ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ శాసనసభ్యత్వం చెల్లదని రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ ప్రకటించే అవకాశం ఉండడంతో, ఆ రాష్ట్రంలోని అధికార జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభంకు గురవుతున్నది. తమ ఎమ్యెల్యేలను ఆకట్టుకొని, తమ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నం జరగవచ్చని భయంతో ఎమ్యెల్యేలను రిసార్ట్ లకు తరలించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అధికారంలో ఉన్న సంకీర్ణ పక్ష ఎమ్మెల్యేలు శనివారం మూడు బస్సులలో రాష్ట్ర రాజధాని రాంచికి 30 కిమీ దూరంలో గల ఖుంతికి తరలించారు. గనులలీజ్ వ్యవహారంతో సిఎం సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు ఊగిసలాట దశలో ఉంది. గవర్నర్ తమపై అనర్హత వేటు వేస్తే ఎమ్మెల్యేలు బిజెపి ప్రలోభానికి గురి కాకుండా ఉండేందుకు సోరెన్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ బస్సులు చత్తీస్‌గఢ్ లేదా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లినట్లు మొదట భావించారు. ఈ రెండు రాష్ట్రాలలో బిజెపియేతర ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో ఇక్కడి రిసార్ట్‌లను ఎంచుకుని సోరెన్ వారిని తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ ఎమ్మెల్యేలు పెట్టెబేడాలతోనే సిఎం అధికార నివాసానికి…
Author: Editor's Desk, Tattva News
కేసీఆర్ నయా నిజాం అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముంగిపు సందర్బంగా హన్మకొండ లో ఏర్పటు చేసిన బిజెపి భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా పాల్గొంటూ చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారని … కేసీఆర్ కూడా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బాటలో నడుస్తున్నారని చురకలంటించారు. నిజాం తరహాలోనే ప్రజలు కేసీఆర్ ను రాబోయే రోజుల్లో ఇంట్లో కూర్చోబెడుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ఇదే ముగింపు అని స్పష్టం చేశారు. వరంగల్ ప్రజలకు నమస్కారాలు అంటూ జేపీ నడ్డా ప్రసంగం మొదలు పెట్టారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ ముగింపు సభను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా…
పాకిస్థాన్‌ను వరదలు కుదిపేస్తున్నాయి. సింధ్ ప్రావిన్స్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీ కురుస్తున్నాయి. పాకిస్తాన్ మునుపెన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తుతుండడంతో జన జీవనం చిన్నాభిన్నం అయింది. దానితో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సుమారు 3.3 కోట్ల మంది ప్రజలపై వర్షాలు, వరదల ప్రభావం పడినట్టు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,456 మంది గాయపడగా, 982 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రధాని షెబాజ్ షరీఫ్ సైన్యం సాయాన్ని కోరాల్సి వచ్చింది. వరదల వల్ల 6.8 లక్షల ఇళ్లు నీళ్లలో మునిగాయి. 3,000 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, 150 వంతెనలు కూలిపోయాయి. దేశంలో సగానికి పైనే ప్రాంతాలు వరద నీటిలో ఉన్నట్టు పాకిస్థాన్ కు చెందిన న్యూస్ వెబ్ సైట్ డాన్ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. లక్షలాది మంది ప్రజలు నీటిలో చిక్కుకున్నట్టు పేర్కొంది. 57 లక్షల మంది ఆశ్రయం కోల్పోయినట్టు తెలిపింది. ముఖ్యంగా ఖైబర్ ఫక్తున్ క్వా,…
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యూయూ లలిత్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ప్రస్తుత జడ్జిలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. సీజేఐ యూయూ లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. 2014 ఆగస్ట్ 13న ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా బాధ్యతలను స్వీకరించిన ఘనత ఈయనది. దేశ చరిత్రలో జస్టిస్ యూయూ లలిత్ తో పాటు మరొకరు మాత్రమే లాయర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్…
తాను ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే సీఎం కేసీఆర్ డైరెక్షన్లో కొందరు అల్లర్లు సృష్టించి యాత్రను అడ్డుకునే కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా, చివరకు న్యాయమే గెలిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం జనగామ జిల్లా పామునూరు నుంచి ప్రజా సంగ్రామ యాత్ర మళ్లీ ప్రారంభించి, వరంగల్ జిల్లాకు చేరుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపడుతున్న యాత్రను ఆపేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించి ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి, నాగపురం, ఐనవోలు మీదుగా ఓరుగల్లుకు చేరుకుంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ సభకు అనుమతి ఇస్తూ శుక్రవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నాగపురం వద్ద సంజయ్ మీడియాతో మాట్లాడుతూ శాంతిభద్రతలను సాకుగా చూపి బీజేపీ సభను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి…
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఎం సోరెన్‌కు సంబంధాలున్నట్టు తేలినందున ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దయినా, సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. యుపిఎ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే, మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది. తాజా పరిణామాల అనంతరం సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం యుపిఎ ఎమ్మెల్యేలతో తన నివాసంలో సమావేశమయ్యారు. సోరెన్‌పై అనర్హత వేటు పడినా, జార్ఖండ్‌లో యుపిఎ సర్కార్‌కు ఢోకా లేదని కాంగ్రెస్ నేత, మంత్రి అలంగీర్ ఆలమ్ స్పష్టం…
అమెరికాలో నలుగురు భారత సంతతికి చెందిన మహిళలపై ఓ మహిళ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడి కూడా చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో మెక్సికో సంతతికి చెందిన ఆమెను టెక్సాస్ పోలీసులు అరెస్టు చేశారు. భారత సంతతి మహిళలపై జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తూ.. భారత్‌కు తిరిగి వెళ్లిపోండి అంటూ అరిచినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ‘భారతీయులంటే నాకు అయిష్టం. మెరుగైన జీవితాల కోసం అమెరికాకకు వచ్చారు’ అంటూ ‘ఎఫ్’ పదజాలాన్ని పలుమార్లు వాడినట్లు వినిపిస్తోంది. ఈ వీడియో అమెరికాలోని భారత కమ్యూనిటీలో విపరీతంగా వైరల్ అయింది. కాగా, ఆ మహిళను ప్లానోకు చెందిన ఎస్మెరాల్డా ఆప్టన్‌గా గుర్తించారు. ఈ వీడియోను పోస్టు చేసిన వ్యాక్తి.. ఈ సంఘటన టెక్సాస్‌లోని డల్లాస్‌లో మా అమ్మ, తన ముగ్గురు స్నేహితులతో భోజనానికి వెళ్లాక జరిగిందని పేర్కొన్నారు. ఆ వీడియోలో భారత సంతతి మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ జాత్యంహకార దూషణలు చేస్తున్నారు. అయినప్పటికీ భారత…
ఆంధ్ర ప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. శుక్రవారం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ కీలకమైన ప్రకటన చేశారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగించరాదని స్పష్టంచేసిన జగన్ ప్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసినవే ఉండాలని సూచించారు. విశాఖ నుంచి ఈ ప్లాస్టీక్ ఫ్లెక్సీల నిషేదం అమలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీన్ చేశారు వలంటీర్లు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్ మెచ్చుకున్నారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం…
నీతివంతమైన పరిపాలనకు నిధుల సమీకరణలో పారదర్శకత అత్యంత అవసరం. అయితే మన రాజకీయ పార్టీలు బయటకు వెల్లడింపలేని వర్గాల నుండి భారీగా `గుప్త విరాళాలు’ పొందుతున్నాయి. స్వయంగా తాము తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వర్గాల నుంచి మన జాతీయ పార్టీలు రూ.15,077.97 కోట్లు వసూలు చేశాయి. 2004-05 నుంచి 2020-21 మధ్యకాలంలో ఈ వసూళ్లు జరిగాయని ఎన్నికల నిఘా సంస్థ విశ్లేషించింది. 2020-21లో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు గుర్తుతెలియని సంస్థల నుంచి విరాళాల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ.690.67కోట్లుగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడీఆర్) వెల్లడించింది. ఎనిమిది రాజకీయ పార్టీలు, ఇరవై ఏడు ప్రాంతీయ పార్టీల వసూళ్లను ఎడిఆర్ పరిగణనలోకి తీసుకుంది. జాతీయ రాజకీయ పార్టీల్లో కేంద్రంలోని అధికార భారతీయ జనతాపార్టీ (బిజెపి)తోపాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఎం), కమ్యూనిస్ట్ ఆఫ్ (సిపిఐ), నేషనలిస్ట్ కాంగ్రెస్ సమాజ్ పార్టీ నేషనల్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హస్తం పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి నాలుగు పేజీల రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో పేర్కొంటూ పార్టీ ప్రస్తుత దుస్థితికి రాహుల్ గాంధీ `అపరిపక్వ నాయకత్వమే’ కారణం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మార్పులను సూచించేందుకు గతంలో నిర్వహించిన మేధోమథనంలోని అంశాలు అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఆగస్టు 16న జమ్ము కాశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధిపతి పదవికి ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. పార్టీలో సీనియర్ నాయకులను, అనుభవం గలవారిని పక్కన పెట్టి, భజనపరులతో ఏఐసీసీ నిండిపోయినదని మండిపడ్డారు. పార్టీలో సంప్రదింపుల పక్రియ నిలిచిపోయినదని వాపోయారు. కాంగ్రెస్ తో అర్ధశతాబ్ద కాలంగా సంబంధాలున్న ఆజాద్ యువజన…