Author: Editor's Desk, Tattva News

చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) 20వ మహాసభలు శనివారంతో ముగియడంతో వరుసగా మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షునిగా ఎన్నిక కావడానికి రంగం సిద్ధం చేసుకున్న జిన్‌పింగ్‌ మావో తర్వాత ఆ దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన్నట్లయింది. ఆయన మరోసారి ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే. ఇప్పటి వరకు మావో తరవాత ఎవ్వరు మూడోసారి ఎన్నిక కాలేదు. వారం రోజులుగా జరుగుతున్న సీపీసీ సమావేశాలు శనివారం ముగింపు దశలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీనీ, ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్న జిన్‌పింగ్‌కి మూడోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి నేడు పార్టీ కేంద్రకమిటీ, పోలిట్‌ బ్యూరోలు ఆమోదముద్ర వేస్తాయి. మావో తర్వాత అంత బలవంతుడైన నాయకునిగా జిన్‌పింగ్‌ పార్టీ ప్రశంసలు అందుకుంటున్నారు. 25 మంది సభ్యులు గల పోలిట్‌ బ్యూరోని పార్టీ కేంద్ర కమిటీ పునర్వ్యవస్థీకరించింది. ఈ బ్యూరో అత్యధికులు జిన్‌పింగ్‌ ఆంతరంగికులు. ఆదివారం ఉదయం కేంద్ర కమిటీ సమావేశం…

Read More

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3  రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.  ఎల్‌వీఎం3-ఎం2/వన్‌వెబ్ ఇండియా-1 మిషన్ విజయవంతంమైందని, 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం 19 నిమిషాల్లోనే ముగిసింది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ప్రైవేట్‌ శాటి‌లైట్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ కంపెనీ అయిన వన్‌‌వె‌బ్‌కి చెందిన 36 బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా నిగిలోకి పంపించారు. యూకేకి చెందిన ఈ ఉపగ్రహాలన్నీ కలిపి 5,200 కిలోల వరకు బరువు ఉంటాయి. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించడంతో యూకేకి చెందిన  గ్రౌండ్‌స్టేషన్‌ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి…

Read More

భారత దేశ మాజీ ప్రధాని  పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాలలో మొదటి సారిగా ఆస్ట్రేలియాలోని  సిడ్నీ స్ట్రాత్ ఫీల్డ్ లో ఆవిష్కరించారు. భారత ప్రధానులుగా పనిచేసిన వారి విగ్రహాలు విదేశాలలో ఆవిష్కరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అదే  విధంగా మహాత్మా గాంధీ తర్వాత భారత నేతల విగ్రహాలు విదేశాలలో నెలకొల్పడం కూడా ఇదే మొదటిసారి.  శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్ ఫీల్డ్ హోంబుష్ కమ్యూనిటీ సెంటర్లో స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహాన్ని స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆవిష్కరించారు. స్ట్రాత్ ఫీల్డ్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహావిష్కరణ ఉత్సవాలను జ్యోతి వెలిగించి, భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో ప్రారంభించారు.  ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం చేసిన  పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిటీ కన్వీనర్ మహేష్ బిగాల సీఎం…

Read More

ప్రముఖ టెలికాం సంస్థ జియో మరో రెండు నగరాల్లో 5జీ ట్రయల్‌ సేవలను ప్రారంభించింది. రాజ స్థాన్‌లోని సథాద్వారాతో పాటు, చెన్నయ్‌లోనూ 5జీ సేవలను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జియో ఛైర్మన్‌ అకాష్‌ అంబానీ తెలిపారు. దేశంలోనే 5జీ వైఫై సేవలను మొదటిసారిగా నథాద్వారా నుంచి ఆకాష్‌ అంబానీ ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లి, ముంబై, కోల్‌కతా, వారణాశిలో 5జీ బీటా ట్రయల్స్‌ను జియో నిర్వహిస్తోంది. తాజాగా చెన్నయ్‌, నథాద్వారాలోనూ ఈ సేవలను ప్రారంభించారు. త్వరలోనే దేశమంతా 5జీ సేవలు ప్రారంభిస్తామని అకాష్‌ అంబానీ తెలిపారు. రిలయన్స్‌ జియో ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన తొలిసారిగా 5జీ సేవల గురించి మాట్లాడారు. రాజస్థాన్‌లోని నథాత్వారా లోని శ్రీనాథ్‌ జీ అలయాన్ని ముఖేష్‌ అంబానీ తరచుగా సందర్శిస్తుంటారు. గత నెలలో ఈ అలయాన్ని సందర్శించిన సందర్భంగా త్వరలోనే ఇక్కడ 5జీ సేవలు ప్రారంభిస్తామని ముఖేష్‌ అంబానీ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు ఆయన…

Read More

భద్రాద్రి రాములవారి భూములు కబ్జా చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. రెండవ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాములవారి 917 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ లో యదేచ్చగా కబ్జాకు గురవుతోందని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని పరిషత్ తప్పు పట్టింది. రాముల వారి భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై, దేవాదాయశాఖపై ఉందని స్పష్టం చేసింది. కానీ ఈ విషయాన్ని విస్మరించి ఆంధ్ర ప్రదేశ్ లోని వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జా చేశారని వినోద్ కుమార్ మాట్లాడటం సిగ్గుచేటని మండిపడింది. తెలంగాణ ఆస్తిని, శ్రీ రాముల వారి అస్తిత్వాన్ని ఇతరులు కబ్జా చేస్తుంటే కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, సహకార్యదర్శి బాను ప్రసాద్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఓ ప్రకటనలో నిలదీశారు. భద్రాద్రి…

Read More

దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రిక్రూట్ మెంట్ డ్రైవ్ రోజ్ గార్ మేళాని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభిస్తూ భారతదేశం స్వావలంబన మార్గంలో ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ వేడుకలో కొత్తగా చేరిన 75,000 మంది నియామక పత్రాలను అందజేసిన‌ట్టు తెలిపారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందనీ, ఎనిమిదేళ్లలో దేశం 10వ స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింద‌ని ప్రధాని గుర్తు చేశారు. భారతదేశం.. యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించి ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచిందని తెలిపారు. త్వ‌ర‌లోనే భార‌త్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతుంద‌ని అంచ‌నాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. గత ఏడు-ఎనిమిదేళ్లలో ఆర్థిక వృద్ధికి అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగించడం వల్ల ఇది సాధ్యమైందని రోజ్‌గార్ మేళా కోసం నిర్వ‌హించిన‌ వర్చువల్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ చెప్పారు. అనేక పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నేడు ద్రవ్యోల్బణం,…

Read More

పేద ప్రజల గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపుతామని మునుగోడు ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని రామాలయం చౌరస్తావద్ద  జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తాను మాట్లాడడానికి ఏమీ లేదని, తాను ఏది చేసినా కూడా చేతలతోనే చేసి బొంద పెడతా అని చెప్పారు.  తన రాజీనామా దెబ్బకు ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ మునుగోడు కు వచ్చిండని పేర్కొంటూ  నమ్మించే తెలివితేటలు కొన్ని రోజులవరికే నడుస్తాయని, ఆ తర్వాత ఎవరు నమ్మరని తెలిపారు.  బిజెపి అంటే ఒక యుద్ధ నౌక,  ఒక బండి సంజయ్, ఒక రఘునందన్ రావు, ఒక రాజాసింగ్ లాంటి క్షిపణలు ఉన్న యుద్ధ నౌక అని హెచ్చరించారు.  కెసిఆర్ కు అహంకారం ఎక్కువై తనను ఎవరు ప్రశ్నించొద్దనే ఉద్దేశంతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడని గుర్తు చేస్తూ  ఆ రోజు నుంచి తాను…

Read More

ఉత్తరాఖండ్‌ హెలికాప్టర్‌ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్‌ కుప్పకూలింది. అరుణా చల్‌ప్రదేశ్‌లో ఓ మిలటరీ విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.  దీంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారు.  వీరిలో ఇద్దరు పైలట్లు. రోజువారి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కూడా ఐదుగురితో బయలుదేరిన ఈ హెలికాప్టర్‌ అప్పర్‌ సియాంగ్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కూలిపోయింది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ఐదుగురి కోసం రెస్క్యూ టీమ్స్‌ తీవ్రంగా గాలించవలసి వచ్చింది.  ఆర్మీ నడుపుతున్న  అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్  ఎగువ సియాంగ్‌ జిల్లాలోని ట్యుటింగ్ ప్రాంతంలో కుప్పకూలిందని పేర్కొన్నారు.   శుక్రవారం ఈ ఘటన జరిగిందని, సహాయక సిబ్బందిని ఘటనా స్థలికి పంపినట్లు  వెల్లడించారు.   హెలికాప్టర్‌ క్రాష్‌ అయిన ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో రెస్క్యూ టీమ్స్‌ అక్కడికి చేరుకోవడం…

Read More

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై దేశ ఎన్నికల సంఘం వేటేసింది. ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయరాదు, ఏ పదవిని చేపట్టడానికి వీల్లేదు. ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ నేతల నుంచి ఆయన అందుకున్న విలువైన కానుకల విక్రయ సంబంధిత తోషాఖానా కేసు సంబంధించి ఎన్నికల సంఘం ఈ తీవ్ర చర్య తీసుకుంది. ఈ కానుకల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాచి పెట్టారని ఇమ్రాన్‌పై అభియోగాలు ఉన్నాయి. ఎన్నికల ప్రధానాధికారి సికందర్ సుల్తాన్ రజాతో కూడిన నలుగురు సభ్యుల ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా ఇమ్రాన్‌పై అనర్హత నిర్ణయం తీసుకుని దీనిని అధికారికంగా వెలువరించింది. ఇప్పటి ఈ అసాధారణ నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్ దేశంలో ఎన్నికలలో పోటీ చేసే వీలుండదు. తనకు వచ్చిన కానుకల విక్రయం విషయంలో ప్రధాని హోదాలో ఇమ్రాన్ అత్యంత దారుణ రీతిలో వ్యవహరించారని, అక్రమ పద్ధతులకు పాల్పడ్డారని, అధికారిక అమ్మకాలలో వీటిని తక్కువ ధరకు తాను తీసుకోవడం…

Read More

టీడీపీ మాజీ మహిళా నేత, సినీ నటి దివ్యవాణి త్వరలో బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తున్నది. కొద్దీ రోజులగా తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం నడుస్తుంది. సినీ తారలతో పాటు ఇతర పార్టీ నేతలు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. బిజెపి అధిష్టానం సైతం సినీ స్టార్స్ ఫై కూడా ఫోకస్ చేసింది.  ఇప్పటికే సినీ స్టార్స్ జీవిత రాజశేఖర్ , విజయశాంతి తో పాటు పలువురు పార్టీలో ఉన్నారు.  కాగా..ఇక ఇప్పుడు టీడీపీ మాజీ మహిళా నేత దివ్యవాణి సైతం బిజెపి లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దివ్యవాణి కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాల్సిందిగా దివ్యవాణిని ఈటల ఆహ్వానించారు. దీంతో బీజేపీలో చేరేందుకు ఆమె సిద్దమైనట్లు అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. తాజాగా ఆమె బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె . లక్ష్మణ్‌ను కలవడంతో దివ్యవాణి…

Read More