మునుగోడు లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని, పోలీసులు, డబ్బును నమ్ముకుని గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని..ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేశారని బిజెపి ఎమ్యెల్యే, మాజ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంత భయపెట్టినా స్థానిక నేతలు కట్టలు తెంచుకుని కాషాయ కండువా కప్పుకుంటారని ఆయన తేల్చి చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తూ, ఎవరికీ వారే గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ శనివారం భారీ సభ నిర్వహిస్తుండగా, బిజెపి ఆదివారంసభ నిర్వహించబోతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం సమావేశాలు , ప్రచారంలో మునిగిపోయింది. ఈ నెల 21 న బిజెపి అమిత్ షాతో సభ ఏర్పటు చేస్తున్నట్లు కొద్దీ రోజుల క్రితమే ప్రకటించగా, వెంటనే కేసీఆర్…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో, అమలు పరచడంలో భారీ ఎత్తున అవినీతి చూటుచేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పలువురి ఇళ్లల్లో సిబిఐ సోదాలు జరపడం తెలంగాణలోని టిఆర్ఎస్ నేతలకు వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ కుంభకోణంలో కొందరు కీలక టిఆర్ఎస్ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 7 రాష్ట్రాలలో 21 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ లో కూడా సోదాలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు భేటి అయ్యారు. ఆ సమయంలో కేసీఆర్ వెంట పలువురు టీఆర్ఎస్ ముఖ్యలు సైతం ఉన్నారు. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ నేతలంతా అప్రమత్తమయ్యారు. కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. సీబీఐ విచారణను తాము స్వాగతిస్తామని, తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, అందుకే ఈ విచారణలో ఎటవంటి అవకతవకలు బయటకు…
కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటకం, ఆతిథ్యం, సంబంధిత రంగాలను ఆదుకునేందుకు ఈసీఎల్జీఎస్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రూ.50 వేల కోట్ల అదనపు నిధులతో ఈ రంగాలను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈసీఎల్‌జీఎస్ పథకానికి రూ.50 వేల కోట్ల నిధులను అదనంగా కేటాయించి రూ. 4.5 నుండి రూ. 5 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. కరోనానంతర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న ఆతిథ్య, పర్యాటక రంగాలను మరింతగా ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి పర్యాటకం, ఆతిథ్య రంగాలపై పెను ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో ఈ రంగాలను ఆదుకునేందుకు అత్యవసర రుణసదుపాయ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్)నికి రూ.50వేల కోట్ల నిధులను అదనంగా కేటాయించి రూ. 4.5 నుండి రూ. 5 లక్షల కోట్లకు పెంచారు. పర్యాటక, ఆతిథ్య రంగాలు ఇప్పుడిప్పుడే…
తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా ఎంపిక చేసి నియమించిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే తమ ధిక్కార ధోరణులు వెల్లడి చేస్తున్నారు. ఆ పార్టీకి తెలంగాణాలో బలమైన జిల్లాగా భావించే పాత నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఎవ్వరి దారి వారిదిగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి, ఉపఎన్నికల్లో పోటీకి సిద్దపడుతుంటే కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలతో నవ్వులపాలవుతున్నది. రాష్ట్ర నాయకత్వంలో కుమ్ములాటలు తీవ్రతరం అవుతూ ఉండగా, ప్రతి జిల్లాలో- ప్రతి నియోజకవర్గంలో కూడా పరిస్థితులు అంతకన్నా భిన్నంగా లేవు. రేవంత్ రెడ్డి తనకంటూ ఓ వర్గం ఏర్పర్చుకొనే ప్రయత్నం మిన్నగా పార్టీలో అందరిని కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి. ఒక వంక మునుగోడు ఉపఎన్నిక వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ…
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొని, పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్థార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నందనం కృపాకర్ రాసిన మరో ఛత్రపతి మన తెలుగు దళపతి పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన సర్వాయి పాపన్న జయంతి జరుపుకుంటున్నామని తెలిపారు. తాడిచెట్టుపై పన్ను విధించిన నియంత పాలనపై పాపన్న వీరోచితంగా పోరాడారని తెలిపారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. గోల్కొండ కోటగా సామ్రాజ్యాన్ని స్థాపించి బడుగుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. మహ్మదీయుల…
డోలో-650 తయారీదారులు ఈ ట్యాబ్లెట్‌ను ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్లకు రూ.1,000 కోట్ల విలువైన బహుమానాలు (తాయిలాలు) ఇచ్చినట్లు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. రోగులకు డ్రగ్స్ సిఫార్సు చేయించడం కోసం ఫార్మా కంపెనీలు వైద్యులకు ఎలాంటి ఉచితాలు అందించకుండా నిరోధించాలంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉచితాలు తీసుకుని ప్రజలకు మందులు రాసిచ్చే ప్రక్రియ చాలా ప్రమాదకరమన్న మెడికల్ అసోసియేషన్.. వైద్యులకు ఉచితాలు అందించకుండా నిరోధించే చట్టమేదీ ప్రస్తుతానికి లేదని కోర్టుకు తెలిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ.. కరోనా సమయంలో 650 ఎంజీ టాబ్లెట్ అమ్మకాల కోసం డోలో కంపెనీ రూ. 1,000 కోట్లకు పైగా ఉచితాలను ఇచ్చిందని ఆరోపించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నుంచి వచ్చిన నివేదిక తను ఆరోపిస్తున్న సమాచారానికి మూలమని ఆయన పేర్కొన్నారు.అలాగే, యాంటీబయాటిక్‌ల అవసరం లేకపోయినా…
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 8 యూ ట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది. ఇందులో ఏడు భారత్‌కు చెందినవి కాగా, ఒకటి పాకిస్థాన్‌కు చెందినదిగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఛానళ్లకు మొత్తం 85 లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వీటిలో వచ్చిన వీడియోలను 114 కోట్ల మందికి పైగా వీక్షించారు. దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు, దేశంలో కొన్ని వర్గాల మధ్య ద్వేషం పెంచేలా వీడియోలు ప్రసారం చేస్తున్నందుకు ఈ ఛానెళ్లను బ్లాక్ చేసినట్టు సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సాయుధ బలగాలు, జమ్ముకశ్మీర్‌కు వ్యతిరేకంగా ఈ ఛానళ్లు పలు నకిలీ వార్తలను ప్రసారం చేశాయని పేర్కొంది. తాజా నిర్ణయంతో గత ఏడాది…
బీజేపీలో అత్యున్నత కమిటీలు రెండింటిలో తెలంగాణకు చెందిన పార్టీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలు రెండింటిలోనూ ఆయన సభ్యుడిగా కొనసాగుతారు. రాష్ట్ర బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణకు చెందిన డాక్టర్ కోవా లక్ష్మణ్‌కు జాతీయ పార్టీకి సంబంధించిన రెండు అత్యున్నతస్థాయి కమిటీల్లో స్థానం లభించింది. అత్యున్నత నిర్ణాయక కమిటీలైన పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో కె.లక్ష్మణ్‌ను సభ్యుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతూ రాష్ట్ర బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు అన్నివిధాలుగా గుర్తింపునిస్తోంది. దక్షిణాది నుంచి కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పతో పాటు లక్ష్మణ్ మాత్రమే పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని బోర్డులో సభ్యులుగా ప్రధాని…
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధాన మంత్రిగా లిజ్ ట్రుస్ ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ సభ్యుల్లో అత్యధికులు లిజ్ వైపు నిలిచారు. దీంతో రుషి ఆమె కన్నా 32 పాయింట్లు వెనుకబడి ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ఆ పార్టీకి చెందిన 961 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 60 శాతం మంది లిజ్ ట్రుస్‌కు అనుకూలంగా ఉన్నారు. కేవలం 28 శాతం మంది మాత్రమే రుషి సునాక్‌కు మద్దతిచ్చారు. ఆగస్టు 4న నిర్వహించిన పోల్‌లో కూడా లిజ్ 32 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీకి, ప్రధాన మంత్రి పదవికి తదుపరి నేతగా లిజ్ ట్రుస్‌ను చూడాలని ఆ పార్టీలో అత్యధికులు కోరుకుంటున్నట్లు కన్జర్వేటివ్ హోం వెబ్‌సైట్ బుధవారం తెలిపింది. తాజా పోల్‌లో పాల్గొన్నవారిలో 9 శాతం…
అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల…