బిజెపి బహిష్కృత నేత, గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. మంగళ్‌హాట్ పోలీసులు ఆయనపై మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఇటీవల ట్విట్టర్‌లో ఆయన ఓ పోస్ట్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇటీవల నోటీసులు జారీ చేశారు. దీనిపై రాజాసింగ్ తరపు న్యాయవాదులు వివరణ ఇవ్వగా పోలీసులు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టినందుకు రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గతంలో ఒవైసి సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, రాజాసింగ్ గుర్తు చేశారు. వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. తన పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవ హరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకే తనపై వరుస కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులపై రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఈ…
Author: Editor's Desk, Tattva News
అన్నా హజారే 2011లో ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరుగా పేరొంది, ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ గా మహిళా పక్షపాతిగా పేరొందినస్వాతి మలివాల్ ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో కలకలం రేగుతోంది. అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలను నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. కమిషన్‌లో వివిధ ఉద్యోగాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను నియమించేందుకు స్వాతి, మరికొందరు తమ పదవులను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. ఏ పరిణామమే పట్ల దిగ్బ్రాంతి చెందిన ఆమె ఏడేళ్ళ తన పదవీ కాలంలో తాను సర్వస్వం కోల్పోయానని, మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి కుటుంబ జీవితం వరకు అన్నిటినీ కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన జీవితాన్ని పెను ప్రమాదంలోకి నెట్టుకున్నానని చెబుతూ, అయితే తనకు వేలాది ఆశీర్వాదాలు లభించాయని, తాను బతికి ఉండటానికి కేవలం అదే కారణమని పేర్కొన్నారు. 22 ఏళ్ళ వయసులో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాన్ని వదులుకుని, మురికివాడల్లో…
రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపిడీకి గురైన మహిళల్లో షుమారు 88 శాతం మంది నేటికి మన సమాజంలో చీత్కారాలు, అవమానాలు తో పాటు వివక్షతకు గురవుతున్నారని అక్రమ రవాణా భాదితుల రాష్ట స్థాయి భాదిత మహిళా సంఘం “విముక్తి” రాష్ట్ర నాయకులు శ్రీమతి అపూర్వ , శ్రీమతి పుష్ప, మౌనిక, భాజీవలి, లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాము మనుషులమని, తమకు మానవ హక్కులు వరిస్తాయనే విషయం కూడా తెలియక, తామే ఏదో చేయకూడని కఠిన నేరాలు చేసిన నేరస్తులుగా భావించుకొంటూ, నేటికి ఈ సమాజంలో తమ వెతలు, భాధలు, కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. *“అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం”* పురష్కరించుకొని శుక్రవారం విజయవాడలో మీడియాతో విముక్తి రాష్ట్ర అధ్యక్షరాలు శ్రీమతి అపూర్వ మాట్లాడుతూ తమకు తెలియకుండానే ఎవరి చేతనో మోసగించబడి బలవంతంగా వ్యభిచారం లోకి నెట్టబడి, వివిధ సమస్యలు, హింస, వివక్షత ఎదుర్కొంటున్న…
గుజరాత్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు నిద్రపట్టదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. బీజేపీని అణిచేస్తామని కేసీఆర్ ప్రగర్భాలు పలికారని, కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఆయనకు నిద్ర కూడా పట్టదని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కూడా విరమించుకుంటారేమో అని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమిపాలవడం కంటే పదవీకాలం పూర్తయ్యేవరకైనా అధికారాన్ని అనుభవిద్దామనుకుంటారని జీవీఎల్ తెలిపారు. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని సూత్రీకరించారు. ఇందుకు మునుగోడు ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ గుజరాత్ తరహాలోనే రికార్డు స్థాయి మెజారిటీ సాధిస్తుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. 2019లో సొంతంగా 303 సీట్లు సాధించగా, 2024లో 404 సీట్లు సాధిస్తామని చెప్పారు. ఇదేమీ అతిశయోక్తి కాదని, ప్రజలు…
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రూప్ ఏ పోస్టులు 23,584, గ్రూప్ బీ పోస్టులు 1,18,807, గ్రూప్ సీ పోస్టులు 8,36,936. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయం తెలిపారు. వివిధ కేంద్ర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) పోస్టుల ఖాళీల సంఖ్యపై కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖలో 2,93,943 ఖాళీలు, రక్షణ (సివిల్) శాఖలో 2,64,704 ఖాళీలు, హోం వ్యవహారాల శాఖలో 1,43,536 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ‘రైల్వేలో మొత్తం 15,14,007 పోస్టులు ఉండగా, 2,93,943 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం రైల్వేలో 12,20,064 మంది ఉద్యోగులున్నారు. అదేవిధంగా డిఫెన్స్ (సివిల్)లో 6,46,042 పోస్టులు మంజూరుకాగా 2,64,707 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.…
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాఘరాజ్ సింగ్‌పై డింపుల్ 2 లక్షల 88 వేల 461 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య అయిన డింపుల్ ఉదయం పోలింగ్ మొదలైన 8 గంటల నుంచి ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చారు. డింపుల్‌కు మొత్తం 6,18,120 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి 3,29,659 ఓట్లు సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇటీవల కన్నుమూయడంతో మైన్‌పురి లోక్‌సభకు ఉప ఎన్నిక నిర్వహించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్ అసెంబ్లీకి, కతౌలి అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరిగింది. రాంపూర్ సదర్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తమ సమీప సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిపై గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి ఆకాష్…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..‘భారత్ రాష్ట్ర సమితి‘ గా మార్చడాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సిఎం కెసిఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన ‘భారత రాష్ట్ర సమితి‘ ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో (ఒంటిగంట 20 నిమిషాలకు) తనకు అందిన అధికారిక లేఖకు సమాధానంగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం సిఎం బిఆర్‌ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,…
అధికారంలోకి రాబోతున్నామంటూ ప్రచారం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఐదు సీట్లకు పరిమితం కావలసి రావడంతో ఒక విధంగా గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. అయితే ఈ ఫలితాలతో జాతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం ఆప్ కు లభించింది. గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుని జాతీయ పార్టీకి అర్హత సాధించిందని చెబుతూ పదేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేశారు. పదేండ్ల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుని, జాతీయ పార్టీగా అవతరించిందని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘‘గుజరాత్ ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. వాళ్లకు రుణపడి ఉంటా. ఈ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆప్ ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. ఆప్ ను జాతీయ పార్టీగా మార్చేందుకు కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు” అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.కాగా, బీజేపీకి కంచుకోటలా ఉన్న…
అణ్వాస్త్రాల్ని వాడే రిస్క్ పెరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. తామేమి అణు దాడి చేసేందుకు పిచ్చిగా లేమని, కానీ ఎవరైనా దాడి చేస్తే మాత్రం అణ్వాయుధం వాడనున్నట్లు పుతిన్ స్పష్టం చేశారు. రష్యా వార్షిక మానవ హక్కుల మండలి సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి ప్రకటించిన తర్వాత పుతిన్ అణ్వాయుధాల్ని వాడుతారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి దాడి ఏమీ జరగలేదు. అణ్వాయుధాన్ని ప్రయోగించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఆ విషయాన్ని దాచిపెట్టడం తప్పే అవుతుందని పుతిన్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా మొదట అణ్వాయుధాన్ని వాడదని పుతిన్ స్పష్టం చేశారు. అంతేకాదు తమ వద్ద ఆయుధాలతో ఎవర్నీ బెదిరించడం లేదని కూడా ఆయన వెల్లడించారు. మరీ మేం పిచ్చిగా లేమని, అణ్వాయుధాలపై అవగాహన తమకు ఉందని పుతిన్ పేర్కొన్నారు. అణ్వాయుధాల…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి రికార్డు స్థాయిలో, ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో మరే పార్టీ సాధింపలేనన్ని సీట్లను గెల్చుకొని, వరుసగా ఏడవసారి అధికారంలోకి వస్తుండగా, హిమాచల్ ప్రదేశ్ లో అధికార ఓటమి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అధికారంలో ఉన్న బిజెపిని ఓడించి, కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సంపాదించింది. గుజరాత్ లో బిజెపి 156 సీట్లు గెల్చుకోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు హాజరుకానున్నారు. కాగా, కాంగ్రెస్ 17స్థానాల్లో, ఆప్ 5 స్థానాలకు పరిమితమయ్యాయి. గుజరాత్ చరిత్రలోనే ఈ స్థాయి సీట్లు ఎవరికీ ఎప్పుడూ రాలేదు. గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లను సాధించింది. ఇప్పుడా రికార్డును బీజేపీ బద్ధలు కొట్టబోతోంది. హిమాచల్‌లో కాంగ్రెస్ 39 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బిజెపి 26, ఇతరులు…