Author: Editor's Desk, Tattva News

ఇంటర్నెట్‌ కేవలం అవసరమైన సమాచారం సులభంగా తెలుసుకొనే వేదికగానే కాకుండా ఆత్మహత్యలకు, నేరాలకు పాల్పడే వారికి ఓ గైడ్ గా కూడా సహకరిస్తున్నట్లు పలు ఉదంతాలు వెల్లడి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడిన ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) ఏవిధంగా ఆత్మహత్య చేసుకోవాలో ఇంటర్నెట్‌ ద్వారానే తెలుసుకున్నట్లు తెలుస్తున్నది.  ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ప్రత్యూష 10 రోజుల ముందు నుంచే దానికి మానసికంగా సిద్ధం  అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే, నొప్పి తెలియకుండా, ఎట్లాంటి బాధా క‌ల‌గ‌కుండా సులభంగా చ‌నిపోవ‌డం ఎలా అనే దానిపై ఆమె ఇంటర్నెట్‌లో వెతికి ప‌లు వివరాలు సేక‌రించినట్టు చెబుతున్నారు.  కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం ద్వారా అయితే ఎట్లాంటి బాధ లేకుండా సులభంగా చనిపోవచ్చని తెలుసుకొని అది కొనుగోలు చేసినట్లు వెల్లడైనది. అయితే దానిని ఎక్కడి నుంచి కొనుగోలు చేసింద‌నే విషయంపై  పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.  కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోవడం కుదరదని భావించిన…

Read More

జాతీయ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం కోసం ఓ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేసిన ప్రకటనను దేశంలో ఎవ్వరు అంత సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయమై ఎవరూ కనీసం ఎటువంటి వాఖ్య కూడా చేయలేదు. అయితే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆయనను ఆదివారం కలవడం ఆసక్తి కలిగిస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు గురించి కేసీఆర్ సంకేతం ఇచ్చిన తర్వాత బహుశా ఆయనను కలసిన టి ఆర్ ఎస్ తో సంబంధం లేని నేత ఆయనే కావడం గమనార్హం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా, ఆయన మద్దతుతో రెండు సార్లు రాజమహేంద్రవరం నుండి లోక్ సభకు ఎన్నికైన తర్వాత, ఏపీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్ధకంగా ఉండడంతో ఆయన  క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  మరోవంక, రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ ప్రారంభించి, ఏపీలో అధికారంలోకి వచ్చినా ఆయనతో ఉండవల్లికి మంచి సంబంధాలు ఉన్నట్లు…

Read More

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వరకు జాతీయ రాజకీయాలలో దాదాపు మౌనంగా వ్యవహరిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అకస్మాత్తుగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలకు కేంద్ర బిందువుగా ఎదిగే ప్రయత్నం ప్రయత్నించారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కొద్దిమంది ప్రతిపక్ష నేతలతో ఫోన్ లో  మాట్లాడి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గురించి చర్చలకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో మమతా నేరుగా ఈ నెల 15న ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు.  రాష్ట్రపతి ఎన్నిక విషయమై ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలతో టెలిఫోన్ లో మాట్లాడిన సోనియా గాంధీ అదేరోజున శరద్ పవర్, స్టాలిన్ వంటి కొందరు యుపిఎ, వామపక్షాలకు చెందిన సీనియర్ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. బహుశా ఈ భేటీ విషయంలో తనను నిర్లక్ష్యం చేశారని కావచ్చు మమతా అదేరోజు మరో భేటీ జరపడం ప్రతిపక్ష శిబిరంలో కల్లోలం సృష్టింప నున్నది.  రాష్ట్రపతి ఎన్నికలకు సంయుక్త వ్యూహాన్ని రూపొందించేందుకు జూన్ 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి వారిని…

Read More

కేసీఆర్‌ ఎనిమిదేండ్ల పాలనలో జనాభాలో సింహభాగమైన బీసీ, ఎంబీసీ, సంచార జాతులు పూర్తిగా నిర్వీర్యానికి గురి చేశారని బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎంబిసిల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ కుల వృత్తుల ఫెడరేషన్స్‌ను, బీసి కార్పొరేషన్‌లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న ఓబీసీలకు కేసీఆర్‌ కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చారని, ఇదే కేసీఆర్‌ గొప్పగా చెప్పే సామాజిక న్యాయమని నిలదీశారు.  సబ్సిడీ రుణాల ధరఖాస్తుల వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని చెబుతూ కరోనా సమయంలో పూర్తిగా నష్టపోయిన కుల, చేతివృత్తిదారులకు కనీస ఆర్థిక సహాయం కూడా చేయలేదని గుర్తు చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని, ఎంబిసీల సంచార జాతుల అస్థిత్వాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నరేంద్ర మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో బిసి, ఎంబిసి, సంచార జాతులు అన్ని కులాలలకు…

Read More

ఎటువంటి డ్రగ్స్‌ కార్యకలాపాలకు పాల్పడకపోయినా, తనపై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాదారుడిగా ముద్ర వేయడం సరైనదా? అంటూ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ వేస్తున్న ప్రశ్నలకు నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు సమాధానం చెప్పలేక తలవంచుకొంటున్నారు.  గత ఏడాది అక్టోబర్‌లో ముంబయి తీరంలో క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎన్‌సిబి అధికారులు దీనికి ఆర్యన్‌ ఖాన్‌కు సంబంధముందంటూ ఆయన్ను అరెస్టు చేశారు. అనేక వారాలు జైలులో ఉంచారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ విషయమై మీడియా విస్తృతంగా ప్రచారం కలిగించింది.  ఆ సమయంలో ఆర్యన్‌ అక్రమ డ్రగ్స్‌ కలిగి ఉండటం నుండి అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ గత నెలలో తగిన సాక్షాలు లేవని పేర్కొంటూ ఎన్‌సిబి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అయితే ఇన్ని రోజులు ఆర్యన్‌, షారూఖ్‌ ఎదుర్కొన్న అవమానాలపై ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని సీనియర్‌ ఎన్‌సిబి అధికారి ఒకరు తెలిపారు.…

Read More

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండే సరికి గత ఎన్నికలలో బిజెపిని దాదాపు పరాజయం అంచుకు తీసుకెళ్లి, పెద్ద షాక్ ఇచ్చిన పటీదార్లు తిరిగి ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. అప్పటి పాటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ను కాంగ్రెస్ నుండి బీజేపీలో చేర్చుకున్నప్పటికీ వారిలో బిజెపి పట్ల ఏర్పడిన వైమాష్యం పూర్తిగా తొలిగిన్నట్లు కనిపించడం లేదు.  ఈ సారి, సర్దార్ పటేల్ స్టేడియం (మొతెరా క్రికెట్ స్టేడియం)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై పాటిదార్లు ఆగ్రవేశాలు వ్యక్తం చేయడం ద్వారా బిజెపికి వ్యతిరేకంగా సమీకృతమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టేడియానికి తిరిగి సర్దార్ పటేల్ పేరునే పెట్టాలని డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రధాని మోదీని గౌరవిస్తామని, అయితే ఈ స్టేడియంకు గతంలో ఉన్న పేరును మార్చకూడదని చెప్తున్నారు. ఇదే డిమాండ్‌తో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.  ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియంలలో ఈ స్టేడియం ఒకటి. ఈ స్టేడియం పేరు మార్చాలని…

Read More

జివికె గ్రూపులో భాగమైన జివికె కోల్‌ డెవలపర్స్‌ సంస్థ పలు బ్యాంక్‌లకు రూ.12,114 కోట్లు (1.5 బిలియన్‌ డాలర్లు) ఎగనామం పెట్టింది. ఆయా బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేదు. దాదాపు 11 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పులను రాబట్టుకోలేక ఆయా బ్యాంక్‌లు ఇప్పుడు లబోదిబో మంటున్నాయి.  అసలుతో పాటు వడ్డీ చెల్లించాలని ఆరు బ్యాంక్‌లు తాజాగా లండన్‌ హైకోర్టును ఆశ్రయించాయి. అప్పులిచ్చిన భారత బ్యాంక్‌ల్లో కెనరా బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లున్నాయని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కథనం వెలువరించింది.  ఈ విత్త సంస్థలు 2011లో ఒక్క బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7600 కోట్లు) రుణం, రూ.273 కోట్లు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ రూపంలో అందించాయి. ఐదు బ్యాంక్‌లు 2014లో మరోసారి రూ.1,250 కోట్లు అప్పుగా ఇచ్చాయి. ఈ అప్పులన్నిటీని చెల్లించడంలో సింగపూర్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన జివికె…

Read More

నాలుగు రాష్ట్రాలలో 16 సీట్ల కోసం శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికలలో రాజస్థాన్ లో తప్ప, మిగిలిన మూడు రాష్ట్రాలలో బిజెపి వ్యూహం ఫలించి, తమ అభ్యర్థులను సునాయనంగా గెలిపించుకోగలిగింది. రాజస్థాన్ లో  మాత్రం బిజెపి ఎత్తుగడలను అధిగమించి కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు గెలుపొందగా, బిజెపి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి,   జీ మీడియా అధినేత సుభాష్‌ చంద్ర క్రాస్ ఓటింగ్ పై నమ్మకం పెట్టుకొని  ఓటమి పాలయ్యారు. మొత్తం మీద బీజేపీ 9 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుపొందింది. శివసేన, ఎన్సీపీ చెరోస్థానం గెలుచుకున్నాయి. మహారాష్ట్రలో ఆరో స్థానం కోసం శివసేనకు చెందిన సంజయ్‌ పవార్‌, బీజేపీ అభ్యర్థి ధనంజయ్‌ మాదిక్‌ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి మహదిక్ 41 ఓట్లతో విజయం సాధించారు. పవార్‌కు 33 ఓట్లు వచ్చాయి. ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగాబీజేపీ అభ్యర్థులైన గోయల్, బోండేలకు అత్యధికంగా 48 ఓట్లు వచ్చాయి. ఎన్సీపీ అభ్యర్థి…

Read More

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనపై, రాష్ట్రంలో కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ప్రపంచమంతా విస్తుపోయేలా పాలన కొనసాగిస్తున్న చరిత్ర నరేంద్రమోదీదైతే, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాల్జేసిన ఘనత కేసీఆర్ దని ఆయన విమర్శించారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనపై బీజేపీ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూకుట్ పల్లిలో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ  బీజేపీ విలక్షణమైన పార్టీ అని, పార్టీ పుట్టినప్పటి నుండి అనేక అవమానాలను ఎదుర్కొందని, అవహేళనలకు గురైందని తెలిపారు. మతోన్మాద పార్టీ అన్నారని, దళిత, బీసీల వ్యతిరేక పార్టీ అన్నారని,  ఇది గుజరాత్ మార్వాడీల పార్టీ అని నవ్వుకున్నారని,  అగ్రవర్ణాల పార్టీ అన్నారని గుర్తు చేశారు.  అయితే, విమర్శించిన కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోయాయని,  ఈ దేశమే మాది, మేం చెప్పిందే శాసనమని విర్రవీగిన కాంగ్రెస్ పార్టీ 440 ఎంపీ స్థానాలనుండి 44కు…

Read More

రైతు సమస్యలపై ఉద్యమించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి రైతు పోరుబాట పేరిట బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో సమావేశమై రైతు సమస్యలపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.  కేవలం తన పర్యటనలే కాకుండా క్షేత్రస్థాయిలో నేతలు వివిధ సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.  ఈ నేపథ్యంలో రైతు సమస్య‌లపై తొలుత ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటికే ఫైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మోటార్ల బిగింపు కార్యక్రమం ప్రారంభమయిందని పార్ట నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.  దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోరుబాట పేరిట సీఎం సొంత జిల్లా అయిన కడప నుంచే ప్రారంభించేందుకు నిర్ణయించారు.  ఈ నెల 20వ తేదీన కడప, 25న నెల్లూరు,…

Read More