భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బిఎ.2కి ఉపరకమైన కొత్త సబ్ వేరియంట్ బిఎ.2.75ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది. బిఎ.2.75 లక్షణాలను విశ్లేషిస్తున్నామని పేర్కొంది. గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య 30 శాతం పెరిగింది. డబ్ల్యుహెచ్‌ఒకు చెందిన ఆరు సబ్‌రీజియన్‌లలో నాలుగు ప్రాంతాల్లో గతవారంలో కేసులు పెరిగాయని డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ అధ్నామ్ గాబ్రియేస్ పేర్కొన్నారు. యూరప్, అమెరికాల్లో బిఎ.4, బిఎ.5 వేరియంట్‌లు వ్యాప్తి చెందుతున్నాయని, భారత్ వంటి దేశాల్లో కొత్త సబ్ వేరియంట్ బిఎ..75 వ్యాప్తిని గుర్తించామని పేర్కొన్నారు. అయితే, పరిమిత స్థాయిలో జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతుండటంతో విశ్లేషణకు పూర్తి సమాచారం అందుబాటులో లేదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గతవారం 4.6 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పొలిస్తే మరణాలు 12 శాతం మేర తగ్గాయని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌పై డబ్ల్యు హెచ్‌ఒ శాస్త్రవేత్త సౌమ్యాస్వామినాథన్ మాట్లాడుతూ…
Author: Editor's Desk, Tattva News
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో వివాహం గురువారం నిరాడంబరంగా జరిగింది. కొద్ది మంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్ప్రీత్ కౌర్‌ను సీఎం మాన్ వివాహమాడారు. చంఢీగఢ్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా సైతం భగవంత్ మాన్ వివాహానికి హాజరయ్యారు. బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి వెలిగిపోయారు భగవంత్‌మాన్. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్‌కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతకుముందు తన సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆప్ నేత రాహుల్ చద్దా తెలిపారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల అని, ఇప్పుడు అది…
కాకతీయుల వంశం ప్రతాపరుద్రునితో ముగిసిపోయిందని అనుకుంటే వారి వారసులు ఇంకా సజీవంగా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం 22వ వారసుడిని నేడు వరంగల్ నగరానికి తీసుకురావడం ద్వారా రుజువు చేసింది. ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో నేటి నుంచి ఏడు రోజుల పాటు ప్రభుత్వం వరంగల్‌లో నిర్వహించనున్న ఉత్సవాల సందర్భంగా కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర బంజ్ దేవ్ నేడు సప్తాహాలను ప్రారంభించనున్నారు. ఈ వేడుకలను ప్రారంభించేందుకు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ వరంగల్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్‌లు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన హన్మకొండ లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. తమ పూర్వపు రాజవంశీయున్ని చూసేందుకు ఓరుగల్లు వాసులు భారీగా తరలి వచ్చారు. ఓరుగల్లును…
టీఆర్‌ఎస్ సర్కార్‌పై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుల ద్వారా పోరాటానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ప్రభుత్వ లెక్కలు, సమాచారం ఆధారంగా సర్కారును ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు కొత్త అస్త్రాన్ని ఎంచుకుంది. సీఎం కేసీఆర్ చట్టసభల్లో, జిల్లా పర్యటనల్లో ఇచ్చిన హామీలు మొదలు.. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోల్లో చేసిన వాగ్దానాలు, ఆర్థిక, రెవెన్యూ, విద్య, వైద్యం, సంక్షేమ, నీటిపారుదల తదితర శాఖల్లో చేపట్టిన కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితిపై దాదాపు వంద దాకా ఆర్టీఐ దరఖాస్తులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమర్పించారు. ఈ మేరకు సీఎంవోతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ ప్రభుత్వ శాఖల స్పెషల్ సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఈ పిటిషన్లను పంపారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్థాయిల్లో కూడా పార్టీ జిల్లా కమిటీలు, వివిధ మోర్చాలు, రాష్ట్ర స్థాయి నాయకుల ద్వారా పెద్దఎత్తున ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం…
బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ మంగళవారం ఇద్దరు సీనియర్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా, బుధవారం మరో ఐదుగురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. మంత్రులు కెమి బాడెనోచ్, నీల్ ఓ’బ్రియన్, అలెక్స్ బర్గార్ట్, లీ రౌలీ, జూలియా లోపెజ్‌లు బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బోరిస్ జాన్సన్‌ను ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తమకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం, తదుపరి ప్రధానిగా భావిస్తున్న భారత మూలాలు గల రిషి సునాక్ మాట్లాడుతూ “మన దేశం కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం…
నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన మంత్రిపదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఆయననే తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించవచ్చని పలువురు భావిస్తున్నారు. నఖ్వీతో పాటు మరో మంత్రి ఆర్‌సిపి సింగ్ (జెడియు) కూడా మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి రాజ్యసభ పదవి కాలం గురువారంతో ముగియనుంది. బుధవారం ఉదయం నఖ్వీ ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాలతో సమావేశం కావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్‌డిఎ అభ్యర్థిగా ఆయనను నిలబెట్టే అవకాశాలున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అబ్బాస్ నఖ్వీ, రాజ్‌నాథ్ సింగ్‌లు మాత్రమే వాజ్‌పేయి ప్రభుత్వం నుండి ప్రధాని మోదీప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇటీవల బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో మైనార్టీ వర్గంలో, ముఖ్యంగా భారత్ కు మంచి వాణిజ్య సంబంధాలున్న గుల్జ్ దేశాలలో కొంత ప్రతికూలత ఏర్పడినట్లు భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మైనార్టీ నేతకు…
రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ సాంస్కృతిక వవహారాలు, మత్స శాఖ మంత్రి సాజీ చెరియన్ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరించాయని ఆరోపించిన ఆయన ఏదేమైనా జరిగిన దానికి తాను విచారిస్తున్నానని తెలిపారు. సోమవారం పథనంతిట్టలో జరిగిన సిపిఎం సభలో చెరియన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. చెరియన్ వ్యాఖ్యలను కాంగ్రెస్, బిజెపి ఖండించాయి. రాజ్యాంగం ద్వారా మంత్రి పదవిని చేపట్టిన చెరియన్ అదే రాజ్యాంగాన్ని అవమానించారంటూ బిజెపి డుయ్యబట్టింది. పథనంతిట్ట సభలో మాట్లాడుతూ చెరియన్ రాజ్యాంగంపై దోపిడీదారులకు సాధనంగా మారిపోయిందంటూ ఆరోపించారు. బ్రిటిష్ విధానాన్ని కాపీ కొట్టి మనం రాజ్యాంగాన్ని రాసుకున్నామంటూ చెరియన్ వ్యాఖ్యానించడం పెను వివాదానికి దారితీసింది. కాగా..అంతకుముందు బుధవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగింది. రాజ్యాంగంపై చెరియన్ చేసిన వ్యాఖ్యలపై…
కాళీ మాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఒక సినిమా పోస్టర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆమెను అరెస్టు చేయాలని బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిరసన చేపట్టడమే కాకుండా టీఎంసీ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. మరోపక్క తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోడానికి మహువా నిరాకరించారు. బెంగాలీలు ఆరాధించే దేవతామూర్తి నిర్భయమైందంటూ ట్వీట్ చేశారు. ‘నేను కూడా కాళీ మాత ఆరాధకురాలినే. మీ గుండాలకు, మీ పోలీసులకు మరో ముఖ్యంగా మీ ట్రోల్స్‌కు దేనికీ నేను భయపడను. నిజం చెప్పేందుకు ఇతర శక్తుల మద్దతు అవసరం లేదు’ అంటూ గట్టిగా బదులిచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికీ తెలిసినవే అయినా ప్రస్తుతం వస్తోన్న విమర్శలు తీవ్ర దిగ్భ్రాంతికి…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమాల ఖాతాలలో పోస్ట్ చేశారని పిటిషనర్ గిరీష్ భరద్వాజ్ ఆరోపించారు. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా ఇండియన్ కాపీరైట్ యాక్ట్, 1957; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, కోర్టు ధిక్కార చట్టాలను ఆయన ఉల్లంఘించారని ఆరోపించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌పీ సందేశ్ వ్యాఖ్యలతో కూడిన వీడియోను రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారని గిరీష్ భరద్వాజ్ ఆరోపించారు. న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాలను తిరిగి ప్రసారం చేయకూడదని, మార్పులు చేయకూడదని పేర్కొన్నారు. ‘‘ఆథరైజ్డ్ రికార్డింగ్స్‌ను ఒరిజినల్ ఫార్మ్‌లో కేవలం శిక్షణ, విద్యా సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇటువంటి రికార్డింగ్స్‌ను ప్రమోషనల్ పర్పసెస్ కోసం కానీ, సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడానికి కానీ, ఏ రూపంలోనైనా ప్రమోషన్ చేసుకోవడానికి కానీ ఉపయోగించకూడదని నిబంధనలు…
బాలా సాహెబ్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాల పరిరక్షణ కోసమే తాము పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, బిజెపి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే స్పష్టం చేశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఇతర పార్టీలు లాభపడుతూ, శివసేన నష్టపోతున్నదని చెప్పినా పట్టించుకొనక పోవడంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో తిరుగుబాటు చేయవలసి వచ్చినదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మహా వికాస్ అఘాడీ’ కూటమితో శివసేనకు జరిగిన నష్టమేంటి ? మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో శివసేన ఉండటం మంచిది కాదనే విషయాన్ని నేను పార్టీ అధిష్ఠానానికి గతంలో ఎన్నోసార్లు చెప్పాను. సైద్ధాంతిక విబేధాలున్న పార్టీలతో పొత్తు మంచిది కాదని వారించాను. దీనిపై శివసేన ఎమ్మెల్యేలంతా బాధపడుతున్నారని కూడా వివరించాను. అయినా వినిపించుకోలేదు. పర్యవసానంగానే సీఎం పదవి మా చేతిలో ఉన్నా, నగర పంచాయతీ ఎన్నికల్లో శివసేన నాలుగో స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. దీనర్ధం మహా వికాస్ అఘాడీ సర్కారు వల్ల లబ్ధి శివసేనకు జరగలేదు..…