి; కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిని పద్మశ్రీ వరించింది. తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్ గుప్తా(సైన్స్ అండ్…
Author: Editor's Desk, Tattva News
ప్రముఖ డిజిటల్ చెల్లింపులు, ఫిన్‌టెక్ వేదిక ఫోన్ పే తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చికోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తమ ఇన్వెస్టర్లు రూ.8,000 కోట్ల పన్ను చెల్లింపులు చేశారని ఫోన్ పే కో పౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమీర్ నిగమ్ తమ సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారితో కలిసి తెలిపారు. ఏదైనా దేశం నుంచి ఓ కంపెనీ భారత్‌కు పూర్తిగా మారాలంటే ఇన్వెస్టర్లు మూలధన రాబడులపై పన్నులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో తమ సంస్థ తాజా మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఫోన్‌పే ఇటీవల రూ.2,850 కోట్ల (350 మిలియన్ డాలర్లు) సమీకరించింది. దీంతో ఆ కంపెనీ విలువ సుమారు రూ.97,800 కోట్ల (12 బిలియన్ డాలర్లు)కు చేరినట్లయ్యింది. దాదాపు 100 కోట్ల డాలర్ల మేర నిధులను సంస్థ సమీకరించనుండగా, జనరల్ అట్లాంటిక్‌తో పాటు మార్క్ గ్లోబల్…
అధిక ధరలు, పెరుగుతున్న దారిద్య్రంతో ఆసియా ఖండంలో ప్రజానీకం తీవ్ర ఆహార అభద్రతకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితికికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎప్‌ఎఓ) పేర్కొంది. యునిసెఫ్, డబ్ల్యుహెచ్‌ఓ తదితర సంస్థలతో కలిసి రూపొందించిన నివేదికను ఆ సంస్థ మంగళవారం విడుదల చేసింది. దక్షిణాసియాలో దాదాపు 50కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కుంటున్నారని, ప్రతి ప్రతి పదిమందిలో 8 కన్నా ఎక్కువమందే ఈ దుస్థితిలో ఉన్నారని పేర్కొంది. మరో వంద కోట్ల మంది ప్రజలు ఒక మోస్తరు నుండి తీవ్ర ఆహార అభద్రతను 2021లో ఎదుర్కున్నారని తెలిపింది. ఇక మొత్తంగా ప్రపంచ దేశాల్లో 2014లో ఆహార అభద్రత 21శాతంగా వుండగా, 2021 వచ్చేసరికి అది 29శాతానికి పైగా పెరిగింది. ‘కోవిడ్ మహమ్మారితో పెద్ద ఎదురుదెబ్బ తగలింది. మూకుమ్మడిగా ఉద్యోగాలు పోయాయి. తర్వాత వచ్చిన ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అనేక లక్షలమందికి తగినంత ఆహారం…
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడం వల్ల ఆ ప్రాంతం గుండా బద్రినాథ్ వెళ్లే జాతీయ రహదారిపై మూడు మీటర్ల పొడవైన పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగుళ్ల నేపథ్యంలో అక్కడ 181 భవనాలు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 275 కుటుంబాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, జాతీయ రహదారిపై పగుళ్ల విషయం తమ దృష్టికి వచ్చిందని చమేలీ డీఎం హిమాన్షు ఖురానా తెలిపారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో కేంద్ర భవన పరిశోధన సంస్థ (సీబీఆర్‌ఐ) బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక రహదారి అలైన్‌మెంట్ కారణంగానే పగుళ్లు వచ్చినట్లు ప్రకటించారు. పగుళ్ల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంచు పర్వతాలతో కూడిన సుందర తలమైన జోషీమఠ్ అనేక మందికి పవిత్రమైన దైవభూమి. కానీ అభివృద్ధి, మౌలిక వసతుల పేరిట చేపట్టిన విచక్షణ…
ప్రపంచ బిలినీయర్ల జాబితాలో రెండో స్థానానికి చేరిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తాజాగా నాలుగో ర్యాంక్‌కు పడిపోయారు. అంటే ఆయన రెండు స్థానాలు దిగువకు చేరారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అమెజాన్ జెఫ్ బెజోస్ గౌతమ్ అదానీని అధిగమించి మళ్లీ మూడో స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి చేరారు. జాబితా ప్రకారం, గౌతమ్ అదానీ ఆస్తులు ఇప్పుడు 120 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆయన సంపద 872 మిలియన్ డాలర్లు తగ్గింది. 2023 జనవరి 1 నుండి ఇప్పటి వరకు ఆయన సంపద 683 మిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు జెఫ్ బెజోస్ ఆస్తులు 121 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2023లో ఇప్పటివరకు బెజోస్ నికర విలువ 13.8 బిలియన్ డాలర్లు పెరిగిందని జాబితా వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 188 బిలియన్ డాలర్ల సంపదతో బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2023లో…
చివరి వన్డేలోనూ భారత్ గెలిచి 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 386పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు 41.2ఓవర్లలో 295పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ శర్మ(101), శుభ్‌మన్(112) తొలి వికెట్‌కు 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(54), కోహ్లీ(36), శార్దూల్ ఠాకూర్(25) ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నెర్‌కు మూడేసి, బ్రాస్‌వెల్‌కు ఒక వికెట్ దక్కాయి. ఛేదనలో న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫిన్ డకౌటైనా.. మరో ఓపెనర్ కాన్వే(138) బ్యాటింగ్‌లో రాణించాడు. నికోల్స్(42), సాంట్నర్(32) ఫర్వాలేదనిపించారు. శార్దూల్, కుల్దీప్‌కు మూడేసి, చాహల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ శుభ్‌మన్ గిల్‌కు లభించింది. ఇక…
దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎట్టకేలకు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ టాప్ -4లో నిలిచింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలోని ఈ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్‌లో నామినేషన్ సాధించి చరిత్ర సృష్టించింది. చంద్రబోస్ రాసిన ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలా భైరవ పాడారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారత సిినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్లు సాధించిన ఇతర భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1957), సలామ్ బాంబే (1988), లగాన్ (2001). ఫలితం తెలియాలంటే మార్చి 13, 2023 వరకు ఆగాల్సిందే. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు సాంగ్…
ఆచరణ కాని హామీలు ఇచ్చేందుకు, రాష్ర్ట ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, హామీల గురించి చర్చ జరగదని పేర్కొంటూ కొత్త కొత్త సంక్షేమ పథకాల పేర్లు చెప్పి.. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతారని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో బిజెపి రెండు రోజుల రాష్ట్రకార్యవర్గ సమావేశాలలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలందరికీ వివరించాలని పార్టీ శ్రేణులకు సంజయ్ పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ర్టంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి కూడా లేదని, చివరకు కోర్టు ఆదేశాలను కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు పూర్తి నిరాశ, నిస్పృహ, ఆందోళనలో ఉన్నారని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం,…
కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పంపిన నిధులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం దారి మళ్ళించడంపై సర్పంచుల సంఘం నాయకులు ఢిల్లీకి వస్తే స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల ఆధ్వర్యంలో సర్పంచ్ లు గ్రామాల సమస్యలపై విజయవాడలో జరిగిన అఖిల పక్షరౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటూ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం చేపట్టే అన్ని ఉద్యమాలకు బిజెపి పార్టీ *గల్లీ నుంచి ఢిల్లీ వరకు* మద్దతుగా నిలుస్తామని వీర్రాజు భరోసా ఇచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో టిడిపి, బిజెపిలతో సహా వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీల నాయకులు కూడా ఒకే వేదికపైకి వచ్చి సర్పంచ్ లకు, గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై గళం విప్పారు. ఉమ్మడిగా ఈ విషయంలో ప్రభుత్వంపై…
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోలగట్ల మీనాక్షి, తెలంగాణకు చెందిన గౌరవి రెడ్డితో పాటు మొత్తం 11 మంది బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి జాతీయ బాలల పురస్కారాలు అందుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకున్నారు. చిన్న వయస్సులో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి దేశానికి పేరు తీసుకొచ్చిన బాలలను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ చందరంగం క్రీడాకారిణి కోలగట్ల ఆలన మీనాక్షి 2022 అక్టోబర్‌లో ప్రకటించిన ర్యాంకింగ్స్ 11 ఏళ్ల లోపు వయసు కేటగిరీలో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచింది. క్రీడల విభాగంలో మీనాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయ బాలల పురస్కారానికి ఎంపికైంది. మరోవైపు ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్ కు 2016లో నామినేటైన నృత్యకారిణి ఎం. గౌరవి రెడ్డి అతిచిన్న వయస్సులో ఈ ఘనత సాధించి రికార్డుల్లోకి ఎక్కింది.…