Author: Editor's Desk, Tattva News

అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్, ఆ అరెస్ట్ ను నిరసిస్తూ నిరసనకు దిగిన జర్నలిస్టులు వంశీ కృష్ణ, కృష్ణాంజనేయులు తదితరులను అరెస్ట్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని అంకబాబు తమ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే తప్పేముందని ప్రశ్నించిన పవన్ ఈ ఘటనపై ప్రభుత్వం ఇంతగా రియాక్ట్ అయ్యిందంటే అందులో ఏదో మతలబు దాగుందని స్పష్టం చేశారు. అరెస్టు, కుట్రపూరిత నేరం కింద సెక్షన్ల నమోదు చూస్తుంటే..జగన్‌ ప్రభుత్వం ఉలిక్కిపడుతుందని అనిపిస్తోందని తెలిపారు. అసలు అంకబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనే లేదని కూడా పవన్ ఆరోపించారు. సింగిల్…

Read More

ఇస్లామిక్‌ సంస్థ అయిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పిలుపునిచ్చిన హర్తాళ్‌ హింసాత్మక సంఘటనలకు దారితీయడంతో కేరళలో ఉద్రిక్తంగా మారింది. తిరువనంతపురం, కొల్లాం, కొజికోడ్‌, వయనాడ్‌, అలప్పుజ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. ఆందోళన కారులు బస్సులపై రాళ్లు రువ్వారు. ఉదయం వార్తాపత్రికలను తీసుకెళ్తున్న ఓ వాహనంపై పెట్రోల్‌ బాంబుతో దాడి చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలప్పుజలో బస్సులతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 15 ఏళ్ల బాలిక, ఆటోడ్రైవర్‌కి తీవ్రగాయాలైనట్లు కేరళ పోలీసులు తెలిపారు. పోలీసులకు కూడా గాయాలైనట్లు వివరించారు. పిఎఫ్‌ఐ ధర్నాను కేరళ హైకోర్టు సుమోటుగా స్వీకరించింది. పిఎఫ్‌ఐ మెరుపు సమ్మెను కేరళ హైకోర్టు ఖండించింది. సమ్మె కారణంగా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గాను ఏడు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలన్న 2019 నాటి ఉత్తర్వులను పిఎఫ్‌ఐ ఉల్లంఘించిందని కోర్టు మండిపడింది. పిఎఫ్‌ఐ సమ్మె పిలుపు కోర్టు ధిక్కరణేనని జస్టిస్‌ ఎ.కె. జయశంకరణ్‌…

Read More

మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. కేసీఆర్ ఖేల్ కాబోతోందని, ఆయన దుకాణం బంద్ ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ తో లడాయికి సిద్ధమయ్యామని, ఎంఐఎతో కలిసి వచ్చినా బల ప్రదర్శనకు సిద్ధమని సవాల్ విసిరారు. నాల్గవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా పెద్ద అంబర్ పేట సమీపంలోజరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ అక్టోబర్ 15 నుండి 5 విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నట్లు ప్రకటించారు.  ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నం గా మారుస్తామని వెల్లడించారు. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ రాజకీయం చేస్తుండని ధ్వజమెత్తారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడగొట్టే ప్రయత్నం చేసాడని గుర్తు చేశారు. చేనేత కార్మికులను, గౌడ కులస్తులను, యాదవులు.. ఇలా అన్ని కులాలను నిర్వీర్యం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు.  పాదయాత్రను…

Read More

దాదాపు రూ.3 వేల కోట్ల నిధుల కేటాయింపుతో రాజమహేంద్రవరం వద్ద ఎనిమిది  ఫ్లైఓవర్లకు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ శంకుస్థాపన చేశారు.  గ‌తంలో రాజ‌మండ్రి వ‌చ్చిన‌ప్పుడు ఇచ్చిన హామీని నెర‌వేరుస్తున్నామ‌ని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. జాతీయ రహదారి నంబర్‌ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్‌, ఉండ్రాజవరం జంక్షన్‌, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. అలాగే, వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్‌, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్‌ హైవేపై 4 లేనింగ్‌, రంపచోడవరం నుంచి కొయ్యూరి వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్య రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. ‘అమెరికా ధనిక దేశం అవడం…

Read More

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ముస్లిం మత పెద్దలతో భేటీ అయ్యారు. సంఘ్ ప్రచారక్ లు రామ్ లాల్, నందగోపాల్, ఇంద్రేష్ కుమార్ లతో కలిసి కస్తూర్బా గాంధీ మార్గ్లోని మసీదుకు వెళ్లిన ఆయన ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వారి రహస్య సమావేశం సాగింది. ఉమర్ అహ్మద్ ఇల్యాసీని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘‘నా ఆహ్వానం మేరకు మోహన్ భగవత్ గారు నాతో సమావేశమయ్యారు. ఆయన జాతి పిత, జాతి రుషి; ఆయన సందర్శనతో ఓ మంచి సందేశం వెళ్తుంది. మేం దేవుడిని ఆరాధించే విధానాలు వేర్వేరు, అయినప్పటికీ అతి పెద్ద మతం మానవత్వమే. దేశానికే పెద్ద పీట అని మేం విశ్వసిస్తున్నాం’’ అని ఇల్యాసీ అన్నట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. అయితే వెంటనే వివరణ ఇస్తూ…

Read More

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. గురువారం పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు అక్కడి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో డ్రైవర్‌ దస్తగిరి, ఆయన భార్య షబానాను ప్రశ్నిస్తున్నారు. సీబీఐ అధికారులను బెదిరిస్తున్నందున విచారణ ఆలస్యమవుతున్నదని, అందుకుగాను కేసు విచారణను ఇతర రాష్ట్రంలోని కోర్టుకు బదిలీ చేయాలని వివేకానంద కుమార్తె డా. సునీత ఇటీవల సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చారు. పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు ఇప్పటకే అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరిని విచారించారు. గతంలో సీబీఐ, ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్‌ ఎదుట కీలక సమాచారం దస్తగిరి వెల్లడించినట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే, ఆయన భార్య షబానాను కూడా అధికారులు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరోసారి సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చినట్లుగా తెలుస్తున్నది. గత…

Read More

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నిషేధం నవంబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ జారీ చేశారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ, బ్యానర్ల ఉత్పత్తి, దిగుమతితోపాటు ముద్రణ, వినియోగం, రవాణ, ప్రదర్శనలపై కూడా నిషేధం ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, హెల్త్‌ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు.. నిషేధం అమలుకు బాధ్యత వహించాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వినియోగించకుండా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, పంచాయతీ అధికారులు, గ్రామ సచివాలయాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నవంబర్‌ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలు అమలులోకి రానున్నాయి.…

Read More

మయన్మార్‌లో అక్రమ నిర్బంధంలో బాధలు పడుతున్న దాదాపు 300 మంది భారతీయులను రక్షించేందుకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అభ్యర్థించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఆ 300 మంది భారతీయుల్లో దాదాపు 50 మంది తమిళులు ఉన్నారని వివరించారు. ఐటి సంబంధ ఉద్యోగాల కోసం ప్రయివేట్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీల ద్వారా వీరంతా మొదట థాయ్‌లాండ్‌కు వెళ్లగా అక్కడ నుంచి వారిని బలవంతంగా మయన్మార్ తీసుకెళ్లి ఆన్‌లైన్‌లో అక్రమ ఉద్యోగాలు చేయిస్తున్నారని స్టాలిన్ లేఖలో తెలిపారు. ఈ అక్రమ ఉద్యోగాలకు తిరస్కరిస్తే ఆయా యాజమాన్యాలు భౌతిక దాడులకు దిగుతున్నారని అక్కడ నుంచి వార్తలు వస్తున్నాయని స్టాలిన్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న వారిలో 17 మంది తమిళులతో తాము ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని, వారు భారత ప్రభుత్వం త్వరగా జోక్యం చేసుకుని రక్షించాలని…

Read More

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన, యువతను ఆకట్టుకొని వారికి శిక్షణ ఇవ్వడం చేస్తున్నట్లు వెల్లడి కావడంతో పిఎఫ్ఐ లక్ష్యంగా దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తుంది. 10 రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. కేరళ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తున్నది. ఎన్‌ఐఏ, ఈడీ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో వివిధ నేరాలతో సంబంధాలున్న 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. 200 మందికిపైగా ఎన్‌ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, పలువురు కార్యకర్తల ఇండ్లలో సోదాలు జరుపుతున్నారు. రెండురోజుల క్రితం నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో దాడులు నిర్వహించిన ఎన్‌ఐఏ తాజాగా హైదరాబాద్‌, కరీంనగర్‌లో సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలోని పీఎఫ్‌ఐ కార్యాలయాన్ని అధికారులు సీజ్‌ చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి…

Read More

సోలర్‌ ప్లాంట్ల కోసం రూ.19,500 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు పిఎల్‌ఐ స్కీమ్‌ తీసుకొచ్చింది. అలాగే పిఎల్‌ఐ స్కీమ్‌ కిందకు సోలార్‌ ప్యానెళ్లను తెచ్చారు. సెమీ కండక్టర్ల అభివృద్ధి, డిస్‌ప్లే తయారీ ఎకోసిస్టమ్‌ సంబంధి కార్యక్రమానికి కూడా కేంద్ర మంత్రి ఆమోదం తెలిపింది. నూతన రవాణా విధానానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రవాణా సేవల సామర్థ్యం మెరుగుదల కోసం ఏకీకృత లాజిస్టిక్స్‌ ఇంటర్‌ ఫేస్‌ ప్లాట్‌ఫారం, ప్రమాణీకం, పర్యవేక్షణ వ్యవస్థ, నైపుణ్యాభివృద్ధి అంశాలకు నూతన విధానంలో ప్రాధాన్యత ఉంటుందని కేంద్రం తెలిపింది. 2030 నాటికి టాప్‌ 25 దేశాల్లో చేరేలా లాజిస్టిక్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్‌ మెరుగుపరుచుకునే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. వస్తువులు దేశవ్యాప్తంగా అంతరాయాలు లేకుండా రవాణా అయ్యే విధంగా చేయడం…

Read More