Author: Editor's Desk, Tattva News

బిజెపి పార్టీ నుండి ఆదివారం సాయంత్రం సస్పెండ్ చేసిన ఇద్దరు నేతలు ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలు గల్ఫ్ దేశాలలో పెను దుమారం రేపుతున్నాయి.  గల్ఫ్ దేశాలు భారతీయ దౌత్యవేత్తలను పిలిపించి వరుసగా నిరసనలు తెలుపుతున్నాయి.  ఖతార్, ఇరాన్, కువైట్‌లతో పాటు సౌదీ అరేబియా  ప్రభుత్వాలు భారత రాయబారులను పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేశాయి.  ఈ నిరసనల తీవ్రతను పసిగట్టిన తర్వాతనే బిజెపి తన జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ,ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ లను బహిష్కరించినట్లు తెలుస్తున్నది.  ముస్లిం సమూహాల నిరసన ప్రదర్శనలు, అంతర్జాతీయ సమాజం నుండి తీవ్ర ప్రతిస్పందనలతో బిజెపి అన్ని మతాలను గౌరవిస్తుందని, ఏదైనా మతపరమైన వ్యక్తిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేస్తూ బిజెపి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కాగా, ఖతార్, కువైట్ దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు భారతదేశంలోని అధికార పార్టీ ఈ విషయమై విడుదల చేసిన ప్రకటనను…

Read More

ఎన్టీఆర్‌ బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే, కేసీఆర్‌ ప్రభుత్వం 18 శాతానికి కుదించి బీసీలకు అన్యాయం చేసిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కుల వృత్తిదారుల సదస్సులో పాల్గొంటూ  రాష్ట్రంలో 54 శాతం ఓబీసీలు ఉంటే కేసీఆర్ మంత్రివర్గంలో  కేవలం ముగ్గురు మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. మరోవంక, కేవలం ఒక్కశాతం జనాభా సామాజిక వర్గంకు చెందిన  నలుగురు మంత్రులు ఉన్నారని విమర్శించారు.  రాష్ట్రంలోని అవినీతి, అక్రమ, నియంతృత్వ కేసీఆర్​ పాలనను కూకటివేళ్లతో పెకలిస్తామని, త్వరలోనే మోదీ, యోగి జోడీ తరహా పాలనను తెలంగాణ ప్రజలు చూస్తారని లక్ష్మణ్​ స్పష్టం చేశారు. యూపీ నుంచి బుల్డోజర్​ వస్తోందని, కేసీఆర్​ దోచుకున్న అక్రమాస్తులను కూల్చేసి, స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.  కేసీఆర్​ అత్యంత అవినీతిపరుడు, అబద్ధాలకోరని లక్ష్మణ్ ఆరోపించారు.…

Read More

కేంద్ర పధకాలను, నిధులను తమ పథకాలుగా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్నదని అంటూ ప్రధాని మోదీ నుండి రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల వరకు నిత్యం ఆరోపణలు చేస్తుండగా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు పరుస్తున్న `మిషన్ భగీరథ’ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేసుకొంటున్నట్లు రాష్ట్ర మంత్రి కెటి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘జల్ జీవన్ మిషన్’ పథకంలో భాగంగా తెలంగాణలోని 54 లక్షలకుపైగా ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామంటూ కేంద్ర జలశక్తి శాఖ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘‘కేంద్ర సర్కారు సిగ్గు లేకుండా.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మిషన్ భగీరథ’ పథకాన్ని తనదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది’’ అని ఆయన విమర్శించారు.  తెలంగాణ‌లో ఇంటింటికీ తాగునీటి ప‌థ‌కానికి కేంద్రం నుంచి 19వేల కోట్ల నిధులు స‌మ‌కూర్చాల‌ని నీతి ఆయోగ్ చేసిన సూచ‌న‌ల‌ను అస‌లు కేంద్ర ప‌ట్టించుకోలేద‌ని, కేంద్ర సర్కారు ఒక్క పైసాను కూడా విదిల్చలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడదే…

Read More

మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఆరుగురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఏకగ్రీవ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన సమాలోచనలు విఫలం కావడంతో 24 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 10న జరుగనున్న ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగిసింది. రాజ్యసభకు అభ్యర్ధులను మూజువాణి ఓటు పద్ధతిలో ఎన్నుకోవాలని చట్టం రూపొందించిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. 1998లో రాజ్యసభ ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు ఏకంగా 24 ఏళ్ల తరువాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఎన్నికల కమిషన్ గడువు విధించింది. ఆలోపు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు మహావికాస్‌ ఆఘాడి సీనియర్‌ నేతలు ఛగన్‌ భుజబల్, సునీల్‌ కేదార్‌ తదితరులు ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్‌ నివాసమైన సాగర్‌ బంగ్లాలో చర్చలు జరిపారు. అయినప్పటికీ బీజేపీ, శివసేన నామినేషన్లు ఉపసంహరించుకోక పోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. …

Read More

ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. నూపుర్‌ శర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆదివారం వెల్లడించింది. ఆ తర్వాత, మహమ్మద్ ప్రవక్తపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని నూపుర్ శర్మ ప్రకటించారు. తన వ్యాఖ్యల కారణంగా మనోవేదనకు గురైనవారికి బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ట్వీట్ చేశారు. నవీన్‌ కుమార్‌ జిందాల్‌ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్‌గా ఉన్నారు. సస్పెన్షన్‌ లేఖలో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నాము’ అని కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం హింస చెలరేగడానికి…

Read More

డాలర్‌తో పోల్చితే మన రూపాయి రోజు రోజుకు చిక్కిపోతోంది. 2022 జనవరి నుంచి రూపాయి విలువ ఏకంగా నాలుగు శాతం పతనమైంది. 2021లో డాలర్‌తో 73.21 ఉన్న రూపాయి విలువ ఆరు శాతం తగ్గి ప్రస్తుతం 77.69కి చేరింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లును సవరిస్తే మన రూపాయి మరింత పతనం అయ్యే అవకాశం ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి రూపాయి వేగంగా పతనం అవుతోంది. 2017లో మారకం విలువ 64 ఉంటే, ఇప్పుడు 77.69 అయ్యింది. ఇంత భారీగా రూపాయి విలువ పతనం కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతోంది. ముఖ్యంగా చమురు దిగుమతుల భారం భారీగా పెరుగుతోంది. దీనికి తోడు రష్యా, ఉక్రేయిన్‌ యుద్ధం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా మన చమురు దిగుమతులు బిల్లు భారీగా పెరుగుతోంది. దేశ అవరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. రూపాయి పతనం…

Read More

కాశ్మీర్ లోయలో లక్షిత దాడులు జరిగిన్నప్పుడల్లా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశం జరిపినట్లు వార్తలు వస్తున్నాయని అంటూ అటువంటి సమావేశాలు ఇక చాలని, దాడులు ఆపడానికి ఓ కార్యాచరణ ప్రణాలికను ప్రకటించండి అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. “1990 యుగం మళ్లీ వచ్చింది. వారికి (ప్రభుత్వానికి) ఎలాంటి ప్రణాళిక లేదు. లోయలో హత్య జరిగినప్పుడల్లా, హోంమంత్రి అత్యున్నత స్థాయి సమావేశాన్ని పిలిచారని వార్తలు వస్తున్నాయి, ఈ సమావేశాలు సరిపోతాయి, ఇప్పుడు మాకు చర్య కావాలి, కాశ్మీర్ చర్య కావాలి, ”అని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికీ నిరసనగా దేశ రాజధానిలోని ‘జంతర్ మంతర్’ వద్ద ‘ఆప్’ నిర్వహించిన `జన్ ఆక్రోశ్‌ ర్యాలీ’ని ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగిస్తూ లోయలో కాశ్మీరీ పండిట్‌లకు భద్రత కల్పించడంలో బిజెపి పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాశ్మీర్‌ సమస్యను బిజెపి పరిష్కరించలేదని, నీచరాజకీయాలకు పాల్పడటమే బిజెపి…

Read More

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, నలుగురు మాజీ మంత్రులతో సహా ఏడుగురు సీనియర్ నాయకులు శనివారం చండీగఢ్‌లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇద్దరు శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) నేతలు కూడా ఆ పార్టీలో చేరారు. రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్ సింగ్ కంగర్, సుందర్ శామ్ అరోరా బీజేపీ వైపు మారిన నలుగురు మాజీ మంత్రులు. వీరితో పాటు ఆ పార్టీ నేతలు కేవల్ ఎస్. ధిల్లాన్, కమల్జీత్ ఎస్. ధిల్లాన్, అమర్జీత్ ఎస్. సిద్ధూ కూడా బీజేపీలో చేరారు. అమర్జీత్ మొహాలీ మేయర్. బీబీ మొహిందర్ కౌర్ జోష్, సరూప్ చంద్ సింగ్ బీజేపీలోకి చేరిన అకాలీదళ్ నాయకులు. మొహాలీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్బీర్ సిద్ధూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా, రాంపుర ఫుల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్‌ప్రీత్ కంగార్…

Read More

వచ్చే ఎన్నికలకు సంబంధించి బిజెపితో తమ పార్టీ బంధం పటిష్టంగా ఉన్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఎన్నికలలో పొత్తుకు సంబంధించి తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నట్లు వెల్లడించారు. జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా జనసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమ ముందున్న మూడు ఆప్షన్లు అని ఆయన తెలిపారు. ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని, మంచి కోసం తగ్గాలనేది బైబిల్ సూక్తిని పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే మంచిదని పవన్ హితవు చెప్పారు. తమకు, బిజెపికి మధ్య కొంత సామాజిక అంతరం ఏర్పడినదని అంగీకరించారు. అయితే ఇప్పుడది పోయిందని తెలిపారు. ఇటీవల బీజేపీ జాతీయ నేతలతో కూడా చర్చించానని ఆయన వెల్లడించారు. తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలెవరూ చెప్పలేదని ఏ సందర్భంగా స్పష్టత ఇచ్చారు. పొత్తులపై తనను అందరూ అడుగుతున్నారని పేర్కొంటూ గతంలో `వన్ సైడ్…

Read More

ఆకాశంలో చాలా అరుదుగా విష్క్రతమయ్యే నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించే అరుదైన దృశ్యం చూసే అవకాశం వస్తోంది. ఈ నెలలోనే ఈ ఖగోళ విన్యాసం కనువిందు చేయనుంది. ఆయా గ్రహాలు వాటి కక్ష్యల్లోనే తిరుగుతున్నప్పటికీ ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడమే ఈ అద్భుతం. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. వీటిని ఏ బైనాక్యులర్‌ లేదా టెలిస్కోప్‌ సహాయం లేకుండా నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెల్లవారడానికి కొద్ది గంటల ముందు ఈ అద్భుతాన్ని చూడొచ్చు. సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తూంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు. కానీ ఇలా ఐదు ప్రధాన గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించడం చాలా అరుదు. 2004లో ఇలా ఐదు గ్రహాలు ఒకే సరళరేఖలో ఉన్నట్లు కన్పించాయి. అయితే ఈ అద్భుతమైన దృశ్యాన్ని సూర్యుడు ఉదయించకముందే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే,…

Read More