Author: Editor's Desk, Tattva News

రాజ్యసభ కొత్త చైర్మన్​గా ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్​కర్​ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్​ శీతాకాల సమావేశాల తొలి రోజు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర నేతలు ధన్​కర్​ను చైర్మన్​ సీటు వరకు తీసుకుని వెళ్లారు. పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సందర్భంగా ధన్​కర్​కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను ధన్​కర్​ కొనసాగిస్తారని అధికార పార్టీ సభ్యులు ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న పార్టీలకు మరింత సమయం ఇవ్వాలని, ప్రభుత్వ బిల్లుల స్క్రూటినీ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను బలోపేతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి. లోక్​సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఇటీవల మరణించిన సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్, 8 మంది మాజీ సభ్యులకు నివాళులర్పించింది. ద మల్టీ స్టేట్​ కో ఆపరేటివ్ సొసైటీస్(అమెండ్​మెంట్) బిల్లు, 2022ను ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది. ధన్​కర్​కు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ రాజ్యసభ చైర్మన్‌‌గా ధన్​కర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడతారని విశ్వాసం…

Read More

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త ప్రచార రథంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఎలక్షన్ ప్రచారం కోసం ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించారు. ఈ ప్రచార రథానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ఆర్మీ వాహనానికి అత్యాధునిక మెరుగులు దిద్ది తయారు చేసినట్లుగా వారాహి వాహనం ఉంది. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. సంప్రదాయ రాజకీయ నేతలెవరికీ లేనివిధంగా ఈ వాహనాన్ని సరికొత్తగా తయారు చేయించారు పవన్ కళ్యాణ్. తన సెక్యూరిటీ టీమ్‌లో ఇటీవల కొత్తగా రిక్రూట్ చేసుకున్న 10 మంది భద్రతా సిబ్బంది పర్యవేక్షణ మధ్య దూసుకొస్తున్న వారాహి వాహనం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వారాహి’ – రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అంటూ ఈ వాహనానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్‌ను బుధవారం హైదరాబాద్‌లోకి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను చేశారు. వాహనాన్ని…

Read More

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఉత్కంఠ రేకెత్తించిన ఈ పోరులో చివరి బంతికి ఆరు పరుగులు కావల్సిన ఉండగా ముస్తాఫిజుర్ రహ్మాన్ డాట్ బాల్ వేయడంతో బంగ్లా విజయం సాధించింది. భారత బ్యాట్స్ మెన్స్ లో అయ్య‌ర్(82), అక్ష‌ర ప‌టేల్(56) రాణించారు. మిగతా వారు ఘోరంగా విఫలమవ్వగా.. చివర్లలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(51 నాటౌట్: 28 బంతుల్లో 5సిక్స్‌లు, 3 ఫోర్ల‌ు) బ్యాట్ ఝుళిపించినా మ్యాచ్ గెలిపించలేకపోయాడు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. దీంతో టీమిండియాపై బంగ్లా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 2-0తో మూడు వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపిన ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో బాంగ్లాదేశ్ గెలుపొందింది. గాయం కారణంగా డగౌట్‌కే పరిమితమైన టీమిండియా…

Read More

బిజెపికి కంచుకోటగా ఒంటి, గత 15 ఏళ్లుగా ఆ పార్టీ ఎన్నికవుతూ వస్తున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మొదటిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 15 ఏళ్లుగా బీజేపీనే కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఆక్రమించుకోగా, తొలిసారి పూర్తిస్థాయి మద్దతుతో ఢిల్లీ కార్పొరేషన్ పీఠాన్ని సొంతం చేసుకుంది డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 250 వార్డులకు ఎలక్షన్ జరిగింది. బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరిగింది.ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలకి పరిమితం అయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ ఆఫీస్ దగ్గర ఆప్ కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందంగా గడిపారు. 958లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 2012లో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేశారు. ఈ…

Read More

వాణిజ్య వర్గాలు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ ఈ సారి వడ్డీ రేట్లను 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తంగా రెపో రేటు 6.25 శాతానికి రెపో రేటు పెరిగింది. ఆర్బీఐవడ్డీ రేట్లను పెంచడం ఇది వరుసగా ఐదో సారి కావడం గమనార్హం.  ఇంతకుముందు మాత్రం 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచగా ఈసారి కాస్త తక్కువే పెంచి ఉపశమనాన్ని కల్పించింది. ప్రతి నెలా ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ లక్షిత పరిధి అయిన 6 శాతానికి మించి నమోదవుతున్న నేపథ్యంలో రెపో రేటును పెంచక తప్పట్లేదు. కొంత కాలంగా ద్రవ్యోల్బణం లెక్కకు మించి నమోదవుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా భారీగా పడిపోతుంది. ఇక ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో.. ఈ భారాన్ని వెంటనే అన్ని బ్యాంకులు ప్రజలపై మోపుతాయి. రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇవి గృహ,…

Read More

ఉగ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం అత్యవసరమని కేంద్రం పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని ఆడ్డుకోవడం భారత్‌తో పాటు ఇతర దేశాలకు అత్యవసరమని సూచించింది. మంగళవారం నిర్వహించిన ”జాతీయ భద్రతా సలహాదారులు/ భద్రతా మండలి కార్యదర్శులు” ప్రారంభ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఐఎ) అజిత్‌ దోవల్‌ ప్రసంగిస్తూ.. ఈ ప్రాంతంలోని దేశాలన్నింటికీ ఆఫ్ఘనిస్థాన్‌ ముఖ్యమైన సమస్య అని పేర్కొన్నారు. కజికిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాల నుద్దేశించి మాట్లాడారు. శాంతియుత, భధ్రత, సుసంపన్నమైన మధ్య ఆసియా అన్ని దేశాలకు ప్రయోజనకరమని దోవల్‌ పేర్కొన్నారు. సంబంధిత ఉగ్రవాద నిరోధక ఒప్పందాలను పొందుపరిచిన ప్రయోజనాలను నెరవేర్చేందుకు, ఉగ్రవాదదాడులకు పాల్పడే సంస్థలకు మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యులను కోరాలని మధ్య ఆసియా దేశాలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతం భారత్‌కి పొరుగు ప్రాంతంగానే కాకుండా నాగరికతతో అనుసంధానించబడిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఇతర దేశాలతో సహకరించడానికి,…

Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 11న మూడు జాతీయ ఆయుష్ సంస్థలను జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో గోవాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఇఐఎ), ఘజియాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (ఎన్ ఐ యు ఎం),  రాజధాని ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (ఎన్ ఐ హెచ్) ఉన్నాయని కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.  ఈ సంస్థలు పరిశోధనలతో అంతర్జాతీయ సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని, అధిక జనాభాకు అందుబాటు ధరలో ఆయుష్ సేవలను సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు. డిసెంబరు 8-11 వరకు గోవాలోని పంజిమ్‌లో నిర్వహిస్తున్న 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ (డబ్ల్యూఏసీ) వివరాలను కూడా సోనోవాల్ వెల్లడించారు. ఆయుష్ వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న శాస్త్రీయత, సమర్థత, సామర్థ్యాన్ని ముందుకు తెస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాలు, మానవ వనరులను విస్తరించడం, సాంప్రదాయ వైద్య విధానాలలో పరిశోధనలను ప్రోత్సహించడం వంటి ప్రధాన మంత్రి నరేంద్ర…

Read More

భారత్‌ వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ సవరించింది. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తుండటంతో గతంలో వేసిన 6.5 శాతం వృద్ధిరేటు అంచనాను 6.9 శాతానికి పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థ అంతర్జాతీయ పరిణామాలను తట్టుకుని రాణిస్తోందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.  ఈ సంవత్సరం అక్టోబర్‌లో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. ప్రపంచ పరిణామాలు ఏ మాత్రం సానుకూలంగా లేనప్పటికీ రెండో త్రైమాసికంలో భారత్‌ మెరుగైన గణాంకాలను నమోదు చేసింది. దీంతో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను పెంచినట్లు ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది.  ఈ ఆర్ధిక సంవత్సరం ద్రవ్యోల్బణం 7.1 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. భారత్‌ స్థూల ఆర్ధిక ప్రాథమిక అంశాలు బలంగా ఉండటంతో ప్రపంచ పరిణామాలను తట్టుకుని నిలదొక్కుకుందని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ట్రేడర్స్‌, సంస్థల కన్ను పడని అతి పెద్ద దేశీయ మార్కెట్‌ ఉండటం…

Read More

తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి సాకేత్ గోఖలేను గుజరాత్ పోలీసులు రాజస్థాన్‌లోని జైపూర్‌లో సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అక్టోబర్‌లో మోర్బీ వంతెన కూలి 130 మంది చనిపోయిన ఘటనస్థలిని ప్రధాని మోడీ సందర్శించిన అంశంపై ఆయన చేసిన ట్వీట్ కారణంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఇది బిజెపి రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించింది. ‘కొవిడ్ టెస్ట్ తర్వాత అతడిని లాంఛనంగా అరెస్టు చేయడం జరిగింది’ అని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఓ పౌరుడి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశామని కూడా ఆయన తెలిపారు. ఫోర్జరీ, అపఖ్యాతి పాలుచేయడం (డిఫేమేషన్) అభియోగాలు అతడిపై పెట్టినట్లు వివరించారు. ప్రభుత్వం ఫ్యాక్ట్-చెక్ యూనిట్ గోఖలే ట్వీట్‌ను ఇటీవల తప్పుపట్టింది. “ప్రధాని మోదీ మోర్బీ సందర్శనానికి రూ. 30 కోట్లు ఖర్చయిందని ఆర్‌టిఐ పేర్కొంది” అని అతడు పేర్కొన్న ట్వీట్‌ను ఫ్యాక్ట్‌చెక్…

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వరుస నిరసనల సెగలు ఆగడం లేదు. ఈ మధ్యనే  గన్నేరువరం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన యువజన సంఘాలు తమకు డబుల్ లైన్ రోడ్డు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా చేస్తుండగా, అటుగా వచ్చిన రసమయిని నిరసనకారులు అడ్డుకునే యత్నం చేశారు.  రసమయి కాన్వాయ్ ఆపకుండా ముందుకు సాగారు. తమకు సమాధానం కూడా చెప్పరా? అంటూ రసమయి కాన్వాయ్ పై దాడికి యత్నించారు. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే మరో నిరసన సెగ తగిలింది. గద్దపాక గ్రామంలో రేషన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అఖిలపక్షం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుకుంటారా..? అంటూ అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే…

Read More