Author: Editor's Desk, Tattva News

సుప్రీంకో​ర్టులో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్‌నాథ్‌ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ మేరకు రెబల్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శివసేన శాసనసభా పక్షనేత అజయ్‌ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్‌, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయిదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కార్‌ను ఆదేశించింది. జూలై 11న పిటిషన్లను తిరిగి విచారిస్తామని తెలిపింది. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హతపై డిప్యూటీ స్పీకర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉద్దవ్‌ ఠాక్రే లాయర్‌ తెలిపారు. డిప్యూటీ…

Read More

 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా.. సోమవారం విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేశారు. అధికార పక్షం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో యశ్వంత్‌ సిన్హాతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతరామ్‌ ఏచూరి, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌తోపాటు పలువురు విపక్షనేతలు ఉన్నారు. పార్లమెంట్‌ భవనంలో రిటర్నింగ్‌ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోడీకి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా పార్టీలు మాత్రం తమ ప్రతినిధులను పంపలేదు. సిన్హా శుక్రవారం మాట్లాడుతూ, తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, మహిళలు, అణగారిన వర్గాల కోసం గళమెత్తుతానని చెప్పారు. తనను ప్రతిపక్షాల…

Read More

గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నరేంద్ర మోదీకి ఆ అల్లర్లతో సంబంధం లేదని కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ, ఈ కేసులలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా దర్యాప్తులను పక్క దారి పట్టించారని అంటూ మోదీపై కేసులలో కీలకంగా వ్యవహరించిన వారిపై కఠినంగా పదజాలం ఉపయోగించడంతో మొత్తం కేసు కొత్త రూపు తీసుకున్నాయి. సుప్రీం కోర్ట్ తీర్పు తనపై చేసిన వాఖ్యాలను ఆసరాగా చేసుకొని, ఆ మరుసటి రోజే తనపై గుజరాత్ పోలీసులు మరో కేసు నమోదు చేసి, ఆ సాయంత్రానికల్లా అరెస్ట్ చేస్తారని సామజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ అసలు ఉహించినట్లు లేదు. అందుకనే అరెస్ట్ తో ఆమె ఓ విధంగా షాక్ కు గురయ్యారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో ఫోర్జరీ, నేరపూరిత కుట్ర దర్యాప్తు ప్రక్రియను అవమానించారనే అభియోగాలపై నమోదైన కేసు విచారణకు గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను క్కూడా ఏర్పాటు చేసింది.…

Read More

మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేనతో చెలరేగిన `తిరుగుబాటు’ వారం రోజులవుతున్నా పరిష్కారం లభించే అవకాశాలు కనిపించకపోవడంతో రాష్ట్రపతి పాలనా అనివార్యం అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  తిరుగుబాటు ఎమ్యెల్యేల కార్యాలయాలపై దాడులు, నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉండడం, వారు తిరిగి వస్తే దాడులు తప్పవని అంటూ బెదిరింపులు చేస్తుండడంతో గవర్నర్ జోక్యం తప్పకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.  మరోవంక, డిప్యూటీ స్పీకర్‌ నరహరిజైర్వాల్‌ తమపై ఇచ్చిన అనర్హత వేటు నోటీసులను సవాల్‌ చేస్తూ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్‌ నోటీసుతో పాటు, శివసేన శాసనసభాపక్ష నేతగా అజరు చౌదరిని నియమించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ రెండు పిటిషన్లను దాఖలు చేసింది.  అనర్హత పిటిషసన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌ను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. అలాగే తమ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరారు. సోమవారం ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది.  రాష్ట్రంలో శాంతిభద్రతలు విచ్ఛిన్నమైతే,…

Read More

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్‌ అడ్డాలో కమలం వికసించింది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ నెల 23న జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో  బీజేపీ సత్తా చాటింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది.  ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి షాక్‌ ఇచ్చింది. ఎస్పీకి కంచుకోటలాగా, సిట్టింగ్‌ స్థానాలైన రాంపూర్‌, ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానాలాలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. రాంపూర్ లో బిజెపి అభ్యర్థి  ఘన్‌ శ్యామ్‌ లోధి  42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది.. త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. రాంపూర్ లోక్‌స‌భ స్థానం ఇప్ప‌టివ‌ర‌కు ఆజంఖాన్ కంచుకోట‌గా ఉంది.  ఇక ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానంలోనూ కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి దినేశ్‌ లాల్‌ యాదవ్‌ 8,679 ఓట్ల…

Read More

బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని అన్ని గిరిజన తండాల్లో సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో కనీస వేతనాల్లేక, వివక్షకు గురవుతున్న పూజారులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్ఛారు.  బిజెపి రాష్త్ర కార్యాలయంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో పాతబస్తీకి చెందిన వందలాది మంది గిరిజనులతో సంజయ్ సమావేశమయ్యారు. అఖిల భారత బంజారా సంఘం నాయకులు క్రిష్ణా నాయక్, జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు నేదునూరు కనకయ్యతోపాటు పలువురు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.  మోదీ హయాంలో గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు సంజయ్ తెలిపారు.  సామాన్య కుటుంబంలో జన్మించిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించారు. మైనారిటీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ అబ్దుల్ కలాంను, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా చేసిన ఘనత…

Read More

అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్న దృష్ట్యా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బియ్యం సేకరణను నిలిపి వేసింది. దానితో తెలంగాణాలో బియ్యం మిల్లులు మూతపడుతున్నాయి. పలు తనిఖీలలో బియ్యం నిల్వలు లెక్కలకు సరిపోకపోవడంతో ఎఫ్‌సీఐ తీవ్రంగా పరిగణించింది. సన్నధాన్యానికి సంబంధించి ఇబ్బంది లేకపోగా, దొడ్డు ధాన్యం మిల్లింగ్‌ చేసేచోట సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94లక్షట మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణను ఈ నెల 7 నుంచి నిలిపివేయడంతో 20 రోజులుగా కస్టమ్‌ మిల్లింగ్‌ నిలిచిపోయింది. బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ అనుమతించకపోవడంతో మిల్లింగ్‌ ప్రక్రియ నిలిచిపోయి మిల్లర్లు, కార్మికులు, మిల్లులపై ఆధారపడిన తౌడు, నూక వ్యాపారులు, సాల్వెంట్‌ ఆయిల్‌మిల్‌ పరిశ్రమ కూడా కుదేలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3200 రైసు మిల్లింగ్‌ నిలిచిపోవడంతో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైసు మిల్లుల యజమానులతో పాటు కూలీలు,…

Read More

దేశంలో కొందరు నేతల నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విధానాన్ని విశ్వసించిన ప్రజలు సాహసోపేత పోరాటం చేశారని, ప్రజాస్వామ్య స్పూర్తితో ఓడించారని చెబుతూ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ  కొనియాడారు. ఏళ్ల తరబడి దేశ ప్రజల్లో నరనరానా జీర్ణించుకుపోయిన ప్రజాస్వామ్య విలువలవల్ల, అదే మార్గంలో నియంతృత్వ విధానాలపై పోరాడి విజయం సాధించగలిగారని పేర్కొన్నారు.  ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాచి, అనేక దారుణాలకు కారణమైన అత్యయిక స్థితిని రద్దు చేసే వరకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు చివరి వరకు పోరాడారని గుర్తు చేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని.. భారత చరిత్రలో చీకటి ఘట్టంగా అభివర్ణించిన ప్రధాని, ప్రజల వీరోచిత పోరాటం వల్ల నియంతలు తలవంచక తప్పలేదని స్పష్టం చేశారు. ప్రతినెల ప్రసారమయ్యే ప్రధానమంత్రి మోడీ మన్‌ కీ బాత్‌లో భాగంగా ఆదివారంనాడు 90వ ప్రసంగంలో ఆయన ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడిన…

Read More

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య థాకరేపై తిరుగుబాటు జరిపి, ఎనిమిది మంది మంత్రులతో సహా మూడింట రెండు వంతుల మందికి పైగా ఎమ్యెల్యేతో గౌహతిలో మకాం వేసిన శివసేన సీనియర్ నాయకుడు ఎకనాథ్ రానిదే కు నెలరోజుల క్రితమే ముఖ్యమంత్రి పదవిని థాకరే ఇవ్వజూపినట్లు తాజాగా చెబుతున్నారు. స్వయంగా ఈ విషయాన్నీ మంత్రిగా ఉన్న థాకరే కుమారుడు ఆదిత్య థాకరే వెల్లడించారు.  ఈ ప్రతిపాదనను మే 20న చేయగా, షిండే నుండి సరైన సమాధానం లేదని చెప్పారు. సరిగ్గా నెల రోజుల తర్వాత `తిరుగుబాటు’ చేటుచేసుకోవడం గమనార్హం. అయితే, `తిరుగుబాటు’ను ముందే ఊహించి ఈ ప్రతిపాదన చేశారా? అనే అనుమానం కలుగుతుంది. వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు కలసి చేరి సగం రోజులు పంచుకోవాలని అనుకున్నట్లు థాకరే చెబుతున్నారు. ఆ హామీకి బిజెపి నిలబడక పోవడం వల్లననే ప్రభుత్వం బిజెపితో కలసి ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదని అంటున్నారు. కానీ, అటువంటి అవగాహన ఏదీ జరగలేదని స్వయంగా హోమ్ మంత్రి అమిత్ షా…

Read More

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపాందారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. ఇక, పోస్టల్‌ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్‌ ఓట్లలోనూ వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం సాధించింది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి…

Read More