Author: Editor's Desk, Tattva News

జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. 2022, జులై నెలలో అత్యధికంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.  ఏడాది పరంగా 28 శాతం పురోగతి జులై ఆదాయం ఏకంగా రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యింది. జీఎస్టీ విధానం  అమల్లోకి వచ్చాక ఇది రెండవ గరిష్ఠ ఆదాయం కావడం విశేషం.  దీంతో వరుసగా 5వ నెలలో కూడా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్ల మార్క్ దాటినట్టయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. గతేడాది జులైలో వసూలైన జీఎస్టీ ట్యాక్స్ కన్నా ఈ సారి 28% శాతం అధికంగా రాబడి వచ్చిందని స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో  సీజీఎస్టీ 25వేల 751 కోట్లు, ఎస్ జీఎస్టీ 32వేల 807 కోట్లు, ఐజీఎస్టీ  79వేల 518 కోట్లు, సెస్ రూపంలో 10వేల 920 కోట్లు వసూలయ్యాయని తెలిపింది. జులై వరకు జీఎస్టీ ఆదాయం ఏడాదిపరంగా 35 శాతం వరకూ పెరిగింది.  పన్ను…

Read More

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. గదిలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో తలుపులు గట్టిగా పగలగొట్టి చూడగా విగతజీవిగా పడిఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన జూబ్లీహిల్స్‌ పోలీసులు మధ్యాహ్నం 2.45 గంటలకు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. అనారోగ్య సమస్యలతో తన తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు కుమార్తె దీక్షిత తెలిపింది. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురిమే ఉన్నామని, లోపలి నుంచి గడియ పెట్టుకుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉమా మహేశ్వరి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నట్టు వివరించింది. భోజన సమయానికి బయటకు రాకపోవడంతో తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపలి నుంచి బోల్టు పెట్టుకుని ఉందని దీక్షిత తెలిపారు. తలుపులను…

Read More

పాత్రాచాల్ భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను పిఎంఎల్ఏ కోర్టు ముందు సోమవారం మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయనను 8 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడంతో నాలుగు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుతించింది. లెక్కల్లో చూపించని రూ.11.5 లక్షల నగదును సంజయ్ రౌత్ నివాసం నుంచి ఈడి ఆదివారంనాడు స్వాధీనం చేసుకుంది. దీనిపై ఈడి అధికారులు ఆయనను విచారించి సోమవారం మధ్యాహ్నం 12.05 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం పిఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ‘‘నా వద్ద ఉన్న మెటీరియల్ ఆధారంగా.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీల్యాండరింగ్‌ యాక్ట్‌ నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరానికి సంజయ్ రాజారామ్ రౌత్ పాల్పడినట్లు నమ్ముతున్నాం. అందుకే ఆయన్ని అరెస్ట్‌ చేశాం’’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ సెక్షన్‌…

Read More

రూ 1,50,173 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌లు అమ్ముడవడంతో భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌వేవ్ వేలం ఆగస్టు 1న ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన వేలం ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసినట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. విక్రయాల ద్వారా వచ్చిన తాత్కాలిక సొమ్ము(ప్రావిజినల్ సేల్ అమౌంట్) రూ. 1,50,173 కోట్లు కాగా తుది లెక్కింపు ఇంకా జరుగుతోందని వారు తెలిపారు. భారతదేశంలో 5జి సేవలకు మద్దతిచ్చే స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమైంది. తొమ్మిది బ్యాండ్‌ల క్రింద సుమారు 72,000 MHz 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో విక్రయించారు. చివరి రోజున నాలుగు రౌండ్ల వేలం పూర్తయిందని, దరఖాస్తుదారుల నుండి “బలమైన బిడ్లు” వచ్చాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా,  అదానీ డేటా అనే నలుగురు బిడ్డర్లు పోటీలో ఉన్నారు.   ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో బిడ్‌లలో అత్యంత దూకుడు ప్రదర్శించగా, సునీల్ భారతి మిట్టల్…

Read More

జయలలిత మంత్రివర్గంలో ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొంది, ఆమె రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన మాజీ ముఖ్యమంత్రి  పన్నీర్‌సెల్వం ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితులు ఎదురుకొంటున్నారు. ఒక వంక, అన్నాడీఎంకేలో తగు బలం సమీకరించేయలేక పోవడంతో పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు మొత్తం పార్టీ వ్యవహారాలు మరో మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆధిపత్యంలోకి వెళ్లాయి.  మరోవంక, న్యాయస్థానాల నుండి, ఎన్నికల  కమీషన్ నుండి వరుసగా ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. ఎడపాడి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చెల్లదు..అని ఆదేశించాలని కోరుతూ వేసిన అప్పీల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  పైగా మద్రాసు హైకోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని ఆదేశించడం,అప్పటి వరకు అన్నాడీఎంకేలో యథాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేయడం ఓపీఎస్‌కు మింగుడుపడలేదు. అయితే, అన్నాడీఎంకే వ్యవహారంపై 3 వారాల్లోగా తీర్పు చెప్పాలని కూడా మద్రాసు హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన విచారణ ప్రారంభం కానుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలను…

Read More

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు వివిధ సోషల్‌ మీడియాల్లో తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 91వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. ఆగస్టు 2న జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించారు. త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కీలక పాత్ర పోషించారని చెప్పారు. 2 నుంచే సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ పిక్చర్‌ డ్రైవ్‌ ఆరంభించాలని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వేస్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టినట్టు గుర్తు చేశారు.  అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని ప్రధాని సూచించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ…

Read More

నేటి నుండి తెలుగు రాష్ట్రాలలో సినిమా షూటింగ్ లను నిలిపి వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. టాలీవుడ్ లో కొన్ని రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం, ఓటీటీల్లో సినిమాలు రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతుండటం, పెద్ద హీరోల రెమ్యునరేషన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు హద్దులు దాటడం పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ పరిస్థితులలో  సినిమా బడ్జెట్ కూడా నియంత్రణ  చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నట్లు నిర్మాతలు పేర్కొంటున్నారు. ఇటువంటి పలు కారణాలతో చాలా రోజులుగా నిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇవన్నీ పరిష్కారం అయ్యాకే సినిమా షూటింగ్ లు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు సోమవారం నుండి సినిమా షూటింగ్ లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాకుండా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి. పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా సామరస్య పూర్వక పరిష్కారం లభించే…

Read More

సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లో పోర్న్ సైట్లను వీక్షించే వారిపై హైదరాబాద్ పోలీసులు నిఘా సారిస్తున్నారు. అశ్లీల వీడియోలు పదేపదే చూడడం వల్ల నిందితులు ఎమి చేస్తున్నామో తెలియక అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఇలాంటి సంఘటనలు ఈ ఏడాది మూడు కమిషనరేట్ల పరిధిలో చాలా చోటుచేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ పోర్న్‌కు బానిసలుగా మారడమే కాకుండా, అపనిగా చూడడంతో వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందని, ఒక్కసారి పోర్న్ వీడియోలకు బానిసలుగా మారిన తర్వాత వారిని మార్చడం చాలా కష్టంగా మారుతోందంటుని భావిస్తున్నారు. అందుకనే, నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు తరచూ పోర్న్ వీడియోల సైట్ల సందర్శించే వారిని ఐపి ఆధారంగా గుర్తించి వారిపై ఐటి చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. ఈక్రమంలో పోర్న్ చిత్రాల వీక్షించిన వారిపై నేరం రుజువైన పక్షంలో వారిపై ఐటి యాక్ట్‌తో పాటు ఐపిసి సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు శిక్షలు…

Read More

కేరళలో తొలి మంకీపాక్స్ మరణం నమోదయ్యింది. కేరళలోని త్రిసూర్ జిల్లా పున్నియార్‌లో 22 ఏళ్ల యువకుడు వైరస్‌తో చనిపోయాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీనా జార్జ్ ఒక ప్రకటన చేశారు. మృతి చెందిన యువకుడు యూఏఈ నుంచి జులై 22న భారత్ వచ్చాడు.  ఇక్కడికి రావడానికి ఒక్కరోజు ముందే పరీక్షలు నిర్వహించగా అక్కడే మంకీ పాక్స్ నిర్ధారణ అయ్యిందని మంత్రి చెప్పారు. మంకీ పాక్స్ కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆమె వివరించారు.  యువకుడి శరీరం నుండి తీసిన ద్రవాలను వైరాలజీ ల్యాబ్‌కు పంపామని, వాటి ఫలితాలు ఇంకా రావాల్సి వుందని చెప్పారు. ఈ కేసును ఉన్నత స్థాయి బృందం దర్యాప్తు చేస్తుందని వీణా జార్జి తెలిపారు. మంకీపాక్స్‌తో మరణాలు అరుదని, అది కూడా యువకుడైనందున సవివర మైన దర్యాప్తు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఆ రోజున యువకుడితో కలిసి విమానంలో ప్రయాణించిన వారు, ఇరుగు…

Read More

శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఈడీ ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఆయనను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈవిషయం తెలియడంతో శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో సంజయ్ రౌత్ ఇంటివద్దకు చేరుకొని ఈడీకి, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ముంబైలోని పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ తో పాటు ఆయన భార్య, అనుచరుల లావాదేవీలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రెండుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఆగస్టు 7 తర్వాతే విచారణకు వస్తానని రౌత్ స్పష్టం చేశారు.  దీంతో స్వయంగా ఈడీ అధికారులే ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రౌత్ ఇంట్లో సోదాలు చేశారు.  సోదాల అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఈడీ ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. సోదాల్లో…

Read More