ప్రముఖ సినీ నటుడు మిథున్ చక్రవర్తిని రాజ్యసభకు నామినేట్ చేయాలని బిజెపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరి, ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఆయన ఆ తర్వాత మౌనంగా ఉంటూ వచ్చారు. అయితే అకస్మాత్తుగా సోమవారం కలకత్తాలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఆయన రావడం గమనించిన వారికి బిజెపి ఢిల్లీ నేతల పిలుపు మేరకే వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో నామినేట్ సభ్యుల ఖాళీలు ఏడు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుండి రూప గంగోపాధ్యాయ, స్వపన్ దాస్‌గుప్తాల పదవీకాలం ముగిసింది. వారిద్దరి స్థానంలో తిరిగి బెంగాల్ నుండి అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర నాయకత్వం కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోమ్…
Author: Editor's Desk, Tattva News
మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే బలపరీక్షలో విజయం సాధించడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) కూటమి ప్రశ్నార్ధకంగా మారింది. థాకరేతో ఎన్సీపీ, కాంగ్రెస్ ఇంకెంతకాలం కొనసాగుతారో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటివరకు మిత్రపక్షాలు శివసేన, ఎన్సీపీతో అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు షిండే సీఎం అయ్యాక మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ కూటమి నుంచి బయటకు కావాలనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిత్రపక్షం బీజేపీ తెగదెంపులు చేసుకున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జట్టు కట్టి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఠాక్రేకు ఏక్‌నాథ్ షిండే షాక్ ఇచ్చారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గతవారమే సీఎంగా బాధ్యతలు చెప్పారు. మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ విడిపోతుందనే వార్తలు బయటకు రాగానే బీజేపీ ఎంపీ…
అమరవీరుల ఆకాంక్షలను వాస్తవం కావించి, కుటుంభ, అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలమని ప్రజలను ఒప్పించడం ద్వారా తెలంగాణాలో తగిన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగింది బిజెపి మాత్రమే అని హైదరాబాద్ లో రెండు రోజులపాటు జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు స్పష్టం చేశాయి. తెలంగాణలోని పరిస్థితులపై ప్రత్యేకంగా సమావేశాలు ఆమోదించిన ఓ ప్రకటనలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక, సామజిక, మానవ అభివృద్ధి వంటి అన్ని సూచికలలో తీవ్రమైన క్షీణత వ్యక్తం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రం ఇటువంటి నీచమైన అధోగతికి చేరుకోవడం గతంలో ఎన్నడూ ఎరుగదని తెలుపుతూ అందుకు పూర్తి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నదని పేర్కొంటూ 2019 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు, టీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకోగా, ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుందమొ గుర్తుజి సీజేసోందో. 2018 ఎన్నికలలో పొందిన ఓట్లకన్నా చాలా ఎక్కువగా బిజెపి 19.45 ఓట్లు సాధించుకుందని తెలిపింది. అయితే, దేశ వ్యాప్తంగా…
ప్రస్తుతం ఉన్న 5,12, 18 మూడు రకాల శ్లాబులను కుదించి రెండే ఉండాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న డిమాండ్ ఉందని, దీనిపై కొంత వ్యతిరేకత ఉందని చెబుతూ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి మరికొంత కాలం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే, రాష్ట్రాలు కోల్పోయో ఆదాయంపై స్పష్టత రానంత వరకు దీనిపై ఏకాభిప్రాయం సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని రెవెన్యూ కార్యదర్శి కూడా దృవీకరించారు ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆదాయాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్న మన దేశంలో విలాసవంతమైన వస్తువులు, వాహనాలు, హానికరమైన వాటిపై 28శాతం జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేస్తూ ప్రస్తుతం ఉన్న జీఎస్టీ శ్లాబులలో అత్యధికంగా ఉన్న 28 శాతం…
విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధానికి సోమవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని వీడ్కోలు పలికే సమయంలో సిఎం వినతిపత్రం సమర్పించారు. భీవమరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ పయనమైన ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో సిఎం వీడ్కోలు పలికారు. రిసోర్స్‌గ్యాప్ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో పేర్కొన్న సిఎం రూ.34,125.50 కోట్లను ఇవ్వాలని కూడా కోరారు. ముఖ్యంగా తెలంగాణా డిస్కమ్‌ల నుండి రావాల్సిన రూ.6,627 కోట్లను ఇప్పించాలని ప్రధానికి విజ్జప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలిపాలని ముఖ్యమంత్రి కోరారు. జాతీయ ఆహార భద్రతాచట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతుబద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు. దీనిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. నల్ల బెలూన్లు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రధాని పర్యటన సందర్భంగా బ్లాక్ బెలూన్లు ఎగరడంపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సీరియస్ అయ్యింది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ స్పష్టం చేసింది. బెలూన్ల తరహాలోనే డ్రోన్లను ఎగరేస్తే పరిస్థితేంటని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్పీజీ నివేదిక కోరినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్‌పాల్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ నేతలు నల్లబెలూన్లను ఎగురవేశారు. ప్రధాని భద్రతా విషయంలో ఎలాంటి వైఫల్యం లేదు. ఇప‍్పటికే కాంగ్రెస్ నేత సుంకర పద‍్మ, సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశాము. మిగతా వారిని…
ఏడు నుంచి పదేళ్లలో పెట్రోల్‌తో నడిచే వాహనాలను దశలవారీగా తొలగించాలని ఆటోమేకర్ మారుతీ సుజుకి నిర్ణయించింది. అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ భారత ప్రభుత్వం నిర్దేశించిన గ్రీన్ టార్గెట్‌కు తగ్గట్టు తన ఉత్పత్తులను అప్‌డేట్ చేయాలని చూస్తున్నందున ఈ చర్య తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. తన మొత్తం వాహన తయారీ సిస్టమ్‌ని పర్యావరణ అనుకూల పరిస్థితులకు తగ్గట్టు మార్చడానికి మరో 7నుంచి10 సంవత్సరాలు పడుతుందని కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. రాబోయే పదేళ్ల కాలంలో తాము అన్ని వాహనాలను మారుస్తామని, పెట్రోల్‌తో నడిచే వాహనాలు ఇకపై ఉండబోవని మారుతీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రామన్ తెలిపారు. మారుతీ వాహనాలన్నీ ఇకమీదట ఎలక్ట్రానిక్, లేదా సి ఎన్ జి తో నడిచేవి గానూ, లేకుంటే బయో ఇంధనం ద్వారా నడిచేలా తయారు చేస్తామన్నారు. అయితే.. ఎలక్ట్రిక్, బయో ఇంధనం ఆధారిత వాహనాల ధరలలో గణనీయమైన మార్పు ఉంటుందని రామన్ చెప్పారు. కాగా, ఎలక్ట్రిక్…
వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ లోని ఇంటివద్ద మూడు రోజులుగా ఎవ్వరో రెక్కీ నిర్వహిస్తుండటం కలకలం రేపుతున్నది. తన హత్యకు కుట్ర జరుగుతున్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయన ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు రెక్కీ నిర్వహించడాన్ని సెక్యూరిటీ సబ్బంది గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక వ్యక్తి పట్టుపడ్డాడు. మిగిలినవారు పారిపోయారు. ఆ వ్యక్తిని విచారించగా రకరకాలుగా పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకసారి తన పేరు బాషా అని, మరొకసారి సుభాన్ అని చెబుతున్నాడు. ఇంకొకసారి డిపార్టుమెంట్‌కు చెందిన వ్యక్తినని, విజయవాడ, హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తూ ఉంటానని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడకి వచ్చానట్లు ఆ వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. ప్రశ్నించిన ప్రతిసారి రకరకాలుగా సమాధానాలు చెబుతున్నాడు. ఏఆర్ కానిస్టేబుల్‌నని, మరోమారు క్రైమ్ పోలీసునని చెబుతున్నాడు. వీఆర్‌లో ఉన్న తనను ఉన్నతాధికారులే ఇక్కడకు తీసుకు వచ్చారని తెలిపాడు. కనీసం…
ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని చెప్పారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘‘మన్యం వీరుడు.. తెలుగుజాతి ముద్దు బిడ్డ.. తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా నినాదంతో జన చైతన్యాన్ని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ పుణ్య పుడమిపై మనమంతా కలుసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని మోడీ తెలుగులో పేర్కొన్నారు. ‘‘మన దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను (ఆజాదీకా అమృత్ మహోత్సవ్) జరుపుకుంటున్నాం. సరిగ్గా ఇదే సమయంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో విప్లవకాంతులు నింపిన చారిత్రక రంప ఉద్యమానికి కూడా ఇప్పటికి 100 సంవత్సరాలు గడిచాయి.…
మహారాష్ట్రలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది. శివసేన అసమ్మతి వర్గ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో చేపట్టిన బలపరీక్షలో అలవొకగా నెగ్గారు. బలపరీక్షకు అవసరమైన మెజార్టీ మార్కును ఆయన సాధించారు. షిండేకు 164 మంది మద్దతు ప్రకటించారు. 99 వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి.కాగా, పలువురు కాంగ్రెస్ నేతలు ఈ ఓటింగ్‌లో పాల్గనలేదని తెలుస్తోంది. సోమవారం అసెంబ్లీ మొదలు కాగానే స్పీకర్ విశ్వాస పరీక్ష చేపట్టారు. తొలుత మూజువాణీ పద్ధతి ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించగా.. ప్రతిక్షాలు డివిజన్ ఆఫ్ ఓట్ పద్ధతిలో చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఇందుకు అంగీకరించిన స్పీకర్.. డివిజన్ ఆఫ్ ఓటింగ్ పద్ధతిలో చేపట్టారు. ప్రస్తుతం చీలిన శివసేన వర్గంలో.. షిండే వైపు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరేపై తిరుగుబావుటా ఎగుర వేసిన షిండే వర్గం.. అసోంలోని హోటల్‌లో మకాం వేసిన సంగతి తెలిసిందే. తామే…