స్వాతంత్య్ర వజ్రోత్సవాలను భారత్ ఘనంగా జరుపుకొంటున్న సమయంలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామాలో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలను గుర్తించిన భద్రతా దళాలు, వాటిని నిర్జీవ ప్రాంతంలో పేల్చివేశాయి. ఈ పేలుడు పదార్ధాలు దాదాపు 25 నుంచి 30 కిలోల వరకు ఉండొచ్చని జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. పుల్వామా లోని తహబ్ క్రాసింగ్ వద్ద సుమారు 25 నుంచి 30 కిలోల పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు , పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముందస్తుగా గుర్తించి పెను ప్రమాదాన్ని నివారించగలిగాం అని జమ్ముకశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ‘పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై సుమారు 25-30 కిలోలు ఉన్న ఐఈడీని పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా పోలీసులకు అందిన సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగాం.’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, స్వాతంత్య్ర…
Author: Editor's Desk, Tattva News
భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత దేశ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ యూయూ లలిత్ ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. అయితే, జస్టిస్ యూయూ లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎందుకంటే.. ఆయన నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ యూయూ లలిత్ 1957, నవబర్ 9న జన్మించారు. 1983లో లీగల్ కెరీర్‌ను ప్రారంభించారు. 1985 డిసెంబర్ వరకు ముంబై హైకోర్టులో పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావొస్తున్నా బడుగు బలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా వివిధ గ్రామాల్లో సందర్శించినప్పుడు కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనబడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. లంగాణలో బీసీలకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తూ… కేసీఆర్ ‘బీసీ ద్రోహి’ అవతారమెత్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే సబ్బండ వర్గాల బతుకులు బాగుపడ్తయ్, సామాజిక న్యాయం జరుగుతదని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ సమయంలో చెప్తుండేవారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లయింది. కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ రాజకీయం రోజు రోజుకూ అప్రజాస్వామికంగా తయారవుతున్నదని చెబుతూ సంపదనూ, అధికారాన్ని చేజిక్కించుకున్నవాళ్లు మరింత పొందాలని చూస్తున్నరుగానీ, వాటిని వెనుకబడిన వర్గాలతో పంచుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరని విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా,…
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనకు ప్రాణహాని ఉందన్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నుపుర్ వినతి పిటిషన్ పై సానుకూలంగా స్పందించింది. నుపుర్ పై దాఖలైన అన్ని కేసులను కలిపి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌వో ) యూనిట్‌కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు నుపుర్ ను అరెస్ట్ చేయకూడదని తెలిపింది. అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను కూడా నుపుర్ శర్మకు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్ చేసి నుపుర్ శర్మ వివాదంలో చిక్కుకుంది. నుపుర్ కామెంట్స్ తో ఆమెకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు…
బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు నేతలు హాజరయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి. రాజకీయ అస్థిరతలో బీహార్ లో నూతన అధ్యాయం మొదలైందని నితీష్ కుమార్ మరోమారు ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేయడంపై స్పందిస్తూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బీజేపీ విషయంలో నితీష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని, ఈ కారణంగానే ఎన్‌డీఏ నుంచి వైదొలగారని తెలిపారు. అయితే, నితీష్ కుమార్, తేజశ్వి యాదవ్‌లను పునరేకీకరణ చేయడంలో తన పాత్రమీలేదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. మహాఘట్‌బంధన్ ప్రభుత్వ ఏర్పాటులో తన భాగస్వామ్యంలేదని తేల్చిచెప్పారు. నితీష్ కుమార్ రాజకీయ ప్రయాణం, బీహార్‌లో ప్రస్తుత…
భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీం కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్ మంజూరు చేసేందుకు బొంబాయి హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వరవరరావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై న్యాయమూర్తులు యూయూ లలిత్, అనిరుద్ధ బోస్, సుధాన్షు ధూలియా ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విరసం నేత ఆరోగ్య పరిస్థితి, రెండున్నర సంవత్సరాల కస్టడీ కాలాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ఈ కేసులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, చార్జీషీట్ దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం పేర్కొంది. అయితే, ముంబైలోని ఎన్‌ఐఏ కోర్ట్ అనుమతి లేకుండా ఆయన గ్రేటర్ ముంబయిని దాటి వెళ్లకూడదని ధర్మాసనం వరవరరావుకు సూచించింది. అలాగే ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.…
ముస్లింలు అనగానే బహుభార్యత్వం లేదా అనేక మంది మహిళలతో పురుషులు భౌతిక సంబంధాలు పెట్టుకుంటారని భావిస్తుంటాము. అయితే క్రమంగా దేశంలో పరిస్థితులు తారుమారు అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇతర మాతాళలోకన్నా హిందూ మతంలోని పురుషులలో బహు లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం పెరుగుతున్నట్లు తేలుతున్నది. హిందూ పురుషుల తర్వాత, సిక్కులు, క్రైస్తవులు, బౌద్దులు, ముస్లింలు, జైనులలో ఇటువంటి ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) సర్వే డేటాను ‘ది వైర్’ వెల్లడించింది. 2019-20లో కేంద్ర ప్రభుత్వం కోసం ముంబయికి చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ ఈ సర్వేను నిర్వహించింది. హిందూ పురుషులు పెళ్లి కాకుండా లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ లేదా అక్రమ సంబంధాలు కలిగి ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వారి జీవిత కాలంలో సగటున 2.2 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని తెలిపింది. సిక్కులు, క్రైస్తవులు 1.9, బౌద్ధులు, ముస్లింలు సగటు 1.7 మందితో లైంగిక సంబంధాలు కలిగి…
శ్రీలంకలో భారీగా విద్యుత్ రేట్లు పెరగనున్నాయి. ఏకంగా 264శాతం మేరా టారిఫ్‌లు పెంచనునుట్లు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సిఇబి) మంగళవారం ప్రకటించింది. తక్కువ విద్యుత్ వినియోగించే వారికి ఎక్కువ పెంపు, ఎక్కువ విద్యుత్ వినియోగించే వారికి తక్కువ పెంపు వర్తించనున్నాయి. విద్యుత్ బోర్డు 61.6కోట్ల డాలర్ల మేరా నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నష్టాలను భర్తీ చేసుకోవడానికి బుధవారం నుండి చార్జీలను పెంచనున్నారు. అయితే తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి 800శాతానికి పైగా టారిఫ్‌లు పెంచుతామని సిఇబి కోరింది. కానీ గరిష్టంగా పెంపు 264శాతం మాత్రమే వుండాలని విద్యుత్ నియంత్రణా సంస్థ స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. దేశంలోని 78లక్షల కుటుంబాల్లో మూడింట రెండు వంతుల మంది నెలకు 90కిలోవాట్‌ల కన్నా తక్కువే వినియోగిస్తారని అధికార రికార్డుల్లో వెల్లడైంది. వీరందరూ అధిక టారిఫ్‌ల బారిన పడనునాురు. విద్యుత్‌ను అధికంగా ఉపయోగించే వినియోగదారులు 80శాతం కనాు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం యూనిట్ ధర…
:బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. 210 మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత బృందం 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్యాలతో సహా మొత్తం 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. గేమ్స్ ప్రారంభానికి ముందు టాప్ 5లో నిలవడం కష్టమేనని భావించినా.. ఆ మార్క్‌కు చేరుకుంది. ఈసారి కూడా స్వర్ణ పతకాల వేటను వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానునే ప్రారంభించింది. మహిళల 49 కిలోల విభాగంలో ఆమె తొలి పసిడిని అందించింది. టేబుల్ టెన్నిస్‌లో వెటరన్ శరత్ కమల్ స్వర్ణంతో ఈ పతకాల వేట ముగిసింది. భారీ అంచనాలతో బరిలో దిగిన పురుషుల హాకీ జట్టు, మహిళల క్రికెట్ జట్టు రజత పతకాలతో సరిపెట్టుకున్నాయి. మొత్తం 72 దేశాల నుంచి 20 క్రీడాంశాలకు సంబంధించి 5 వేలమందికి పైగా అథ్లెట్లు పాల్గంటే.. భారత్ నుంచి 210 మంది ప్రాతినిధ్యం…
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో మారు బిజెపితో తెగతెంపులు చేసుకొని, మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే నుండి వైదొలిగిన ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో సహా ఏడు రాజకీయ పక్షాలు, ఓ స్వతంత్ర ఎమ్యెల్యేతో కలసి కూటమిగా ఏర్పడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మహా కూటమి ఏర్పాటు చేసిన ఆయన గవర్నర్కు మద్దతు లేఖ అందజేసి, తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం చెప్పడంతో బుధవారం సాయంత్రం 4 గంటలకు తిరిగిర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్తో పాటు ఉపముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేసే అవకాశముంది. పొత్తు పెట్టుకున్న పార్టీలను బీజేపీ నాశనం చేస్తుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇదే జరిగిందన్న విషయానికి చరిత్ర సాక్ష్యమని పేర్కొన్నారు. పంజాబ్, మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందని ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలను…