Author: Editor's Desk, Tattva News

శివసేన ఎంపీ  సంజయ్ రౌత్  ఇంట్లో ఈడీ  అధికారులు ఆదివారం ఉదయం నుండి సోదాలు ప్రారంభించారు. పాత్రా చాల్  ల్యాండ్ స్కామ్ లో  సంజయ్ రౌత్ కు  ఇప్పటికే రెండుసార్లు  అధికారులు సమన్లు  ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో   ఆయన నివాసానికి  చేరుకున్నారు. ఇంట్లో సోదాలు  నిర్వహించి సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు   ప్రశ్నిస్తున్నారు. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్‌ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు.  ఏప్రిల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ దాడులపై సంజయ్ రౌత్…

Read More

ఎలాంటి న్యాయ సహాయం అందకుండా విచారణ దశలోనే అనేక మంది ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని విడుదల చేసేందుకు న్యాయ సహాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారిని త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.  శనివారం ఢిల్లీలో జరిగిన ప్రథమ అఖిల భారత జిల్లా న్యాయ సేవా సంస్థల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ జిల్లా స్థాయి అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీ ఛైర్‌పర్సన్‌ హోదాలో విచారణ ఖైదీల విడులకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న జిల్లా జడ్జీలను కోరారు. 2020 నాటి క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో 4,88,511 మంది ఖైదీలు ఉండగా వారిలో 76 శాతం మంది అంటే 3,71,848 మంది అండర్‌ ట్రయల్స్‌గా ఉన్నారని గుర్తు చేశారు.  సులభతర వాణిజ్యం, సులభతర జీవనం మాదిరిగానే సులభతర న్యాయం కూడా ప్రధానమైన విషయమేనని ప్రధాని మోదీ స్పష్టం…

Read More

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఏపీలో నాలుగు, తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు అనుమతులు అవసరం లేదని, నిర్మాణ పనులను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్ఫష్టం చేసింది.  ఏపీలో హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం, తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరి-నగరి, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టంపాడ ఎత్తిపోతలకు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అనుసరించి అప్పటికే అనుమతులు పొంది నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాంకేతిక కారణాలతో అవి అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేరాయి.  ఈ నేపథ్యంలో ఏడాది లోపు డీపీఆర్‌ లు సమర్పించి అనుమతులు తీసుకోవాలనీ, లేదంటే నిర్వహణను నిలిపివేయాల్సి ఉంటుందంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)  గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి సమగ్రమైన…

Read More

టీచర్ల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన అయిదు బ్యాంకు ఖాతాలను జప్తు చేసే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ బ్యాంకు ఖాతాల్లో రూ 2 కోట్లకు పైగా నగదును ఇడి అధికారులు గుర్తించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా అర్పితా ముఖర్జీ నిర్వహిసున్నట్లుగా భావిస్తున్న పలు షెల్ కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లు కూడా ఇడి దృష్టిలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ షెల్ కంపెనీల్లో ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారో మాత్రం ఆయన చెప్పాలేదు. సంబంధిత అధికారలు నుంచి ఈ ఖాతాల వివరాలను కోరామని, అవి అందిన తర్వాత తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని ఆ అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముఖర్జీకి చెందిన కనిపించకుండా పోయిన నాలుగు లగ్జరీ కార్లను వెతికే పనిని ఇడి మొదలు పెట్టిన్నట్లు అ అధికారి తెలిపారు. ఈ కార్లలో…

Read More

ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో పోలీసులకు పశ్చిమ బెంగాల్ లో పట్టుబడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జరిగింది. అయితే, తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  రాజేష్ ఠాకూర్ ఆరోపించారు.  ఒక ఎస్‌యువి వాహనంలో పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాలో రాణిహటి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ముగ్గురు ఎమ్మెల్యేలను  పోలీసులు పట్టుకున్నారు. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సాల్‌ కొంగరిలుగా గుర్తించారు.  ఒక నల్ల కారులో పెద్ద మొత్తంలో డబ్బు రవాణా అవుతున్నట్లు తమకు సమాచారం అందిందని, దీంతో వాహనాల తనిఖీ మొదలుపెట్టామని హావ్‌డా ఎస్‌పి స్వాతి భంగాలియా తెలిపారు. ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేల ఎస్‌యువి వాహనంలో భారీ నగదు బయటపడిందని చెప్పారు. నగదును లెక్కించడానికి యంత్రాలను తెప్పించామని,  ఎమ్మెల్యేలను విచారిస్తున్నామని పేర్కొన్నారు.  వాహనంలో ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పారు.  కాగా, రాష్ట్రంలోని…

Read More

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లో నాలుగు రోజులుగా ఏంచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీకి వరద రావడంతో నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జిని ఆయన పరిశీలిస్తూ కూడా భారీ వర్షాల కారణంగా లక్ష ఇళ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.  గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాది తర్వాత కూడా మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు. మూసీ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఒక్క అడుగు కూడా ముందు పడలేదని ధ్వజమెత్తారు.  ప్రాజెక్టు రిపోర్టు రెడీ అయిందని, రుణాలు వస్తున్నాయని చెప్పడం మినహా కేసీఆర్ సర్కారు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రగతిభవన్ దాటి బయటికి రాని కేసీఆర్ఇ ప్పుడు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా…

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో లోన్‌ యాప్‌ నిర్వాహకు అకృత్యాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. నెల్లూరులో నేరుగా ఓ మాజీ మంత్రిని, ప్రస్తుత మంత్రిని ఫోనులు చేస్తూ, బెదిరిస్తూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమై నలుగురిని అరెస్టు చేశారు. మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు బెదిరింపులు తప్పలేదు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించాలంటూ రెండు రోజులుగా ఫోన్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తమకేమీ సంబంధం లేదని మంత్రి గోవర్థన్‌రెడ్డి పిఎ సమాధానమిచ్చినా వారు ఫోన్‌ చేయడం మానలేదు. లోన్‌ చెల్లించాల్సిందేనంటూ మంత్రికి 79 సార్లు ఫోన్‌ చేశారు. ఈ విషయంపై నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ”ముత్తుకూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా నా నంబర్‌కు 79సార్లు ఫోన్‌ చేశారు. నాకు ఎందుకు ఫోన్‌ చేశారనే విషయంపై ఆరా తీస్తే.. రుణం తీసుకున్న అశోక్‌కుమార్‌ నా నంబర్‌ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని చెప్పారు. అందుకే ఫోన్‌ చేస్తున్నామని చెబుతున్నారు”…

Read More

ఎంతటి బలమైన ప్రభుత్వమైనా ప్రతీదాన్ని, ప్రతీ ఒక్కర్నీ నియంత్రించలేదని ప్రధానమంత్రి నరేంద మోదీ స్పష్టం చేశా రు. శుక్రవారం అన్నా యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సంస్కరణల స్వభావాన్ని కలిగి ఉందని చెప్పారు. ‘బలమైన ప్రభుత్వ అంటే అన్నింటినీ, ప్రతి ఒక్కర్నీ నియంత్రించాలనే భావన ఇంతకు ముందు ఉండేది. కానీ మేము దానిని మార్చాము. బలమైన ప్రభుత్వం ప్రతీ ఒక్కర్నీ లేదా ప్రతీదాన్ని నియంత్రించదు. బలమైన ప్రభుత్వం అనేది నిర్బంధం కాదు, కానీ ప్రతిస్పందిస్తుంది’ అని ప్రధాని తెలిపారు. ‘బలమైన ప్రభుత్వం.. వ్యక్తుల నియంత్రణ కోసం కాదు. అన్ని విషయాల్లో జోక్యం చేసుకోదు. దానికీ కొన్ని పరిధులు ఉన్నాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బలమైన ప్రభుత్వం ప్రతీ డొమైన్‌లోకి వెళ్లదని, తనను తాను పరిమితం చేసుకుంటూ ప్రజల ప్రతిభకు కొంత అవకాశాన్ని ఇస్తుందని మోదీ చెప్పారు. బలమైన ప్రభుత్వ బలం దాని వినయంలోనే ఉంటుందని,  తనకు అన్ని…

Read More

తెలంగాణలో కేసీఆర్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నదని, కుమ్ములాటలతో కాంగ్రెస్ ముందుకు కదలడం లేదని, రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని, ప్రజలలో కేంద్రంలోని నరేంద్ర మోదీ పరిపాలన పట్ల సానుకూల వాతావరణం ఉన్నదని భావిస్తున్న బిజెపి నాయకత్వం వచ్చే ఎన్నికలలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు పట్టుదలగా పనిచేస్తున్నది. నేరుగా కేంద్ర నాయకత్వమే ఎన్నికల, ప్రచార వ్యూహాలను రూపొందిస్తూ, రాష్ట్ర పార్టీ నాయకులకు మార్గదర్శనం చేస్తున్నది. పరిస్థితులు ఎంతసానుకూలంగా ఉన్నప్పటికి ఎన్నికలలో గెలుపొందే బలమైన అభ్యర్థుల కొరత ఉన్నట్లు పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించినట్లు తెలుస్తున్నది. క్షేత్రస్థాయిలో ప్రజలను కదిలించే నాయకత్వ కొరత ఉన్నట్లు భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిష్టితులపై సొంతంగా సర్వేలు జరిపించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఈ విషయమై రాష్ట్ర నాయకత్వంకు నిర్దుష్టమైన సూచనలు చేసిన్నట్లు తెలుస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సొంత బలం సరిపోదని, ఇతర పార్టీల్లో గెలిచే అవకాశం ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర పార్టీని ఆదేశించింది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై అంతర్గతంగా సర్వే చేసిన…

Read More

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’ అని అనుచితంగా ప్రస్తావించడం ద్వారా పార్లమెంట్ లోపల, బైట పెద్ద రాజకీయ దుమారం రేపడానికి కారకుడైన లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ కోరుతూ చివరకు రాష్ట్రపతికి లేఖ వ్రాసారు.  ‘‘మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి మాట్లాడుతూ పొరపాటున తప్పడు పదం వాడాను. దీనిపై విచారం వ్యక్తం చేసేందుకు ఈ లేఖ రాస్తున్నాను. నోరు జారడం వల్లే అలా జరిగింది. నన్ను క్షమించండి’’ అని అధీర్‌ రంజన్‌ చౌదరి తన లేఖలో పేర్కొన్నారు.  ఆయన వాఖ్యలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధినేత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు ఆందోళనలు జరిపారు.  దీనిపై తొలుత క్షమాపణ చెప్పేది లేదు, తాను తప్పుగా వ్యాఖ్యానించలేని బుకాయించిన అధిర్ రంజన్ చౌదరి ఆ తర్వాత…

Read More