Author: Editor's Desk, Tattva News

జార్ఖాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జైనులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారంనాడు నిరసనలకు దిగారు. ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక కేంద్రమైన ‘శ్రీ సమ్మేద్ శిఖర్‌జీ’ను పర్యాటక కేంద్రంగా జార్ఖాండ్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై జైన మతస్తులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వేలాది మంది జైనులు బ్యానర్లు పట్టుకుని నిరనసలకు దిగారు. శ్రీ సమ్మేద్ శిఖర్‌జీని పర్యాటక కేంద్రంగా మార్చరాదంటూ డిమాండ్ చేశారు. జైనుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలుసుకుంది. అటు సౌత్ ముంబై‌లోనూ నిరసనలు పెల్లుబికాయి. విపి రోడ్డు నుంచి నుంచి క్రాంతి మైదాన్ వరకూ జైనులు నిరసన మార్చ్ నిర్వహించారు. విపి రోడ్డు, బోరివలి, ఘట్కోపార్, భయండెర్, డోంబేవలి, భివాండి, గుల్వాడిలో సైతం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ముంబైలోని భులేశ్వర్ జైన్ ఆలయం వద్ద జైన ప్రముఖులు, ఆ కమ్యూనిటీ కి చెందిన…

Read More

హైదరాబాద్‌ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఆదివారం ప్రారంభమైంది. ఏటా దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు, వస్తువులను ప్రదర్శనలో ఉంచటంతో పాటు విక్రయించడానికి వేదికగా చేసుకునే నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేది ఆదివారం ప్రారంభమైంది. 82వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో ఈసారి 2400స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో జ‌రిగే ఎగ్జిబిష‌న్ (నుమాయిష్‌)ను మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొన‌సాగ‌నుంది. 1938లో వంద స్టాళ్లతో ప్రారంభమైన నుమాయిష్‌.. ప్రస్తుతం 1500కుపైగా స్టాల్స్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నుమాయిస్‌ భారీగా ప్రజాదరణ పొందిందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ద్వారా 19 విద్యా సంస్థలు నడుస్తున్నాయని, సొసైటీ ద్వారా 10వేల మందికి లబ్ధి కలుగుతుందని తెలిపారు. అన్ని రకాల సాంస్కృతిక సంప్రదాయాలు…

Read More

బిజెపి సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు (88) కన్నుమూశారు. కొంతకాలం కిందట అస్వస్థతకు గురై నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. భౌతికకాయాన్ని పిఠాపురం కాలనీలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చలపతిరావుకు భార్య అనురాధ (రిటైర్డ్‌ లైబ్రేరియన్‌), కుమార్తెలు అంజనా ఉపాధ్యాయ, అపర్ణా ముఖర్జీ, కుమారుడు ఎమ్మెల్సీ పివిఎన్‌ మాధవ్‌ ఉన్నారు. చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా 1980, 1985ల్లో రెండు పర్యాయాలు పనిచేశారు. 1974, 1984లలోనూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. పీవీ చలపతిరావు ఆకస్మిక మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి చలపతిరావు…

Read More

ప్రతి ఏడాది జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారని తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అయితే, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇవ్వమంటే, సాక్షి దినపత్రిక క్యాలెండర్ ను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గత మూడేళ్లు గడిచిపోయాయని, ఇది నాల్గవ ఏడాది. అయినా జాబ్ క్యాలెండర్ ఊసే లేదని ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. కానీ నిర్వహించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో 50 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 6000 స్కూళ్లను మూసి వేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు అని అనడమే తప్పితే, కొత్తగా ఒక్క టీచర్ ను నియమించలేదు. ప్రస్తుతం నాలుగు నుంచి 5వ తరగతి విద్యార్థుల సీబీఎస్ఈ సిలబస్ జన్యునుగా పరీక్షలు రాసి ఫస్టు క్లాసులో పాసైన తమకే కన్ఫ్యూజన్ గా ఉందని వివరించారు. …

Read More

హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలోని రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ కావడం విశేషం. ఆదివారం రోజున ఎస్సార్‌డీపీలో భాగంగా హైదరాబాద్‌ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల ఈ ఫ్లై ఓవర్ ను రూ. 263 కోట్లతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ లను కలిపేలా ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. గచ్చిబౌలి నుండి మియాపూర్ కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీకి ఈ ఫ్లై ఓవర్ ద్వారా సులభంగా చేరుకునే విధంగా వెసులుబాటు దక్కనుంది. మజీద్ బండ రోడ్డు నుండి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు 401 మీటర్ల ర్యాంపు, కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వైపు 383 మీటర్ల ర్యాంపు…

Read More

ఓమ‌హిళా అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై కేసు నమోదు కావడంతో హ‌ర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌ తన మంత్రిత్వ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖత్తార్ కు అప్పగించారు కురుక్షేత్ర‌లోని పెహోవా బీజేపీ ఎమ్మెల్యే అయిన సింగ్ త‌న‌ను తొలుత జిమ్‌లో చూశార‌ని, ఆపై ఇన్‌స్టాగ్రాంలో ప‌రిచ‌యం పెంచుకున్నాడ‌ని మ‌హిళా అథ్లెటిక్ కోచ్ ఆరోపించారు. ఇన్‌స్టాలో త‌న‌తో ప‌రిచ‌యం పెంచుకున్న మంత్రి ఆపై త‌న‌ను క‌లుసుకోవాల‌ని ఒత్తిడి చేశాడ‌ని ఆరోపించారు. త‌న నేష‌న‌ల్ గేమ్స్ స‌ర్టిఫికెట్ పెండింగ్‌లో ఉంద‌ని, ఈ విష‌యమై త‌న‌ను క‌ల‌వాల‌ని కోరాడ‌ని చెప్పారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఫెడ‌రేష‌న్‌లో త‌న స‌ర్టిఫికెట్ గ‌ల్లంతు కాగా చివ‌ర‌కు తాను మంత్రి వ‌ద్ద‌కు డాక్యుమెంట్ల‌తో వెళ్లాన‌ని, ఈ క్ర‌మంలో సందీప్ సింగ్ త‌న ప‌ట్ల అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రిస్తూ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆమె ఆరోపించారు. సందీప్ సింగ్ గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన ఒలింపియన్…

Read More

హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను కించపరిచేందుకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భద్రతలోనే హిందూ దేవుళ్లను కించపరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందూ ధర్మాన్ని పాటించే వారిలో ఐక్యత లోపించటం వల్లే హిందూ దేవుళ్లను అవహేళన చేస్తున్నారని పేర్కొంటూ హిందువులందరూ సంఘటితం కావాలని సంజయ్ పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లను, ధర్మాన్ని హేళన చేసి మాట్లాడితే హిందూ సమాజం ఊరుకోదని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు నిర్వహించిన పడిపూజా కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సంజయ్ సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునేది హిందూ ధర్మం అని పేర్కొన్నారు. హిందూ ధర్మం పాటించే వారిలో నిస్వార్థం ఉంటుందని.. అందరూ బాగుండాలని కోరుకుంటారని వివరించారు. అలాంటి గొప్ప హిందూ ధర్మాన్ని ఈరోజు హేళన చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం…

Read More

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీలను ఆర్థిక సలహా మండలి (ఈఎసి) సభ్యులుగా నియమించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) ఓ ప్రకటన ద్వారా తెలిపింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆ మండలికి నేతృత్వం వహిస్తారు. ఆ మండలిలో 21 మంది సభ్యులుగా ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, అదానీ పోర్ట్ సిఈవో కరణ్ అదానీలు రేవుల, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ప్రాతినిధ్యం వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ‘ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్షాన్ని సాధించేందుకు ఈ ఆర్థిక సలహా మండలి కీలక భూమికను నిర్వహించగలదు. ఇదో ప్రయివేట్ పరిశోధన సంస్థగా పనిచేయనున్నది. వ్యవసాయం, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, విద్య తదితర రంగాలకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించనున్నది’ అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ …

Read More

ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం(2023)లోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరంలో ఆర్థికంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన కొన్ని నియమాలలో ముఖ్యమైన మార్పులు ఉండబోతున్నాయి. జనవరి 1 నుండి ఎన్‌పిఎస్ డిపాజిట్, బీమా వంటి వాటికి కెవైసి పత్రాలు తప్పనిసరి, మరోవైపు క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లకు కొత్త నియమాలు ఉంటాయి. వాటి ప్రత్యక్ష ప్రభావం వినియోగదారుల జేబుపై పడనుంది. అందుకే ఈ కొత్త నిబంధనల గురించి సమాచారాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎస్‌బిఐ కార్డ్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో 2023 జనవరి 1 నుండి కొన్ని మార్పులు చేసింది. ఎస్‌బిఐ వెబ్‌సైట్ ప్రకారం, జనవరి 1 నుండి అమెజాన్‌లో ఎస్‌బిఐ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి 10కి బదులుగా 5 రెట్లు రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, ఈజీ డైనర్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్ మునుపటి కంటే 10 రెట్లు రివార్డ్…

Read More

చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్త వేరియంట్ ను భారత్ లో గుర్తించారు. దీన్ని కొవిడ్ ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ గా పిలుస్తున్నారు. గుజరాత్ లో నమోదైన ఓ కేసులో ఈ కొత్త వేరియంట్ ను గుర్తించారు. అమెరికా వైద్య నిపుణులు కొవిడ్ ఎక్స్ బీబీ 1.5 రకాన్ని సూపర్ వేరియంట్ అంటున్నారు. ఇది బీక్యూ.1 వేరియంట్ కంటే 120 రెట్లు అధికవేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపారు.  ఇటీవల ఈ వేరియంట్ తో అమెరికాలో కొన్ని కరోనా కేసులు వెల్లడయ్యాయి. చైనా సంతతి అమెరికా వైద్య నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ దీనిపై స్పందిస్తూ, కొవిడ్ ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ మానవ వ్యాధినిరోధక వ్యవస్థను ఏమార్చే సామర్థం గలదని హెచ్చరించారు.  కాగా, ఈ నయా వేరియంట్ ను గుర్తించిన…

Read More