అక్రమ రవాణా భాదితులు తిరిగి మరలా అక్రమ రవాణాకు గురి కాకుండా వారి అవసరాలను తీర్చడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు సమన్వయoతో ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్ రాజేంద్ర సూచించారు. వ్యాపార లైంగిక దోపిడీ కోసం ట్రాఫికింగ్ నుండి కాపాడిన భాదితులను తిరిగి పూర్వ స్థితికి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషిస్తున్న కమ్యూనిటీ ఆధారిత పునరావాసంపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం అని పేర్కొంటూ ఇతర రకాల సమస్యలతో సహా పేదరికం సమాజంలోని బాలలు, మహిళలపై జరిగే అన్ని రకాల హింసలకు దారి తీస్తుందని హెచ్చరించారు. హెల్ప్, విముక్తి విజయవాడలో నిర్వహించిన “కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ (సీబీఆర్) పై విఎల్సిపిసి, పిఆర్ఐల సెన్సిటైజేషన్” రాష్ట్ర స్థాయి సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొంటూ ట్రాఫికింగ్, ఇతర రకాల హింస నుండి కాపాడినవారు ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాల ప్రయోజనాలతో సహా రాష్ట్ర…
Author: Editor's Desk, Tattva News
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు నిందితులుగా ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జరుగుతున్న విచారణ గురించి తప్పుగా నివేదించిన రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, జీ న్యూస్, టైమ్స్ నౌ చానల్స్కి ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ చానెల్‌లు ప్రసారం చేసే వార్తా నివేదికలను పరిశీలించి, ప్రసారాలు వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కోర్టుకు తెలియజేయాలని న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుపై తాము అందించే అన్ని నివేదికలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన “అధికారిక సమాచారం” ఆధారంగా మాత్రమే ఉన్నాయని నిర్ధారించాలని కోర్టు వార్తా చానెల్‌లను ఆదేశించింది. సింగిల్ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ జారీ చేసిన ఉత్తర్వు ప్రభావవంతంగా ఈ వార్తా చానెల్‌లు కేసుకు సంబంధించిన సోర్స్…
ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవినిఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా గుర్తించామని కేంద్ర సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ రాకూర్ ప్రకటించారు. చలన చిత్ర రంగానికి చిరంజీవి అందించిన సేవలకు గుర్తింపుగా జీవన సాఫల్య అవార్డు బహూకరిస్తామని ఠాకూర్ ప్రకటించారు. గోవాలో 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభ వేడుకల్లో ఠాకూర్ చిరంజీవికి జీవన సాఫల్య అవార్డు ప్రధానం చేస్తామని అన్నారు. చిరంజీవి నాలుగు శతాబ్దాలుగా చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. 150కి పైగా చిత్రాల్లో చిరంజీవి నటించారని ఠాకూర్ పేర్కొన్నారు. ‘ చిరంజీవి గుర్తింపు పొందిన భారతీయ నటుడు, డాన్సర్, చలన చిత్ర నిర్మాత, పరోపకారి, ఒక రాజకీయవేత్త. ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన చిరంజీవి హిందీ, కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించారు’ అని ఠాకూర్ వివరించారు. పద్మభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, నంది లాంటి అనేక అవార్డులను చిరంజీవి అందుకున్నారని…
అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా తిరిగి తెరుచుకుంది. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అల్లర్లను ప్రోత్సహించారంటూ, గతేడాది ఆరంభంలో నిబంధనల ఉల్లంఘన కింద ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. ట్విట్టర్ నిషేధంతో ట్రంప్ తాను సొంతంగా ట్రూత్ అనే సోషల్ మీడియా యాప్ ను తయారు చేసుకున్నారు. అప్పటి నుంచి ట్రూత్ సోషల్ మీడియా ద్వారానే తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విటర్ లోకి తిరిగి వచ్చేందుకు ట్రంప్ ఆసక్తిగా లేనట్టు చెప్పారు. రిపబ్లికన్ కొయిలిషన్ వార్షిక నాయకత్వ సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ తిరిగి ట్విట్టర్ లోకి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేశారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూపొందించిన ట్రూత్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తోందని, తాను దానికే పరిమితమవుతానని చెప్పారు.…
ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఈజిప్టులోని షరమ్ ఎల్‌షేక్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ విపత్తుల కారణంగా నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి మొట్ట మొదటిసారిగా సంపన్న దేశాలు అంగీకరించాయి. విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోతున్న పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధిని ఏర్పాటు చేయాలని భారత్‌తో పాటుగా పలు దేశాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇందుకోసం ఏటా ఏకంగా వంద బిలియన్ డాలర్లు వెచ్చిస్తామంటూ 2009లో సంపన్న దేశాలు చేసిన హామీని ఇప్పటికీ నిలుపుకోకపోవడంతో ఈ విషయంలో పలు దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. అలాగే పలు అంశాలపై ఏకాభిప్రాయం మృగ్యం కావడంతో వాస్తవానికి శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారం కూడా కొనసాగింది. అయినప్పటికీ పలు అంశాలపై…
న్యూజిలాండ్‌లోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ 20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత జట్టు మూడు టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. న్యూజిలాండ్ గడ్డపై మిస్టర్ 360 సూర్యకుమార్ 217.65 స్ట్రైక్ రేటుతో 51బంతుల్లోనే 111 సూపర్ సెంచరీ నమోదు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈక్రమంలో టి20ల్లో రెండో సెంచరీ నమోదుచేసిన సూర్య పొట్టి ఫార్మాట్‌లో రెండు శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. టి20ల్లో ఓ బ్యాటర్ రెండు సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం. ఇదే ఏడాది ఇంగ్లండ్‌పై 55బంతుల్లో 117పరుగులు చేసి సెంచరీ నమోదు…
కర్ణాటకలోని మంగళూరులో శనివారం పేలుడు కలకలం రేపింది. కంకనాడి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోరి సమీపంలో బిజీ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ ఆటో సడెన్ గా పేలిపోయింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా రోడ్డుపై ఇలా ఆటో పెద్ద శబ్దంతో పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆటోలో కుక్కర్ బ్లాస్ట్ గా పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటక దర్యాప్తు సంస్థలు ఆటో రిక్షాలో పేలుడు పదార్థాలు, గ్యాస్ బర్నర్ భాగాలతో కూడిన కాలిపోయిన ప్రెషర్ కుక్కర్‌ను కనుగొన్నాయి. కుక్కర్‌కు కాలిన బ్యాటరీల సెట్ కూడా జోడించబడింది, పరిశోధకులు అది టైమర్ లేదా ఇగ్నిషన్ పరికరం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తీరప్రాంత నగరంలో భయాందోళనలు సృష్టించేందుకు తక్కువ తీవ్రత కలిగిన పేలుడు ఉద్దేశించబడిందని, ప్రయాణీకుడే ప్రధాన అనుమానితుడు అని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్న కర్ణాటక పోలీసులు అక్టోబరు 23న కోయంబత్తూరు సిలిండర్…
గంగా యమునల సంగమం మాదిరి కాశీ తమిళ సంగమం పవిత్రమైనదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాశీ, తమిళనాడు.. సంస్కృతి, నాగరికతకు కాలాతీత కేంద్రాలని చెప్పారు. ఈ రెండు ప్రాంతాలు ప్రపంచంలోనే పురాతన భాషలైన సంస్కృతం, తమిళ్‌కు నిలయాలని వివరించారు. శనివారం వారణాసిలో కాశీ తమిళ సంగమాన్ని ప్రధాని ప్రారంభించారు. కాశీ, తమిళనాడు మధ్య విజ్ఞానం, ప్రాచీన నాగరికతతో కూడిన సంప్రదాయ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకవైపు కాశీ మన సాంస్కృతిక రాజధాని. దేశం మొత్తాన్ని కవర్ చేస్తుంది. మరోవైపు తమిళనాడు.. భారతదేశ ప్రాచీనత, గర్వానికి కేంద్రంగా ఉంది” అని చెప్పారు. తమిళ వారసత్వాన్ని కాపాడుకోవడం 130 కోట్ల మంది భారతీయుల బాధ్యతని, దీన్ని విస్మరిస్తే దేశానికి తీరని అపకారం చేసినట్లేనని ప్రధాని పేర్కొన్నారు. భాషాపరమైన విభేదాలను తొలగించుకోవాలని, భావోద్వేగాలతో కూడిన ఐకమత్యాన్ని ఏర్పరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని పురాతన భాషల్లో తమిళం ఒకటని చెబుతూ కానీ దాన్ని మనం పూర్తి స్థాయిలో గౌరవించుకోవడం లేదని విచారం వ్యక్తం…
మహిళలకు మహిళలే శత్రువులని, చదువుకున్న మహిళలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయా బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల తన మనుమరాలు నవ్య నవేలీ నంద పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కుమార్తెలను పెంచినట్లుగానే కుమారులను కూడా పెంచాలన్న వ్యాఖ్యలకు ఆమె ఈ విధంగా స్పందించారు. జయా బచ్చన్, ఆమె కుమార్తె శ్వేత బచ్చన్, మనుమరాలు నవ్య నవేలీ నంద పిల్లల పెంపకం గురించి మాట్లాడారు. నవ్య మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ కుమార్తెలను పెంచినట్లుగానే కుమారులను కూడా పెంచాలని చెప్పారు. జయ జోక్యం చేసుకుని చదువుకున్న మహిళలు కూడా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని, ఇది చాలా శోచనీయమని చెప్పారు. ఈ విషయాన్ని చెప్పాలని చాలాసార్లు అనుకున్నానని, అయితే బాగుండదని చెప్పలేదని తెలిపారు. శ్వేత మాట్లాడుతూ, తన తల్లి తన పట్ల అంత బాగా వ్యవహరించరని చెప్పారు. మహిళలు తమ తోటి మహిళలతో మంచిగా…
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డితో పాటు బినోయ్ బాబును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా శనివారం ఈడీ విచారణకు కనికా రెడ్డి హాజరయ్యారు. జెట్ సెట్ గోకు సంబంధించిన వివరాలను ఆమె అందజేసినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయిన కీలక నిందితుడు శరత్ చంద్రా రెడ్డి భార్య ఆమె . జెట్ సెట్ గో విమానాల్లో పెద్ద ఎత్తున డబ్బులు తరలించారన్న అనుమానంతో ఈడీ కనికారెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. బేగంపేట కేంద్రంగా ఈ పెద్ద ఎత్తున ముడుపులు చెల్లినట్లు తెలుస్తుంది. కాగా ఈ కేసులో వినయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి కస్టడీని మరో 5 రోజులు పెంచుతూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలా ఉండగా, తమ విమానాల్లో ఎప్పుడూ డబ్బు, మద్యం తరలించలేదని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంను తమ కంపెనీ విమానాలకు ముడిపెడుతూ నిరాధార కథనాలు తీసుకువస్తున్నారని, దీన్ని తాను గట్టిగా…