Author: Editor's Desk, Tattva News

ఊహించినట్లుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ ) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం ప్రకటించారు. రెపో రేటును గత నెలలోనే 40 బేసిస్‌ పాయింట్ల మేర పెంచగా, తాజాగా మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచారు. దీంతో రెపో రేటు 4.90 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా సరళ విధాన వైఖరిని క్రమక్రమంగా సడలిస్తామంటూ ఆర్‌బీఐ గతంలోనే సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్‌బీఐ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది.  ఇలా క్రమంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్‌బీఐ రెపో రేటును 5.6 శాతానికి చేరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. పరపతి విధాన నిర్ణయాలకు ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.79 శాతానికి చేరింది. ఇది ఎనిమిదేళ్ల…

Read More

ఏపీలో వైయస్సార్సీపీ ప్రభుత్వం పోయి, బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భరోసా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మంగళవారం సాయన్తరం  ఏర్పాటు చేసిన బీజేపీ `గోదావరి గర్జన’ బహిరంగ సభలో ప్రసంగిస్తూ  వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  రాష్ట్రంలో వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అంటూ నినాదం ఇచ్చారు.  ఏపీ సర్కారు విచక్షణారహితంగా అప్పులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. జగన్ హయాంలో అవినీతి తారస్థాయికి చేరిందని ధ్వజమెత్తారు. ఇసుక, భూమి, మద్యం మాఫియా అడ్డూ అదుపులేకుండా చేలరేగిపోతుందని విమర్శించారు.  ఎనిమిదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశంలో పేదరికం తగ్గడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగం అందుకున్నాయని చెబుతూ  2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలు ఉండేవని గుర్తు చేశారు. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదని,  గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలు నిలిచేవని, …

Read More

భారతదేశంలో సంపూర్ణ ప్రజాస్వామ్యం, పూర్తి భావప్రకటన స్వేచ్ఛ ఉన్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీనివల్ల ఒక్కోసారి కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలూ వినిపిస్తుంటాయనితెలిపా రు. ఖతర్‌లో మూడు రోజుల పర్యటనను ముగించుకుని మంగళవారం ఢిల్లీకి బయలుదేరేముందు స్థానికంగా ఉన్న ప్రవాసీ తెలుగు ప్రముఖలతో వెంకయ్య కొద్దిసేపు సమావేశమయ్యారు.  అంతకుముందు సోమవారం రాత్రి ఖతర్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించీ ఆయన మాట్లాడారు. భారత్‌లో అన్ని వర్గాలకు, మతాలకు సమాన స్వేచ్ఛ ఉందని, ఎవరి పట్ల ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. అందరికీ సమాన న్యాయమనేది భారతీయ సంస్కృతి అని పేర్కొన్నారు.  ముస్లిం అయిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాంను గతంలో రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని వెంకయ్య నాయుడు గుర్తు చేశా రు. ముస్లింలు, హిందువులు, కైస్త్రవులు అంటూ మతాల ఆధారంగా కాకుండా అందరినీ భారతీయులుగానే వ్యవహరిస్తామని చెప్పారు. ఏ ధర్మం వారైనా అందరూ భారత మాత ముద్దుబిడ్డలేనని స్పష్టం చేశా రు.  కాగా,…

Read More

బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మకు నెదర్లాండ్స్‌ పార్లమెంటు సభ్యుడు, ఫ్రీడం పార్టీ అధ్యక్షుడు గీర్ట్‌ విల్డెర్స్‌ మద్దతుగా నిలిచారు. ఆమెపై అరబ్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. మహమ్మద్‌ ప్రవక్త గురించి ఆమె మాట్లాడిందంతా నిజమే స్పష్టం చేశారు. నూపుర్‌ శర్మ తప్పుడు ఆరోపణలు ఏమీ చేయలేదని మంగళవారం వరుస ట్వీట్లలో విల్డెర్స్‌ తెలిపారు. ఆయెషా ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెను ప్రవక్త పెళ్లి చేసుకున్నారంటూ నూపుర్‌ శర్మ చేసిన ప్రకటన పూర్తిగా వాస్తవమేనని పేర్కొన్నారు. భారతదేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బుజ్జగింపు ఎప్పటికీ పనిచేయబోదని, దాని వల్ల పరిస్థితులు దిగజారుతాయని హితవు పలికారు. ‘భారతదేశంలోని నా మిత్రులారా.. ఇస్లామిక్‌ దేశాలకు భయపడకండి. ప్రవక్త గురించి నిజం చెప్పిన నూపుర్‌ శర్మను సమర్థిస్తూ ధైర్యంగా, స్వేచ్ఛగా, గర్వంగా నిలబడండి’ అని ఆయన పిలుపునిచ్చారు. అందుకు బెదిరింపులు…

Read More

“కాషాయ తీవ్రవాదులను బతకనీయం.. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్​ రాష్ట్రాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తాం” అని అల్​ఖైదా ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల​ చేసిన లేఖ ఒకటి సోషల్​ మీడియాలో హల్​చల్​ అవుతోంది. అయితే ఈ లేఖ ఈ నెల 6వ తేదీన విడుదల​ చేసినట్టు తెలుస్తోంది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగిన నేపథ్యంలో ఇది వెలుగులోకి వచ్చింది. ‘‘మా ప్రవక్తను అవమానించేవారిని మేము వదిలిపెట్టం, చంపేస్తాం.. మా ప్రవక్తను అవమానించే ధైర్యం చేసే వారి దేహాలను పేల్చివేయడానికి మా శరీరాలతో, మా పిల్లల శరీరాలతో పేలుడు పదార్థాలను నింపుకొని వస్తాం..  కాషాయ ఉగ్రవాదుల అంతం కోసం మా ప్రయత్నాలు కొనసాగుతాయి. బొంబాయి, యూపీ, గుజరాత్​లో ఇవి జరుగుతతాయి ” అని ఆ లేఖలో పేర్కొన్నారు. ​ఖతర్‌, కువైట్‌, యూఏఈ, పాకిస్థాన్‌, మాల్దీవ్‌, ఇండోనేషియా.. ఇలా దాదాపు పదిహేను దేశాలు నూపుర్‌…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మరింత ఉత్సాహంతో దూసుకెళ్లాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లోని బీజేపీ కార్పొరేటర్లు, ఇతర బిజెపి నాయకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్ధేశం చేశారు.  మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని  న్యూఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న తన అధికార నివాసంలో వారితో సుమారు గంటన్నరసేపు సమావేశమై కష్టపడితే తెలంగాణలో అధికారం మనదేనని భరోసా ఇచ్చారు. సేవతో ప్రజలకు దగ్గరవ్వవచ్చని చెబుతూ న్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, మిగతా సమయమంతా ప్రజా సేవలోనే మమేకమవ్వాలని కార్పొరేటర్లకు నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్లకు రాజకీయ జీవితం ఇప్పుడే ఆరంభమైందని, కష్టపడితే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని, వచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకుంటూ వారికి చేరువ కావాలని సూచించారు. ఎదుగుతున్న క్రమంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా మీడియాతో జాగ్రత్తగా మాట్లాడాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ మే 26న హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా జీహెచ్‌ఎంసీ…

Read More

పర్యావరణ నిర్వహణలో 180 దేశాల జాబితాలో అట్టడుగున భారత్ ఉన్నట్టు అమెరికాకు చెందిన అధ్యయన సంస్థలు వెల్లడించాయి. యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్ కొలంబియా యూనివర్శిటీ వెలువరించిన 2022 పర్యావరణ నిర్వహణ సూచిక (ఇపిఐ) లో డెన్మార్క్ టాప్‌లో ఉండగా, తరువాతి స్థానాల్లో బ్రిటన్, ఫిన్‌లాండ్ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా హరిత వాయు ఉద్గారాలను నిరోధించడం వల్లనే ఈ దేశాలు ఎక్కువ స్కోరు సాధించగలిగాయి. ప్రపంచం మొత్తం మీద వాతావరణ స్థితిపై డేటా ఆధారిత సారాంశాన్ని “ఇపిఐ” అందించింది. 11 అంశాల వారీగా 40 పనితీరు సూచికలను ఉపయోగించి వాతావరణ మార్పు, పర్యావరణ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ జీవశక్తిలపై 180 దేశాల ర్యాంకులను నిర్దేశించింది. పర్యావరణ విధానపర లక్షాలకు ఆయా దేశాలు ఎంతవరకు చేరువలో ఉన్నాయో ఈ సూచిక తెలియచేస్తుంది. తక్కువ స్కోరులో ఉన్న దేశాల్లో భారత్ (18.9),…

Read More

జమ్ముకాశ్మీర్‌లో కొనసాగుతున్న లక్ష్యిత దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ జరిగిన లక్ష్యిత దాడుల్లో 22 మంది మృతి చెందారు. మృతులంతా మైనార్టీలు, వలసకార్మికులు, భద్రతా సిబ్బందే కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా, ఈ లక్ష్యిత హత్యల్లో నిందితులుగా భావిస్తున్న 14 మంది ఉగ్రవాదులు, వారి సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుల్లో ప్రభుత్వ ఉద్యోగైన కాశ్మీరీ పండిట్‌, నలుగురు వలస కార్మికులు, నలురుగు పంచాయతీ స్థాయి నాయకులు ఉన్నారు. అలాగే వీరిలో నలుగురు పోలీస్‌ సిబ్బంది, ఒక ఆర్మీ సైనికుడు, ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది, ఇద్దరు రైల్వే ప్రోటక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పిఎఫ్‌) సిబ్బంది, ముగ్గురు స్థానికులు ఉన్నారు. అలాగే మధ్య కాశ్మీర్‌లో 10 మంది (ఇందులో ఏడుగురు బుద్గాంలో, ముగ్గురు శ్రీనగర్‌లో) మరణించారు. దక్షిణకాశ్మీర్‌లో 10 మంది (ఇందులో కుల్గాంలో ఐదుగురు, పుల్వామాలో ముగ్గురు, అనంతనాగ్‌, షోపియాన్‌లో ఒకొక్కరు) మృతి చెందారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో ఇద్దరు…

Read More

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటనపై పోలీసులు సత్వరం స్పందించకుండా, కీలక నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుండటాన్ని బహిర్గతం చేసిన బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దురాగతంలో ఎంఐఎం ఎమ్యెల్యే కుమారుడికి సంబంధం ఉందని ఆయన ఫోటోలు, వీడియో బహిర్గతం చేయడంతో, అతనికి ఈ కేసుతో సంబంధం లేదని ఆ ముందు రోజే సర్టిఫికెట్ ఇచ్చిన పోలీసులకు అతనిపై దర్యాప్తులో దృష్టి సారించక తప్పలేదు. పైగా, అతనిని నిందితుడిగా చేర్చడం కోసం మీనమేషాలు లెక్కపెడుతున్నారు. తాజాగా, రఘునందన్ రావుకు జూబ్లీహెల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో వీడియోలు ఫోటోలు బయట పెట్టారని అడ్వకేట్ కొమ్మిరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు రఘునందన్ రావుకు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆయన తనకు నోటీసులు, కేసులు కొత్త కాదని పేర్కొంటూ…

Read More

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  విద్యా విధానంను తిరోగమనంలో తీసుకు వెడుతూ ఉండడం తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాలు వెల్లడి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం స్పష్టం చేసింది.  విద్యావిధానంలో మార్పులు శాస్త్రీయబద్దంగా  కాకుండా ఆర్థిక అవసరాలకు లేదా ఆర్థిక ఇబ్బందుల వలన లేదా గత ప్రభుత్వాల విధానాలు నచ్చకనో మార్పులు చేయడంతో విద్యా వ్యవస్థ రోజు రోజుకి దిగ జారీ పోతుందని ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు, కార్యదర్శి  బొప్పన రాజశేఖర్ రావు, సహాయ కార్యదర్శి పావులూరి ఖాజారావు ఆందోళన వ్యక్తం చేశారు.  పదో తరగతి ఫలితాలు తక్కువ రావడానికి కారణాలను ప్రస్తావిస్తూ, మొదటగా ఇంగ్లీష్ మీడియం తీసుకున్న పిల్లలు ఇబ్బంది పడినట్లు తెలిపారు.  సోషల్ స్టడీస్ పేపర్ తెలుగులో రాయగలరు గాని ఇంగ్లీషులో రాయలేరని, అలాగే సైన్స్ కానీ, మాథ్స్  కానీ మాతృభాషలో చదివినంత ఇంగ్లీష్ మీడియంలో చదవలేరని చెప్పారు.   అలాగే, ఎయిడెడ్ స్కూల్స్ నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతో ఆయా సంస్థల నడపడంలో విఫలమవడం క్కూడా   ఉత్తీర్ణత శాతం తగ్గడానికి…

Read More