ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సినీ , రాజకీయ ప్రముఖులను సైతం మోసం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి , నిర్మాత జీవిత రాజశేఖర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. జియో స్మార్ట్ స్టోర్లో ఆఫర్ల పేరుతో రూ. 1.22 లక్షలు కొల్లగొట్టారు. దీనిపై జీవిత రాజశేఖర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో నిందితుడు నాగేందర్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సైబర్ క్రైం ఏసీపీ ఏవీఎం ప్రసాద్ తెలిపారు. జియో బహుమతుల పేరుతో లక్షన్నర రూపాయల మేర జీవితారాజశేఖర్‌కు సైబర్ నేరగాళ్లు మోసం చేసారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామంటూ ఛీటింగ్ చేశారని, అలా తెలిసినవారి పేరు చెప్పి జీవితారాజశేఖర్‌కు టోకరా వేశారు. తెలిసినవాళ్లని నమ్మి లక్షన్నర రూపాయలు బదిలీ చేసిన జీవిత మేనేజర్ ఆ డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులకు…
Author: Editor's Desk, Tattva News
యూనిఫాం సివిల్ కోడ్ అమలుతో పాటు ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గుజరాత్ బీజేపీ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం భూపేంద్ర పటేల్ మేనిఫెస్టో విడుదల చేశారు. సంఘ విద్రోహశక్తులు పని పట్టేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్ యూనిఫాం సివిల్ కోడ్ కమిటీ సిఫారస్సును పూర్తిగా అమలు చేయడంతో పాటు గుజరాత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రానున్న 5 ఏండ్లలో రూ. 10,000 కోట్ల బడ్జెట్‌తో 20,000 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని, యువతకు 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10,000 కోట్లు, నీటిపారుదల సౌకర్యాల కోసం రూ. 25,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షల విలువైన వైద్య బీమా, రాష్ట్రంలో మూడు మెడిసిటీలు, రెండు అత్యాధునిక ఆసుపత్రులను…
సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు. మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఆయన చేరికతో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతమవుతుందని, టీఆర్ఎస్ కుటుంబ పాలన అంతమవుతుందని చెప్పారు. అనంతరం మర్రి శశిధర్ రెడ్డితో కలిసి నేతలందరూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నివాసానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన మర్యాదపూర్వక భేటీలో అధ్యక్షులు జేపీ నడ్డా కూడా మర్రి శశిధర్ రెడ్డికి మరోసారి కండువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం నేతలు అరగంటకు పైగా తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది. టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనడం కాంగ్రెస్ వల్ల కాదు’ అని పేర్కొన్నారు. ఆయన…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసు ను సిట్ కు బదిలీ చేయగా..ఈ కేసు విచారణ చేపట్టిన తెలంగాణ సిట్ బీఎల్ సంతోష్ ను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. తనను నిందితుడిగా పేర్కొని నోటీసులు ఇవ్వడం పట్ల బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సంబంధంలేని వ్యవహారంలో తన పేరును ప్రచారం చేస్తున్నారని బీఎల్ సంతోష్ తన పిటిషన్ లో ఆరోపించారు. సీఆర్పీసీ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది లంచ్ మోషన్…
మెరుగైన వేతనాలు, పని పరిస్థితుల కోసం అమెజాన్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో శుక్రవారం విక్రయాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏడాది మొత్తంలో అత్యధికంగా సేల్స్ జరిగేవి శుక్రవారాలే కావడం గమనార్హం. దీంతో ‘మేక్ అమెజాన్ పే’ పేరుతో అమెరికా, బ్రిటన్, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూరప్‌లతో కలిపి మొత్తం 40 దేశాలకు చెందిన ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పెరుగుతున్న జీవన వ్యయానికి తగినట్లుగా మెరుగైన వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెజాన్‌లోని ఆమోదయోగ్యం కాని, అసురక్షిత పనిపరిస్థితులను వెంటనే నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని యుఎన్‌ఐ గ్లోబల్ యూనియన్ జనరల్ సెక్రటరీ క్రిస్టీ హాఫ్‌మాన్ పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించడంతో పాటు మెరుగైన ఉద్యోగుల కోసం కార్మికులతో చర్చలు జరపాలని సూచించారు. ఫ్రాన్స్, జర్మనీ యూనియన్స్ సిజిటి, వెర్.డి లతో పాటు యూరప్ మార్కెట్‌లోని 18 మేజర్ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. కార్మికుల…
బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు, ఫొటోను అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించరాదని ఢిల్లి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ అధికారులకు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. నోటీసులిచ్చింది. తన అనుమతి లేకుండా తన మేధో సంపత్తిని వాడుకుంటున్నారంటూ అమితాబ్ బచ్చన్ ఢిల్లి హైకోర్టులో పిటిషనల్ దాఖలు చేయగా, శుక్రవారం దానిపై విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. అమితాబ్ అనుమతి లేదా ధ్రువీకరణ లేకుండా ఆయనకున్న సెలబ్రిటీ హోదాను వినియోగించుకోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ”ఇది అమితాబ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమే. నటుడి అనుమతి లేకుండానే నటుడి సెలబ్రిటీ హోదాను వాడుకుంటున్నారు. ఇలాంటి కార్యకలాపాల వల్ల నటుడి పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి” అని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్లితే… నకిలీ కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీ…
ప్రపంచంలో తిరుగులేని నాయకుడు తానేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో 77 శాతం రేటింగ్‌తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 56 శాతం రేటింగ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ద్వితీయ, ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41శాతం రేటింగ్‌తో తృతీయ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో కెనడా ప్రధాని ట్రుడో, బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని కిషిండా నిలిచారు. ”మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్” ఈ సర్వే నిర్వహించి, 22 దేశాల అధినేతల రేటింగ్స్‌తో ఫలితాలు విడుదల చేసింది. గత సర్వే నివేదికల్లో కూడా మోదీ అత్యంత ప్రజాదరణ గల నేతగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 75 శాతం రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తాజా సర్వేలో మోదీ రేటింగ్ మరో 2 శాతం పెరగడం గమనార్హం. కొందరు…
అంతర్జాతీయ అంశాల ప్రభావం వల్లే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని సాధించలేక పోయినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుండటం వల్ల ఇంధనం, ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాల ధరలు పెరిగాయని, కరోనా మహమ్మారి వల్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయని పేర్కొంది. ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాల్లో ఇవి కొన్ని అని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ ఓ లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, అత్యంత గోప్యంగా రాసిన ఈ లేఖలో భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరాలు లేవు. వరుసగా మూడు త్రైమాసికాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 6 శాతం బ్యాండ్‌లో అప్పర్ రేంజ్‌ను తాకింది. ఈ నేపథ్యంలో ఈ లేఖను కేంద్రానికి ఆర్బీఐ ఎంపీసీ పంపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ ఈ లేఖను రాసింది. ఈ సమాచారాన్ని వెల్లడించవలసిన అవసరం…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిత్యం ఏదో ఒక వివాదంకు నెలవుగా మారుతున్నది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. ఐతే ఇటీవల ఆయన రాజస్థాన్‌కు చెందిన మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్య మహిపాల్ మడెర్నాను ముద్దుపెట్టడంపై దుమారం రేగుతోంది. దివ్యను తలపై రాహుల్ ముద్దుపెట్టిన ఫొటోను బీజేపీ నేత అరుణ్ యాదవ్ పోస్ట్ చేశారు. దీనికి బెస్ట్ క్యాప్షన్ చెప్పాలని నెటిజన్లను అడిగారు. ఆయన ట్వీట్‌తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ ట్వీట్‌పై దివ్య మడెర్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఏడు క్యాప్షన్స్ ఇచ్చి బీజేపీపై ఎదురు దాడికి దిగారు. రాహుల్ గాంధీ తన సంరక్షకుడు, గురువు, అన్నయ్య, దయ కలిగిన నాయకుడు అని పేర్కొన్నారు. నిన్ను సిగ్గేస్తుందని.. మీకు కూడా కూతురు, భార్య, తల్లి ఉంటుంది కదా.. అని మండిపడ్డారు. వ్యక్తిత్వాన్ని కించపరచడం ఆపాలంటూ విరుచుకుపడ్డారు.భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో జరుగుతున్న…
బహుభార్యత్వం, నిఖా-హలాలాపై దాఖలైన కేసులను పరిశీలిచేందుకు కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయా పద్ధతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు తాజాగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ ధర్మాసనం ఎదుట న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ముస్లింల బహుభార్యత్వం, నిఖా హలాలను రాజ్యాంగ విరుద్ధమైనవి ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తా ధర్మాసనం పదవీ విరమణ చేసిందని, కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అశ్విని ఉపాధ్యాయ సీజేఐ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో కొత్తగా బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు సీజేఐ ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు నిఖా-హలాల, బహుభార్యత్వం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై అఖిల భారత ముస్లిం…