Author: Editor's Desk, Tattva News

రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్‌ పార్లమెంటు మద్దతు పలికింది. ఉక్రెయిన్‌లో పౌరులే లక్ష్యంగా స్కూళ్లు, దవాఖానలు, విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడుతున్నదని, ఇది అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఈ తీర్మానంపై ఐరోపా పార్లమెంటులో ఓటింగ్‌ నిర్వహించగా 494 మంది సభ్యులు మద్దతు పలుకగా, 58 మంది వ్యతిరేకించారు. మరో 44 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. యూరోపియన్‌ పార్లమెంట్‌ రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా తీర్మానించడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతించారు. తమ దేశంపై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా.. ఉక్రేనియన్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నందతూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల ఆర్థికంగా, విద్యుత్‌, చమురు పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న యూరిపియన్‌ దేశాలు ఈ తీర్మానానికి మద్దతు…

Read More

డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు వీలుగా ఓ బిల్లును తేడానికి కేంద్రం పనిచేస్తోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. గతంలో వార్తలు వన్‌వే కమ్యూనికేషన్‌గా ఉండేదని, కానీ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వచ్చాక వార్తలు తెలిపే విధానం మల్టీడైమెన్షనల్ గా మారిందని ఆయన వివరించారు. నేడు చిన్న గ్రామాల్లోకి కూడా డిజిటల్ మీడియా ద్వారా జాతీయ వార్తలు చేరుకుంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం చాలా వరకు స్వీయ నియంత్రణను ప్రింట్, ఎలెక్ట్రానిక్, డిజిటల్ మీడియాకిచ్చిందని ఆయన పేర్కొన్నారు. “చట్టంలో మార్పులు తేవలసి ఉంది. మీ పని సులభంగా, సింపుల్‌గా ఉండేలా మేము ఓ బిల్లును తేబోతున్నాం” అని ఆయన ‘మహానగర్ టైమ్స్’ అనే ఓ హిందీ వార్తాపత్రిక ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చెప్పారు. 1867 ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని తేబుతున్నామని ఆయన తెలిపారు. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక…

Read More

ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.  తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.  మళ్లీ అధికారులను పంపి దాడులు చేయించేది కేసీఆరే అంటూ పంట చేతికొచ్చే సమయానికి దాడులు చేసి పంటను నాశనం చేయించేది కేసీఆర్ అని ధ్వజమెత్తారు.  సమస్యను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నడని మండిపడ్డారు. సీఎం కుట్రలకు అధికారులను బలి చేస్తున్నారని, బీజేపీ నేతలకు నోటీసులతో బెదిరింపులకు దిగుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నడని పేర్కొంటూ తన పదవిని కాపాడుకునే యత్నం చేస్తున్నడని విమర్శించారు.  కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఆడుతున్న డ్రామా అని…

Read More

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ట్రాన్స్‌జండర్ల భద్రత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాన్స్‌జండర్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ను ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని పోలీస్‌హెడ్‌ క్వార్టర్స్‌లో సిఐడి చీఫ్‌ పివి సునీల్‌కుమార్‌ ట్రాన్స్‌జండర్లతో కలసి ఈ సెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌జండర్లకూ ప్రత్యేక హక్కులు, రక్షణ వ్యవస్థ వుండాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక కార్యమ్రాలను చేపట్టాలని 2019లో సుప్రీంకోర్టు సూచన మేరకు కేంద్రప్రభుత్వం ట్రాన్స్‌జండర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను తీసుకువచ్చిందని తెలిపారు.  విద్య, ఉపాధి అవకాశాలల్లోనూ ప్రాధాన్యతను కల్పించాలని చట్టం చెబుతోందని తెలిపారు. ఈసెల్‌కు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్‌పి కెజివి సరిత నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఈ ఈ చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఈ సందర్బంగా ఎస్‌పి కెజివి సరిత మాట్లాడుతూ ట్రాన్స్‌జండర్లు పోలీస్‌ స్టేషన్‌కు వస్తే వారిని అగౌరపరిచేలా కాకుండా గౌరవించి సమస్యకు పరిష్కారం చూపాలని…

Read More

తెలంగాణలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా వైసిపి నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు అంద‌జేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 100 కోట్లు తాను సమకూరుస్తానని రఘురామ చెప్పినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఈ వ్యవహారంలో విచారించేందుకు రఘురామకృష్ణంరాజుకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామరాజు దిగిన ఫొటోలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిట్ అధికారుల దృష్టి ఆయనపై పడినట్లు భావిస్తున్నారు.  దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది  మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తునకు సహకరించని కీలక అనుమానితులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎవరైతే సీట్…

Read More

మంత్రి మల్లారెడ్డి ఇంటిలో ఐటీశాఖ రెండు రోజులపాటు సాగించిన సోదాలు ముగిశాయని తెలుస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, కుమారులు, బంధువులు, సోదరులు ఇండ్లల్లో తనిఖీలు పూర్తయ్యాయని సమాచారం అందుతోంది. రెండు రోజుల పాటు 65 బృందాలతో ఐటీశాఖ అధికారులు, సిబ్బంది సోదాలు నిర్వహించారు. 400 మంది ఐటీ అధికారులు దాదాపు 48 గంటల పాటు తనిఖీలు చేశారు.  సోదాలు ముగిసిన తర్వాత పంచనామా నివేదికలను మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు అందజేశారు. ఈనెల 28వ తేదీన( సోమవారం) ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 10 కోట్ల 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.  సోదాల్లో సీజ్ చేసిన ల్యాప్ టాప్ లను ఐటీ అధికారుల నుండి మంత్రి మల్లారెడ్డి అనుచరులు బలవంతంగా లాక్కున్నారు. దీంతో బోయిన్ పల్లి పీఎస్ వద్ద హైడ్రామా నడిచింది. తాను లేని సమయంలో తమ కుమారుడితో బలవంతంగా తప్పుడు స్టేట్ మెంట్…

Read More

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ విభాగంలో టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల ముగిసిన వరల్డ్‌ కప్‌ టోర్నీలో 239 పరుగులు చేసిన సూర్య, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ చెలరేగాడు.  ఆ సిరీస్‌లో అతను 124 రన్స్‌ చేశాడు. మౌంట్‌ మౌంగనీలో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ 111 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.  సూర్యకుమార్‌ 890 పాయింట్లతో కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లు సాధించి అందనంత ఎత్తులో ఉన్నాడు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 836 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.  భారత్‌తో సిరీస్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించిన డెవాన్‌ కాన్వే ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ నాలుగో ప్లేస్‌కు పడిపోయాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌…

Read More

తెలంగాణ బీజేపీ నేతలుబుధవారం  ఢిల్లీకి వెళ్లనున్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలు హస్తినకు వెళ్తున్నారు. వారితో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆ పార్టీ  సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా దేశ రాజధానికి వెళ్లనున్నారు. 25న (శుక్రవారం రోజు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.  ఈ సందర్భంగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్నోటీసులు, తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర బిజెపి నేతలు చర్చించే అవకాశం ఉంది . కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని  స్థితికి చేరుకుందని శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని…

Read More

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)  విజయాశ్వంగా పిలువడే పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా మరో  ప్రయోగాన్ని చేపట్టేందుకు సర్వం సిద్దంచేశారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ లోని మొదటి ప్రయోగ వేదికపై నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే రాకెట్‌ అనుసంధాన ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు.  పీఎస్‌ఎల్‌వీ -సీ54 వాహకనౌక నాలుగు దశలను సిద్దం చేసి శిఖరభాగాన పేలోడ్‌లో ఓషన్‌శాట్‌ -3తో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను అమర్చారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 26న 11.56గంటలకు పీఎస్‌ఎల్‌వీ -సీ54 రాకెట్‌ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్‌ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టనున్న ఓషన్‌ శాట్‌ భూ పరిశీలన ఉపగ్రహం సముద్ర పరిశీలన లక్ష్యంగా సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహాన్ని ఐదేళ్లపాటు సేవలు అందించే విధంగా రూపొందించారు. సముద్ర ఉపరితల పరిశీలన కోసం ఈ ఉపగ్రహాన్ని ఉపయోగపడనుంది. అదేవిధంగా భూటాన్‌శాట్‌, ధృవస్పేస్‌కు…

Read More

ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు షాక్ తగిలింది. పెంబి ఎంపీపీ బుక్యా కవితా గోవింద్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ వేధింపులు భరించలేకనే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏడాది నుంచి ఎన్నో అవమానాలు ఎదురుకుంటూ వస్తున్నానని , ఎన్నోసార్లు తమపై కేసులు పెట్టారని.. జైలుకు పంపించారని కవిత భర్త ఆవేదన వ్యక్తం చేసారు. గత కొన్నాళ్లుగా ఎమ్మెల్యే రేఖానాయక్తో ఎంపీపీకి విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరు నచ్చకపోవడంతో కవిత గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. అటు ఎమ్మెల్యే రేఖానాయక్ తీరుతో ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఖాళీ అవుతోందని కవితా గోవింద్ వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం జెడ్పీటీసీ జానకి కూడా టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. కవిత సైతం బిజెపిలో చేరబోతున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టనున్నారు. భైంసా…

Read More