Author: Editor's Desk, Tattva News

నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో లోక్‌సభ ఎంపీ నవనీత్‌ రాణా, ఆయన తండ్రిపై ముంబై కోర్టు సోమవారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది.  అంతకుముందు కూడా నవనీత్ రాణా, ఆమె తండ్రికి వ్యతిరేకంగా కోర్టు సెప్టెంబర్‌లో కూడా వారెంట్ జారీ చేసింది.నాడు కోర్టు జారీ చేసిన పాత వారెంట్ కూడా ఇంకా అమలు కాలేదు.  ఈ వ్యవహారం సోమవారం విచారణకు రాగా అమరావతి ఎంపీ అయిన నవనీత్ రాణా, ఆమె తండ్రిపై వారెంట్‌ అమలుకు మరింత గడువు కావాలని పోలీసులు కోరారు.అయితే పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన ముంబయి కోర్టు.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నవనీత్‌ రాణాతో పాటు ఆయన తండ్రిపై తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. ఆ తర్వాత సర్వీస్ ఆఫ్‌ వారెంట్‌పై నివేదికను సమర్పించేందుకు కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా చేశారు. .ముంబైలోని ములుంద్…

Read More

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) వారికి విద్య, ఉపాధి కల్పనలో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించే 103వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు కాకుండా 3:2 నిష్పత్తిలో మెజారిటీ తీర్పును వెలువరించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఆ సవరణ ఉల్లంఘించడం లేదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయమై దాఖలైన మొత్తం 40 పిటిషన్లపై సోమవారం నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించింది. ధర్మాసనంలోని జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదీ, జస్టిస్‌ జేబీ పార్దీవాలా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు అనుకూలంగా తీర్పు చెప్పగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లలిత్‌తో పాటుగా జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌ ఆ రిజర్వేషన్‌ను తిరస్కరిస్తూ మైనారిటీ తీర్పు వెలువరించారు. 35 నిమిషాల వ్యవధిలో న్యాయమూర్తులు నాలుగు తీర్పులను కోర్టులో చదివి వినిపించారు. 2019లో తెచ్చిన ఆ సవరణ రాజ్యాంగ…

Read More

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సోమవారం అత్యున్నత పదవి నుంచి పదవీ విరమణ చేశారు. వాస్తవానికి జస్టిస్ లలిత్ మంగళవారం (ఈ నెల 8న) వరకూ పదవిలో కొనసాగే వీలుంది. అయితే.. మంగళవారం గురు నానక్ జయంతిని పురస్కరించుకుని సెలవు రావ‌డంతో ఆయన సోమవారమే పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 74 రోజుల పాటు విధుల్లో కొనసాగారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన 37 ఏండ్ల ప్రయాణం చాలా సంతృప్తినిచ్చిందని సీజేఐ జస్టిస్‌ లలిత్‌ తెలిపారు. పదవీ విరమణ సందర్భంగా సోమవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో లాయర్‌గా తన తొలి కేసును జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ బెంచ్‌ ముందు వాదించానని, ఇప్పుడు ఆయన కుమారుడు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు సీజేఐగా బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 27న 49వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌…

Read More

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసులో బెంగళూరు కోర్టులో చుక్కెదురైనది. కాపీరైట్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్‌, భారత్‌ జోడో యాత్రకు ప్రచారానికి వాడుతున్న ట్విట్టర్‌ హ్యాండిళ్లను తాత్కాలికంగా బ్లాక్‌ చేయాలని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ యాజమాన్యానికి కోర్టు ఆదేశించింది. రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో యాత్రకు సంబంధించిన ఒక వీడియోలో కేజీఎఫ్‌-2 సినిమా పాటను కాంగ్రెస్‌ వాడుకున్నదని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఎంఆర్టీ మ్యూజిక్‌ సంస్థ చేసిన ఫిర్యాదు చేసింది. హిందీలో కేజీఎఫ్‌-2 పాటల హక్కులను పొందేందుకు తాము పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఈ సంస్థ తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ ఫిర్యాదును విచారించిన బెంగళూరు కోర్టు ఇది ముమ్మాటికీ కాపీరైట్‌ నిబంధనల ఉల్లంఘనే అని నిర్ధారించింది. అయితే, తీవ్రమైన చర్యలు కాకుండా తాత్కాలికంగా బ్లాక్‌ చేయాలని ట్విట్టర్‌ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి కలిశారు. సోమవారం పార్టీ ఆఫీస్ కు వచ్చిన ఆమె తన భర్త ను బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ తరఫున సాయం అందించాలని కోరారు. తన భర్తపై పార్టీపరంగా విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఉషాబాయి మెదటసారి బీజేపీ కార్యాలయానికి వచ్చారు. తన భర్త హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నందు వల్లే తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందని ఈ సందర్బంగా ఆమె పేర్కొంది. కాగా, రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే బండి సంజయ్ లేఖ రాశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజాసింగ్‌కు సంబంధించిన కేసుల విషయంతో పాటు పార్టీకి వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు లీగల్ టీమ్స్‌తో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. రాజాసింగ్‌ ఇచ్చిన వివరణపై బీజేపీ హైకమాండ్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీపరంగా రాజాసింగ్ కు న్యాయ…

Read More

వంద మంది ఎమ్మెల్యేలను దించి 10 వేల ఓట్లతో గెలవడం గొప్పనా? అంటూ మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. మునుగోడు మునుగోడులో విజయం సాధించామంటూ టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, 10 వేల ఓట్లతో గెలవడం ఒక గెలుపేనా అని నిలదీశారు. ‘‘84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎంపీలను, మొత్తం పోలీసు వ్యవస్థను మునుగోడులో మొహరించారు. కేసీఆర్ రెండు సార్లు బహిరంగ సభలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని టీఆర్ఎస్ నాయకులు ప్రజలను బెదిరించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇన్ని చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని మాత్రమే టీఆర్ఎస్ సాధించింది” అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రలజకు అసంతృప్తి ఉందని మునుగోడు…

Read More

ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో చిట్టచివరకు విజయం కైవసం చేసుకున్నప్పటికీ అధికార టిఆర్ఎస్ వర్గాలు మాత్రం వచ్చిన 10 వెల పైచిలుకు ఆధిక్యత మాత్రం సంతృప్తి కలిగించడం లేదు. సుమారు 20 వేల మెజారిటీ వస్తుందని వేసుకున్న అంచనాలు తలకిందులు కావడంతో ఆత్మవలోకనంలో పడ్డారు. మెజారిటీ తగ్గడానికి ప్రధాన కారణం తమ ఎన్నికల గుర్తు కారును పోలిన పలు ఇతర గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంగా భావిస్తున్నారు. ఆయా గుర్తులను స్తంభింప చేయాలనీ రిటర్నింగ్ అధికారిని ముందే కోరినా ప్రయోజనం లేకపోయింది. ఇటువంటి గుర్తులకు సుమారు 6,000 ఓట్లు పడడంతో అవన్నీ తమ ఓట్లే అని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కారుగుర్తును పోలిన రోడ్డురోలర్‌, చపాతిరోలర్‌ గుర్తులు ప్రమాదకరంగా మారాయి. అభ్యర్థులెవరో తెలియకపోయినా వారికి పెద్ద మొత్తంలో ఓట్లు వచ్చాయి. ఈవిఎం 12వ నెంబర్‌లో ఉన్న మారమోని శ్రీశైలంయాదవ్‌ చపాతిరోలర్‌కు 2407 ఓట్లు, 14వ సంఖ్యలోని కె.శివకుమార్‌ రోడ్డురోలర్‌ గుర్తుకు 1874 ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా…

Read More

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారం లోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఈమేరకు సిమ్లాలో జరిగిన ‘బీజేపీ సంకల్ప్ పాత్ర 2022’ కార్యక్రమంలో 11 పాయింట్ల మేనిఫెస్టోను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. ఉమ్మడి సమాజం, యువత, రైతులకు సాధికారత , తోటల పెంపకానికి చేయూత, ప్రభుత్వ ఉద్యోగులకు తగిన న్యాయం, పర్యాటకానికి మరింత ఊతమివ్వడమే లక్షంగా మేనిఫెస్టోని రూపొందించామని ఆయన చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో వాగ్దానం చేయని లక్షాలను కూడా బీజేపీ సాధించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం బీజేపీ పని చేస్తుందని, ప్రలోభాలకు, ఉచితాలకు తమ పార్టీ వ్యతిరేకమని నడ్డా చెప్పారు.…

Read More

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్‌ ఆధారితంగా పనిచేసే ఫోన్లకే ఇది పరిమితమైంది. అదికూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉన్నది. ప్రీమియం సర్వీసులు నెల రోజుల్లో భారత్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సేవలను మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని, అన్ని డివైజ్‌లకు అందుబాటులోకి తెస్తామని సంస్థ వెల్లడించిండింది. అయితే ఈ సేవలను పొందాలంటే నెలకు 7.99 అమెరికన్‌ డాలర్లు చెల్లించాల్సిందే. ప్రస్తుతానికి ఐఓఎస్‌ ఆధారితంగా పనిచేసే ఆపిల్‌ ఐ ఫోన్లలో మాత్రమే ఈ బ్లూటిక్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ట్విట్టర్‌ టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత సంస్కరణలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఖర్చులను తగ్గించుకోవడానికి సగం మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఇక ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి చెల్లింపుల ప్రాతిపదికన బ్లూటిక్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్నింటిని త్వరలో…

Read More

దేశవ్యాప్తంగా 7 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో గెలుపొందడం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ప్రజలు చూపిన అభిమానానికి కొలమానం అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ తెలిపారు. గతంలో 3 స్థానాలకు అదనంగా మరో సీటు బీజేపీ గెలుచుకుందని చెప్పారు.  బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని, హర్యానాలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ 3 సిట్టింగ్ స్థానాలను కోల్పోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పతనానికి ఇది నిదర్శనం అని స్పష్టం చేశారు. ఆ పార్టీ దేశంలో కనుమరుగవుతోందని చెబుతూ మునుగోడు కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని గుర్తు చేశారు.  బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేడీ ఏకమైనా ఓడించలేకపోతున్నాయని డా. లక్ష్మణ్ తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో సర్కస్ ఫీట్లు చేసినా జనం నమ్మడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ముక్త్…

Read More