కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. జులై 21న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు సోనియాను ఆదేశించారు. గత నెలలో ఈడీ ఎదుట సోనియా హాజరుకావాల్సి ఉండగా కరోనా కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని దర్యాప్తు సంస్థకు తెలిపారు. కరోనా సోకిన నేపథ్యంలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన సోనియా కరోనా నుంచి కోలుకునేందుకు తనకు కనీసం 3 వారాల సమయం పడుతుందని, అప్పటిదాకా విచారణకు హాజరు కాలేనని గత నెలలో తెలిపారు. ఇక.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూడు వారాల సమయం ఇవ్వాలని కోరారు. సోనియా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు మరోసారి తాజా నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.…
Author: Editor's Desk, Tattva News
అన్నాడీఎంకేలో రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీని తన నియంత్రణలోకి తీసుకొన్న కొద్దిసేపటికే ప్రత్యర్థి నేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)పై ఈపీఎస్ చర్యలు తీసుకొన్నారు. ఆయనను కోశాధికారి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఆయనతో పాటు ఓపీఎస్ మద్దతుదారులను కూడా పార్టీ నుంచి తొలగించారు. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ వ్యవహారంపై పళని, పన్నీర్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పళని నేతత్వంలో సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని పన్నీర్ సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన కాసేపటికే పళని నేతత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈపీఎస్…
బ్యాంకు రుణాలను ఎగవేసి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో నాలుగు నెలల కారాగార శిక్షను విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే ఉద్దేశంతో కోర్టు ధిక్కరణకు పాల్పడిన నిందితునికి తగిన శిక్షను విధించక తప్పదని జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంటూ మాల్యాకు రూ. 2,000 జరిమానా కూడా విధించింది. తన యాజమాన్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రూ.9,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణ ఎగవేత కేసులో మాల్యా నిందితుడిగా ఉన్నారు. వాస్తవాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు తన ప్రవర్తనకు నిందితుడు ఎటువంటి క్షమాపణ చెప్పకపోవడం లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో నాలుగు మాసాల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తున్నట్లు తన ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తన పిల్లలకు 40 మిలియన్ అమెరికన్ డాలర్లు బదలీ చేసి కోర్టు…
వచ్చే సంవత్సరం నాటికి జనాభా పరంగా భారత్ చైనాను అధిగమించి, అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా సంఖ్య 800 కోట్ల మార్క్ ను చేరుకుంటుంది. 1950 తర్వాత ప్రపంచ జనాభా అత్యంత తక్కువ వృద్ధి రేటును చూస్తోంది. 2020లో జనాభా వృద్ధి రేటు ఒక శాతం లోపునకు పడిపోయింది. 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు ప్రపంచ జనాభా విస్తరించనుంది. 2080 నాటికి 1040 కోట్లకు చేరి, 2100 నాటికి అదే స్థాయిలో జనాభా ఉంటుంది. ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు కాగా, భారత్ జనాభా 141.2 కోట్ల స్థాయిలో ఉంది. 2050 నాటికి పెరుగుతుందని అంచనా వేస్తున్న ప్రపంచ జనాభాలో సగం భారత్ సహా ఎనిమిది దేశాల్లోనే ఉంటుంది. మిగతా ఏడు దేశాలు.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్…
పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడమే కాకుండా బిజెపితో కలసి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి పదవి, అధికారంలతో పాటు కనీసం శాసనసభలో ప్రతిపక్ష నేత పదవి కూడా పొందలేక పోయిన ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన ఇప్పుడు కనీసం విధాన పరిషద్ లో ప్రతిపక్ష నేత పదవి కోసం కన్నేసినట్లు తెలుస్తున్నది. అందుకై మహా వికాస్ ఆఘాడిలో శివసేన మిత్రపక్షాలైన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లపై ఒత్తిడి చేయనున్నట్లు విధాన పరిషత్‌తో శివసేనకు చెందిన నూతన సభ్యుడు సచిన్ అహిర్ వెల్లడించారు. ఇటీవల శివసేన నేత ఏక్‌నాథ్ శిందే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహావికాస్ ఆఘాడి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తరువాత విధాన సభలో ప్రతిపక్ష పదవి నేతగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్‌ను ఎంపిక చేశారు. …
‘‘సింహాసనం ఖాళీ చేయండి. ప్రజలు వస్తున్నారు’’ అన్న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలు త్వరలోనే ఏపీలో నిజం కాబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. వైసీపీ నాయకుల దాష్టీకాలు, దౌర్జన్యాలు చూసి ప్రజలే వారిని సింహాసనం దించే సమయం దగ్గర పడుతోందని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో జనవాణి-జనసేన భరోసా రెండో విడత కార్యక్రమం ముగింపు సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల దాష్టీకాలను తట్టుకోవ డానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తిరగబడే మైండ్ సెట్ లేకపోతే ఈ దోపిడీ దౌర్జన్యకాండ ఇలాగే సాగుతుందని ప్రజలను హెచ్చరించారు. “పవన్ కల్యాణ్ ఒక్కడే తెగిస్తే సరిపోదు. మీలో నాయకులు, నాయకురాళ్లు పుట్టాలి. కామన్ మినిమం ప్రోగ్రాం కింద ప్రభుత్వ పాలనను ఎదిరించే బాధ్యతను అంతా తీసుకోవాలి” అంటూ పిలుపిచ్చారు. ‘‘దౌర్జన్యాలు, దోపిడీలు చేసేది మీరు. ప్రజల్ని వేధించేది, హింసించేది మీరు. కౌరవుల లక్షణాలు ఉన్న మీరు మమ్మల్ని అనడం దారుణం.…
టీఆర్‌ఎ్‌సలో చాలామంది ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని, అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం తన రెండు గంటల మీడియా సమావేశంలో వందసార్లు షిండే గురించి ప్రస్తావించారని, దీన్నిబట్టే టీఆర్‌ఎ్‌సలో ఏదో జరుగుతోందని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. టీఆర్‌ఎ్‌సలో ఎవరు షిండేలో తెలుసుకోవాలని సూచించారు. “కుంగుబాటులో ఉన్నడు. ఆయన ముఖ కవళికల్లో తేడా కన్పిస్తోంది. మహారాష్ట్ర ప్రజలు, నాయకులు కూడా తలచుకోనంతగా ఏక్‌నాథ్ షిండేను గుర్తుకు చేసుకుంటున్నడు. బహుశా ఆయన కుటుంబంలోనో, పార్టీలోనో కొందరు షిండేలుగా మారుతున్నట్లున్నరు. అది తెలిసి బీజేపీపై అభాండాలు వేస్తున్నడు” అంటూ సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని, తాము కూల్చాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. నువ్వు చేసిన సర్వేల్లోనే తెలుస్తుంది కదా అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కృష్ణా జలాలను ఏపీ దోచుకుపోతుంటే ఎందుకు మాట్లాడ్డం లేదు? ఆర్డీఎస్ గురించి…
మరోవంక, హర్యానాలో కాంగ్రెస్ సీనియర్ నేత కుల్‌దీప్ బిష్ణోయ్ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఆదివారం కలవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కుల్‌దీప్ బిజెపిలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో నడ్డాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‍కు పాల్పడినందుకు కుల్‌దీప్ బిష్ణోయ్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. ఆయన బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మకు ఓటు వేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బిష్ణోయ్ తమ పార్టీలో చేరాలనుకుంటే కచ్చితంగా ఆహ్వానిస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. మాజీ సీఎం దీపిందర్ సింగ్ హుడా అనుచరుడిని హరియాణా కాంగ్రెస్ చీఫ్‌గా నియమించడంపై బిష్ణోయ్ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు ఓటు వేయలేదు. తన మనస్సాక్షి చెప్పిన వ్యక్తికే ఓటు వేశానని ఎన్నికల అనంతరం ప్రకటించారు. గోవా కాంగ్రెస్ లో ముసలం మరోవంక, గోవా కాంగ్రెస్ లో…
శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ చెప్పారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందించినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం శరణార్థ సంక్షోభం లేదని జైశంకర్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది, ఏం జరుగుతుందో వేచి చూడాలని చెప్పారు. భారత్ నుంచి మాత్రం అవసరమైన సాయం అందుతుందని స్పష్టం చేశారు. ‘మేము శ్రీలంకకు మద్దతుగా ఉన్నాం. వారికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. వాళ్లు వారి సమస్యలతో సతమతమవుతున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి శరణార్థుల సంక్షోభం లేదు’ అని జైశంకర్ తెలిపారు. సంక్షోభంతో అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఆహారం, ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి కారణం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అని, ఆయనే ప్రస్తుత పరిస్థితికి బాధ్యత తీసుకోవాలంటూ లక్షల మంది…
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులు అందులో పెద్ద ఎత్తున నోట్లకట్టలు కనిపించడంతో ఆశ్చర్యంకు గురయ్యారు. ఆ భవనం అంతటా కలియతిరుగుతున్న నిరసనకారులు ఇంకా ఆ భవనాన్ని విడిచి వెళ్లలేదు. మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో తప్పించుకుపోయిన అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆచూకీ లభించలేదు. ఆయన ఓడలో పారిపోయి ఉంటారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సంక్షోభం నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు అధ్యక్షుడి నివాసంలో గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ, వ్యాయామ కేంద్రంలో కసరత్తులతో సందడి చేశారు. గుట్టలుగా ఉన్న కరెన్సీ నోట్లను నిరసనకారులు గుర్తించి, వాటిని భద్రతాధికారులకు అప్పగించినట్లు ఆ దేశ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి…