ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో ఆ భారం రుణాలు తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై పడనుంది. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల నుంచి గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారు నెల వారి చెల్లించే వాయిదాల మొత్తం పెరగనుంది. 20 సంవత్సరాల కాలపరిమి తితో 25 లక్షలు గృహ రుణం తీసుకున్న వారిపై 7 శాతం వడ్డీకి నెల వాయిదాగా ప్రస్తుతం చెల్లిస్తున్న 19,382 రూపాయలు, ఇక నుంచి 20,756 కు పెరగనున్నాయి. అదనంగా నెలకు 1374 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వాహన కొనుగోలుకు 10 శాతం వడ్డీతో 7 సంవత్సరాల్లో చెల్లిచేలా 10 లక్షలు రుణం తీసుకున్న వారు నెలవారి ఈఎంఐ ప్రస్తుతం చెల్లిస్తున్న 16,601 నుంచి 17,070 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా 469 రూపాయల భారం పడుతుంది. 14 శాతం వడ్డీకి ఐదేళ్లలో చెల్లించేలా 6 లక్షలు వ్యక్తిగత రుణం తీసుకున్నవారు 13,961 రూపాయలకు…
Author: Editor's Desk, Tattva News
సంక్షేమ కార్యక్రమాలకు గత ప్రభుత్వం తో పోల్చి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అదనంగా ఖర్చు చేసిందేమీ లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. గత మూడేళ్లలో రూ 5 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం చేస్తున్న ఖర్చు, గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చును ఆయన పోల్చి విశ్లేషించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ 3840 కోట్ల టాయించగాయం గతంలో ఎవరి పేరు పెట్టకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకాన్ని అన్ని అమలు చేశారని గుర్తు చేశారు. జగనన్న విద్యా దీవెన పథకానికి రూ 500 కోట్లు ఎగ్గొట్టారని తెలిపారు. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద నేరుగా కాలేజీల యాజమాన్యాలకే ప్రభుత్వం డబ్బు చెల్లించే దని, రూ 500 కోట్లు చెల్లించడంలో ఆలస్యమైనా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చేవని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం నేరుగా తల్లిదండ్రులకు…
అమరావతిలో రాజధానిగా ఆరు నెలల లోగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్లాట్ లను అందజేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన గడువు ముగిసినా ఆ దిశలో ఒక్కడుగు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వేయడం లేదు. పైగా, రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు ఉచితంగా ఇచ్చిన భూములుఏళ్ళు గడచినా కొద్దీ తగ్గిపోతూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. సహజంగా ఎక్కడైనా కరువు పరిస్థితులో లేదా ప్రత్యేక పరిస్థితులో ఉంటే జనాభా తగ్గొచ్చు. కానీ, రాజధానిలో భూములు ఏ ఏడాదికాయేడాది తగ్గిపోతున్నాయి. సిఆర్‌డిఎలో భూపరిపాలన చూసే అధికారుల కనుసన్నల్లోనే ఈ భూములు మాయం అయ్యాయని, మరొకరికి అది సాధ్యం కాదని అధికారులూ స్పష్టం చేస్తున్నారు. ఈ తగ్గుదల వ్యవహారం సిఆర్‌డిఎలోనే చర్చనీయాంశం అవుతోంది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు తీర్పు అనంతరం జరిగిన సమీక్షల్లోనూ, చర్చల్లోనూ దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓ ప్రత్యేకాధికారి…
కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను 2022-23 సంవత్సరానికి క్వింటాలుకు రూ 100 పెంచింది. దీనితో వరి మద్దతు ధర ఇక క్వింటాలుకు రూ 2,040 కానుంది. వరి వేసవిలో వేసే 14 రకాల ఖరీఫ్ పంటలకు ఈ ఏడాదిలో మద్దతు ధరలను పెంచే నిర్ణయానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా వరి పంట సాగు విస్తీర్ణం పెంచడం, వరి వేసే రైతుల ఆదాయం పెంచడానికి ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. పంటల వైవిధ్యతను పెంచడం అత్యంత కీలకమైన విషయం. ఈ దిశలో వివిధ రకాల పంటలకు ఎంఎస్‌పిని పెంచాలని నిర్ణయించినట్లు, ఖరీఫ్ పంటలపై మద్దతు ధరలను పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సకల స్థాయిల్లో…
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు కధనాలు వాస్తు ఉండడంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా తీవ్రమైన కసరత్తు చేస్తున్నది. గత నెల ఒంగోలులో జరిగిన పార్టీ మహానాడుకు విశేష స్పందన లభించడంతో, పార్టీ కార్యకర్తలలో ఆ ఉత్సాహాన్ని కొనసాగించే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు ఏడాది పాటు ఆయన ప్రజల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లోగా ఎన్నికల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. గత నెలల్లో కొన్ని జిల్లాలో పర్యటించినప్పుడు కూడా అనూహ్య స్పందన లభించడం గమనార్హం. ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయాన్ని టీ-డీపీ అధినేత తీసుకున్నారు. పర్యటనల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రధానంగా ప్రస్తావించి…
కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసిన బంగారు స్మగ్లింగ్ కేసులో స్వయంగా ముఖ్యమంత్రి పునరాయి విజయన్ కు సంబంధం ఉన్నట్లు ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేష్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం రాజకీయ కలకలం రేపుతున్నది. పైగా, కోర్టులో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉండటమే కాకుండా, ఆ విధంగా ఆరోపణలు చేయడంలో తనకు ఎటువంటి వ్యక్తిగత లేదా రాజకీయ ఎజెండా లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. స్వప్న సురేశ్ మంగళవారం కొచ్చిలోని కోర్టులో సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం స్టేట్‌మెంట్ ఇచ్చారు. బంగారం అక్రమ రవాణా కేసు నేపథ్యంలో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఆమె ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన సతీమణి కమల, కుమార్తె వీణలపై ఆరోపణలు చేశారు. విజయన్ ఓ బ్యాగు నిండా కరెన్సీ నోట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు తీసుకెళ్ళారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను సీఎం…
ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. జొన్నాడ వెళ్తుండగా సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్‌ఐ శివప్రసాద్ ఫిర్యాదు చేశారు. దీంతో సోము వీర్రాజుపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో అమాయకులను అరెస్టు చేశారని, వారి కుటుంబాలను పరామర్శించడానికి సోము వీర్రాజు బుధవారం జొన్నాడకు బయలుదేరారు. అయితే కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సెంటరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ ఆయన కారులోంచి దిగి తననే అడ్డుకుంటారా అంటూ ఒంటికాలిపై లేచారు. అక్కడే ఉన్న ఆలమూరు ఎస్‌ఐ శివప్రసాద్‌ను పక్కకు నెట్టేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమలాపురం వెళ్లడానికి అనుమతి లేదని వీర్రాజుకు తేల్చిచెప్పారు. దీంతో సోముతో పాటు అక్కడికి చేరుకున్న…
లద్దాఖ్ సమీపంలో చైనా( కదలికలు ఆందోళనకరమని అగ్రరాజ్యం అమెరికా భారత్ను అప్రమత్తం చేసింది. సరిహద్దు వెంబడి చైనా పలు మౌలిక సదుపాయాల ఏర్పాటును ఇందుకు కారణంగా పేర్కొంది. హిమాలయ ప్రాంతంలో చైనా మౌలిక సౌకర్యాలు పెంచుతుండడంపై యూఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఏ ఫ్లిన్ మీడియాతో మాట్లాడుతూ చైనా చర్యలు అస్థిరత, హానికరమైనవిగా స్పష్టం చేశారు. ‘‘చైనా కదలికల స్థాయి అప్రమత్తతను సూచిస్తోంది. పశ్చిమ ప్రాంత కమాండ్‌లో కొన్ని వసతులను పెంచుకోవడం కలవరపరుస్తోంది. చైనా తన మిలిటరీ వనరులు అన్నింటినీ పెంచుకుంటుంది. ఇవన్నీ ఎందుకని చైనాను ఎవరైనా ప్రశ్నించాలి ’’ అని ఆయన హెచ్చరించారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా కదలికలు ఎక్కువవ్వడం, చాపకింద నీరులా రహస్య మార్గాల నిర్మాణం, అస్థితపరిచే చర్యలు, హానికరమైన ప్రవర్తన ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజకరం కాదని ఆయన స్పష్టం చేశారు. హానికరమైన శక్తులకు వ్యతిరేకంగా తామంతా ఉమ్మడిగా పనిచేయాల్సి ఉంటుందని భారత్‌కు సంకేతాలిచ్చారు. భారత సరిహద్దుల్లో చైనా అక్రమ…
ఆధునిక సమాచార సదుపాయం కల్పించడం కోసం భారత రైల్వలు రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం ప్రయాణికులకు కల్పించే పక్రియ ప్రారంభించగా, అదెక్కువగా దుర్వినియోగం అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ సదుపాయంతో దేశంలోని రైల్వేస్టేషన్లు పోర్న్ హబ్స్‌గా మారుతున్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ అందించే ఫ్రీ వైఫై తో చాలామంది పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకొంటున్నట్లు గమనిస్తున్నారు. సికింద్రాబాద్ వంటి అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇప్పుడు పోర్న్ హబ్‌గా మారిందని చెబుతున్నారు. దీనికి డేటా మొత్తం ఖాళీ కావడం ఒక కారణమైతే, ఎక్కువగా ఈ ప్రాంతంలో వీపీఎన్ సహాయంతో పోర్న్ సైట్స్ యాక్సెస్ కావడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా విజయవాడ, టెంపుల్ సిటీ అయిన తిరుపతి వంటి చోట్ల కూడా పోర్న్ ఎక్కువగా చూస్తున్నారని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో అత్యవసర ఉపయోగానికి వాడాల్సిన ఫ్రీ వైఫైని ప్రయాణికులు పోర్న్ చూడ్డానికి ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. పోర్న్ డౌన్ లోడ్ లతో మొత్తం…
ఈ ఏడాది ఖాళీగా ఉన్న 1,450 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను ఎందుకు భర్తీ చేయలేదంటూ కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో మెడికల్ సీట్లను ఖాళీగా ఉంచడం సరికాదని పేర్కొంది. ‘‘మీరు వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. ఈ ఏడాది నీట్ పీజీ ఆల్ ఇండియా కోటాలో 1456 సీట్లు ఖాళీగా ఉండటంతో ఆ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలివ్వాంటూ కొందరు వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధా బోస్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, ఒక్క మెడికల్ సీటు ఖాళీగా ఉన్న భర్తీ చేయాల్సిందేనని మండిపడింది. అదనంగా మాప్ అప్ కౌన్సెలింగ్…