ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ విజృంభించింది. అన్ని విభాగాల్లో రాణించి పాక్‌ను చిత్తు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో లక్ష్య చేధనకు దిగిన భారత్ ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించింది. నషీమ్ షా వేసిన తొలి ఓవర్ రెండో బంతికే కెఎల్ రాహుల్ డకౌటయ్యాడు. ఇదే ఓవర్‌లోనే విరాట్ కోహ్లి డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆఫ్‌సైడ్ వేసిన బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డర్ వదిలేయడంతో కోహ్లి బతికిపోయాడు. తొలి ఓవర్ ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోయి మూడు పరుగులు మాత్రమే చేసింది. తరువాత విరాట్ కొంచెం సేపు దాటిగా ఆడ్డంతో ఏడు ఓవర్లకు భారత్ 41 పరుగులు చేసింది. అయితే తరువాత ఓవర్‌లోనే రోహిత్ శర్మ (12)ను మహమ్మద్ నావాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇదే బౌలర్ 10వ ఓవర్ తొలి బంతికి దాటిగా ఆడుతున్న కోహ్లి (35…
Author: Editor's Desk, Tattva News
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రసారం చేయడమే కాకుండా ఆకాశవాణి, దూరదర్శన్ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్ర సమాచార ప్రసార, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్. ఎల్.మురుగన్ సూచించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా యూనిట్ల సమీక్ష సమావేశాన్ని జమ్మూలో నిర్వహిస్తూ గ్రామీణ ప్రజలను చేరుకోవడానికి రేడియో అత్యుత్తమ ప్రసార సాధనం గా ఉంటుందని చెప్పారు. ఖాదీ వినియోగం ఎక్కువ చేయడానికి, ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి ఉపకరించే కార్యక్రమాలను ప్రసారం చేయాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, జమ్మూ కాశ్మీర్, లడఖ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విభాగాలు, వాటి ఫీల్డ్ యూనిట్లతో కలిసి నిర్వహిస్తున్న మీడియా కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలపై జమ్మూ కాశ్మీర్ ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌదరి పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ప్రసారం అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని డాక్టర్…
గణేష్ భక్తులకు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని సంకీర్ణ ప్రభుత్వం గణేష్ ఉత్సవాల కోసం రోడ్డు మీదుగా స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు టోల్ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి ఈ టోల్ ఫ్రీ అమలు లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం గణేశోత్సవాలలో పాల్గొనేందుకు ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముంబై బెంగళూర్ రహదారి, ముంబై గోవా రహదారులతోపాటు ఇతర పీడబ్లుడీ రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలకు ఈనెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టోల్ మాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి షిండే ప్రకటించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సార్వజనిక గణేశోత్సవ మండళ్లు, ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. అలంకరణ పనులకు కూడా చాలా తక్కువ స్ధాయిలో ఖర్చు చేశారు. కానీ ఈసారి…
తన భార్యపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై రూ 100 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేసి, కోర్ట్ సమన్లు పంపించిడంతో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మతో ఏర్పడిన వివాదం ఇప్పుడు పరస్పరం ట్వీట్ లలో తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడంకు చేరింది. అస్సాం, ఢిల్లీ ముఖ్యమంత్రుల మధ్య రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి మూడు, నాలుగు రోజులుగా ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. అస్సాంలో కొన్ని పాఠశాలలను మూసేశారని వచ్చిన వార్తలపై స్పందిస్తూ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 2007లో ఇచ్చిన ఎన్నికల హామీని గుర్తు చేశారు. దేశ రాజధాని నగరం ఢిల్లీని లండన్, పారిస్ నగరాల మాదిరిగా మార్చుతానని వాగ్దానం చేశారు కదా? గుర్తు లేదా కేజ్రీవాల్ గారూ అని ప్రశ్నించారు. “మీరు ఏమీ చేయలేకపోవడంతో ఇప్పుడు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని…
టిక్‌టాక్ నటి, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ (42) అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని గోవా ముఖ్యమంత్రి అరవింద్ సావంత్ తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తనతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడినట్టు వెల్లడించారు. లోతైన విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. ఫోగాట్ కుటుంబం సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా తనతో ప్రస్తావించారని చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆదివారం అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత కేసును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని తెలిపారు. ఇప్పటికే గోవా పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారని పేర్కొన్నారు. గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్ గత సోమవారం అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టమ్ నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు…
ఆర్థిక మంత్రిత్వ శాఖ చేపడుతున్న ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాల ద్వారా సామాజికంగా నిరాదరణకు గురైన, ఇన్నేళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా మాత్రమే దేశంలో సమానమైన, సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. “జన్‌ధన్ ఖాతాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్లు (డీబీటీ) పెరిగాయి. రూపే కార్డ్‌ల వాడకం ద్వారా డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేశాం. ప్రతి కుటుంబమే కాదు ప్రతి ఒక్కరికీ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫలాలు అందాయి” అని ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. 2022 ఆగస్టు 10వ తేదీ నాటికి మొత్తం పిఎంజెడివై ఖాతాల సంఖ్య : 46.25 కోట్లు; 55.59% (25.71 కోట్లు) జన్-ధన్ ఖాతాదారులు మహిళలు; 66.79% (30.89 కోట్లు) గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ఖాతాలేస్కీమ్ ప్రారంభించిన ఏడాదిలోనే ప్రారంభమైన పిఎంజెడివై ఖాతాలు 17.90 కోట్లుపిఎంజెడివై కింద నిరంతరాయంగా పెరుగుతున్న ఖాతాలుపిఎంజెడివై ఖాతాల సంఖ్య 2015 మార్చిలో 14.72 కోట్ల నుంచి 10-08-2022 నాటికి 46.25 కోట్లకు పెరుగుదల; ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో నిస్సందేహంగా అద్భుతమైన ప్రయాణంపిఎంజెడివై ఖాతాల్లో మొత్తం నగదు డిపాజిట్ బ్యాలెన్స్ రూ.1,73,954 కోట్లుడిపాజిట్లలో 7.60 రెట్లు, ఖాతాల్లో 2.58 రెట్లు వృద్ధి…
దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మృతి కేసులో విచారణ ఐదేళ్లకు ముగిసింది. శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విచారణ జరిగిన కమీషన్ కు నేతృత్వం వహించిన ఆర్ముగ స్వామి 600 పేజీల నివేదికను సమర్పించారు. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అలాగే, ఈనెల 29వ తేదీన మంత్రి వర్గం భేటీ కావాలని నిర్ణయించారు. 2016 డిసెంబర్ 5న అప్పటి సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్ 24న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్‌ను ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుంచి∙విచారణను ఆర్ముగ స్వామి కమిషన్ ప్రారంభించింది. ఐదేళ్ల పాటుగా సాగిన విచారణకు అనేక అడ్డంకులు తప్పలేదు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య…
బీజేపీనాయకురాలు, నటి సోనాలీ ఫోగట్‌ది హత్యేనని గోవా పోలీసులు తేల్చారు. ఆమె తాగిన డ్రింక్‌లో ప్రమాదకరమైన కెమికల్‌ను కలిపినట్లు వెల్లడించారు. సోనాలీతో పాటు వెళ్లిన వాళ్లే ఈ పనిచేశారని, డ్రింక్‌లో కెమికల్ కలపడం సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వివరించారు. దీంతో సోనాలీ అసిస్టెంట్లు సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆగస్టు 22న సోనాలీతో కలిసి గోవా టూర్‌కు వెళ్లినట్లు, అంజునా ఏరియాలోని కర్లీస్ రెస్టారెంట్‌లో దిగినట్లు వారు చెప్పారు. అదే రోజు రాత్రి రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్నామని, సోనాలీ తాగిన డ్రింక్‌లో ప్రమాదకరమైన కెమికల్‌ను కలిపినట్లు వారు ఒప్పుకున్నారు. సోనాలీ స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో బాత్రూమ్‌కు తీసుకెళ్లినట్లు వివరించారు. ఉదయం ఆమెను హాస్పిటల్‌కు తరలించగా, గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా మొదట కేసు నమోదు చేసుకున్నారు. అయితే, పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె శరీరంపై…
కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ త్వరలోనే కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టనున్నారు. ఆజాద్ కొత్త పార్టీ పెడతారని, దీనిపై రెండు వారాల్లో ప్రకటన చేస్తారని ఆయన అనుచరుడు జీఎం సరూరీ వెల్లడించారు. ముందుగా జమ్మూకాశ్మీర్ లో పార్టీ పెడతారని, ఆ తర్వాత జాతీయ స్థాయి పార్టీపై ఆలోచన చేస్తారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత మొదటగా సెప్టెంబర్ 4న ఆజాద్ జమ్మూకు వస్తారని, కొత్త పార్టీ ఏర్పాటుపై మద్దతుదారులతో చర్చిస్తారని ఆయన చెప్పారు. ఆజాద్ ది సెక్యులర్ భావజాలమని, ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసి పని చేయరని ఆయన స్పష్టం చేశారు. ఆజాద్ కాంగ్రెస్ ను వీడడంతో ఏం చేయాలో అర్థం కాక, ఆయనపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ఆజాద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పాలనాకాలం స్వర్ణయుగం లాంటిది. ఇప్పుడాయన తిరిగి జమ్మూ కాశ్మీర్ కు…
మహారాష్ట్రలోని యరవాడ కేంద్ర కార్యాలయం ఖైదీలు తయారుచేసిన పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యరవాడ జైలు ఖైదీలు వినాయక విగ్రహాలు తయారుచేయడం ఇదే మొదటిసారని, వీరు తయారు చేసిన వినాయక మట్టి విగ్రహాలను జైలు ఇండస్ట్రీ రిటైల్ షాపులో అమ్మకానికి ఉంచామని జైలు అధికారులు తెలిపారు. యరవాడ జైలు ఖైదీలు తయారుచేసిన వుడెన్ ఫర్నీచర్, కార్పెట్లు, టవల్స్, చెప్పులు, కళాకృతులు, వస్త్రాలను కూడా రిటైల్ షాపులో ప్రదర్శనకు ఉంచినట్లు వారు చెప్పారు. ప్రతి ఏడాది నాసిక్ సెంట్రల్ జైలు ఖైదీలు వినాయక విగ్రహాలు తయారుచేస్తారని, కాని ఈ ఏడాది మొట్టమొదటిసారి యరవాడ కేంద్ర కారాగారంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ ప్రారంభించామని వారు తెలిపారు. ఇందుకోసం నాసిక్ జైలుకు చెందిన విగ్రహాల తయారీ తెలిసిన ఇద్దరు ఖైదీలను ఇక్కడకు రప్పించామని వారు వివరించారు. విగ్రహాల తయారీపై యరవాడ జైలుకు చెందిన 15 మంది ఖైదీలకు వారు…