భారత పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలలో ప్రజా ప్రతినిధుల సాధారణ గణాంకాలను పరిగణలోకి తీసుకొంటె జులై చివరి వారంలో భారత రాష్ట్రపతిగా తొలిసారిగా ఓ గిరిజన మహిళ ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు చేబట్టపోతున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వారిలో రాష్ట్రపతి పదవి అధిష్టిస్తున్నవారిలో కూడా ఆమె మొదటి వారు కావడం గమనార్హం. ఓ మారుమూల గిరిజన గ్రామంలో జన్మించి, ప్రభుత్వంలో గ్రూప్-3 ఉద్యోగంతో ప్రారంభించి, ఉపాధ్యాయురాలుగా మారిన సాధారణ గిరిజన కుటుంబ మహిళ రాజకీయ వేత్త అయిన ఆమె జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా గెలుపొందడం లాంఛనమే కాగలదు. స్వాతంత్ర్య కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశం మొత్తం 75 ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అత్యంత వెనుకబడిన సంతాలీ గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడమే ఓ చారిత్రాత్మక మలుపు కాగలదు. భారతదేశంలోని 12 కోట్ల మంది గిరిజనుల సాధికారికతకు సంబంధించి కీలకమైన మలుపు …
Author: Editor's Desk, Tattva News
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇవాళ బీసీసీఐ ట్వీట్ చేసింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. “శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ తేలింది. అతడు ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు. అదే విధంగా అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని” బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. కాగా, జూలై 1 నుంచి ఇంగ్లాడ్ తో టెస్టు క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టెస్టుకు ముందే రోహిత్ కు పాజిటివ్ రావడం టీమిండియాకు భారీ షాక్ అనే చెప్పొచ్చు. రోహిత్ వారం రోజులు పాటు ఐషోలేషన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూలై1న జరగబోయే నిర్ణయాత్మక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ ప్రస్తుతం టీసెస్టర్ జట్టుతో జరుగుతోన్న వార్మప్ మ్యాచ్ లో ఆడుతున్నాడు. గురువారం…
శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసి, మూడింట రెండు వంతుల మంది ఎమ్యెల్యేలను గౌహతిలోని ఓ స్టార్ హోటల్ కు తరలించిన ఆ పార్టీ సీనియర్ నేత ఏకనాథ్ షిండే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శివసేన రంగం సిద్ధం కావడంతో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత నోటీసులు పంపి, సోమవారంనాటికి సమాధానాలు సమర్పించాలని ఆదేశించారు. ఇప్పుడేమి చేయాలో అన్నదానిపై సందిగ్థలో పడినట్లు కనిపిస్తున్నది. డిప్యూటీ స్పీకర్ ఎన్సీపీకి చెందిన వ్యక్తి కావడంతో 16 మందిపై అనర్హత వేటు వేస్తే తమ తిరుగుబాటు అంతా వృధా ప్రయత్నం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. పైగా, శాసన సభ్యత్వం కూడా కోల్పోతే మిగిలిన తిరుగుబాటు ఎమ్యెల్యేలు అందరూ జారుకునే అవకాశం ఉంది. కోర్టును ఆశ్రయించినా అప్పట్లో తేలే అంశం కాదు. అనర్హత అంశాలకు సంబంధించిన పిటీషన్లు దేశంలో ప్రస్తుతం నాలుగు హైకోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయమై గౌహతిలో తాము ఉంటున్న హోటల్ కు సీనియర్ న్యాయ…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బిజెపి జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందుకోసం జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరుప తలపెట్టిన జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆసరా చేసుకొని రాష్ట్ర ప్రజలందరికి బలమైన సందేశం వినిపించేందుకు సమాయత్తం అవుతున్నది. బిజెపి తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ తెలంగాణ బిజెపి రూపొందించిన వెబ్ సైట్ ను శనివారం ఆవిష్కరిస్తూ ఇకనుండి కేసీఆర్ ప్రభుత్వం రోజులు దగ్గర పడినట్లే అని స్పష్టం చేశారు. మరోవంక, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇతర రాష్ట్రాల నేతలను నియోజకవర్గాల ఇన్ చార్జులుగా నియమించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా నియోజకవర్గాల్లో వీరి కింద మరో నేత కూడా ఉంటారు. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి…
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, గుజరాత్ రిటైర్డ్ డిజిపి ఆర్ బి శ్రీకుమార్ లను గుజరాత్ తీవ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తీస్తాను ముంబై లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకోగా, శ్రీకుమార్ గాంధీనగర్ లోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. 2002 గుజరాత్ నరమేధం కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే ఈ అరెస్టులు జరిగాయి. గుజరాత్ నరమేధం కేసుకు సంబంధించి నకిలీ పత్రాలను తయారు చేశారనే ఆరోపణలతో తీస్తా సెతల్వాద్, పోలీసు మాజీ అధికారులు ఆర్‌బి శ్రీకుమార్, సంజీవ్ భట్‌లపై అహ్మదాబాద్ సిటీ క్రైం బ్యాచ్‌లో శనివారం ఉదయం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా, 1990 కస్టడీ మృతి కేసులో సంజీవ్ భట్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ట దిగజార్చడానికి తీస్తా సెతల్వాద్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం…
మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2022 కిరీటాన్ని బ్రిటన్‌కు చెందిన బయోమెడికల్ విద్యార్థిని ఖుషి పటేల్ దక్కించుకున్నారు. భారతదేశం వెలుపల గత 29 ఏళ్లుగా ప్రపంచవ్యాప్త భారతీయ అందాల సుందరి పోటీలను ఇండియా ఫెస్టివల్ కమిటీ(ఐఎఫ్‌సి) నిర్వహిస్తోంది. ఈ ప్రపంచవ్యాప్త భారతీయ అందాల సుందరి పోటీలో ఫస్ట్ రన్నర్ అప్‌గా అమెరికాకు చెందిన వైదేహి డోంగ్రే ఎంపిక కాగా సెకండ్ రన్నర్ అప్‌గా శృతికా మానే ఎంపికయ్యారు. ఈ అందాల సుందరి పోటీలో పాల్గొన్న 12 మంది సుందరీమణులు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వేర్వేరు అందాల పోటీలలో విజేతలుగా నిలిచినవారే. కాగా..గుయానాకు చెందిన రోషనీ రజాక్ మిస్ టీన్ ఇండియా వరల్డ్‌వైడ్ 2022 విజేతగా నిలిచారు. అమెరికాకు చెందిన నవ్యా పైంగల్ ఫస్ట్ రన్నర్ అప్‌గా, సురినాంకు చెదిన చిఖితా మలాహ సెకండ్ రన్నర్ అప్‌గా గెలుపొందారు. చివరిగా 2019లో ముంబయిలోని లీలా హోటల్‌లో ఈ పోటీలు జరిగాయి. కరోనా కారణంగా మూడేళ్ల…
ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం కక్షసాధింపు చర్యలలో భాగం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ఉపాధ్యాయులను వేధించడంలో భాగంగా జారీ చేసిన ఆదేశాలుగానే స్పష్టం చేస్తూ, వినాశకాలే విపరీత బుద్ది అనే చందంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయకులను వేధించడమే లక్ష్యంగా పిచ్చి తుగ్లక్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఒక వంక, 317 జీవో పేరుతో ఉద్యోగుల, ఉపాధ్యాయులను రాచిరంపాన పెడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు బదిలీలు చేస్తూ టీచర్లకు అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదం అని సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ నియంత–కుటుంబ–అవినీతి-దుర్మార్గపు పాలనలో…
నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా జాతీయ స్థాయిలో ఒకప్పుడు రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించడమే కాదు, కనీసం ఇద్దరు ప్రధాన మంత్రుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజకీయంగా ఒంటరిగా కనిపిస్తున్నారు. రాజకీయంగా ఆయనతో జత కట్టడానికి జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎవ్వరు ఆసక్తి కనబరచడం లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాలం నుండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనతో పొత్తుకోసం ఒకవంక వామపక్షాలు, మరోవంక బిజెపి పోటీ పడుతూ ఉండెడివి. చివరకు ఆయనతో విభేదించి, మంత్రి పదవి ఇవ్వకపోవడంతో బయటకు వెళ్లి టి ఆర్ ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న కె చంద్రశేఖరరావు సహితం 2009లో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీతో పొడగిట్టని రెండు వామపక్షాలు సహితం అదే సమయంలో టిడిపితో కలసి పోటీ చేశాయి. 2014 ఎన్నికలలో బిజెపితో కలసి పోటీచేసిన చంద్రబాబు అధికారంలోకి రావడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో బిజెపితో కలసి మంత్రి పదవులు పంచుకున్నారు. అటువంటిది 2019 నుండి ఆయనతో పొత్తుకు ఏ పార్టీ కూడా…
మహారాష్ట్రలో సొంత పార్టీ ఎమ్యెల్యేలు ఎకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ కోల్పోయిన విషయం నిర్ధారణ కావలసింది అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే గాని, రాజ్ భవన్ లలో కాదని గతంలో పలు న్యాయస్థానాలు స్పష్టం చేయడంతో బలపరీక్ష జరగడం అనివార్యంగా కనిపిస్తున్నది. బలపరీక్షలో తమ మెజారిటీ నిరూపించు కొంటామని థాకరేతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్ `మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్నప్పటికీ అందుకు తగిన బలం లేదని వారికి తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా కాలయాపన చేస్తే, తిరుగుబాటు ఎమ్మెల్యేలలో కొందరు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ సందర్భంగా ఎమ్యెల్యేల సమావేశానికి హాజరు కాలేదని 16 మందిని అనర్హులుగా ప్రకటించాలని శివసేన డిప్యూటీ స్పీకర్ కు లేఖ అందీయడం బలపరీక్షను జాప్యం చేయడం కోసమే అని తెలుస్తున్నది. అది గమనించే షిండే తన మద్దతుదారులతో ముంబైకి వచ్చి డిప్యూటీ స్పీకర్ ను కలసి, తనను శివసేన శాసనసభ పక్ష నాయకుడిగా…
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకే రాజకీయ సంక్షోభం సృష్టించారని, దీని వెనుక బీజేపీ పాత్ర ఉందని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలు చేయడం పట్ల బిజెపి మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేస్తూ శివసేన పార్టీపై ఆ పార్టీ మంత్రి ఏక్‌నాథ్ షిండే చేసిన తిరుగుబాటులో తమ పార్టీ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ‘ఏదోపని మీద’ మాత్రమే ఢిల్లీ వెళ్లారని, ఈ సంక్షోభంపై సంబంధం లేదని తెలిపారు. చెప్పారు. తన స్వస్థలం కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ , శివసేన, మహా వికాస్ అఘాడిలో తలెత్తిన సంక్షోభంలో బీజేపీ పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. ముంబైలో గురువారం మధ్నాహం తాను దేవేంద్ర ఫడ్నవిస్‌తో లంచ్ చేశానని, ఆ తర్వాత ఆయన ఏదో పనిమీద ఢిల్లీ వెళ్లారని తెలిపారు.…